![Ashraf initiative on the evacuation of sridevi dead body from dubai - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/1/srideviiiiiiiiiiiiiiiii.jpg.webp?itok=5Htha69o)
శ్రీదేవి భౌతికకాయం
సాక్షి, హైదరాబాద్ : శ్రీదేవి భౌతికకాయం దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగిరావటంలో అక్కడ స్థిరపడిన ఓ భారతీయుడు సాయం చేశారు. ఆయన పేరు అశ్రఫ్ షెర్రీ తమరసెరీ. 44 ఏళ్ల ఈయన కేరళ నుంచి వచ్చి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. యూఏఈలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపటాన్ని కర్తవ్యంగా భావిస్తారు. ఈయన అసలు వృత్తి మెకానిక్. దుబాయ్‌కి 35 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రాంతంలో ఈయనకు మెకానిక్ షెడ్ ఉంది. మృత దేహాలను స్వస్థలాలకు పంపేందుకు.. అక్కడి చట్టాలకు అనుగుణంగా అవసరమైన పద్ధతులన్నీ దగ్గరుండి పూర్తి చేస్తారు.
పనికోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న కార్మికుల దగ్గర్నుంచి ప్రముఖుల వరకు అందరికీ ఈయన సాయం చేస్తారు. 18 ఏళ్లుగా 38 దేశాలకు చెందిన 4,700 మృతదేహాలను వారివారి దేశాలకు పంపిచారు అశ్రఫ్. అందుకే అక్కడి అధికారులకు, యూఏఈలో ఉండే విదేశీయులకు అశ్రఫ్ అంటే విపరీతమైన గౌరవం. శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు తరలించిన రోజే ఈయన.. మరో ఐదు పార్థివ దేహాలనూ వేర్వేరు దేశాలకు పంపించారు. ఆయన్ను స్థానికులంతా ‘ఫ్రెండ్ ఆఫ్ డెడ్’అని పిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment