Kushboo Interesting Comments On Megastar Chiranjeevi - Sakshi
Sakshi News home page

Kushboo: మెగాస్టార్‌తో ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నా: ఖుష్బూ

Published Wed, May 3 2023 8:59 PM | Last Updated on Thu, May 4 2023 10:52 AM

Kushboo Shares Opinion to Work With Chiranjeevi In Romantic Movie - Sakshi

దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన గొప్ప నటి. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు అభిమానులు ఏకంగా గుడినే నిర్మించారంటే ఖుష్బూకు ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకొవచ్చు. ఆమెతో కలిసి నటించేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపేవారట.

(ఇది చదవండి: నా బెడ్‌ రూమ్‌లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్‌ ఉంటాయి: ఖుష్బూ)

అలాగే ఖుష్బు కూడా దాదాపు అందరికి స్టార్లలతో కలిసి నటించింది. కానీ తన అభిమాన హీరోతో కలిసి రొమాన్స్ చేసే అవకాశం రాలేదని ఇప్పటికీ బాధపడుతోంది. అయితే ప్రస్తుతం ఆమె గోపీచంద్ నటించిన రామబాణంలో కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.  

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్)

ఖుష్బూ.. మాట్లాడుతూ.. 'మెగాస్టార్ ఓ లెజెండ్. ఆయనకు వర్క్‌పై ప్యాషన్. ప్రతి రోజు సెట్స్‌లో కొత్తగా కనిపిస్తారు. ప్రతి రోజు ఇంకా ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. నా  జీవితంలో బిగ్గెస్ట్ డ్రీమ్ చిరంజీవితో రొమాన్స్ చేయడం. ఇప్పటివరకు అది నెరవేరలేదు. స్టాలిన్‌లో మేము నటించాం. కానీ ఆయనతో ఏదైనా లవ్ స్టోరీ లేదా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని ఉంది. అది నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నా. రామబాణం నిర్మాత నన్ను కలిశారు. చాలా బాగా మాట్లాడుతారు. సక్సెస్‌ఫుల్ నిర్మాత కూడా.  రామబాణం మూవీ ఫ్యామిలీ ఓరియంటెడ్‌ చిత్రం. ఈ  చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి సినిమాకు రిలీజ్ అయినప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటా.' అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement