'ఈ ఊరు అమ్మాయిలు.. ఈ ఊరు అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలి' | Tollywood Movie Uruku Patela Trailer Out Now | Sakshi
Sakshi News home page

Uruku Patela Trailer: 'నీకు అమ్మాయి పడిందంటే.. నిజంగానే చదువుకుందా?'

Published Mon, Aug 26 2024 1:25 PM | Last Updated on Mon, Aug 26 2024 1:26 PM

Tollywood Movie Uruku Patela Trailer Out Now

తేజస్‌ కంచెర్ల, ఖుష్బూ చౌదరి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఉరుకు పటేలా'. ఈ సినిమాకు వివేక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌లో కంచెర్ల బాల భాను ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లవ్‌ స్టోరీతో పాటు ఫుల్ హారర్ కామెడీతో అదిరిపోయేలా ఉంది. దెయ్యంతో ప్రేమ ఎలా ఉంటుందో అనే కోణంలో కథను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement