నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ ఏమి జరగలేదని చెప్పారు. 2-4 రోజులు రీ ఫ్రిజిరేటర్‌లో పెట్టామని.. మృతదేహాలు 50శాతానికి పైగా డి కంపోజ్ అయ్యాయని ఆయన తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం అడిగిన యంత్ర పరికరాలను తాము సమకూర్చామని డా. శ్రవణ్ తెలిపారు. శీతాకాలం వల్ల మృతదేహాలు ఇంకా అలాగే ఉన్నాయని.. అదే వేసవికాలంలో అయితే మూడు రోజుల్లో డీ కంపోజ్ అవుతాయని అన్నారు. ఒక్కో మృతదేహం రీ పోస్ట్ మార్టం చేసేందుకు 1 గంట సమయం పట్టే అవకాశం ఉందని డా. శ్రవణ్ తెలిపారు. రీ పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత వైద్యులు సాయంత్రం 7:30కి ఢిల్లీకి వెళ్లతారని ఆయన చెప్పారు.