న్యూఢిల్లీ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మృతి విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తుతూ సీనియర్ జర్నలిస్టు ఎస్ బాలకృష్ణన్ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాశారు. సాధారణంగా బాత్‌టబ్ ఎత్తు మూడు అడుగులు మాత్రమే ఉంటుందని, అందులో మునిగి ఒక వ్యక్తి ఎలా చనిపోతారని ఆయన తన లేఖలో ప్రశ్నించారు. శ్రీదేవి శరీరంలో ఉన్న ఆల్కాహాల్ స్థాయి చాలా తక్కువ అని, అలాంటి సమయంలో ఆమె అకస్మాత్తుగా బాత్‌టబ్‌లో మునిగి ఎలా చనిపోతుందని ఆయన ప్రశ్నించారు. ఆమె భౌతికకాయాన్ని ముంబైకి తరలించిన తర్వాత మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని ఆయన లేఖలో ప్రభుత్వాన్ని కోరారు.
54 ఏళ్ల శ్రీదేవి గత శనివారం రాత్రి దుబాయ్‌లో ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయాన్ని ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంది. ఆమె ఆకస్మిక మృతిపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ జరుపుతోంది. శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని,ఆ సమయంలో ఆమె స్పృహలో లేరని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మృతి వెనుక ఎలాంటి నేరిపూరిత కోణం కనిపించడం లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment