repostmortem
-
మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం
చింతకాని: హైకోర్టు ఆదేశాల మేరకు అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన మరియమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలో, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జ్యుడీషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ సమక్షంలో వరంగల్ రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం, కాకతీయ మెడికల్ కళాశాల వైద్య బృందం శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించింది. దొంగతనం కేసులో జూన్ 17వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు మరియమ్మతోపాటు ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు వేముల శంకర్లను విచారణ పేరుతో గ్రామం నుంచి తీసుకెళ్లి కొట్టడంతో అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ మృతిచెందిన విషయం విదితమే. దీంతో మరియమ్మ మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని పౌరహక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై న్యాయ విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆలేరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. జూన్ 18న మృతి చెందిన మరియమ్మ మృతదేహానికి అడ్డగూడూరు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మృతురాలి స్వగ్రామమైన కోమట్లగూ డెంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే న్యాయ విచారణలో భాగంగా గ్రామంలో పూడ్చిపెట్టిన మరియ మ్మ మృతదేహాన్ని 14 రోజుల తర్వాత వెలికితీసి ఆలేరు మేజిస్ట్రేట్ సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ మరియమ్మ ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లను విచారించి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. -
భర్త మృతిపై అనుమానం: నెల తరువాత మృతదేహం..
తిరువళ్లూరు: భర్త మృతిపై అనుమానం వుందని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్ట మ్ నిర్వహించిన సంఘటన కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా రామతండలం గ్రామానికి చెందిన సుధ(23)కు పెరంబదూరు గత మార్చి 29న రాజశేఖర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్టు నిర్ధారించడంతో పోస్టుమార్టమ్ నిర్వహించకుండానే మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే భర్త మృతిపై అనుమానంతో సుధ, తిరువళ్లూరు కలెక్టర్ పొన్నయ్య, ఎస్పీ అరవిందన్‌కు ఫిర్యాదు చేసింది.శుక్రవారం పోలీసుల సమక్షంలో శవపరిక్ష నిర్వహించారు. పుస్తకం తీసుకోవడానికి వెళ్లిన విద్యార్థినిపై లైంగిక దాడి తిరువొత్తియూరు: బ్రిడ్జ్ కోర్సు పుస్తకాన్ని తీసుకోవడానికి పాఠశాలకు వెళ్లిన తొమ్మిదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించిన ఉపాధ్యాయుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ధర్మపురి జిల్లా పెన్నాగరానికి చెందిన విద్యార్థిని (14) సమీప గ్రామంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థుల కోసం బ్రిడ్జ్ కోర్సు పుస్తకాన్ని అందజేస్తున్నారు. ఈ పుస్తకాన్ని తీసుకోవడానికి విద్యార్థిని గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లింది. పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లియంపట్టికి చెందిన గోవిందన్ (43) విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. విద్యార్థిని దీని గురించి తల్లిదండ్రులతో చెప్పడంతో పెన్నాగరం మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడు గోవిందన్‌ను పోక్సో చట్టం కింద శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. చదవండి: బిడ్డను చంపి ఉరేసుకున్న తల్లి చదవండి: ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ తయారు చేసి -
రీ పోస్టుమార్టం ఫలించని ప్రయత్నం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: హైకోర్టు ఆదేశాల మేరకు మావోయిస్టుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే మృతదేహాలను తిరిగి తీసుకొచ్చేందుకు ఏ మేరకు ప్రయత్నాలు చేశారనే వివరాలను పోలీసులు పూర్తిస్థాయిలో వెల్లడించడంలేదు. కావాలనే తాత్సారం చేశారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నెల 23న చర్ల మండలం చెన్నాపురం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ సాయంత్రం సమయంలో జరిగిందని, ఇదేరోజు ఉదయం పాల్వంచ మండలంలోని ఉల్వనూరు గ్రామ సమీపంలోని పాములదన్ను అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అంత్యక్రియలు పూర్తి పోలీసులు మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతిచెందినవారిలో చర్ల మండలంలోని కిష్టారంపాడు గ్రామానికి చెందిన లోకల్ గెరిల్లా స్క్వాడ్ సోడి జోగయ్య, చెన్నాపురానికి చెందిన దళ సభ్యురాలు మడకం మల్లి, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం గన్నాపురం గ్రామపంచాయతీ పరిధిలోని భువనగిరి గ్రామానికి చెందిన లోకల్ గెరిల్లా స్క్వాడ్ సభ్యురాలు మడకం మంగి ఉన్నారు. జోగయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, మల్లికి వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. మృతదేహాలు గ్రామాలకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. హైకోర్టులో పిటిషన్‌తో.. చెన్నాపురం ఎన్‌కౌంటర్‌పై రఘునాథ్ అనే వ్యక్తి ఈ నెల 24న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని, మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం చేయించాలని, సదరు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అసలు ఎన్కౌంటర్ పైనే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయా, లేక పట్టుకుని కాల్చి చంపారా అంటూ హక్కుల సంఘాల అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో వరుసగా ఈ నెలలో నాలుగు చోట్ల ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ నెల 3న గుండాల మండలం దేవళ్లగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు, 7న చర్ల మండలం పూసుగుప్ప వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మా వోలు, 19న ఆసిఫాబాద్ జిల్లా కదంబా అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు మృతిచెందారు. భద్రతా కారణాలతో.. మృతదేహాలను వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఫ్రీజర్‌లో ఉంచాలని, ఫోరెన్సిక్ నిపుణులతో వీడియో తీస్తూ రీపోస్టుమార్టం చేసి, సదరు నివేదికను సీల్డ్ కవర్లో తమకు అందజేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు అప్పగించిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను తిరిగి కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే చర్ల మండలం చెన్నాపురం, కిష్టారంపాడు గ్రామాలు దట్టమైన అటవీప్రాంతంలో ఉండటంతో భద్రత కారణాల నేపథ్యంలో అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉందని, పైగా పలుచోట్ల ఇప్పటికే మందుపాతరలు పెట్టి మావోలు రోడ్డును పేల్చివేశారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పలుచోట్ల మందుపాతరలు వెలికితీశారు. మరికొన్నిచోట్ల మావోలు పేల్చారు. దీంతో పోలీసులు మృతదేహాలను తిరిగి తెప్పించేందుకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను ఆయా గ్రామాల వద్దకు పంపించారు. గ్రామస్తులు, మిలీషియా సభ్యులు మాత్రం ఎవరినీ అనుమతించలేదని తెలుస్తోంది. కాగా.. ఈ నెల 28న∙బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోలు ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీ గూడెంలపై నిఘా పాల్వంచ: ఎదురుకాల్పుల ఘటనతో పాల్వంచ ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చి ఏర్పాటు చేసుకున్న ఆదివాసీ గిరిజనుల గూడెంలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పాల్వంచ మండలంలోని ఉల్వనూరు సమీపంలో పాములదన్నుగుట్ట అటవీప్రాంతంలో బుధవారం మావోయిస్టు దళం సంచరిస్తున్నట్లు సమాచారం అందుకుని కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో ఒక తుపాకి, కిట్ బ్యాగ్‌లు, విప్లవ సాహిత్యం, వంట పాత్రలు వదిలి అడవిలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం రెండు రోజులుగా ప్రత్యేక పోలీసులు, సివిల్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివాసీలతో మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాద్‌రావు శుక్రవారం కొత్తూరు, మల్లారం, రాళ్లచెలక, పెద్దకలస, నర్సిహాసాగర్ సమీపంలోని ఆదివాసీ గిరిజన గూడెంలను డీఎస్పీ ప్రసాద్‌రావు, ఎస్ఐ కె.సుమన్ సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ స్థానిక ఆదివాసీ గిరిజనులతో మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారికి ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వొద్దని కోరారు. అపరచిత వ్యక్తులు బయట నుంచి ఎవరు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొత్తగా ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి ఎవరెవరు వచ్చి పోయారని డీసీఎ్ప గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలి కొత్తగూడెం: ఈనెల 3, 7, 19, 23 తేదీల్లో జరిగిన ఘటనలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు చేసిన బూటకపు ఎన్కౌంటర్లేనని ప్రజలు, ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని, హత్యలకు పాల్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, నాయకులను, పోలీసులను శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో శుక్రవారం ఒక ప్రకటన విడుదలైంది. హైకోర్టు వెంటనే బూటకపు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని, ఎన్కౌంటర్లకు నిరసనగా సెప్టెంబర్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను పాటించాలని పేర్కొన్నారు. చెన్నాపురం, కదంబ, పూసుగుప్ప, దేవార్లగూడెంలో జరిగివన్నీ బూటకపు ఎన్కౌంటర్లేనని, 8 మందిని పట్టుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు చట్ట ప్రకారం వారిని జైల్లో పెట్టకుండా బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారని వివరించారు. మావోయిస్టు పార్టీ ఎజెండానే, మా ఎజెండా అంటూ నమ్మబలికిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు సేవలు చేస్తూ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు పక్కన పెట్టి సహజ వనరులను దోచుకుంటూ తెలంగాణలో 90 శాతంగా ఉన్న పీడిత ప్రజలు, దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలవారు, మహిళలు, విద్యార్ధులు, ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేశారని ఆరోపించారు. -
రీపోస్టుమార్టం నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువుల నుంచి వెంటనే స్వాధీనం చేసుకొని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో భద్రపరచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్య బృందంతో మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని, ఈ మొత్తం ప్రక్రియను ఫొటోలు, వీడియోలు తీయాలని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. చర్ల ఎన్కౌంటర్లో చనిపోయిన ముగ్గురి మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసేలా ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం అత్యవసరంగా విచారణకు స్వీకరించింది. ఎన్కౌంటర్ పేరుతో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని పోలీసులు హత్య చేశారని, మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయించేలా ఆదేశించడంతోపాటు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపించారు. తూతూమంత్రంగా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారని, ఆధారాలను మాయం చేసేందుకే పోలీసులు ఇలా చేశారని కోర్టుకు నివేదించారు. కాగా, ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని, వారిని సోది జోగయ్య, మడకం మంగ్లి, మడకం మల్లిగా గుర్తించామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ నివేదించారు. పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాలను అప్పగించామని చెబుతూ.. ఈ మేరకు శవాలను బంధువులకు అప్పగించినట్లుగా ఉన్న పత్రాలను ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ ప్రక్రియను వీడియో తీశామని వివరించారు. అయితే ఆధారాలను మాయం చేసేందుకే పోలీసులు పోస్టుమార్టం చేసి మృతదేహాలకు వెంటనే అంత్యక్రియలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని రఘునాథ్ ఆరోపించారు. మృతదేహాలను వెంటనే వారి బంధువుల నుంచి స్వాధీనం చేసుకొని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచేలా చర్యలు తీసుకుంటామని ఏజీ నివేదించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది. -
హైకోర్టు రిజిస్ట్రార్‌కు రీ పోస్ట్‌మార్టం రిపోర్ట్
-
దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం పూర్తి
-
‘మృతదేహాలకు ఎంబామింగ్ జరగలేదు’
