మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. చిరుకు దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది. ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది. ఈ వీసాతో దుబాయ్‌లో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసం ఉండేందుకు అనమతి లభిస్తుంది. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలు అందిస్తోంది.
అయితే ఇప్పటికే ఈ వీసా అందుకున్న వారిలో తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి అగ్రహీరోలు కూడా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ సైతం వారి సరసన చేరనున్నారు. అయితే మెగాస్టార్ కంటే ముందే మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. చిరుకంటే ముందుగా రామ్ చరణ్ భార్య, ఆయన కోడలు ఉపాసన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా ఈ వీసాను చిరంజీవికి ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార్ ఫేమ్, వశిష్ట డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Megastar @KChiruTweets has been awarded the Golden Visa by the UAE (Dubai) government, facilitated by Emirates First!✨#Chiranjeevi #Vishwambhara #TeluguFilmNagar pic.twitter.com/ND4DOVrvDk
— Telugu FilmNagar (@telugufilmnagar) May 27, 2024
Comments
Please login to add a commentAdd a comment