sridevi death
-
శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు.. చిక్కుల్లో ప్రముఖ యూట్యూబర్!
అందాల తార, తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శ్రీదేవి. కానీ ఉహించని విధంగా దుబాయ్‌లోని ఓ హోటల్లో కన్నుమూసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచింది.బాలీవుడ్ నిర్మాత బోనీ కపూప్ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. పెద్దకూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరలో కనిపించనుంది. మరోవైపు చిన్నకూతురు ఖుషీ కపూర్ సైతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే శ్రీదేవి మరణంపై ఒడిశాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా పలువురు ప్రముఖుల పేర్లతో నకిలీ లేఖలను యూట్యూబ్‌లో ఉంచింది. శ్రీదేవి మరణంపై విచారణను రెండు ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆమెపై గతేడాది ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె యూట్యూబ్ వీడియోలో ఉంచిన పత్రాలు నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా శ్రీదేవి మరణానికి స్పాన్సర్‌గా ప్రభుత్వాన్ని కించపరిచేలా పదేపదే మాట్లాడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి లేఖలతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన పత్రాలు, యూఏఈ ప్రభుత్వం నుంచి వచ్చిన రికార్డులు నకిలీవని తేలిందని న్యాయవాది ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆయన ఫిర్యాదుతో యూట్యూబర్ దీప్తితో ఆమె లాయర్ భరత్ సురేశ్ కామత్‌లపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తానికి శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేసి ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పడ్డారు యూట్యూబర్. తాజాగా సీబీఐ ఛార్జిషీట్ వేయడంపై దీప్తి స్పందించారు. ఆ ఛార్జ్ షీట్ నమ్మేలా లేదని దీప్తి ఆరోపించారు. నా స్టేట్మెంట్ను రికార్డ్ చేయకుండా ఛార్జిషీట్ దాఖలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్ 2న భువనేశ్వర్‌లోని ఆమె నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుంది. శ్రీదేవి మరణంతో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో జరిగిన చర్చల్లోనూ దీప్తి చురుకుగా పాల్గొంది. -
విధి మా కలలను నాశనం చేసింది.. బోనీ కపూర్ ఎమోషనల్
Sridevi Death Anniversary: Boney Kapoor Pens Emotional Post: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అకాల మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం నివ్వెరపోయింది. ఎన్నో అనుమాల మధ్య శ్రీదేవి మరణాన్ని నిర్ధరించారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ శ్రీదేవి నటన, అందం, అభినయాన్ని సినీలోకం గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఎవర్ గ్రీన్ హీరోయిన్గా నిలిచిన శ్రీదేవి వర్ధంతి గురువారం కావడంతో ఆమె ఙాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. వెనిస్లో బోనీ కపూర్ శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ భావోద్వేగమైన కోట్స్ రాశాడు. 'మేము సెప్టెంబర్ 7, 2008న మిలన్ నుంచి వెనిస్కు వెళ్లాం. ఆ నగరంలో కొన్ని గంటలు మాత్రమే గడిపాం. మేము వెనిస్‌ని మళ్లీ సందర్శించాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ మా ప్రణాళికలను విధి తిరస్కరించింది.' అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు బోనీ కపూర్. అలాగే శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గతంలో తన తల్లిపై హృదయానికి హత్తుకునేలా పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
ఇంకా షాక్‌లోనే ఉన్నా!
కూతురిని సిల్వర్ స్క్రీన్‌పై చూసి మురిసిపోవాలనుకున్నారు శ్రీదేవి. తనలానే కూతురు కూడా అంచలంచెలుగా పైకెళ్తుంటే పడిపోకుండా పక్కనుండి పట్టుకోవాలని ఆశపడ్డారు. కానీ కూతురి మొదటి చిత్రాన్ని (ధడక్) చూడకుండానే శ్రీదేవి చనిపోయారు. ‘తల్లి మరణం తనకింకా షాక్‌గానే ఉంది’ అంటున్నారు జాన్వీ కపూర్. ఈ విషయం గురించి ఇటీవల ఓ షోలో మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి చాలామంది చాలాసార్లు అడిగారు. చాలాసార్లే చెప్పాను కూడా. కానీ అమ్మ మరణం నాకిప్పటికీ షాకింగ్‌గానే ఉంది. ఆ వార్తను ఎందుకో జీర్ణించుకోవడానికి నా మనసు ఇష్టపడటం లేదు. ‘అమ్మ చనిపోయింది’ అనే వార్త విన్నప్పటినుంచి ఆ తర్వాత నాలుగు నెలల వరకూ జరిగిన సంఘటనలు ఏవీ నా మైండ్‌లో రిజిస్టర్ కాలేదు. జ్ఞాపకాలన్నీ అమ్మ చుట్టూనే ఉండిపోయాయి’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే షోను తేలికపరచడం కోసం తన తల్లిదండ్రులు ‘చాలా డ్రమాటిక్’ అని మరో విషయాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘డేటింగ్ విషయాన్ని అమ్మా, నాన్న చాలా డ్రామా చేసేవారు. ‘నీకెవరైనా నచ్చితే మాతో వచ్చి చెప్పు. మేం నీకు పెళ్లి చేస్తాం’ అనేవారు. అప్పుడు నేనేమో ‘నచ్చిన ప్రతీ అబ్బా యిని పెళ్లి చేసుకోలేం కదా. జస్ట్ ఫ్రెండ్లీగా చిల్ కూడా అవ్వొచ్చు అనుకుంటా?’ అని సమాధానం చెప్పేదాన్ని. ‘చిల్ అవ్వడమంటే? ఏంటి?’ అని తిరిగి ప్రశ్నించేది అమ్మ. ఇలా సరదాగా జోక్ చేసుకునేవాళ్లం’’ అని పేర్కొన్నారు జాన్వీ. సినిమాల విషయానికి వస్తే జాన్వీ ప్రస్తుతం పైలెట్ గుంజన్ సక్సెనా బయోపిక్‌లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘శ్రీదేవిని ప్లాన్ ప్రకారమే హత్య చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: అతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణం చెంది మూడు నెలలు కావస్తున్నా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లో ఫిబ్రవరి 24 న ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి శ్రీదేవి మరణించారు. మొదట శ్రీదేవి గుండెపోటుతో చనిపోయినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్లో గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల ఆమె చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని దుబాయ్ పోలీసులు తేల్చారు. అయితే తాజాగా ఢిల్లీకి చెందిన వేద్ భూషణ్ అనే మాజీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీదేవి మృతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని ఆయన అన్నారు. బాత్‌టబ్‌లో బలవంతంగా ముంచి చంపడం చాలా సులువని, అలా చేస్తే మునిగి చనిపోయారని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఆమెను పథకం ప్రకారం చంపేశారని అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దుబాయ్ డాక్టర్లు ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదికపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఏసీపీగా రిటైర్డ్ అయి ప్రస్తుతం డిల్లీలో ఓ ప్రైవేటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని నడుపుతున్న వేద్ భూషణ్ శ్రీదేవి మృతి చెందిన హోటల్‌కు కూడా వెళ్లారని, కానీ శ్రీదేవి మృతి చెందిన గదిలో సిబ్బంది అనుమతించలేదని ఓ మీడియా సంస్థ పేర్కొంది. దీంతో అదే హోటల్లో వేరొక గదిలో ఉన్న ఆయన, శ్రీదేవి మరణానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేసినట్టు తెలిపింది. కాగా, ఇదివరకే శ్రీదేవి అనుమానాస్పద పరిస్థితుల్లోనే మరణించారని సందేహం వ్యక్తం చేస్తూ.. స్వతంత్ర విచారణ చేపట్టాలని సునీల్ సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒమన్‌లో శ్రీదేవి పేరిట ఉన్న రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే సొమ్మును విడుదల చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ మాత్రం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పటికే ఇలాంటి రెండు పిటిషన్లను నిరాకరించామని గుర్తు చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోలేమని దీపక్ మీశ్రా పేర్కొన్నారు. -
ఒమన్‌లో శ్రీదేవి పేరిట భారీగా బీమా పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై సుప్రీంకోర్టులో శుక్రవారం ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. ఆమె మరణంపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సునీల్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం బెంచ్ కొట్టివేసింది. శ్రీదేవి పేరిట ఉన్న బీమా పాలసీలు ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే చెల్లింపులు జరుపుతాయని పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టుకు నివేదించారు. ఒమన్‌లో శ్రీదేవి పేరిట ఉన్న రూ.240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే సొమ్మును విడుదల చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు తెలిపారు. మరోవైపు 5.7 అడుగులు ఉండే వ్యక్తి కేవలం 5.1 అడుగుల బాత్‌టబ్‌లో ఎలా పడిపోతారని ప్రశ్నించారు. శ్రీదేవి మృతికి సంబంధించి దుబాయ్ పోలీసులు చేపట్టిన ఆమె వైద్య, దర్యాప్తు పత్రాలన్నింటినీ భారత్‌కు రప్పించాలని, స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని కోరారు. అనుమానాస్పద పరిస్థితుల్లోనే శ్రీదేవి మరణించారని వికాస్ సందేహం వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతిపై విచారణను కోరుతూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో సునీల్ సింగ్ మార్చి 9న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీదేవి ఈ ఏడాది ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్లోని బాత్రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయి మరణించారని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
అమ్మ అడుగుజాడల్లో...
‘అచ్చంగా అమ్మలానే’... జాన్వీ కపూర్ గురించి ‘ధడక్’ టీమ్ అంటున్న మాటలివి. చూడ్డానికి తల్లి శ్రీదేవిలానే జాన్వీ ఉంటుంది కాబట్టి అలా అన్నారా? అంటే.. ఊహూ. ఇది ‘క్రమశిక్షణ’ గురించి. తల్లి మరణించి పట్టుమని పదిరోజులు కూడా గడవకముందే ‘ధడక్’ లొకేషన్లో కాలుపెట్టారు జాన్వీ కపూర్. యాక్చువల్లీ జాన్వీ లాంగ్ బ్రేక్ తీసుకుంటుందని, సినిమా వాయిదా తప్పదని కొందరు భావించారు. అయితే తండ్రి బోనీకపూర్ నిర్మాత, తల్లి శ్రీదేవి ఆర్టిస్ట్ కాబట్టి జాన్వీకి సినిమా కష్టాలు తెలుసు. అందుకే షూటింగ్లో పాల్గొనాలని ఫిక్సయ్యారు. ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ కేతన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ధడక్’ మరాఠీ సినిమా ‘సైరట్’కు రీమేక్. గురువారం ఈ సినిమా తాజా షెడ్యూల్ స్టారై్టంది. రెండు రోజుల పాటు ఇషాన్, జాన్వీలపై రొమాంటిక్ సీన్స్ తీసి, ఆ తర్వాత కోల్‌కత్తాలో నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. ‘‘మా షూటింగ్‌కు బ్రేక్ పడుతుందని వచ్చిన వార్తల్లో నిజం లేదు. కోల్‌కతా షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాం’’ అన్నారు శశాంక్ కేతన్. శ్రీదేవి ఆరోగ్యంగా లేకున్నా తన వల్ల మూవీ యూనిట్‌కు ఇబ్బంది కలగకూడదు అనుకునేవారు. జాన్వీ కూడా అంతే. అచ్చు అమ్మ అడుగుజాడల్లోనే ముందుకెళ్తుంది అని అనుకుంటున్నారు బాలీవుడ్ సినీవాసులు. ఈ సంగతి ఇలా ఉంచితే.. శ్రీదేవి గురించి బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ ఓ ఇన్సిడెంట్ను గుర్తు చేసుకున్నారు. ‘‘గుమ్రా’ సినిమా చేస్తున్నప్పుడు శ్రీదేవి జ్వరంతో బాధపడుతున్నారు. షూట్ క్యాన్సిల్ చేద్దామని చెప్పా. ‘లేదు. లేదు..నా వల్ల షూటింగ్ అగిపోకూడదు’ అని శ్రీదేవి చెప్పారు. అంతేకాదు అంత జ్వరంలోనూ వాటర్ సీన్స్‌లో అద్భుతంగా నటించారామె. ఆమె అంకితభావం సూపర్’’ అని పేర్కొన్నారు మహేశ్ భట్. సో.. జాన్వీ కూడా అచ్చంగా అమ్మలానే. తన మానసిక స్థితి ఎలా ఉన్నా సినిమాపై ఆ ప్రభావం పడకూడదనుకుంది. ‘ధడక్’ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 20న విడుదల చేయాలనుకుంటున్నారు. -
నాకూ బతకాలని లేదు..!
-
శ్రీదేవి లేదు.. నాకు బతకాలని లేదు: నటి
శ్రీదేవి అకాల మరణాన్నిఆమె అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణం అందరిపైనా తీవ్ర ప్రభావం చూపింది. దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోయింది. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా శ్రీదేవికి అభిమాని. అతిలోక సుందరి అంత్యక్రియలకు హాజరై తుది వీడ్కోలు పలికింది. అనంతరం శ్రీదేవి మరణం తనును ఎంతో కలిచివేసిందని ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్టు పెట్టింది. 'శ్రీదేవి జీ! మీరు వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. ఐ లవ్ యూ సో మచ్. ఏమైంది మీకు? ఎందుకు వెళ్లిపోయారు? మీలా ఎవరూ నటించలేరు, డాన్స్ చేయలేరు. మీరు చాలా మంచి వారు. మీరు లేకపోవడంతో నాకూ బతకాలని లేదు.. లవ్ యూ ’ అంటూ బాధతో వీడియో పోస్టు పెట్టింది. అయితే రాఖీ సావంత్ పోస్టులకు నెటిజన్లు వినూత్నంగా స్పందించారు. 'ఇదంతా పబ్లిసిటీ స్టంట్, టీఆర్పీ కోసం చేస్తున్నావ్.., రాఖీ, కామెడీ చేయకు.., వీడియోలో నువ్వు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నావ్.., టూ ఫన్సీ.. అంటూ కామెంట్లు పెట్టారు. శ్రీదేవి మరణం తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌ను శ్రీదేవి ఫొటోలతో నింపిన రాఖీ.. తాజాగా శ్రీదేవి పోలికలతో ఉన్న ఓ చిన్నారి పాత వీడియోని పోస్ట్ చేసింది. శ్రీదేవి మళ్లీ పుట్టారని పేర్కొంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్పింది. -
'శ్రీదేవిని చంపింది భారత మీడియానే..!'
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను, కుటుంబసభ్యులను, తోటి నటీనటులను వదిలి కానరాని దూరాలకు అందాలనటి శ్రీదేవి తరలివెళ్లారు. దశాబ్ధాల పాటు వెండితెరను ఏలిన అతిలోక సుందరి ఇక జ్ఞాపకాల్లోనే మిగిలిపోయింది. వేలాదిమంది అశ్రునయనాల మధ్య బుధవారం శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. తన నటన, అందం, అభినయం, హావభావాలతో కోట్లాది హృదయాల్లో నిలిచిపోయిన శ్రీదేవి అకాలమరణం ఎంతోమందిని కలిచివేసింది. దుబాయ్‌లో జరిగిన వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి గత శనివారం ప్రమాదవశాత్తూ హోటల్ గదిలో మరణించిన విషయం తెలిసిందే. శ్రీదేవి ఇకలేరు అని తెలిసిన క్షణం నుంచి, ఆమె పార్థీవదేహం ముంబై చేరుకునే వరకు ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఆకస్మిక మృతి కథనాల విషయంలో జాతీయ మీడియా సంస్థలతో పాటు, స్థానిక మీడియా సంస్థలు కూడా అత్యుత్సాహం ప్రదర్శించాయి. అయితే ఇదే అంశంపై దుబాయ్‌కి చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ఖలీజ్ టైమ్స్ స్పందించింది. శ్రీదేవి మరణంపై భారతీయ మీడియా వ్యవహరించిన తీరును ఆ సంస్థ తప్పుబట్టింది. శ్రీదేవిని ఆ దేశ మీడియానే హత్య చేసిందనే అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న ఓ వ్యక్తి మరణంపై నిజానిజాలు తెలుసుకోకుండా.. అత్యుత్సాహం, అసత్య కథనాలు ప్రచారం చేశారని ఖలీజ్ టైమ్స్ గురువారం ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ఆ సంస్థ దాదాపు భారతీయుల పరువును తీసింది. భారత్‌లోని చాలామంది ఇళ్లలో బాత్ టబ్‌లు ఉండవని, వాటి వాడకం గురించి వారికి తెలియదని అవహేళన చేసింది. మొదట శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్లో గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని దుబాయ్ పోలీసులు తేల్చారు. అయితే, ఆ సంఘటనపై అసలేం జరిగిందో తెలుసుకోకుండానే శ్రీదేవి డెత్ మిస్టరీ అంటూ తమ డిటెక్టివ్ కథనాల ప్రసారాన్ని, బాత్ టబ్‌లో సన్నివేశాలను చూపుతూ భారత మీడియా అత్యుత్సాహం చూపడాన్ని ఖలీజ్ టైమ్స్ విమర్శించింది. అన్నీ టీవీ ఛానెళ్లు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి బాత్‌టబ్‌లో సీన్స్‌ను చిత్రీకరించడంపై విచారం వ్యక్తం చేసింది. అదే విధంగా రాజకీయ ప్రముఖులైన సుబ్రమణ్య స్వామి, అమర్ సింగ్‌లు శ్రీదేవి మృతిపై చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ కథనంలో పేర్కొనడం గమనార్హం. సంఘటన జరిగినప్పటి నుంచి తమ సంస్థ ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నించారని.. కానీ భారతీయ మీడియా తమ సమాచారాన్ని వక్రీకరిస్తూ విభిన్న కథనాలను ప్రసారం చేసిందని ఖలీజ్ వెల్లడించింది. దుబాయ్‌లో శ్రీదేవి మరణం ప్రమాదవశాత్తూ అని తేలినా.. కొంతమంది జర్నలిస్టులు ఆమె మృతి వెనుక ఇదే రహస్యమంటూ.. కాస్మోటిక్ సర్జరీలు, శరీరంలో ఆల్కహాలు జాడలు ఉన్నాయనే కథలు అల్లడం తమను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపింది. ఇలాంటి ఘటనలను మానవతా దృక్పథంతో చూడాలని, కానీ కొన్ని న్యూస్ ఛానెళ్లు మరీ అత్యుత్సాహంతో వెర్రితలలు వేసి శ్రీదేవిని హత్య చేశాయన్న వ్యాఖ్యలు చేసింది. -
‘సన్నీలియోన్ చనిపోతే ఏం చేస్తారో?’
సాక్షి, చెన్నై : నటి కస్తూరి తరచూ వివాదాస్పద వైఖరితో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య కాస్టింగ్ కౌచ్, సీనియర్ హీరోలపై ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీయగా.. ఈ మధ్యే కమల్ రాజకీయ ప్రస్థానంపై కూడా ఆమె చవాక్కులు పేల్చి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఇక తాజాగా ట్విట్టర్లో చేసిన ఓ పోస్టు దుమారాన్ని రేపుతోంది. ‘శ్రీదేవి చనిపోయిందని అన్ని న్యూస్ ఛానెళ్లు ఆమెకు సంబంధించిన పాటలను, వీడియోలను ప్రదర్శిస్తున్నాయి. ఒకవేళ సన్నీ లియోన్ చనిపోతే అప్పుడు ఏం ప్రదర్శిస్తాయో’ అంటూ ఓ ట్వీట్‌ను ఆమె చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫేస్ బుక్‌లో వచ్చిన ఓ జోక్ సందేశాన్నే తాను పెట్టినట్లు ఆమె స్పష్టత ఇచ్చినప్పటికీ.. ఈ సమయంలో ఇలాంటి అసందర్భోచిత పోస్టు చేయటం.. పైగా ఒక నటి అయి ఉండి మరో నటిని అవమానించటం సరికాదని కస్తూరి తీరును పలువురు తప్పుబడుతున్నారు. All the news channels are showing songs and clips of Late Sridevi Wondering what will happen when Sunny Leone expires someday😲😜🤪#facebook #forward pic.twitter.com/D1whQIV1kD — kasturi shankar (@KasthuriShankar) 27 February 2018 -
అభిమాన లోకం.. కన్నీటి శోకం
-
మెకానిక్ సాయంతో కదిలిన శ్రీదేవి మృతదేహం
సాక్షి, హైదరాబాద్ : శ్రీదేవి భౌతికకాయం దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగిరావటంలో అక్కడ స్థిరపడిన ఓ భారతీయుడు సాయం చేశారు. ఆయన పేరు అశ్రఫ్ షెర్రీ తమరసెరీ. 44 ఏళ్ల ఈయన కేరళ నుంచి వచ్చి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. యూఏఈలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపటాన్ని కర్తవ్యంగా భావిస్తారు. ఈయన అసలు వృత్తి మెకానిక్. దుబాయ్‌కి 35 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రాంతంలో ఈయనకు మెకానిక్ షెడ్ ఉంది. మృత దేహాలను స్వస్థలాలకు పంపేందుకు.. అక్కడి చట్టాలకు అనుగుణంగా అవసరమైన పద్ధతులన్నీ దగ్గరుండి పూర్తి చేస్తారు. పనికోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న కార్మికుల దగ్గర్నుంచి ప్రముఖుల వరకు అందరికీ ఈయన సాయం చేస్తారు. 18 ఏళ్లుగా 38 దేశాలకు చెందిన 4,700 మృతదేహాలను వారివారి దేశాలకు పంపిచారు అశ్రఫ్. అందుకే అక్కడి అధికారులకు, యూఏఈలో ఉండే విదేశీయులకు అశ్రఫ్ అంటే విపరీతమైన గౌరవం. శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు తరలించిన రోజే ఈయన.. మరో ఐదు పార్థివ దేహాలనూ వేర్వేరు దేశాలకు పంపించారు. ఆయన్ను స్థానికులంతా ‘ఫ్రెండ్ ఆఫ్ డెడ్’అని పిలుస్తారు. -
అభిమాన లోకం.. కన్నీటి శోకం
సినీలోకం మూగబోయింది. అభిమానం అశ్రుధారలైంది. గుండెగొంతులో గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెగింది. ముంబై దారులన్నీ కన్నీటి వరదలయ్యాయి! లక్షలాది అభిమానులు వెంటరాగా దేవకన్య శ్రీదేవి దివికేగింది. బుధవారం సాయంత్రం ముంబై విలేపార్లేలోని శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త బోనీకపూర్ చితికి నిప్పంటించారు. సాక్షి, ముంబై: సినీలోకం మూగబోయింది. అభిమానం అశ్రుధారలైంది. గుండెగొంతులో గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెగింది. ముంబై దారులన్నీ కన్నీటి వరదలయ్యాయి! లక్షలాది అభిమానులు వెంటరాగా దేవకన్య శ్రీదేవి దివికేగింది. బుధవారం సాయంత్రం ముంబై విలేపార్లేలోని శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీదేవి(54) అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త బోనీకపూర్ చితికి నిప్పంటించారు. ఆ సమయంలో ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషిలు తండ్రి పక్కనే ఉన్నారు. అంతకుముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి తెల్లని పూలతో అలంకరించిన వాహనంపై శ్రీదేవి పార్థివదేహాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు. ఆమెను కడసారి చూసేందుకు దారిపొడగునా అభిమానులు బారులుతీరారు. విలేపార్లే శ్మశానవాటికకు కుటుంబీకులు, సన్నిహితులు, పలువురు సినీతారలు మాత్రమే హాజరయ్యారు. అభిమానుల తాకిడి ఎక్కువకావటంతో షారుక్‌ఖాన్, సోనమ్ కపూర్ తదితరులు తమ వాహనాన్ని దూరంగా నిలిపేసి నడుస్తూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. ఆ దారి.. అభిమాన సంద్రం అంతిమయాత్ర అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి ఈ యాత్ర మొదలైంది. త్రివర్ణ పతాకం కప్పిన శ్రీదేవి భౌతికకాయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వాహనం ముందు, వెనుక శ్రీదేవి ఫొటోలను ఉంచారు. భర్త బోనీకపూర్, ఇద్దరు పిల్లలు, ఇంకొందరు కపూర్ కుటుంబీకులు భౌతికకాయంతో వాహనంలో ఉండగా.. మిగిలిన వారంతా కార్లలో శ్మశానవాటికకు చేరుకున్నారు. శ్రీదేవిని చివరిసారి చూసేందుకు అభిమానులు రోడ్డుకు ఇరువైపులా పెద్దఎత్తున బారులు తీరడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమైన అంతిమ యాత్ర సాయం త్రం 4 గంటలకు శ్మశానవాటికకు చేరుకుంది. ఉదయమే క్లబ్ వద్ద అభిమాను లను అదుపు చేసేందుకు 200 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్విగ్న క్షణాలు.. సెలబ్రేషన్ క్లబ్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. హాల్ మధ్యలో పూలతో అలంకరించిన టేబుల్‌పై శ్రీదేవి పార్థివదేహాన్ని ఉంచారు. ఓవైపు వీఐపీల కోసం మరోవైపు అభిమానుల కోసం బారికేడ్లు కట్టారు. బాక్స్‌కు ముందు ఓ ఫొటో పెట్టి దాని ముందు దీపం ఉంచారు. గదిలో ఓ మూల నిలబడ్డ బోనీ కపూర్‌ను, జాహ్నవి, ఖుషిలను సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఓదార్చారు. బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా బోరున విలపించటంతో.. పక్కనే ఉన్న కరణ్ జోహార్ ఆయన్ను ఓదార్చారు. రాణీ ముఖర్జీ చాలాసేపు భౌతికకాయం వద్దే కూర్చున్నారు. రోదిస్తున్న సోనమ్ కపూర్‌ను ఓదార్చారు. సినీ ప్రముఖులంతా ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ.. బోనీ, పిల్లలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ‘శ్రీదేవిని కడసారి చూసొచ్చాను. సినీ పరిశ్రమ అంతా మౌనంగా రోదిస్తోంది. అదే శ్రీదేవి గొప్పదనం. అందమైన ఎర్రని చీరలో ప్రశాంతంగా ఆమె పడుకుని ఉంది’అని హేమమాలిని ట్వీట్ చేశారు. అభిమానుల నిరాశ ఉదయం నుంచే క్లబ్ ముందు పెద్దసంఖ్యలో అభిమానులు వేచి ఉన్నా.. 10 గంటల సమయంలో వీరిని లోపలకు అనుమతించారు. అయితే భారీగా తరలిరావడంతో కొంద రికే ఆఖరిచూపు దక్కింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు చివరి చూపు కోసం వచ్చారు. వీఐపీలు వచ్చినపుడల్లా అభిమానుల క్యూను ఆపేశారు. దీంతో చాలా మందికి లోపలకు వెళ్లే అవకాశం రాలేదు. శ్రీదేవి అంతిమయాత్ర వాహనాన్ని కూడా మూడువైపుల నుంచి మూసేశారు. ఆమెను చివరిసారిగా చూసేందుకు అభిమానులు చెట్లు ఎక్కారు. పక్కనున్న భవంతులపైకి చేరారు. ఫుట్‌ఓవర్‌పై నిలుచుని మరీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాక్సులో పెట్టడం, పువ్వులతో పెట్టను, వాహనాన్ని కప్పడంతో వారికి ఆమె ముఖం కనిపించలేదు. ఎక్కడ్నుంచో వచ్చినా చివరిచూపు దక్కలేదని వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. దిగివచ్చిన తారాలోకం.. శ్రీదేవికి చివరి వీడ్కోలు పలికేందుకు తారాలోకం దిగివచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ సినీరంగాలకు చెందిన ప్రముఖులు తరలి వచ్చారు. అమితాబ్ బచ్చన్, షారుక్‌ఖాన్, చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్, నాగార్జున, వెంకటేశ్, సంజయ్ కపూర్, హేమామాలిని, రేఖ, జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్, నగ్మా, సారికా, దీపికా పదుకొనే, రాకేశ్ రోషన్, సంజయ్‌ఖాన్, సురేశ్ ఒబెరాయ్, వివేక్ ఒబెరాయ్, షబానా ఆజ్మీ, జావేద్ అఖ్తర్, అనుపమ్ ఖేర్, సుస్మితా సేన్, సోనంకపూర్, కాజోల్, అజయ్ దేవగన్, టబూ, జయప్రద, సంజయ్‌ఖాన్, అక్షయ్ ఖన్నాతో పాటు పలు పార్టీల ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లున్నారు భారత అధికారులు శ్రీదేవి పాస్‌పోర్టును రద్దుచేసి ఇతర దస్తావేజులను సిద్ధం చేస్తుండగానే.. పోలీస్ క్లియరెన్స్ కావాలంటూ జర్నలిస్టులు, అధికారులు, పలువురు స్థానిక భారతీయులు అశ్రఫ్‌కు ఫోన్ చేశారు. క్లియరెన్స్ తెచ్చిన తర్వాత దుబాయ్ సమీపంలోని ప్రభుత్వ మార్చురీకి చేరుకుని ఎంబామింగ్ ప్రక్రియ త్వరగా జరిగేలా చొరవ తీసుకున్నారు. అక్కడ అధికారులు శ్రీదేవితోపాటు మరో ముగ్గురి ఎంబామింగ్‌కు సంబంధించిన పత్రాలను అశ్రఫ్‌కు అందించారు. ఎంబామింగ్ సర్టిఫికెట్ అశ్రఫ్ పేరుతోనే జారీ కావడం గమనార్హం. అక్కడినుంచి మృతదేహాన్ని ఎయిర్‌పోర్టుకు తరలించి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. ఇదంతా పూర్తయ్యాక అశ్రఫ్ తన ఇంటికెళ్లాడు. ‘‘పెద్దల ఆశీర్వాదంతోనే ఈ పనిచేస్తున్నా. విదేశీయులు ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని తరలించేందుకు ఏమేం చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారందరికీ నేను సాయం చేస్తా’ అని అశ్రఫ్ పేర్కొన్నారు. ‘‘శ్రీదేవి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే ఉన్నారు. నిద్రపోతున్న అందాల రాణిలా..’’అని ఆయన తెలిపారు. సినిమాల్లో ఉన్నట్లుగానే ఆమె కనిపించారని.. ముఖంపై ఎలాంటి గాయాలూ లేవని వెల్లడించారు. ఎర్రని చీర.. నుదుట తిలకం.. మంగళ వారం రాత్రంతా శ్రీదేవి నివాసం గ్రీన్ఏకర్స్లోనే ఉన్న శ్రీదేవి భౌతికకాయాన్ని.. బుధవారం ఉదయం 9 గంటలకు సెలబ్రేషన్ క్లబ్‌కు తరలించారు. శ్రీదేవికి ఇష్టమైన ఎరుపురంగు కాంచీవరం చీరతో మృతదేహాన్ని చుట్టారు. సెల బ్రేషన్ క్లబ్లో బోనీ, జాహ్నవి, ఖుషి, అనిల్ కపూర్, సంజయ్‌కపూర్, మేన ల్లుడు హర్షవర్ధన్ కపూర్, కోడలు సోనమ్, రేఖ కపూర్లు భౌతికకాయం వద్ద ఉన్నారు. ఇక్కడ సినీరంగ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిం చిన తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవికి నివాళులర్పించారు. పార్థివ దేహంపై త్రివర్ణ పతాకం కప్పిన అనంతరం గన్ సెల్యూట్ చేశారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత అంతిమయాత్ర ప్రారంభమైంది. -
శ్రీదేవి మృతి; మేం హోలీ పండుగ జరుపుకోము!
సాక్షి, ముంబై : ప్రఖ్యాత నటి, బాలీవుడ్ తొలి ఫీమేల్ సూపర్‌స్టార్ శ్రీదేవి ఆకస్మిక మరణం పట్ల సర్వత్రా సంతాపం వ్యక్తమవుతోంది. ముంబైకి చేరుకున్న ఆమె పార్థీవ దేహానికి ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విలేపార్లే హిందూ స్మశానవాటికలో ఆమె భౌతికకాయనికి అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీదేవి మృతితో బాలీవుడ్, టాలీవుడ్లో విషాదం నెలకొంది. ముంబైలోనూ విషాదఛాయలు కనిపిస్తున్నాయి. శ్రీదేవి మృతికి సంతాపంగా ఈసారి హోలీ పండుగ జరుపుకోవద్దని ఆమె నివసిస్తున్న హౌసింగ్ సొసైటీ వాసులు నిర్ణయించారు. ముంబైలోని గ్రీన్ ఎకర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో శ్రీదేవి కుటుంబం నివాసముంటున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి ఆకస్మికంగా కన్నుమూసిన విషాద పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల (మార్చి) 2న తలపెట్టిన హోలీ వేడుకలను రద్దు చేసుకున్నామని.. ఆ రోజున సంగీతవిభావరులు, రెయిన్ డ్యాన్స్, రంగులు చల్లుకోవడం, కమ్యూనిటీ భోజన కార్యక్రమాలుగానీ ఉండవని సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. -
బాత్‌టబ్‌లో రిపోర్టర్.. నెటిజన్ల విస్మయం!
