Hospital superintendent
-
సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరం
సాక్షి, గాంధీఆస్పత్రి: కరోనా సెకెండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారి, కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యిందని, ఈ తరుణంలో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూలతో పెద్దగా ఫలితాలు ఉండవని, ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను నియంత్రించవచ్చని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చామని, ప్రాణాపాయస్థితిలో ఉన్న కరోనా రోగులను మాత్రమే ఇకపై గాంధీలో చేర్చుకుంటామన్నారు. మొదటి వేవ్‌లో కరోనా సోకిన రెండు, మూడు రోజులకు శరీరంలో వైరస్ లోడ్ పెరిగేదని, సెకెండ్ వేవ్‌లో కేవలం గంటల వ్యవధిలో పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఊపిరితిత్తులపై ఎటాక్.. సెకండ్‌వేవ్ మరో మూడు నెలలు పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వైద్యనిపుణులు అంచనాకు వచ్చారని తెలిపారు. సెకెండ్‌వేవ్‌లో రూపాంతరం చెందిన కరోనా వైరస్ మానవ శరీరంలోని లీవర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందన్నారు. శరీరంలో చేరిన వైరస్ రక్త ప్రసరణకు అడ్డుపడటంతో పెద్దసంఖ్యలో బాధితులు పక్షవాతానికి(పెరాలసిస్)కు గురవుతున్నారని, ఊపిరితిత్తులపై ఎటాక్ చేయడంతో శ్వాస అందక ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నారని వివరించారు. గాంధీలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలతోపాటు నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మందుల కొరత లేదన్నారు. కోవిడ్ బాధితులతో సహాయకులను ఆస్పత్రిలోకి అనుమతించమని స్పష్టం చేశారు. గత ఘటనలు, అనుభవాలను పాఠాలుగా తీసుకుని మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, కోవిడ్ నిబంధనలు పాటించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కోవిడ్ టీకా సెంటర్ కొనసాగుతుంది గాంధీ ఆస్పత్రి ఆర్ఎంఓ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా సెంటర్ కొనసాగుతుందని సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేశారు. ప్రధాన ద్వారం నుంచి కోవిడ్ బాధితులు, అంబులెన్స్‌లు రాకపోకలు సాగిస్తాయని, ఆర్ఎంఓ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న గేట్‌ను శనివారం నుంచి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆస్పత్రి ప్రధాన భవన సముదాయానికి కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ దూరంగా ఉండటంతో టీకా కోసం వచ్చేవారు ఎటువంటి భయాందోళన చెందాల్సిన పనిలేదన్నారు. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ సీఐ నరేష్ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారని తెలిపారు. ( చదవండి: జర జాగ్రత్త: వ్యాక్సిన్ కోసం వెళితే మొదటికే ముప్పు! ) -
వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా
-
వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్యం సహకరించడం లేదంటూ తన రాజీనామాను అంగీకరించాలని ఆయన డీఎంఈకి లేఖ రాశారు. అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్ల రాజీనామాలు తెలంగాణలో సంచలనం రేపుతున్నాయి. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర మనస్తాపానికి గురై నిజామాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర్రావు కూడా ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన మరొకటి జరగడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాగా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. (చిన్నారికి సరికొత్త జీవితం!) -
దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం పూర్తి
-
మృతదేహాలను వాళ్ల ఊరికి తరలిస్తాం
-
‘మృతదేహాలకు ఎంబామింగ్ జరగలేదు’
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం కొనసాగుతోందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రవణ్‌కుమార్ తెలిపారు. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రియ చేపట్టాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. నలుగురు నిపుణులతో కూడిన బృందం రీ పోస్ట్‌మార్టం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోస్ట్ మార్టం మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నామని తెలిపారు. సీడీ, పెన్ డ్రైవ్ ద్వారా వైద్యులు హైకోర్టుకు నివేదిక అందిస్తారని ఆయన తెలిపారు. సాయంత్రం 5 గంటల లోపు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందిస్తామన్నారు. రెండు అంబులెన్స్ వాహనాల్లో వారి గ్రామాలకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. పోస్ట్ మార్టంలో గాంధీ వైద్యులు ఎవ్వరూ పాల్గొనలేదని డాక్టర్ శ్రవణ్ కుమార్ చెప్పారు. గతంలో ఫోరెన్సిక్ వైద్యులు చేసింది ఏంటో తమకు తెలియదని.. నింబంధనల ప్రకారం జరిపారని ఆయన పేర్కొన్నారు. కాగా నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ ఏమి జరగలేదని చెప్పారు. 2-4 రోజులు రీ ఫ్రిజిరేటర్‌లో పెట్టామని.. మృతదేహాలు 50శాతానికి పైగా డి కంపోజ్ అయ్యాయని ఆయన తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం అడిగిన యంత్ర పరికరాలను తాము సమకూర్చామని డా. శ్రవణ్ తెలిపారు. శీతాకాలం వల్ల మృతదేహాలు ఇంకా అలాగే ఉన్నాయని.. అదే వేసవికాలంలో అయితే మూడు రోజుల్లో డీ కంపోజ్ అవుతాయని అన్నారు. ఒక్కో మృతదేహం రీ పోస్ట్ మార్టం చేసేందుకు 1 గంట సమయం పట్టే అవకాశం ఉందని డా. శ్రవణ్ తెలిపారు. రీ పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత వైద్యులు సాయంత్రం 7:30కి ఢిల్లీకి వెళ్లతారని ఆయన చెప్పారు. -
ఏడంతస్తుల్లో ఏం జరుగుతోంది?
సాక్షి, నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ యువకుడు ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం పేరిట విధులనూ కేటాయించాడు. ఇలా రెండు నెలలపాటు 24 మంది నకిలీ ఉద్యోగులను ఆస్పత్రిలో విధుల్లో కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని మాత్రం ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు అనుమానం వచ్చిన ఓ వ్యక్తిని పరిశీలించాడు. ఇంజిక్షన్ ఇవ్వడం రాకపోవడంతో గుర్తించాడు. అతడిని నిలదీయగా అసలు తతంగం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే... మాక్లూర్ మండలం గుత్పకు చెందిన సతీష్ అనే వ్యక్తి పలువురు యువతి, యువకులకు ఆస్పత్రిలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికాడు. ఒ క్కొక్కరి నుంచి రూ.20 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశాడు. ఇలా 24 మంది నుంచి డబ్బు లు వసూలు చేసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధులు కేటాయించాడు. వార్డుల్లో వీరికి ఆప్రాన్ లు ధరించి సాధారణ నర్సింగ్ విద్యార్థులతో ఆస్పత్రిలో పని చేయించాడు. 24 మందికి మొద ట నర్సింగ్ శిక్షణనిస్తామని అనంతరం అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించాడు. వీరికి ప్రతి రోజు హాజరు తీసుకోవడం, గ్రీన్ పెన్ను తో సంతకం చేయడం వంటి తతంగం నడిపించాడు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు అత్యవసర విభాగంలో రోగికి ఇంజిక్షన్ ఇచ్చే విషయంలో అనుమానం రావడంతో నర్సింగ్ విద్యార్థిని ప్రశ్నించారు. సతీష్ అనే వ్యక్తి ఉద్యోగంలో పెట్టాడని వారు తెలిపారు. ‘ప్రస్తుతం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. మీరు ఎలా వచ్చార’ని సూపరింటెండెంట్ ప్రశ్నించారు. ఇలా ఎంత మంది ఉన్నారని ప్రశ్నించగా పది మందిని గుర్తించారు. మరో 14 మంది గైర్హాజరైనట్లు వెల్లడైంది. అనంతరం సూపరింటెండెంట్ ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ప్రేక్షక పాత్ర..? ఏడంతస్తుల భవనంలో ఏమి జరుగుతుందన్నది కనీసం గుర్తు పట్టలేని దుస్థితి నెలకొంది. ప్రతి రోజు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఆరు నర్సింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు శిక్షణ నిమిత్తం వస్తారు. వీరు ఏ కళాశాలకు చెందినవారు ఎంత మంది వస్తున్నారు, వారి ట్యూటర్ వివరాలేంటి అన్నది కూడా సమాచారం లేదు. దీంతో ఆయా వార్డుల్లో నర్సింగ్ విద్యార్థులు ఏ కళాశాలకు చెందిన వారు, లేదా ప్రైవేట్‌కు చెందినవారా అనే అంశాన్ని అధికారులు గుర్తించలేకపోతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సతీష్ అనే వ్యక్తి 24 మంది యువతి, యువకులను నర్సింగ్ విద్యార్థుల పేరిట ఆస్పత్రిలో కొనసాగించాడు. నర్సింగ్ శిక్షణ లేని బయటి వ్యక్తులు ఆస్పత్రికి వచ్చి రోగులకు ఇంజిక్షన్ ఇస్తూ వారి ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉన్నారు. ఆస్పత్రిలోని 32 వార్డుల్లో ప్రతి వార్డులో ఇద్దరి నుంచి ముగ్గురు నర్సింగ్ సిబ్బంది ఉంటారు. స్టాఫ్‌నర్సు, వారి సహాయకులు సైతం ఉంటారు. వీరు కూడా నకిలీ ఉద్యోగులను గుర్తించలేకపోయారు. ఆస్పత్రికి ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు రోగులు వస్తుంటారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశిస్తున్నారు. విచారణ కమిటీ ఏర్పాటు.. నకిలీ ఉద్యోగుల చలామణిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు విచారణ కమిటీని నియమించారు. వీరిని నియమించింది ఎవరు, ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతోంది, ఆస్పత్రిలో ఎవరికైన సంబంధాలున్నాయా.. అనే అంశాలపై విచారించనున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, కంటి వైద్యాధికారి భీంసింగ్, మరో ముగ్గురు ప్రొఫెసర్లతో ఈ కమిటీ ఏర్పాటైంది. మరోవైపు ఒకటో టౌన్ పోలీసుస్టేషన్లో కేసునమోదైంది. పోలీసులువిచారిస్తున్నారు. అసలు సూత్రదారి గోపాలే.. జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల కలకలంలో గోపాలే సూత్రదారిగా ఉన్నట్లు తెలిసింది. గోపాల్ అనే వ్యక్తి వర్ని ప్రాంతానికి చెందినవాడు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఇతను సతీష్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం గోపాల్‌ను కలువగా వీరికి పరిచయం ఏర్పడింది. గోపాల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఉన్నాయని సతీష్‌కు చె ప్పాడు. వారి ద్వారా పరిచయస్తులను ఒక్కొక్కరిని ఉద్యోగాల పేరిట నమ్మించారు. వారి నిర్వహణ బాధ్యతను గోపాల్ సతీష్‌కు అప్పగించి వెళ్లిపోయాడు. గోపాల్ నెలకు ఒక్కసారి మాత్రమే ఆస్పత్రికి వచ్చేవాడని, బాధితులకు గోపాల్ పేరు మాత్రమే తెలుసునని బాధితులు అంటున్నారు. మోసపోయిన యువకులు ఆస్పత్రిలో ప్రభుత్వ ఉద్యోగం అనగానే నిరుద్యోగులు ఆనందంతో గంతులేశారు. ప్రైవేట్ వ్యక్తి ఉద్యోగుల పేరిట మోసం చేయడాన్ని గుర్తించలేకపోయారు. ఒక్కొక్కరు రూ.20 నుంచి రూ.50 వేల వరకు చెల్లించి నకిలీ ఉద్యోగంలో చేరారు. తీరా మోసం జరిగిందని తెలుసుకొని ఆవేదన చెందుతున్నారు. పది మందిని పోలీసులు విచారించగా ఆస్పత్రిలో ఉద్యోగం అనగానే సంతోషపడ్డామని ప్రతి రోజు వార్డుల్లో శిక్షణ ఇవ్వడంతో సతీష్ మాటలు నమ్మనట్లు తెలిపారు. తీరా పోలీసుల విచారణలో నమ్మించి మోసం చేసినవారిని కఠినంగా శిక్షించాలంటున్నారు. ఉద్యోగాల పేరిట వలవేసిన సతీష్ అతడి చెల్లెలు, బంధువు కూడా ఈ నకిలీ ఉద్యోగాల్లో చేరారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి, బోధన్, వర్ని మండలం చింతకుంట, జగిత్యాల, సిరిసిల్లా జిల్లా రుద్రాంగి, నిజామాబాద్‌కు చెందిన వారిద్దరు, మాక్లూర్ మండలానికి చెందిన ఇద్దరు, ఆర్మూర్‌కు చెందిన వారు మరొకరు ఉన్నారు. మరికొందరి వివరాలు తెలియాల్సి ఉంది. ఫిర్యాదు చేసిన బాధితుడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరిట మోసానికి గురయ్యామని క్రాంతి అనే వ్యక్తి బుధవారం ఒకటో టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సతీష్ అనే వ్యక్తికి ఐదుగురం డబ్బులు చెల్లించామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నిలోఫర్‌లో గందరగోళం.. సిబ్బందిపై ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ చిన్నపిల్లల హాస్పిటల్ నిలోఫర్‌లో బుధవారం గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జియాగూడకు చెందిన 3 నెలల బాలుడు ధృవన్‌కు జ్వరం రావడంతో తల్లిదండ్రులు నిలోఫర్‌కు తీసుకొచ్చారు. బాబుకు పరీక్షలు చేసిన వైద్యులు.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించారు. ఆ తర్వాత బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తల్లిదండ్రులు వైద్యం నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, A పాజిటివ్ రక్తానికి బదులు ‘0’ పాజిటివ్ రక్తం ఎక్కించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని ఆసుపత్రి యాజమాన్యం బెదిరింపులకు దిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అవగాహనా రాహిత్యం వల్లే.. కాగా, ధృవన్ అంశంపై నిలోఫర్ సూపరెండెంట్ మురళీకృష్ణ స్పందించారు. బాలుడు ధృవన్ ఆరోగ్యం బాగుందని స్పష్టం చేశారు. అవగాహనా రాహిత్యం వల్ల బాలుడి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారన్నారు. ఆరు నెలల వరకు బ్లడ్ గ్రూప్ నిర్థారణ కాదని, ‘0’ గ్రూప్ విశ్వధాత కావున సదరు బ్లడ్ గ్రూప్ బాబుకి ఎక్కించామని ఆయన వెల్లడించారు. రక్తం ఎక్కించిన తర్వాత బాలుడికి ఎలాంటి ఇబ్బంది జరుగలేదన్నారు. ధృవన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని, ప్రస్తుతం బాబుకు ప్రాణాపాయం లేదని వివరించారు. -
పెద్దాస్పత్రి.... సమస్యలతో కుస్తీ !
జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అది. నిత్యం వైద్య సేవలు కోసం వందలాది మంది ఇక్కడకు వస్తారు. పేరుకు పెద్దాస్పత్రి అయినప్పటికీ ఇక్కడ అనేక సమస్యలు నెలకొన్నాయి. పరికరాలు లేక కొన్ని సేవలు అందడం లేదు. ఉన్నా...కొన్ని పరికరాలు మూలకు చేరడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళ స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతారామరాజు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆస్పత్రిలో పలు వార్డులను, ఓపీ విభాగాలను పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. సూపరింటెండెంట్: అమ్మా నాపేరు సీతారామరాజు. నేను సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను, సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. మీపేరేంటి, ఏసమస్యతో ఎక్కడకు వచ్చారు? రోగి: నాపేరు లెంక రమణమ్మ సార్. మాది గజపతినగరం గ్రామం. బీపీ ఉందని ఇక్కడకు వచ్చాను సూపరింటెండెంట్: డాక్టర్‌గారు వచ్చారా ?, బాగా చెక్ చేశారా? రోగి రమణమ్మ: డాక్టర్‌గారు వచ్చారు. బాగానే చూశారు. సూపరింటెండెంట్: డాక్టర్ గారు కసురుకుంటున్నారా ?, ప్రేమగా మాట్లాడుతున్నారా? రమణమ్మ : బాగానే మాట్లాడుతున్నారు. కసురుకోవడం లేదు. సూపరింటెండెంట్: ఏమ్మా మీదేఊరు? ఏసమస్యతో వచ్చారు? రోగి : నాపేరు భవాని. మాది అయ్యన్నపేట గ్రామం సార్. కడుపునొప్పిగా ఉండడంతో వచ్చాను. సూపరింటెండెంట్: చికిత్స ఏ విధంగా చేస్తున్నారు? భవాని: చికిత్స బాగానే చేస్తున్నారు. మందులు కూడా ఇచ్చారు. సూపరింటెండెంట్: బాబు మీదే గ్రామం. ఆస్పత్రికి ఎందుకు వచ్చారు? రోగి: నాపేరు కె.రమేష్. మాది బీజే పాలెం గ్రామం. బీపీ ఉందని వచ్చాను. సూపరింటెండెంట్: పారిశుద్ధ్యం ఏవిధంగా ఉంది. మరుగుదొడ్లులో నీటి సరఫరా ఉందా, సిబ్బంది ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? రమేష్: ఎవరూ డబ్బులు అడగలేదు. మరుగుదొడ్లలో నీరు వస్తోంది. పారిశుద్ధ్యం బాగానే ఉంది సూపరింటెండెంట్ : ఏమ్మా మీది ఏ ఊరు. ఏ సమస్యతో ఇక్కడకు వచ్చావు? రోగి : బాబు నా పేరు రెడ్డి కమలమ్మ. మాది చింతలవలస గ్రామం. పాము కరవడంతో ఇక్కడకు వచ్చాను. సూపరింటెండెంట్: ఎప్పుడు కరిచింది, ఎన్ని గంటల్లోగా చేరారు, ఏవిధంగా వచ్చారు? కమలమ్మ : గురువారం రాత్రి 7 గంటలకు పాము కరిచింది. రాత్రి 2 గంటలకు కేంద్రాస్పత్రికి వచ్చాను. 108 ద్వారా ఆస్పత్రికి వచ్చాను. సూపరింటెండెంట్ : సిస్టర్ మీపేరేంటి, వార్డులో సమస్యలు ఏవైనా ఉన్నాయా? సునీత స్టాఫ్ నర్స్ : సార్ నాపేరు సునీత. ఎమర్జెన్సీ వార్డులో ఏసీలు నెలరోజులుగా పనిచేయడం లేదు సార్. మెమోలు రాశాం. అయినా బాగు చేయలేదు. సూపరింటెండెంట్ : రెండు మూడు రోజుల్లో ఏసీలు బాగు చేయిస్తాం. రోగులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. సూపరింటెండెంట్ : డాక్టర్ మీ పేరేంటి. క్యాజువాలీటీలో సేవలు ఏవిధంగా అందిస్తున్నారు. డాక్టర్: సార్ నాపేరు శర్మ. క్యాజువాలీటికి వచ్చిన వారికి సకాలంలో సేవలు అందిస్తున్నాం, సేవలు అందించడంలో ఏమాత్రం అలసత్వం వహించడం లేదు. సూపరింటెండెంట్: బాబు ఆస్పత్రికి ఎందుకు వచ్చావు? రోగి: సార్ డయాలసిస్ చేసుకుని ఇంటికి వెళుతుండగా బస్సు దిగినప్పుడు కాలు విరిగింది. చికిత్స చేయించుకోడానికి వచ్చాను. సూపరింటెండెంట్ : ఇప్పుడే వచ్చావా. ఇంతకు మందు ఎప్పుడైనా వచ్చావా. వైద్యులు బాగాచూస్తున్నారా? రోగి: ఇప్పటికి రెండు సార్లు వచ్చాను సార్. హెచ్ఐవీ ఉందని చెప్పి ముట్టుకోకుండా మందులు రాసి పంపిస్తున్నారు. బాధ భరించ లేకపోతున్నాను సార్. సూపరింటెండెంట్: బాధపడుకు నీకు వైద్యం జరిగేలా చూస్తాను. హెచ్ఐవీ రోగులకు కూడా వైద్యం జరిగేలా చర్యలు తీసుకుంటాం. సూపరింటెండెంట్ : డాక్టర్‌గారు మీపేరేంటి, మీ దగ్గరకు ఎంతమంది రోగులు వస్తారు. ఏయే వ్యాధులతో ఎక్కువ మంది వస్తారు? డాక్టర్ సౌజన్య : సార్ నాపేరు సౌజన్య. రోజుకు 30 నుంచి 40 మంది వరకు పిల్లలు వస్తారు. ఎక్కువగా జ్వరాలు, జలుబు, దగ్గు, మరీ ముఖ్యంగా రక్తహీనతతో ఎక్కువ మంది వస్తున్నారు. సూపరింటెండెంట్ : రక్తహీనతతో వచ్చే వారికి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? డాక్టర్ సౌజన్య: అందుబాటులో ఉన్న ఆకుకూరలు, కాయగారులు, పండ్లు వంటి ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నాను. సూపరింటెండెంట్ : డాక్టర్ గారు మీ పేరేంటి, నెలకు మీ దగ్గరకు ఎంతమంది మందుల కోసం వస్తుం టారు. మెరుగైన సేవలు అందించడానికి సౌకర్యాలు అదనంగా కావాలా? డాక్టర్ : సార్ నా పేరు సత్యనారాయణ. నా దగ్గరకు మానసిక సమస్యలతో నెలకు 300 మంది వరకు వస్తారు. మరొక మానసిక వైద్యుడు, సోషల్ వర్కర్ కావాలి. మానసిక రోగులకు ప్రత్యేక వార్డు, ఎంఆర్ఐ స్కాన్, ఈసీటీ పరికరం కావాలి. సూపరింటెండెంట్ : మానసిక వైద్యుడు, సోషల్ వర్కర్ నియామకం కోసం, ఎంఆర్ఐ స్కాన్ పరికరం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తాం. సూపరింటెండెంట్: బాబు నీ పేరేంటి ఎక్కడ నుంచి వచ్చాం. నీ సమస్య ఏంటి? రోగి : సార్ నాపేరు మహేష్, మాది పద్మనాభం గ్రామం. నాకు సుగర్ వ్యాధి ఉంది. గత ఎనిమిదేళ్లుగా బాధపడుతున్నాను. నీరసంగా ఉంటుంది. నడవడానికి ఇబ్బందిగా ఉంది సూపరింటెండెంట్ : పిల్లలో సుగర్ వ్యాధి రావడం చాలా అరుదు. ఇటువంటి పిల్లలకు చికిత్స అందించడానికి అవసరమైన అన్ని మందులు ఆస్పత్రిలో ఉన్నాయి. సూపరింటెండెంట్ : మీపేరేంటి, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారా? జూనియర్ అనలిస్టు భువనేశ్వరావు : సార్ నాపేరు భువనేశ్వరరావు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నాం. సూపరింటెండెంట్ : మీకు ఏవైనా సౌకర్యాలు కావాలా? భువనేశ్వరావు : మరుగుదొడ్లు, గదలు చాలక ఇబ్బంది పడుతున్నాం. సూపరింటెండెంట్ : అదనంగా గదులు, మరుగుదొడ్లు నిర్మిస్తాం. సూపరింటెండెంట్ : మీపేరేంటి, రోగులకు మెరుగైన సేవలు అందించడానికి మీకు ఏమైనా సౌకర్యాలు కావాలా? ల్యాబ్ టెక్నీషయన్ : సార్ నాపేరు ఆచారి. ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. సెల్‌కౌంటర్, ఎలక్ట్రకల్ ఎనలేజర్ వంటి ఆధునాతన సౌకర్యాలు ఉంటే మెరుగైన వైద్య సేవలు అందించగలిగాం. సూపరింటెండెంట్ : లేబరేటరీలో మెరుగైన సేవలు అందించడానికి అధునాతన పరికరాలు ఏర్పాటు చేస్తాం. సూపరింటెండెంట్ : మీపేరేంటి, నెలకు ఎంత రక్తం సేకరిస్తున్నారు, డాక్టర్ : సార్ నాపేరు సత్యశ్రీనివాస్. బ్లడ్‌బ్యాంక్‌లో నెలకు 300 యూనిట్ల వరకు రక్త సేకరణ చేస్తున్నాం. 600 యూనిట్ల వరకు రక్తం అవసరం పడుతుంది. రక్తదానంపై ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది సూపరింటెండెంట్ : మీపేరేంటి, ఇక్కడకు ఎందుకు వచ్చారు? సామాజిక కార్యకర్త: సార్ నాపేరు రవూఫ్. నేను సామాజిక కార్యకర్తను. సూపరింటెండెంట్: రక్తం కొరత తీర్చడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? రవూఫ్ : రక్తదానం ప్రస్తుతం జిల్లా కేంద్రానికే పరమితమైంది. అలా కాకుండా జిల్లాలో ఉన్న 34 మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి సూపరింటెండెంట్ : 34 మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాను. సూపరింటెండెంట్ : సిస్టర్ మీపేరేంటి, రాత్రి వేళల్లో ఆస్పత్రిలో అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి? స్టాఫ్ నర్స్ : నాపేరు అనురాధ సార్, రాత్రి వేళల్లో అత్యవసర కేసులు గురించి మాట్లడానికి క్యాజువాలీటికి వెళతాం. ఆ తర్వాత వచ్చేస్తాం సూపరింటెండెంట్ : కొంతమంది స్టాఫ్‌నర్స్‌లు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండడం లేనట్టు తెలిసింది. ప్రతీ స్టాఫ్ నర్స్ వారికి కేటాయించిన వార్డుల్లో అందుబాటులో ఉండాలి. సూపరింటెండెంట్ : బాబు నీపేరేంటి, ఎప్పుడు జాయిన్ అయ్యావు. ఏసమస్యతో వచ్చావు? రోగి: సార్ నాపేరు మహేష్, కాలు విరగడంతో జనవరి నెలలో జాయిన్ అయ్యాను. ఇంతవరకు ఆపరేషన్ చేయలేదు. సూపరింటెండెంట్: ఆపరేషన్ రెండు, మూడు రోజు ల్లో అయ్యేలా చర్యలు తీసుకుంటాం. -
నర్సింగ్ విద్యార్థినిపై అఘాయిత్యం!
నరరూప రాక్ష సుల కామవాంఛకు ‘నిర్భయ’ బలై ఏడాది గడిచింది. ఆ ఘటనకు నిరసనగా అప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. మహిళల రక్షణకు ‘నిర్భయ’లాంటి కఠిన చట్టాలు వచ్చాయి. అయినా అవి వారిపై దాడులను నిలువ రించలేకపోతున్నాయి. పనిచేసే స్థలాలు, జనసమ్మర్థమైన ప్రాంతాలు, చివరకు ఇళ్లలో కూడా మహిళలకు రక్షణ కరువవుతోంది. మృగాళ్లు... పిశాచాల్లా అవకాశం కోసం కాచుకుని కూర్చొని లైంగిక దాడులకు యత్నిస్తున్నారు. పట్టణంలో కేంద్రాస్పత్రిలో నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి ఒకరు యత్నించడం ఆస్పత్రి సిబ్బందిలో ఆందోళన రేకెత్తించింది. బరితెగించి... రోగులు, వైద్యులు, ఆస్పత్రిలో ఇతర ఉద్యోగులతో నిత్యం రద్దీగా ఉండే కేంద్రాస్పత్రిలోని క్యాజువాలటీ విభాగంలో శిక్షణ పొందుతున్న నర్సింగ్ విద్యార్థినిపై ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి శనివారం లైంగిక దాడికి యత్నించాడు. విద్యార్థిని డ్రెస్సింగ్ మెటీరియ ల్ తేవడానికి క్యాజువాలిటీ పక్కన ఉన్న స్టోర్రూంకి వెళ్లింది. దీనిని గమనించిన ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంఎన్ఓ( మే ల్ నర్సింగ్ ఆర్డర్) రాము అనే వ్యక్తి ఆమెను వెంబడించి స్టోర్‌రూంలో గడియ పెట్టి లైంగిక దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా... సూపరింటెండెంట్ నాకు తెలుసని, నీకు ట్రైనింగ్ సర్టిఫకెట్ ఇవ్వకుండా చేస్తానని బెదిరించసాగాడు. ఊహించని పరిణామంతో తీవ్రం గా ఆందోళన చెందిన ఆమె పెద్దగా కేకలు వేసింది. తలుపు తీసుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. ఇది తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. రెండు నెలల కింద ట ఘోషా ఆస్పత్రిలో ఓ సా్‌టఫ్ నర్సు పై ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది మరువక ముందే మరో వ్యక్తి బరితెగించడంతో మహిళా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజీకి యత్నాలు: బాధితురాలికి అండగా నిల వాల్సిన కొంతమంది సంఘం నాయకులు రాజీకి ప్రయత్నించారు. ఏదో అయిపోయింది , క్షమాపణ చెబుతాడు ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడితెచ్చారు. అయితే విద్యార్థి మాత్రం రాజీకి అంగీకరించలేదని తెలిసింది. ఘోషా ఆస్పత్రిలో... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో తరచూ ఇటువంటి సంఘటనలు జరగుతున్నాయి. దీంతో నర్సులు, మహిళా ఉద్యోగులు, ఆస్పత్రి వచ్చే మహిళలు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలు క్రితం ఘోషా ఆస్పత్రిలో ఓ స్టాఫ్‌నర్స్‌పై ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని విధులు నుంచి తొలిగించారు. అయితే అతనిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. -
ఖురేషి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి
-
ఖురేషి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి: ప్రమోద్‌కుమార్
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన రోగుల్లో ఖురేషి అనే ఖైదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆసుపత్రి నుంచి గత రాత్రి 11 మంది రోగులు పరారైనట్లు ధృవీకరించారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఖురేషి భార్య ములాఖత్ కావాలంటూ ఆసుపత్రికి వచ్చిందని, అయితే ఆ సమయంలో ములాఖత్ నిబంధనలకు విరుద్ధమని చెప్పామని ఆయన తెలిపారు. భార్యతో ములాఖత్ నిరాకరించడంతో ఖురేషి ఆసుపత్రిలో భయానక వాతావరణం సృష్టించాడని పేర్కొన్నారు. ఖురేషీ ఆసుపత్రి సిబ్బంది,పోలీస్ సెక్యూరిటీపై తరచుగా బెదిరింపులకు పాల్పడేవాడని వివరించారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి వారంత పరారయ్యారని తెలిపారు. పరారైన వారిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరో నలుగురు పరారిలో ఉన్నారన్నారు. రాత్రి సమయంలో వారిని అడ్డుకోవడానికి తమ సిబ్బంది, పోలీసులు విఫలయత్నం చేశామన్నారు. అయితే ఆసుపత్రిలో మిగిలిన 50 మంది పేషెంట్లకు ఎటువంటి హాని కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.