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం కొనసాగుతోందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రవణ్‌కుమార్ తెలిపారు. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రియ చేపట్టాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. నలుగురు నిపుణులతో కూడిన బృందం రీ పోస్ట్‌మార్టం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోస్ట్ మార్టం మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నామని తెలిపారు. సీడీ, పెన్ డ్రైవ్ ద్వారా వైద్యులు హైకోర్టుకు నివేదిక అందిస్తారని ఆయన తెలిపారు. సాయంత్రం 5 గంటల లోపు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందిస్తామన్నారు. రెండు అంబులెన్స్ వాహనాల్లో వారి గ్రామాలకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. పోస్ట్ మార్టంలో గాంధీ వైద్యులు ఎవ్వరూ పాల్గొనలేదని డాక్టర్ శ్రవణ్ కుమార్ చెప్పారు. గతంలో ఫోరెన్సిక్ వైద్యులు చేసింది ఏంటో తమకు తెలియదని.. నింబంధనల ప్రకారం జరిపారని ఆయన పేర్కొన్నారు. కాగా నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ ఏమి జరగలేదని చెప్పారు. 2-4 రోజులు రీ ఫ్రిజిరేటర్‌లో పెట్టామని.. మృతదేహాలు 50శాతానికి పైగా డి కంపోజ్ అయ్యాయని ఆయన తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం అడిగిన యంత్ర పరికరాలను తాము సమకూర్చామని డా. శ్రవణ్ తెలిపారు. శీతాకాలం వల్ల మృతదేహాలు ఇంకా అలాగే ఉన్నాయని.. అదే వేసవికాలంలో అయితే మూడు రోజుల్లో డీ కంపోజ్ అవుతాయని అన్నారు. ఒక్కో మృతదేహం రీ పోస్ట్ మార్టం చేసేందుకు 1 గంట సమయం పట్టే అవకాశం ఉందని డా. శ్రవణ్ తెలిపారు. రీ పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత వైద్యులు సాయంత్రం 7:30కి ఢిల్లీకి వెళ్లతారని ఆయన చెప్పారు. -
‘దిశ’ నిందితులకు రీ పోస్టుమార్టం
సాక్షి, హైదరాబాద్ : ఎన్కౌంటర్లో మరణించిన దిశ అత్యాచార నిందితుల మృతదేహాలకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులతో తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని ముగ్గురు సీనియర్ ఫోరెన్సిక్ వైద్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి. నలుగురి మృతదేహాలకు ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పోస్టుమార్టం నిర్వహిం చాలి. మృతదేహాల వారీగా నివేదికివ్వాలి. కమిటీని తక్షణమే పంపాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎయిమ్స్‌ను కోరాలి. వైద్యుల కమి టీకి ప్రయాణ ఖర్చులు, బస మొదలైన వాటిని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. పోస్టుమార్టం నిర్వహించేటప్పుడు వీడియో చిత్రీకరణ చేయాలి. దాన్ని సీడీ లేదా పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అందజేయాలి. రెండోసారి పోస్టుమార్టం పూర్తి చేశాక మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు పోలీ సుల సమక్షంలో గాంధీ ఆస్పత్రి సూపరింటెం డెంట్ అప్పగించాలి. ఎన్కౌంటర్లో వినియోగించిన రివాల్వర్ వంటి ఆయుధాలు, లాగ్ రిజిస్టర్, పోలీసు వాహనాల కదలికల రిజిస్టర్ మొదలైన వాటిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్వాధీనం చేసుకుని హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలి. సిట్ ఇచ్చే వాటిపై నివేదికను, పోస్టుమార్టం నివేదికలను సుప్రీం కోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్‌కు ప్రభుత్వ అధికారులు అందజేయాలి’అని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శనివారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవాలు వెలుగులోకి రావాలి.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు మరణిస్తే.. సీఆర్పీసీలోని 176 (1)(ఎ) సెక్షన్ కింద జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మాత్రమే ఆ ఘటనపై విచారణ చేయాలని, అయితే చటాన్‌పల్లి ఎన్కౌంటర్ తర్వాత ఆర్డీవో విచారణ చేపట్టినట్లు ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో చెప్పడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి. ప్రజలకు నిజం ఏంటో తెలియాలి. అసలు ఏం జరిగిందో చట్టప్రకారం తేల్చాలి’అని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్కౌంటర్ ఘటనపై కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ (ఆధారాల సేకరణ)పై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఈ నెల 17న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కె.సజన ఇతర మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాలు సంయుక్తంగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై శనివారం హైకోర్టు విచారణ జరిపింది. దిశ హత్యాచార ఘటనపై ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో ‘తక్షణ న్యాయం’పేరుతో నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులను ఎన్కౌంటర్లో హతమార్చారని, సీబీఐ దర్యాప్తు చేసే ఉత్తర్వులు జారీ చేయాలని సజన, ఇదే మాదిరిగా మరో ఐదు పిల్స్ కూడా దాఖలయ్యాయి. మృతదేహాలు సగం పాడయ్యాయి.. ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శ్రవణ్ కుమార్ స్వయంగా హాజరై ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రంగా ఉంచామని, ఇప్పటికే మృతదేహాల అంతర్గత భాగాలు 50 శాతం వరకు చెడిపోయాయని, మరో ఐదారు రోజులు ఉంచితే మృతదేహాల బయట కూడా చెడి పూర్తిగా పాడైపోతాయని చెప్పారు. మైనస్ 5 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చేందుకు దేశంలో ఎక్కడా వసతుల్లేవని తెలిపారు. 2 నుంచి 4 డిగ్రీల మధ్య మృతదేహాల్ని భద్రపరిచామన్నారు. వద్దంటూనే ఒప్పుకున్న ప్రభుత్వం ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. హైకోర్టు ఆదేశాల మేరకే నలుగురి మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి వైద్య నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించామని, కోర్టు ఆదేశాల మేరకే మృతదేహాల్ని భద్రపర్చామని, మళ్లీ పోస్టుమార్టం చేయాల్సిన అవసరం లేదన్నారు. రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయిస్తే రాష్ట్రంలో ఉన్న నిష్ణాతులైన ఫోరెన్సిక్ వైద్య నిపుణులతో నిర్వహిస్తే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉంటుందన్నారు. ఒకవేళ రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని ధర్మాసనం నిర్ణయిస్తే అందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ఏజీ చెప్పారు. కోర్టుకు సహాయకారిగా నియమితులైన సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్‌రెడ్డి వాదిస్తూ.. ఎన్‌కౌంటర్‌పై సందేహాలు, అనుమానాలు ఉన్నందున రాష్ట్రానికి సంబంధం లేని వైద్యులతో స్వతంత్రంగా రీపోస్టుమార్టం చేయిస్తే ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరుగుతుందని చెప్పారు. ఎన్కౌంటర్ బోగస్.. పిటిషనర్ సజన తరఫు సుప్రీంకోర్టు న్యాయవాది వింద్రా గ్రోవర్ వాదిస్తూ.. ఇవి ప్రభుత్వ అధీనంలో జరిగిన హత్యలని అభివర్ణించారు. పిటిషనర్లు మహిళలు, బాలికల హక్కుల గురించి పోరాడుతున్నారని, హత్యాచార ఘటనలపై ఆందోళనలు చేస్తారని, అయితే దిశ హత్యాచార కేసులో నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడాలని కోరుకుంటున్నారని వివరించారు. తక్షణ న్యాయం పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకున్నప్పుడు మౌనంగా ఉంటే అరాచకాలకు తెర తీసినట్లవుతుందని పేర్కొన్నారు. ఎన్కౌంటర్ ఘటనపై ఆధారాల సేకరణ, మృతదేహాల అప్పగింత అంశంపై హైకోర్టు ఉత్తర్వులివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, మృతదేహాలకు రెండోసారి పోస్టుమార్టం చేస్తేనే ఆధారాలు సేకరించినట్లు కాదని చెప్పారు. నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా ఉన్నత స్థాయి శిక్షణ పొందిన పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారని, ఆ పోలీసులు అందరి దగ్గర ఆయుధాలు ఉంటే నిరాయుధులైన నిందితులు వాటిని లాక్కుని కాల్పులు జరపబోతే పోలీసులు ఎన్కౌంటర్ చేశామని చెప్పడం కట్టు కథేనని వివరించారు. ఎన్కౌంటర్ జరిగాక సీనియర్ పోలీసులు, మంత్రులు సైతం ఘనకార్యం జరిగినట్లుగా స్పందించి వేడుకలు చేసుకున్నారని, తక్షణ న్యాయం పేరుతో పౌరహక్కుల్ని కాలరాశారని చెప్పారు. ఏం జరిగిందంటే.. దిశ హత్యాచార ఘటన తొండుపల్లి టోల్గేట్ సమీపంలో నవంబర్ 27న జరిగింది. ఘటనా స్థలానికి ఈ నెల 6న నిందితుల్ని పోలీసులు తీసుకువెళ్తుండగా చటాన్‌పల్లిలో ఎన్కౌంటర్ జరిగింది. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అదే రోజే సాయంత్రం పలు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు హైకోర్టుకు ఫిర్యాదు చేశాయి. దీనిని పిల్‌గా పరిగణించిన హైకోర్టు అదే రోజు రాత్రి న్యాయమూర్తి తన నివాసంలో ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమై విచారణ జరిపింది. అప్పటికే మృతదేహాలకు మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో గాంధీ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు. ఇదే సమయంలో మృతదేహాల్ని భద్రంగా ఉంచాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత సుప్రీం కోర్టులో నేరుగా పిల్స్ దాఖలు కావడంతో ఎన్కౌంటర్ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి. హైకోర్టు సహా అన్ని రకాల విచారణలపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో మృతదేహాలు పాడవ్వకుండా మహబూబ్‌నగర్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం
-
దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం
సాక్షి, హైదరాబాద్ : దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలకు మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నాలుగు మృతదేహాల అప్పగింతపై శనివారం న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కోర్టు పలు సూచనలు చేసింది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం అయిదు గంటలలోపు మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా పోస్ట్‌మార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని, కలెక్షన్స్ ఆఫ్ ఎవిడెన్స్‌ను సీల్డ్ కవర్లో భద్రపరచాలని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేని నిపుణులతో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు, బుల్లెట్స్, గన్స్, ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం రిపోర్టులను భద్రపరచాలని, రీ పోస్ట్‌మార్టం పూర్తి అయిన తర్వాత పోలీసుల సమక్షంలో ఆ మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని పేర్కొంది. కాగా న్యాయస్థానం ఆదేశాలతో గాంధీ సూపరింటెండెంట్ శ్రావణ్ ఇవాళ విచారణకు హాజరు అయ్యారు. మృతదేహాలు యాభై శాతం కుళ్లిపోయాయని, ఫ్రీజర్‌లో ఉంచినప్పటికీ మరో వారం, పదిరోజుల్లో అవి పూర్తిగా కుళ్లిపోతాయని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. చదవండి: సంచలన విషయాలు: దిశ హత్యకు ముందు 9 హత్యలు దిశ కేసు: ఆ దారి మూసివేత దిశ: ఆ మృతదేహాలను ఏం చేయాలి? -
హైకోర్టు ఆదేశాలతో లింగన్న మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం
-
‘శ్రీదేవి భౌతికకాయానికి రీపోస్టుమార్టం చేయాలి’
న్యూఢిల్లీ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మృతి విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తుతూ సీనియర్ జర్నలిస్టు ఎస్ బాలకృష్ణన్ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాశారు. సాధారణంగా బాత్‌టబ్ ఎత్తు మూడు అడుగులు మాత్రమే ఉంటుందని, అందులో మునిగి ఒక వ్యక్తి ఎలా చనిపోతారని ఆయన తన లేఖలో ప్రశ్నించారు. శ్రీదేవి శరీరంలో ఉన్న ఆల్కాహాల్ స్థాయి చాలా తక్కువ అని, అలాంటి సమయంలో ఆమె అకస్మాత్తుగా బాత్‌టబ్‌లో మునిగి ఎలా చనిపోతుందని ఆయన ప్రశ్నించారు. ఆమె భౌతికకాయాన్ని ముంబైకి తరలించిన తర్వాత మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని ఆయన లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. 54 ఏళ్ల శ్రీదేవి గత శనివారం రాత్రి దుబాయ్‌లో ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయాన్ని ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంది. ఆమె ఆకస్మిక మృతిపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ జరుపుతోంది. శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని,ఆ సమయంలో ఆమె స్పృహలో లేరని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మృతి వెనుక ఎలాంటి నేరిపూరిత కోణం కనిపించడం లేదని పేర్కొంది. -
నివేదికలో ఏముంది?
వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన సంచారిజీవి కడమంచి వెంకటేశ్ (28) మృతదేహానికి బుధవారం రీపోస్టుమార్టం చేశారు. మృతదేహం ఖననం చేసిన మూలవాగు వద్ద వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ వైద్యనిపుణులు సుమారు ఆరుగంటలపాటు శవపరీక్ష నిర్వహించారు. వేములవాడలోనే తొలిసారి రీపోస్టుమార్టం చేయడంతో సమీప ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజా, దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. వేములవాడ: రాష్ట్రమంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో జూలై 5న పర్యటించిన సందర్భంగా ఓ వ్యక్తి పర్సు చోరీ చేశాడనే కారణంతో