అతిలోకసుందరిగా పేరు గడించిన శ్రీదేవికి దేశవ్యాప్తంగా పాపులారీటీ ఉంది. ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఈ పాపులారిటీ నేపథ్యంలోనే ఆమె ఆకస్మిక మృతి కథనాల విషయంలో జాతీయంగా, దాదాపు అన్నిరా ష్ట్రాల్లోనూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. దుబాయ్‌లో శ్రీదేవి ఆకస్మిక మృతి.. ఈ తర్వాత చోటుచేసుకున్న ఒకింత నాటకీయ పరిణామాలు.. ఆమె గుండెపోటుతో కాకుండా బాత్‌టబ్‌లో మునిగిచనిపోయిందని పోలీసులు తేల్చడం.. ఇవన్నీ న్యూస్ చానళ్లకు కావాల్సినంత సరంజామా ఇచ్చాయి. దీంతో కొన్ని న్యూస్ చానెళ్లు మరీ అత్యుత్సాహంతో వెర్రితలలు వేయడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రీదేవి ఆకస్మిక మృతి విషయంలో న్యూస్ చానెళ్లు జర్నలిజాన్ని బాత్‌టబ్‌కు దిగజార్చడం.. బాత్‌టబ్‌లోకి కూరుకుపోయి మరీ కథనాలు ప్రసారం చేయడం నెటిజన్లకు వెగటు పుట్టిస్తోంది. శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగిచనిపోయిందని వెల్లడైన ఫిబ్రవరి 26న దాదాపు అన్ని జాతీయ చానళ్లు, ప్రాంతీయ చానళ్లు బాత్రూమ్ను టీవీ స్క్రీన్ మీదకు తీసుకొచ్చాయి. బాత్‌టబ్ కొలతలు ఇచ్చాయి. తమ కంప్యూటర్ జనరేటెడ్ గ్రాఫిక్ స్కిల్స్‌కు పదునుపెట్టి.. స్టూడియోలోనే తమ డిటెక్టివ్ బుద్ధికి రెక్కలు విప్పి.. కోడిగుడ్డ మీద ఈకలు పీకన చందంగా కథనాలు వండివార్చాయి. కొన్నిచానళ్లు ఏకంగా బాత్‌టబ్‌లో శ్రీదేవి ఫొటోలు పెట్టి.. ‘మోత్కా బాత్‌టబ్’ అంటూ తమ అతి సృజనాత్మకతను ప్రదర్శించాయి. మరికొన్ని చానళ్లయితే బాత్‌టబ్‌లో శ్రీదేవి పడి ఉంటే..బోనీకపూర్ వచ్చి చూసినట్టు తమ ఫోటోషాపింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించుకున్నాయి. 9 pm lineup on English news TV. @republic: Sridevi. @TimesNow: Sridevi. @CNNnews18: Sridevi. @MirrorNow: Sridevi. @NewsX: Sridevi. @ndtv: Sridevi. If only Judge Loya’s death had elicited such sharp and searing scrutiny. pic.twitter.com/6ArTJXqJSv — churumuri (@churumuri) February 26, 2018 శ్రీదేవి మొదట గుండెపోటుతో మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్లో గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని పోలీసులు తేల్చారు. అయితే, ఆ సమయంలో ఆమె దేహంలో ఆల్కహాల్ జాడలు ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికలో తేల్చారు. ఈ సమాచారాన్ని పట్టుకొని.. ఒక టీవీ చానల్ బాత్‌టబ్ మీద వైన్ గ్లాస్.. మరోవైపు శ్రీదేవి ఫొటో పెట్టి కథనాలు వండివార్చింది. ఇక, జాతీయస్థాయిలో పోటాపోటీగా కథనాలు ప్రచురించే రిపబ్లిక్, టైమ్స్ నౌ చానళ్లు కూడా శ్రీదేవి డెత్ మిస్టరీ అంటూ ప్రైమ్‌టైమ్‌లో తమ డిటెక్టివ్ కథనాల ప్రసారంలో అత్యుత్సాహం చూపాయి. మిగతా చానళ్లు కూడా ప్రధాన వార్తలు గాలికొదిలేసి.. ప్రైమ్‌టైమ్ లో శ్రీదేవి మృతి విషయంలోనే చర్చలు నడిపాయి. C'mon, just give them the goddamn Pulitzer already! pic.twitter.com/aU8vBaL0fI — Karnika Kohli (@KarnikaKohli) February 26, 2018 బాత్‌టబ్‌లో రిపోర్టర్..! ఓ ప్రాంతీయ చానల్‌కు చెందిన రిపోర్టర్ బాత్‌టబ్‌లోకి దిగి మరీ రిపోర్టింగ్ చేయడంపై సోషల్ మీడియాలో విస్మయం వ్యక్తమవుతుంది. దీనిపై నెటిజన్లు జోకులు, సెటైర్లు పేలుతున్నాయి. శ్రీదేవిది బాత్‌టబ్ మరణం కాబట్టి బాత్‌టబ్‌లోకి దిగారు.. ఒకవేళ ఎవరైనా ఉరివేసుకుంటే..రిపోర్టర్ కూడా ఉరి వేసుకున్నట్టు కనిపిస్తూ.. రిపోర్టింగ్ చేస్తారా? నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శ్రీదేవి మృతి విషయంలో కొన్ని చానళ్లు సాగించిన చిలువలపలువల ప్రచారం,చానళ్ల అత్యుత్సాహంపై సోషల్ మీడియా ఘాటుగా స్పందించింది.‘ఇప్పుడు నడుస్తోంది బ్యాడ్ జర్నలిజం కాదు.. బాత్‌టబ్ జర్నలిజం’ అంటూ కత్తి మహేశ్ టీవీ చానళ్ల ధోరణిపై ట్వీట్ చేశారు. మొత్తానికి ఓవైపు టీవీ చానళ్ల వికృత ధోరణిని పరిహాసిస్తూనే.. మరోవైపు శ్రీదేవి మృతివిషయంలో వదంతులు ప్రచారం చేయకుండా ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తూ..నెటిజన్లు పెద్ద ఎత్తున లెట్హార్రెస్ట్ఇన్పీస్ యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ అయ్యేలా చేశారు. One anchor is in "the" bathroom, complete with a wine glass! Wow! Excuse me while I step out to bang my head against a wall. BRB. pic.twitter.com/XTdLNI2ckO — Sachin Kalbag (@SachinKalbag) February 26, 2018 Thank God it's bath tub. As somone pointed out, what if it was a fire. pic.twitter.com/as6kqQTMem — Kathi Mahesh (@kathimahesh) February 27, 2018 .@abpnewstv decides to give a platform to all the WhatsApp crap floating around on her death. "Did plastic surgery kill her?" is the important question being probed. pic.twitter.com/f1S0Yyklbp — Manisha Pande (@MnshaP) February 26, 2018 -
శ్రీదేవి అంత్యక్రియలు అక్కడే..!
-
శ్రీదేవీ అంత్యక్రియలు అక్కడే..!
ముంబై : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై నెలకొన్న అనుమానాలన్నింటికీ తెరదించుతూ.. ప్రమాదవశాత్తునే ఆమె మరణించినట్టు దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు తేల్చారు. దర్యాప్తు ఇక ముగిసిందని, కేసును క్లోజ్ చేశామని, ఇక ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రాసిక్యూషన్ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. భర్త బోనీ కపూర్‌కు కూడా క్లీన్ చీట్ లభించింది. కేసును క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు, ఆమె మృతదేహానికి ఎంబామింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ రోజు రాత్రి 10.30కు శ్రీదేవీ మృతదేహం ముంబై ఛత్రపతి విమానశ్రయానికి చేరుకోనుంది. అనిల్ అంబానీకి చెందిన ఛార్టెడ్ విమానంలో శ్రీదేవీ మృతదేహాన్ని ముంబైకి తరలిస్తున్నారు. రాత్రి పదిన్నరకు ముంబై ఛత్రపతి విమానశ్రయానికి శ్రీదేవీ మృతదేహం రేపు ఉదయం 9 గంటలకు గ్రీన్ ఎకర్స్ నుంచి కంట్రీ క్లబ్‌కు పార్థీవదేహం తరలింపు ఉదయం తొమ్మిదన్నర నుంచి మధ్యాహ్నం పన్నెడున్నర వరకు అభిమానుల సందర్శనకు అనుమతి లకడ్వాలా కాంప్లెక్స్ గార్డెన్ నెం.5లో శ్రీదేవీ సంతాప సమావేశం మధ్యాహ్నం పన్నెడున్నర నుంచి ఒకటింటి వరకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజ రెండు గంటలకు అంతిమయాత్ర ప్రారంభం మధ్యాహ్నం మూడున్నరకు విలే పార్లే హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు శనివారం రాత్రి 11 దాటిని తర్వాత శ్రీదేవి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె గుండెపోటుతో చనిపోయారని తొలుత అనుకున్నారు. కానీ అనంతరం ఆమె పోస్టు మార్టం నివేదికలో, శ్రీదేవీ ప్రమాదవ శాత్తు నీటిలో పడి ఊపిరి ఆడక చనిపోయారని దుబాయ్ వైద్యులు తేల్చారు. ఆమె దేహంలో ఆల్కహాల్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని, బహుశా స్నానానికి వెళ్లిన ఆమె పట్టును కోల్పోయి కాలు జారీ టబ్‌లో పడిపోయి ఉంటారని, ఆ క్రమంలోనే ఊపిరి ఆడక చనిపోయారని అన్నారు. అయితే, ఈ క్రమంలో బోనీ కపూర్‌ను కొన్ని గంటలపాటు మూడుసార్లు విచారించడం, ఆమె మృతదేహాన్ని అప్పగించేందుకు తొలుత ప్రాసీక్యూషన్ అధికారులు అంగీకరించకపోవడంతో బహుశా ఏవో బలమైన కారణాలే ఆమె చావుకు కారణం అయి ఉంటాయని భిన్న కథనాలు వచ్చాయి. కానీ చివరికి వాటన్నంటికి పుల్‌స్టాప్ పెడుతూ దర్యాప్తు క్లియర్ అయిందని, ఇక ఎలాంటి అనుమానం లేదని, ఆమె అనుకోకుండా బాత్‌డబ్‌లో పడి ఊపిరి ఆడక చనిపోయారంటూ దుబాయ్ విచారణ అధికారులు తేల్చేశారు. -
ఎంబామింగ్‌కు శ్రీదేవి మృతదేహం
-
శ్రీదేవి భౌతికకాయం తరలింపు.. లైన్‌క్లియర్!
దుబాయ్ : ఆకస్మికంగా మృతిచెందిన ప్రముఖ నటి శ్రీదేవి భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించే విషయంలో మంగళవారం ఎట్టకేలకు ముందడుగు పడింది. దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతికకాయాన్ని తమ అధీనంలోంచి విడుదల చేసేందుకు అనుమతిస్తూ.. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి, ఆమె భర్త బోనీ కపూర్‌కు లేఖలు అందించారు. దీంతో శ్రీదేవి భౌతికకాయాన్ని ఎంబామింగ్ చేసి.. తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. శ్రీదేవి భౌతికకాయం తరలింపు విషయంలో మంగళవారం కూడా తీవ్ర జాప్యం జరిగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమె పార్థీవదేహాన్ని తరలించేందుకు ఉదయం నుంచి చాలాసేపు ఎదురుచూశారు. ఈ ప్రక్రియ ఆలస్యంగా అవుతుండటంతో తండ్రితో ఉండటానికి బాలీవుడ్ నటుడు అర్జున్‌కపూర్ దుబాయ్ బయలుదేరిన సంగతి తెలిసిందే. దుబాయ్ పోలీసులు అనుమతి ఇవ్వడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీదేవి పార్థీవదేహం ముంబైకి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందని దుబాయ్ పోలీసులు సోమవారం ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం తేల్చి న సంగతి తెలిసిందే. సోమవారమే ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీచేశారు.అయితే, మంగళవారం పూర్తి ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవరకు వేచిచూసి.. ఆతర్వాతే శ్రీదేవి భౌతికకాయాన్ని విడుదల చేసినట్టు తెలుస్తోంది. 54 ఏళ్ల శ్రీదేవి గత శనివారం రాత్రి దుబాయ్‌లో ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. గత రెండురోజులుగా ఆమె భౌతికకాయం దుబాయ్ పోలీసుల అధీనంలోనే ఉంది. ఆమె ఆకస్మిక మృతిపై దుబాయ్ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగం విచారణ జరిపాయి. శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని,ఆ సమయంలో ఆమె స్పృహలో లేరని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మృతి వెనుక ఎలాంటి నేరిపూరిత కోణం కనిపించడం లేదని పేర్కొంది. -
‘శ్రీదేవి భౌతికకాయానికి రీపోస్టుమార్టం చేయాలి’
న్యూఢిల్లీ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మృతి విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తుతూ సీనియర్ జర్నలిస్టు ఎస్ బాలకృష్ణన్ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాశారు. సాధారణంగా బాత్‌టబ్ ఎత్తు మూడు అడుగులు మాత్రమే ఉంటుందని, అందులో మునిగి ఒక వ్యక్తి ఎలా చనిపోతారని ఆయన తన లేఖలో ప్రశ్నించారు. శ్రీదేవి శరీరంలో ఉన్న ఆల్కాహాల్ స్థాయి చాలా తక్కువ అని, అలాంటి సమయంలో ఆమె అకస్మాత్తుగా బాత్‌టబ్‌లో మునిగి ఎలా చనిపోతుందని ఆయన ప్రశ్నించారు. ఆమె భౌతికకాయాన్ని ముంబైకి తరలించిన తర్వాత మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని ఆయన లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. 54 ఏళ్ల శ్రీదేవి గత శనివారం రాత్రి దుబాయ్‌లో ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయాన్ని ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంది. ఆమె ఆకస్మిక మృతిపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ జరుపుతోంది. శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని,ఆ సమయంలో ఆమె స్పృహలో లేరని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మృతి వెనుక ఎలాంటి నేరిపూరిత కోణం కనిపించడం లేదని పేర్కొంది. -
శ్రీదేవి.. మీడియా కథనాలు.. ఆగ్రహం, ఆవేదన!
మీడియా ఏ విషయంలోనైనా అత్యుత్సాహం ప్రదర్శించడం ఇప్పుడు పారిపాటిగా మారింది. నిజానిజాలు ధ్రువీకరించుకోకుండానే వదంతులను చిలువలు, పలువలుగా ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని చానెళ్లలో నిత్యకృత్యంగా మారింది. ఒకప్పుడు సోషల్ మీడియాలో పుకార్లు రేపి.. ప్రచారం చేసేవారు. ఇప్పుడు కొన్ని మీడియా చానెళ్లు ఏ వదంతి తన దృష్టికి వచ్చినా.. నిజానిజాలు పట్టించుకోకుండా యథేచ్ఛగా ప్రసారం చేసేస్తున్నాయి. టీఆర్పీ రేటింగ్స్ కోసం కొన్ని మీడియా చానెళ్లు తహతహలాడుతుండటం కూడా ఇందుకు కారణం కావొచ్చు. తాజాగా శ్రీదేవి మృతి విషయంలో కొన్ని జాతీయ చానెళ్లు, మరికొన్ని ప్రాంతీయ చానెళ్లు వ్యవహరిస్తున్న తీరు, అనుమానాలకు మరిన్ని వదంతులు జోడించి అందిస్తున్న కథనాలు శ్రీదేవి అభిమానులను గాయపరుస్తున్నాయి. దుబాయ్‌లో ఆకస్మికంగా మరణించిన శ్రీదేవి భౌతికకాయం తరలింపు విషయంలో ఆ దేశ చట్టాలకు అనుగుణంగా జాప్యం జరుగుతోంది. మొదట శ్రీదేవి తీవ్ర గుండెపోటుతో చనిపోయారని కథనాలు వచ్చాయి. కానీ, ఫోరెన్సిక్ నివేదికలో ఆమె బాత్‌టబ్‌లో పడి ఊపిరాడక మృతిచెందినట్టు తేలింది. ఈ ఘటన వెనుక పూర్వాపరాలు, అసలు శ్రీదేవి చనిపోయిన రోజు ఏం జరిగిందన్నది తేల్చేందుకు దుబాయ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ లోపు జాతీయ మీడియా శ్రీదేవి మృతి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. దుబాయ్‌లో శ్రీదేవి మృతిచెందిన కథనాలను మొదటినుంచి ఎప్పటికప్పుడు అందిస్తూ.. స్థానికంగా ఉండి వాస్తవాలను అందించేందుకు ప్రయత్నిస్తున్న స్థానిక మీడియా సంస్థ ఖలీజ్ టైమ్స్ తాజాగా భారత మీడియా ధోరణిపై ఘాటుగా స్పందించింది. శ్రీదేవి మృతి విషయంలో ముందుగానే నిర్ధారణలకు వచ్చేందుకు, జడ్జి పాత్ర పోషించేందుకు భారత మీడియాలోని కొన్ని సెగ్మెంట్స్ ప్రయత్నిస్తున్నాయని ఘాటుగా అభిప్రాయపడింది. (1/2) #KTNanoEdit: #Indian actor #Sridevi’s death has shocked us, but why jump to conclusions? In our celebrity-packed culture, some segments of the #media in #India want to play judge even when authorities have not concluded their #investigation. The authorities are working to — KTOpinion (@KTOpinion) February 27, 2018 ‘భారతీయ నటి శ్రీదేవి మృతి మమ్మల్ని కూడా దిగ్భ్రాంతపరిచింది. కానీ, ఎందుకు ఈ కేసులో ముందుగానే ఒక నిర్ధారణకు వచ్చేందుకు తాపత్రయపడుతున్నారు. మన సెలబ్రిటీ ప్యాకెడ్ కల్చర్‌లో భాగంగా భారత మీడియాలోని కొన్ని సెగ్మెంట్లు.. అధికారులు దర్యాప్తును పూర్తిచేయకముందే జడ్జీల పాత్ర పోషించాలని భావిస్తున్నాయి. ఈ విషయంలో సత్యమేమిటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మునిగిపోవడం వల్ల ఆమె మరణం సంభవించిందని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఈ విచారణ సమయంలో సంయమనం పాటించడమే ధర్మమని మేం భారత మీడియాకు సూచిస్తున్నాం’ అని ఖలీజ్ టైమ్స్ తన అభిప్రాయాన్ని తెలిపింది. (2/2): get to the bottom of the truth. Forensics said the death was by #drowning. To the #media in #India, we advise patience — a virtue in these trying times. #SrideviDeathMystery #journalism #KhaleejTimes #dubai #dubaipolice #UAE — KTOpinion (@KTOpinion) February 27, 2018 ప్రముఖ జర్నలిస్టు బర్ఖా దత్ కూడా శ్రీదేవి మృతి విషయంలో టీవీ చానెళ్ల ప్రసారాలను తీవ్రంగా తప్పబట్టారు. ఈ విషయంలో టీవీచానెళ్ల ప్రసారాలు సిగ్గుపడేలా ఉన్నాయని పేర్కొంటూ ‘న్యూస్‌కి మౌత్’ (వార్త మరణం) పేరిట ఆమె ‘వాషింగ్టన్ పోస్టు’లో ఓ వ్యాసాన్ని ప్రచురించారు. శ్రీదేవి మృతిపై కొన్ని చానెళ్లు అత్యుత్సాహంతో అందిస్తున్న కథనాలు, వదంతులు కలతకు గురిచేసేలా ఉన్నాయని సినీ రచయిత కోన వెంటక్ ట్వీట్ చేశారు. శ్రీదేవి మృతి విషయంలో సెన్సేషనల్ కథనాలు ప్రచురించేందుకు కొన్ని మీడియా చానెళ్లు తాపత్రయపడటంపై, చిలువలుపలువలుగా ప్రసారాలు సాగుతుండటంపై సోషల్ మీడియాలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. Ridiculous. Ludicrous. Insidious: The way Indian Media- especially news TV has reported #sridevideath has been shameful. As a a member of the fraternity, I am embarrassed My piece in @washingtonpost on why I started the hashtag #NewsKiMaut -Death of News https://t.co/TK4npaqK8e — barkha dutt (@BDUTT) February 27, 2018 It’s very disturbing and disheartening to see some stories that are being circulated on the death of Sreedevi ji by some media channels.. please leave her alone 🙏 Please don’t hurt her soul or her fans... poor soul can’t even defend herself 🙏🙏 My humble request 🙏🙏🙏 — kona venkat (@konavenkat99) February 26, 2018 -
శ్రీదేవి మృతితో మరో నటికి అనారోగ్యం!
అతిలోక సుందరి శ్రీదేవి మరణించి మూడు రోజుల గడుస్తున్నా అమె లేరనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వెండితెరపై తనదైన ముద్రవేసిన శ్రీదేవి హఠాన్మరణం అభిమానులతో పాటు సినీ ప్రముఖులను తీవ్రంగా కలిచివేసింది. ఈ వార్త విన్నప్పటి నుంచి ప్రముఖుల నివాళులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంతో మంది యువ నటీనటులు శ్రీదేవి నటన చూసి స్పూర్తి పొందినవారున్నారు. శ్రీదేవి నటన చూసి ఎంతో నేర్చుకున్నానని పలు ఇంటర్వ్యూలలో చెప్పిన నటి కంగనా రనౌట్.. ఆమె మరణ వార్తతో తీవ్ర మనస్థాపానికి గరైందట. శ్రీదేవి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. అయితే శ్రీ మరణవార్త విన్నప్పటి నుంచి కంగనా అనారోగ్యానికి గురికావడం ఇప్పుడు చర్చనీయాశమైంది. గత రెండురోజులుగా కంగనా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. గతనెల (జనవరి)లో అనురాగ్ బసు నిర్వహించిన సరస్వతి పూజలో శ్రీదేవి, కంగనా పాల్గొన్నారు. ఆ సమయంలో వారిద్దరూ ఎంతో అప్యాయంగా మాట్లాడుకున్నారు. జనవరిలో జరిగిన సరస్వతి పూజలో శ్రీదేవి, కంగనా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా మణికర్ణిక చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో కంగనా ప్రధాన పాత్రలో నటిస్తోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం శ్రీదేవి మరణవార్త విన్న కంగనా షాక్‌కు గురైందట. ఈ నేపథ్యంలోనే ఆమె జ్వరం బారిన పడ్డారని తెలుస్తోంది. కాగా, కంగనా అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ వాయిదా వేసింది చిత్ర యూనిట్. -
చచ్చిపోవాలనిపిస్తోంది: ఆర్జీవీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణం ఆమెను ఆరాధ్య దేవతగా భావించే దర్శకుడు రాంగోపాల్ వర్మను ఎంత కుదిపేసిందో చెప్పనక్కర్లేదు. ఆమె మరణవార్త తెలిసినప్పటి నుంచి మొదలైన ఆయన ట్వీట్ల పర్వం ఆదివారం వరకు కొనసాగింది. దేవుడ్ని నిందిస్తూ... పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ... తనకు చెప్పకుండా వెళ్లిపోయావంటూ నీతో(శ్రీదేవి) కటీఫ్ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వర్మ.. ఆ తర్వాత మూగబోయాడు. అయితే ఆయన స్పప్నసుందరి మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవ్వడం, ఫొరెన్సిక్ రిపోర్ట్‌లో ఆమె రక్తంలో మద్యం ఉందని, ఊపిరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని వార్తలు రావడం వర్మను తీవ్రంగా కలిచి వేశాయి. ఆమె అందం గురించి మాట్లాడుకునే జనాలు ఇప్పుడు ఆమె ఎలా చనిపోయిందో మాట్లాడుకుంటున్నారని సోషల్‌మీడియా వేదికగా వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మరోసారి ట్వీట్ల పర్వం మొదలెట్టాడు. ‘ఎవరి జీవితమన్నా ఇంత భయంకరంగా, ఇంత విషాదంగా ముగుస్తుందా? ఆమె మరణవార్తను ఇలా ఇన్ని రకాలుగా వినాల్సి రావడం బాధాకరం. ఇదంతా చూస్తుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంద’ని వర్మ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్లో తాను తెరకెక్కించన ’గోవిందా గోవిందా’ సినిమాలోని అమ్మ బ్రహ్మదేవుడో పాటను షేర్ చేస్తూ.. ‘ నేను ఈ పాటను కేవలం ఆమె అందం వర్ణించడం కోసం తీసాను. ఇంత అందమైన అమ్మాయి ఇలా చనిపోవడం సబబేనా?’ అని ప్రశ్నించాడు. Can any person’s life end in a more tragic and in a more horrific way? Its traumatic to hear her being dissected in so many terrible ways ? I feel like just fucking kill myself https://t.co/po7Cq5x9Pk — Ram Gopal Varma (@RGVzoomin) 26 February 2018 I wanted this songs lyric content to be the upper limit description of the divineness of her beauty ..Can u see this song and just tell me how the hell can this woman just like that die? https://t.co/X4Ch4WcN1u — Ram Gopal Varma (@RGVzoomin) 27 February 2018 -
బోనీకపూర్‌ను అరెస్ట్ చేసే అవకాశం?
-
బోనీకపూర్‌ను అరెస్ట్ చేసే అవకాశం?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఆమె గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన రిపోర్ట్‌పై దుబాయ్ పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసును పోలీసులు పునర్విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. నేడు మరోసారి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ పూర్తయ్యేవరకు దుబాయ్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. బోనీని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. శ్రీదేవి, బోనీకపూర్ కాల్‌డేటాను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రీదేవి ఫోన్ నుంచి ఒకరికి ఎక్కువగా కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. పెళ్లి ఈ నెల 20న జరిగితే శ్రీదేవి 24వరకు దుబాయ్‌లోనే ఎందుకున్నారు. ముంబై తిరొగొచ్చిన బోనీ మళ్లీ అక్కడికి ఎందుకు వెళ్లారు. టబ్‌లో పడ్డ ఆమెను ఎవరు చూశారు. ఆ సమయంలో బోనీ ఎక్కడున్నారనే ?అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆమె భౌతిక కాయం అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో ఆమె భౌతిక కాయం వచ్చే అవకాశం కనిపించడంలేదు. అన్ని సందేహాలు తీరాకే ఆమె భౌతికకాయం అప్పగిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీదేవి మరణంపై బోనీకపూర్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. -
శ్రీదేవి మృతి కేసులో అనేక అనుమానాలు
-
మరణం వెనుక..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు దుబాయి ఫోరెన్సిక్ నిపుణులు తేల్చడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. శ్రీదేవి బాత్రూమ్లో గుండెపోటుకు గురవడంతో హాస్పిటల్‌కు తరలించామని, కానీ చికిత్స అందించే లోపే చనిపోయినట్టు కుటుంబీకులు ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు. కానీ జరిగింది అది కాదన్న సంగతి ఫోరెన్సిక్ నివేదికను బట్టి తెలుస్తోంది. బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ ఆమెనే పడిపోయారా లేదా ఎవరైనా తోసేశారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఎన్నో సందేహాలు.. - పెళ్లి జరిగింది ఈ నెల 20న అయితే శ్రీదేవి 24 వరకు ఎందుకు దుబాయిలోనే ఉన్నారు? - 22వ తేదీ మధ్యాహ్నం నుంచి 24 వరకు శ్రీదేవి అసలు హోటల్ రూమ్ నుంచి బయటకు రాలేదు. అందుకు కారణం ఏంటి? ఆల్కహాల్ తీసుకొని స్పృహ లేకుండా ఉందా? - గది నుంచి శ్రీదేవి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది వెళ్లి చూశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై కుటుంబీకులు ఎందుకు స్పందించడం లేదు? - శ్రీదేవిని సర్ప్రైజ్ చేసేందుకు బోనీకపూర్ నిజంగానే 24న సాయంత్రం ముంబై నుంచి దుబాయి వెళ్లారా? లేదా శ్రీదేవి మృతి వార్త తెలిశాక వెళ్లారా? - గతంలో శ్రీదేవికి ఎప్పుడూ గుండెపోటు రాలేదని సంజయ్ కపూర్ మీడియాకు వెల్లడించారు. అలాంటప్పుడు ఆమె గుండెపోటుతోనే మరణించారన్న ప్రచారం ఎందుకు జరిగింది? - బోనీ కపూర్ తన స్నేహితుడికి కాల్ చేసి ఆ తర్వాత హాస్పి టల్‌కు తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవ మెంత? అసలు శ్రీదేవిని హాస్పిటల్‌కు ఎవరు తీసుకెళ్లారు? ఫోరెన్సిక్ రిపోర్టులో ఇదెలా సాధ్యం? శ్రీదేవి మృతికేసులో ఫోరెన్సిక్ విభాగం ఇచ్చిన రిపోర్టుపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మన దేశంలో అయితే నీటిలో మునిగి చనిపోతే.. ఫోరెన్సిక్ రిపోర్టులో అంతవరకే ప్రస్తావిస్తారు. ప్రమాదవ శాత్తూ మునిగిపోయారా? లేదా ఎవరైనా బలవంతంగా నీటిలో ముంచి చంపేశారా అన్నది తేల్చాల్సింది పోలీసులే! కానీ దుబాయి ఫోరెన్సిక్ నిపుణులు వారే ‘ప్రమాదవశాత్తూ మునిగిపోవడం’ (యాక్సిడెంటల్ డ్రౌనింగ్) వల్ల చనిపోయినట్టు తేల్చారు. ఇది సందేహాత్మకంగా కనిపిస్తోందని రాష్ట్ర ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రమాదమా కాదా అన్నది ఫోరెన్సిక్ నిపుణులు తేల్చాల్సిన అంశం కాదని, అది పూర్తిగా పోలీసు దర్యాప్తులో తేలాల్సిన వ్యవహారమని వారు చెబుతున్నారు. అలాగే రిపోర్టులో ‘డ్రౌనింగ్’ అన్న పదం స్పెల్లింగ్‌ను ‘డ్రావింగ్’ అని తప్పుగా ప్రచురించారు. ఒక సెలబ్రెటీ కేసులో ఇలా అచ్చు తప్పుతో నివేదిక రూపొందించడం కూడా ఫోరెన్సిక్, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే శ్రీదేవి తూలి బాత్‌టబ్‌లో పడిపోతే తలకు లేదా మరేదైనా ప్రాంతంలో గాయాలై ఉండాలి. కానీ ఇలాంటి ఆనవాళ్లు ఉన్నాయా? లేదా అన్న అంశాలను కూడా రిపోర్టులో వెల్లడించలేదు. దుబాయిలో ఇవి నిబంధనలు... - డెత్ రిపోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మృతిచెందిన వ్యక్తికి తప్పనిసరిగా పాస్‌పోర్టు, వీసా ఉండాలి. వీటితో పాటు పోలీసులిచ్చే నివేదిక తప్పనిసరి. - సాధారణంగా డెత్ సర్టిఫికెట్ కోసం ఫీజుగా 60 దిరమ్స్ కట్టాలి. అరబ్ భాషలో కాకుండా ఇంగ్లిష్‌లో సర్టిఫికెట్ కావాలంటే 100 దిరమ్స్ చెల్లించాలి. ఎంబసీ నుంచి సర్టిఫికెట్ కోసం 700 దిరమ్స్ కట్టాలి. - డెడ్‌బాడీని మాతృదేశానికి తరలించే ప్రక్రియలో భాగంగా దుబాయి పోలీసుల నుంచి ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాలి. ఆ ఎన్ఓసీని ఎయిర్‌పోర్టు అథారిటీకి అందించాలి. ఇదే సమయంలో ఎంబసీకి దరఖాస్తు చేస్తే మృతిచెందిన వ్యక్తి పాస్‌పోర్టు రద్దు చేస్తారు. తర్వాత డెడ్‌బాడీని మాతృదేశానికి పంపించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. - మాతృదేశంలోని హోంశాఖ కూడా మృతదేహాన్ని తీసుకునేందుకు ఎన్ఓసీ ఇవ్వాలి. సాధారణంగా ఈ ప్రక్రియను భారత ఎంబసీ చూసుకుంటుంది. కుటుంబీకులు ఎందుకు మాట్లాడడం లేదు? శ్రీదేవి మృతి విషయంలో బోనీ కపూర్ కుటుంబం గానీ, కపూర్ ఫ్యామిలీ గానీ ఎక్కడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడంలేదు. మృతి విషయంలో వస్తున్న అనేకానేక పుకార్లను ఖండించే ప్రయత్నం కూడా చేయడంలేదు. తీవ్ర విభేదాలు, తగాదాలు వస్తే తప్పా ఇంతటి పరిస్థితి రాదన్నది కపూర్ కుటుంబ సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. అద్దం ముందు నిలబడి... శ్రీదేవి అంటే నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఆమె నటించిన మిస్టర్ ఇండియా, చాల్బాజ్, లమ్హే సిని మాలు అంటే పిచ్చి. ఒక గ్రేస్‌తో కామెడీని పండిం చిన.. పండించగల నటి ఆమె ఒక్కరే. మిస్టర్ ఇండియాలోని చార్లీ చాప్లిన్ రోల్, కాటే నహీ పాట, లమ్హేలోని డ్యుయల్ రోల్, చాల్బాజ్ పాటలను ఇంట్లో నేను అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎక్స్ప్రెషెన్స్లో శ్రీదేవీని ఇమ్మిటేట్ చేసేదాన్ని. ఎంత ట్రై చేసినా వచ్చేవి కావు. అలా చిన్నప్పటి నుంచీ నేను ఆరాధించిన నటితో నటించే అవకాశం నా మూడో సినిమాకే వచ్చింది. ఆ సినిమా లాడ్లా. అప్పటికే ఆమె సూపర్‌స్టార్. చాలా భయపడ్డా. కాని ఆమె చాలా ఈజీ చేసేశారు. శ్రీదేవి ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. సెట్లో కూడా చాలా కామ్‌గా ఉంటారు అని అంటుంటారు. కాని లాడ్లా షూటింగ్ అప్పుడు నాతో చాలా క్లోజ్‌గా ఉన్నారు. తను వచ్చి.. ‘రెడీ అయిపోయావా? రా.. నా వ్యాన్‌లో కూర్చుని మాట్లాడుకుందాం’’ అని నన్ను తన వానిటీవ్యాన్లోకి తీసుకెళ్లేవారు. చిట్‌చాట్, జోక్స్, డిస్కషన్స్ చేసేవారు. నా జీవితంలో మరిచిపోలేని రోజులవి. – రవీనా టాండన్. కహానీ కోరిక... విశ్రాంతి సమయంలో పుస్తకాలు చదవడం, నిద్రపోవ డం, పెయింటింగ్ అంటే శ్రీదేవికి ఇష్టం. అవే చేసేవారు కూడా. పెళ్లి, పిల్లల తర్వాత సినిమాల నుంచి తీసు కున్న పదిహేనేళ్ల బ్రేక్‌ను ఇంటిని, పిల్లలను చూసుకోవడానికే ఆసక్తి చూపారు. కాని బోనీకపూర్, జాన్వి, ఖుషీల బలవంతం, ప్రోత్సాహంతో గౌరీ షిండే ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. గౌరీ అంటే శ్రీదేవికి చాలా అభిమానం. ఆమె తన చిన్నకూతురు ఖుషీలాగే చురుకుగా, అల్లరిగా,చలాకీగా ఉంటుందని గౌరీని ‘ఖుషీ’ అని పిలిచేవారట. సెట్స్‌లోకి రాగానే ‘‘వేర్ ఈజ్ మై ఖుషీ’’ అంటూ గౌరీని వెదుక్కునేవారట. ప్రతి సినిమాను కొత్తగా.. మొదటి సిని మా అనుకొనే చేస్తారు. తన నటన పట్ల పూర్తి సంతృప్తిని ఎప్పుడూ కనబర్చ లేదు. ఇంట్లోవాళ్లు, స్నేహితులు చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నా.. శ్రీదేవి మాత్రం ఇంకా చేసుండాల్సింది అని అనుకునేవారట. అదే ఆరాటం, అంతే జిజ్ఞాస చివరి సినిమా వరకు కనబర్చారు. బహుశా ఆ తపనే ఆమెను దేశంలోనే ఫస్ట్ ఫీమేల్ సూపర్‌స్టార్‌గా నిలబెట్టిం దేమో! ఎవరితో ఎక్కువగా మాట్లా డకుండా తన పని తాను చేసుకుపోయే ఈ స్టార్‌కు కామెడీ సినిమాలు చేయడం అంటే ఇష్టం. అయితే బయట గంభీరంగా కనిపించే శ్రీదేవి ఇంట్లో, దగ్గరి వాళ్లతో జోక్స్ వేస్తూ, వాళ్లను సరదాగా ఆటపట్టిస్తూ చాలా జోవియల్‌గా ఉంటారు. చక్ దే ఇం డియా, తారే జమీన్ పర్, విక్కీ డోనర్ , కహానీ సినిమాలంటే ఇష్టం. కహానీ లాంటి సినిమా చేయాలని ఆమె కోరిక. బాలీవుడ్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పట్ల ఇప్పుడు వచ్చిన మార్పు పట్ల చాలా సంతోషపడేవారు. స్క్రిప్ట్ ముఖ్య భూమిక పోషించడం, నటనకు స్కోప్ ఉండడాన్ని ఆమె ప్రశంసించారు. కూల్ మామ్... ‘‘మా అమ్మ చాలా స్ట్రిక్ట్. అయితే మా అమ్మ నాతో ఉన్నట్టుగా నేను నా పిల్లల దగ్గర ఉండలేను. కాలంతో మారాలి కదా! అందుకే పట్టూవిడుపులూ చూపిస్తా. లైఫ్‌లో బేసిక్ ఎథిక్స్ ఉండాలని చెప్పేదాన్ని. వాళ్లు టీన్స్‌లో ఉన్నప్పుడు లేట్ నైట్స్ రావాల్సి వస్తే వాళ్లతో పాటు నేనూ వేళ్లేదాన్ని. పిల్లలు వచ్చే వరకు కార్లో వెయిట్ చేసేదాన్ని. ఇప్పుడు పెరిగారు. వాళ్ల మంచి చెడ్డలు చూసుకోగలరు. పిల్లల విషయంలో నేను, బోనీ ఇద్దరం బ్యాలెన్స్డ్గా ఉంటాం. నేను స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు ఆయన.. ‘‘పిల్లలు కదా.. కొన్ని విషయాల్లో మనం చూసీచూడనట్టు ఉండాలి. అంత కఠినంగా ఉండకు వదిలెయ్’’ అని చెప్తుంటారు. కొన్ని సందర్భాల్లో నేను అలా చెప్తుంటాను బోనీకి (నవ్వుతూ). మామూలుగా నేను షూటింగ్లో ఉన్నా గ్యాప్ దొరికినప్పుడల్లా పిల్లలకు ఫోన్ చేస్తుంటా. అయితే మామ్ సినిమా అప్పుడు మాత్రం చేయలేదు. ఖుషీ.. అందిట జాన్వితో. ‘ఇదేంటి అమ్మ ఒక్కసారి కూడా ఫోన్ చేయట్లేదు’ అని. మామ్ సినిమాలోని దేవకీ పాత్ర అలాంటిది. కంప్లీట్‌గా.. నా పిల్లలను కూడా మరిచిపోయేంతగా లీనమయ్యా అందులో. – మామ్ ప్రమోషనల్ సమయంలో శ్రీదేవి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ డాక్టర్.. సినిమాల్లో! జాన్వి సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు శ్రీదేవేమీ షాక్ అవలేదట. జాన్వి చిన్నప్పుడు బంధువులు ఆమెను పెద్దయ్యాక ఏమవుతావ్ అని అడిగారట. ‘డాక్టర్’ అని జవాబిచ్చిందట జాన్వి. అక్కడే ఉన్న శ్రీదేవి ఆ ఆన్సర్‌కి ఆనందపడి ఉబ్బితబ్బిబ్బయ్యే లోపే ఆ పిల్ల ‘కాని సినిమాల్లో’ అని చెప్పిందట. తాను పెద్దయ్యాక ఏం కావాలనుకుంటుందో కూతురు మెస్సేజ్ ఇచ్చేసిందని గ్రహించారట శ్రీదేవి. అందుకే ‘‘నేను యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పినప్పుడు పెద్దగా ఆశ్చర్యపోలేదట. నా పనైపోయిందనుకున్నా.. అందరిలాగే ఫర్హాన్ అక్తర్కూ శ్రీదేవి అంటే పిచ్చి. ఆమె నటించిన లమ్హే సినిమా ప్రొడక్షన్ వర్క్‌లో ఫర్హాన్ కూడా పాలు పంచుకున్నాడు. నిజానికి ఆ సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఫర్హాన్. ఓ పాట షూటింగ్ కోసం శ్రీదేవి రిహార్సల్స్ చేస్తోందట. వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న చోట ఫ్లోర్ పాలీష్ పోయి నల్లగా ఓ మచ్చలా కనపడుతోంది. డైరెక్టర్ వచ్చి అక్కడ పెయింట్ వేయమని ఫర్హాన్‌కు పురమాయించాడు. దాంతో పెయింట్ వేశాడు ఫర్హాన్. శ్రీదేవి ఆరిపోని ఆ పెయింట్ మీద కాలు వేసి జారి పడ్డారట. దెబ్బకే సెట్లో అంతా సైలెంట్. అందరిలో భయం. ఫర్హాన్లో ఇంకా భయం. తన పనైపోయింది.. ఇక సినిమాలకు తనకూ గుడ్ బై అనుకున్నాడట. అంతలోకే శ్రీదేవి పెద్దగా నవ్వడం మొదలెట్టారట. దాంతో సెట్లో అంతా ఊపిరిపీల్చుకొని వాళ్లూ ఆమె నవ్వుతో జతకలిపారు. అయోమయంగా చూస్తున్న ఫర్హాన్ దగ్గరకు వచ్చి.. ‘కూల్’ అంటూ అతని భుజం తట్టారట శ్రీదేవి. అలా ఆమె తన కెరీర్‌ను కాపాడారు అని ట్వీట్ చేశాడు ఫర్హాన్ అక్త్తర్. -
శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించలేం
దుబాయ్ : నటి శ్రీదేవి మృతదేహాన్ని ఈరోజు భారత్‌కు అప్పగించలేమని దుబాయ్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరింత విచారణ అవసరమని దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు తెలిపారు. శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు..ప్రాసిక్యూషన్ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్ అధికారి ఒకరు భారతీయ మీడియాతో మాట్లాడారు. ఫోరెనిక్స్ రిపోర్ట్ ఆధారంగా ప్రమాదవశాత్తు జరిగిందేనని ఎలా నిర్ధారిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని.. ఆమె మృతిపై మరిన్ని అనుమానాలు ఉన్నాయన్న ఆయన.. లోతైన విచారణ అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికితోడు మరిన్ని పత్రాలు కావాలని భారత కాన్సులేట్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో శ్రీదేవి మృతదేహాన్ని ఈరోజు అప్పగించలేమని ఆయన తేల్చేశారు. దీంతో ఆమె భౌతిక కాయన్ని భారత్ తరలించే విషయంపై సంగ్దిగ్ధత నెలకొంది. మరోవైపు బోనీ కపూర్ మూడు గంటలపాటు విచారణ చేపట్టిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు దుబాయ్ విడిచివెళ్లరాదని బోనీకపూర్‌కు ప్రాసిక్యూషన్ అధికారులు తెలిపినట్లు సమాచారం. -
వెక్కివెక్కి ఏడ్చిన బోనీ కపూర్
దుబాయ్ : అతిలోక సుందరి, అందాల తార శ్రీదేవీ మృతిపై యావత్తు ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. సినీలోకం శోకసంద్రంలో నిండిపోయింది. దుబాయ్ లో బోనీ కపూర్ మేనల్లుడు వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవీ, అక్కడే మృతి చెందినట్టు తెలిసింది. అయితే మొదట ఆమె గుండెపోటుతో చనిపోయినట్టు ప్రకటించినా... ఫోరెన్సిక్ రిపోర్టు అనంతరం ఆమె మరణానికి గల కారణాలను వెల్లడించింది. ఆమె గుండెపోటుతో కాదని, ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడిపోవడం వల్ల చనిపోయినట్టు పేర్కొంది. అయితే అపస్మారక స్థితిలో బాత్‌టబ్‌లో పడిపోయి ఉన్న శ్రీదేవీని, భర్త బోనీ కపూర్‌తో పాటు, మరో ముగ్గురు సన్నిహితులు దగ్గరిలోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే శ్రీదేవీ చనిపోయినట్టు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని వారికి చెప్పారు. శ్రీదేవీ మరణ వార్తని బోనీ కపూర్ అసలు తట్టుకోలేక పోయారని పాకిస్తాన్ నటుడు అద్నాన్ సిద్దికి తెలిపారు. ఆ వార్త తెలియగానే ఒక్కసారిగా షాక్‌కి గురైన బోనీ కపూర్, వెక్కి వెక్చి ఏడ్చారని పేర్కొన్నారు. అప్పటికే దుబాయ్‌లో ఉన్న తాను బోనీ సాబ్‌ను కలిసినట్టు అద్నాన్ తెలిపారు. అద్నాన్ శ్రీదేవీ నటించిన 'మామ్' సినిమాలో ఆమెకు కో-స్టార్‌గా చేశారు. పాకిస్తాన్, అమెరికా, యూకే వంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీదేవీ అభిమానులంతా ఆమె లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. తనకు సంతాప సందేశాలు పంపుతున్నారన్నారు. చివరి సారిగా శ్రీదేవీతో ఆ వివాహ వేడుకల్లోనే మాట్లాడినట్టు అద్నాన్ చెప్పారు. ''వివాహ వేడుక రోజు, రాత్రి 12 గంటలకు నా విమానం అక్కడికి చేరుకుంది. అప్పటికే చాలా ఆలస్యమైందని అనుకున్నా. బోనీ సాబ్‌కి కాల్ చేశా. పెళ్లికి రావాలని ఆయన పట్టుబట్టారు. మామ్ సినిమా తర్వాత నేను శ్రీదేవీని మళ్లీ కలువలేదు. నాకోసం వేచిచూస్తున్నారు. చాలా ఆప్యాయంగా నన్ను పలకరించారు. అనంతరం నన్ను ఆమె కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. మీరు చాలా ఆలస్యం అని నవ్వుతూ అన్నారు. ఆ మాటలు ఇంకా నా చెవిలో మారుమోగుతున్నాయి. అవే ఆమె చివరగా నాకు చెప్పిన గుడ్‌బై ఏమో'' అని ఆవేదన వ్యక్తంచేశారు. -
పాపం వర్మ.. ఏం చేస్తున్నాడో?
సాక్షి, సినిమా : నటి శ్రీదేవి హఠాన్మరణం ఆమె కుటుంబ సభ్యులను, అమితంగా అభిమానించే వారిని ఎంత దిగ్భ్రాంతికి గురి చేసిందో చెప్పనక్కర్లేదు. అయితే ఆమెను ఆరాధ్య దేవతగా భావించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మాత్రం ఆ వార్త కుదిపేసింది. ఆమె మరణవార్త తెలిసినప్పటి నుంచి మొదలైన ట్వీట్ల పర్వం ఆదివారం అంతా కొనసాగింది. దేవుడ్ని నిందిస్తూ... పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ... తనకు చెప్పకుండా వెళ్లిపోయావంటూ నీతో(శ్రీదేవి) కటీఫ్ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వర్మ.. ఇవాళంతా మూగబోయాడు. దీంతో ఆయనసలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వేర్ ఈజ్ ఆర్జీవీ? అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొందరేమో ఈ బాధను తట్టుకోలేక వర్మ అందరికీ దూరంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అంటుండగా.. ఆ బాధ నుంచి వర్మ కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. కడసారి చూపుల కోసం ముంబై వెళ్లి ఉంటాడని ఇంకొందరు చెబుతున్నారు. ఎవరి ఊహకు అందని వర్మ మళ్లీ ఏ క్షణానైనా స్పందిచొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి మృతిపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్న నేపథ్యంలోనైనా వర్మ ఏదో ఒకటి రియాక్ట్ అవుతాడేమో చూడాలి. -
మిస్టరీగా మారిన శ్రీదేవీ మృతి..?
దుబాయ్ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. యూఏఈ అధికారులు విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టు అనంతరం అనుమానాలు మరింత పెరిగాయి. శ్రీదేవీ గుండెపోటుతో చనిపోలేదని, ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడిపోవడం వల్ల ఊపిరాడక చనిపోయారంటూ ఫోరెన్సిక్ రిపోర్టు తెలిపింది. అయితే ఈ రిపోర్టు వెలువడక ముందు ప్రముఖ రచయిత, ఫిజిషియన్ తస్లిమా నస్రీన్ చేసిన ట్వీట్‌తో పాటు, ట్విట్టర్ యూజర్లు కూడా ఫోరెన్సిక్ రిపోర్టుపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఒక ఆరోగ్యకరమైన మహిళ ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌ల్లో పడిపోతారా? అంటూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అనంతరం ఫోరెన్సిక్ రిపోర్టు శ్రీదేవీ ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడిపోయినట్టు పేర్కొంది. అయితే శవపరీక్షలో ప్రమాదవశాత్తు పడిపోయినట్టు అని ఎలా పేర్కొంటారు? అని ట్విట్టర్ యూజర్లు మండిపడుతున్నారు. కేవలం బాత్‌టబ్‌లో పడిపోయినట్టే చెప్పాలని, ఒకవేళ అది ప్రమాదవశాత్తు అయి ఉంటే శవపరీక్ష దాన్ని ఎలా బహిర్గతం చేస్తుంది? ఇది ఒక సందేహాస్పదమైన రిపోర్టు అంటున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ రిపోర్టు కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పేరుతో విడుదలైంది. అంటే ఫోరెన్సిక్ అని చెబుతున్న ఈ రిపోర్టు అసలు నిజమైందేనా? అనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మేనల్లుడు పెళ్లి వేడుకకు వెళ్లిన శ్రీదేవీ తాను ఒక్కతే ఎందుకు దుబాయ్‌లోనే ఉండాలనుకున్నారు? ఎందుకు బోనీ కపూర్ మళ్లీ శ్రీదేవీని కలవడానికి ముంబై నుంచి దుబాయ్ వెళ్లారు? అంటూ పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత కార్డియాక్ అరెస్ట్ అని, తర్వాత బాత్‌టబ్‌లో పడిపోయి చనిపోయిరని ఎందుకు చెప్పారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు బోనీ కపూర్ శ్రీదేవీ మృతిపై స్పందించలేదు. ఒకే నెంబర్ నుంచి శ్రీదేవీకి పలుమార్లు కాల్ శ్రీదేవీ మృతిపై ఇంకా విచారణ కొనసాగుతుందని దుబాయ్ పోలీసులు పేర్కొన్నారు. ఆమె కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు. శ్రీదేవీ కాల్ డేటా, బోనీ కపూర్ కాల్‌డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బోనీ కపూర్, శ్రీదేవీ ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారో కూడా తేలుస్తున్నారు. ఒకే నెంబర్ నుంచి ఆమెకు పలుమార్లు కాల్ వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు బోనీ కపూర్‌ని కూడా సుదీర్ఘ సమయం పాటు పోలీసులు విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆయనతో పాటు అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవీని బోనీతోపాటు ఆసుపత్రికి తీసుకెళ్లిన మరో ముగ్గురు వ్యక్తులు, రషీద్ ఆసుపత్రి ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు అటెండర్ల వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు. హోటల్ సిబ్బందిని కూడా దుబాయ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బోనీ కపూర్, హోటల్ సిబ్బంది దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారుల అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. టబ్‌లో పడిపోయిన సమయంలో శ్రీదేవీ ఆల్కహాల్ సేవించినట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు ఆల్కహాల్ సేవించే అలవాటు లేదని రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ అన్నారు. బాత్‌టబ్‌లో పడిపోయిన తర్వాత ఎంత సేపటికి ఆమెను గుర్తించారు? తనంతట తానే పడిపోయిందా? లేదా ఆమెను ఇంకెవరైనా బాత్‌టబ్‌లోకి తోసేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
బోని కపూర్‌ను సుదీర్ఘ సమయం విచారణ
దుబాయ్ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోని కపూర్ వాంగ్మూలాన్ని దుబాయ్ పోలీసులు రికార్డు చేశారు. మొత్తం నలుగురు సీనియర్ పోలీసు అధికారుల సమక్షంలో బోని, వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసినట్టు తెలిసింది. మూడున్నర గంటల పాటు ఆయన్ను విచారించారని, రికార్డెడ్ ఆన్ కెమెరా ముందు బోని స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టు వెల్లడైంది. నీళ్లతో నిండి ఉన్న బాత్‌టబ్‌లో శ్రీదేవీ అకస్మారక పరిస్థితిలో ఉన్నట్టు గుర్తించినట్టు బోని చెప్పినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. అంతేకాక శ్రీదేవీని రషీద్ ఆసుపత్రికి తరలించిన సమయంలో బోనితో పాటు ఉన్న మరో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు. అపస్మారక స్థితిలో శ్రీదేవీ బాత్‌టబ్‌లో పడిపోయి ఉన్న సమయంలో, బోని వారికే ముందస్తుగా కాల్ చేసి సమాచారం అందించాడు. అంతేకాక రషీద్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు అటెండెంట్ల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. మరోవైపు శ్రీదేవీ మృతిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ యూఏఈ ఆరోగ్యశాఖ ఫోరెన్సిక్ రిపోర్టును విడుదల చేసింది. ఆ రిపోర్టులో ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి నీటి టబ్‌లో పడిపోవడం వల్లే మృతి చెందినట్టు పేర్కొంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో బాత్రూంకి వెళ్లిన శ్రీదేవీ, బాత్రూంలో కాలు జారి నీళ్ల టబ్‌లో పడిపోయిందని, ఆ సమయంలో ఊపిరాడక చనిపోయినట్టు తెలిపింది. ఘటన జరిగిన తర్వాత కొద్ది సేపటికి హోటల్ గదికి వచ్చిన బోని కపూర్, హోటల్ సిబ్బంది సాయంతో బాత్రూం డోర్లను బద్దలు కొట్టి తెరిచారు. ఆ సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవీని, హుటాహుటిన దగ్గర్లోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీదేవి ఊపిరి ఆగిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. అయితే శ్రీదేవీ శరీరంలో ఆల్కహాల్‌ను గుర్తించినట్టు యూఏఈ రిపోర్టు పేర్కొది. అంతేకాక అసలు గుండెపోటు విషయాన్నే ఫోరెన్సిక్ రిపోర్టు ప్రస్తావించలేదు.