వెంకటేశ్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు కేసులు నమోదు చేసి అదేనెల 13న కరీంనగర్ జైలుకు తరలించారు. అక్కడ తీవ్రఅనారోగ్యానికి గురవడంతో జైలు అధికారుల పర్యవేక్షణలో అదేనెల 26న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిరిత్స పొందుతూనే వెంకటేశ్ ఆగస్టు 3వ తేదీన చనిపోయాడు. మరుసటి రోజు కుటుంబసభ్యులు వేములవాడ మూలవాగులో ఖననం చేశారు. చేయని నేరం మోసి ఒప్పుకోవాలంటూ పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతోనే తన భర్త చనిపోయాడని, దీనిపై నిజానిజాలు తెలికి తీసి, తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య రేణుక హైకోర్టును ఆశ్రయించింది. వివిధ ప్రజాసంఘాలు సైతం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. స్పందించిన హైకోర్టు.. రీ–పోస్టుమార్టం చేసి నివేదికను సీల్డ్కవర్లో సమర్పించాలని ఆదేశించింది. దీంతో కాకతీయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ వైద్యనిపుణులు ప్రొఫెసర్ కృపాల్‌సింగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాజామొయినుద్దీన్, రజామాలిక్‌ఖాన్ బుధవారం ఉదయం 11.30 గంటలకు వేములవాడకు చేరుకున్నారు. జిల్లా వైద్యాధికారి ఎ.రాజేశం, ఆర్డీవో పాండురంగారావు, తహసీల్దార్ శ్రీనివాస్, వెంకటేశ్ భార్య రేణుక, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. వీరిసమక్షంలో వెంకటేశ్ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు. సుమారు 6గంటల తర్వాత సాయంత్రం 5.30 గంటలకు శవపరీక్ష ప్రక్రియ ముగిసింది. నివేదికను సీల్డ్కవర్లో హైకోర్టుకు సమర్పిస్తామని కృపాల్‌సింగ్ తెలిపారు. రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి వెంకటేశ్ ఊరూరా తిరుగుతూ కూలీ పనులు చేస్తూ భార్యాపిల్లలను పోషించుకుండేవాడని, పోలీసులు చోరీ కేసు నమోదు బనాయించి చిత్రహింసలకు గురి చేశారని, దీంతోనే జైలు తీవ్రఅనారోగ్యానికి గురై మృతి చెందాడని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవింధ్యాల ఆరోపించారు. మూలవాగులో ఆమె విలేకరులతో మాట్లాడారు. వెంకటేశ్ మృతితో అతడి భార్య రేణుక, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారని అన్నారు. జిల్లా పోలీసులు పౌరహక్కులు ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీ మాస్ స్టీరింగ్ కమిటీ సభ్యు కె.చంద్రన్న, తెలంగాణ పునర్నిర్మాణ మిషన్ ప్రధాన సమన్వయకర్త ఎంఏ షోయబ్, అబ్దుల్ మసూద్, మొహమ్మద్ యూకూబా, శ్రీనివాస్, డీఎల్ఎఫ్ నాయకులు మార్వాడి సుదర్శన్, కమటం అంజయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవునూరి ప్రభాకర్, కోనాపురం లక్ష్మణ్, గుండా థామస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగీతం శ్రీనివాస్, సాగారం వెంకటేశ్, ముడిక చంద్రశేఖర్, ఆకునూరి బాలరాజులు పాల్గొన్నారు. మమ్మల్ని ఆదుకోండి కడమంటి రేణుక పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే తన భర్త వెంకటేశ్ మరణించాడని రేణుక ఆరోపించింది. నా భర్త చావుకు కారణమైన ఎస్పీ, సీసీఎస్ ఎస్సై, పోలీసులపై చర్య తీసుకోవాలని వేడుకుంది. తన కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని విన్నవించింది. తహసీల్దార్‌తో వాగ్వాదం తహసీల్దార్ శ్రీనివాస్‌తో మృతుడి కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. రీపోస్టుమార్టం నివేదిక రూపొందిస్తుండగా.. వెంకటేశ్ మృతికి ఎవరిపైనన్నా అనుమానం ఉందా? అని తహసీల్దార్ అడిగారు. దీంతో ఎస్పీ, సీసీఎస్ ఎస్సై, పలువురు పోలీసుల తీరుతో తన భర్త చనిపోయాడని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఇందులో ఒకరిద్దరు పేర్లు నమోదు చేసేందుకు తహసీల్దార్ నిరాకరించడంతో ఎందుకు రాయరంటూ మృతుడి కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని ప్రజాసంఘాల నాయకులు జయవింధ్యాల, చంద్రన్న, షోయబ్, మార్వాడి సుదర్శన్, విజయ్ దుయ్యబట్టారు. -
ఎన్కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశం మేరకు శనివారం శేషాచలం ఎన్కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి విమానంలో బయలు దేరిన ప్రత్యేక వైద్యబృందం.. తిరువణ్ణామలైలోని ఆసుపత్రిలో ఈ పోస్టుమార్టం చేయనుంది. పోస్టు మార్టం సమయంలో వీడియో రికార్డింగ్ చేసి నివేధికని బయటకి రాకుండా సీల్డ్ కవర్లో సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.