Tejus
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
గతవారం దసరాకు థియేటర్ల దగ్గర బోలెడంత హడావుడి కనిపించింది. ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో ఫుల్ డల్ అయిపోయింది. చెప్పుకోదగ్గర ఒక్క తెలుగు సినిమా లేదు. ఇప్పుడు ఓ తెలుగు మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. వినాయక చవితికి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకెళ్లిపోతా.. నిఖిల్ vs గౌతమ్)'హుషారు' సినిమాతో కాస్తోకూస్తో గుర్తింపు తెచ్చుకున్న తేజుస్ కంచర్ల.. రీసెంట్గా 'ఉరుకు పటేల' మూవీ చేశాడు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 7న రిలీజ్ చేశారు. కానీ అదే టైంలో దళపతి విజయ్ 'ద గోట్', '35: ఇది చిన్న కథ కాదు' అనే కాస్త చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజయ్యాయి. దీంతో 'ఉరుకు పటేల' వచ్చినట్లు కూడా చాలామందికి తెలియలేదు. ఇలా థియేటర్లలోకి వచ్చి అలా వెళ్లిపోయింది.ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో ఒక పల్లెటూరిలో తీసిన థ్రిల్లర్ కామెడీ మూవీ ఇది. ప్రేమించిన అమ్మాయి, తన కుటుంబం హీరోని ఎందుకు చంపాలనుకుంటుంది అనే పాయింట్‌తో ఈ సినిమానీ తీశారు. వీకెండ్ టైమ్ పాస్ చేద్దామనుకుంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్!) -
ఇంటర్వ్యూలో యాటిట్యూడ్ చూపించిన హీరో...
-
చాలా గ్యాప్ వచ్చింది.. ఈ గ్యాప్ లో..
-
'ఈ ఊరు అమ్మాయిలు.. ఈ ఊరు అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలి'
తేజస్ కంచెర్ల, ఖుష్బూ చౌదరి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఉరుకు పటేలా'. ఈ సినిమాకు వివేక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్లో కంచెర్ల బాల భాను ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తే ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీతో పాటు ఫుల్ హారర్ కామెడీతో అదిరిపోయేలా ఉంది. దెయ్యంతో ప్రేమ ఎలా ఉంటుందో అనే కోణంలో కథను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్నారు. -
సినిమా రివ్యూ: ఉలవచారు బిర్యాని
నటీనటులు: ప్రకాశ్ రాజ్, స్నేహ, తేజూస్, సంయుక్త, ఎంఎస్ నారాయణ, బ్రహ్మజీ, ఊర్వశి నిర్మాత, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రకాశ్ రాజ్ మ్యూజిక్: ఇళయరాజా కెమెరా: ప్రీతా ప్లస్ పాయంట్స్: కొంతలో కొంత ఇళయరాజా మ్యూజిక్, ప్రీతా ఫోటోగ్రఫి మైనస్ పాయింట్స్: కథ, కథనం విభిన్న పాత్రలతో సినీ అభిమానులను ఆకట్టుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ 'ధోని' చిత్రం తర్వాత మరో రీమేక్ 'ఉలవచారు బిర్యాని' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2011లో మలయాళంలో విడుదలై విజయం సాధించిన కామెడీ చిత్రం 'సాల్డ్ అండ్ పెప్పర్' అనే చిత్రం ఆధారంగా 'ఉలవచారు బిర్యాని చిత్రాన్ని స్యయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. చిత్ర విడుదలకు ముందే టీజర్లు, పాటలతో అంచనాలను పెంచిన 'ఉలవచారు బిర్యాని' చిత్రం ప్రేక్షకుల అభిరుచికి తగినట్టే ఉందా అనే అంశాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కాళిదాసు( ప్రకాశ్ రాజ్) ఓ పెళ్లికాని ప్రసాద్. ఆయన పురావస్తుశాఖ(అర్కియాలజి) శాఖలో పనిచేసే అధికారి. గౌరీ (స్నేహ) మధ్యవయస్సు వచ్చినా..కుజదోషంగా కారణంగా పెళ్లికాని ఓ సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్. మోబైల్ రాంగ్ కాల్ తో అనుకోకుండా కలిసిన కాళిదాసు, గౌరీలు ఒకరికి మరొకరు తెలియకుండానే దగ్గరవుతారు. ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉండటంతో కాళిదాసు, గౌరీలు కలుసుకోవాలనుకుంటారు. వీరిద్దరీ కథలో కాళిదాసు మేనల్లుడు నవీన్ (తేజూస్), గౌరీ స్నేహితురాలు మేఘన (సంయుక్త హోర్నాడ్)లు ప్రవేశిస్తారు. వీరిద్దరి కథలో నవీన్, గౌరీలు ఎందుకు ప్రవేశించారు; కాళిదాసు, గౌరీలు కలుసుకున్నారా? కలుసుకోవడానికి మధ్య జరిగిన సంఘటనలు ఏంటీ? లేటు వయసులో చిగురించిన ప్రేమతో వారిద్దరూ ఒక్కటయ్యారా అనే ప్రశ్నలకు సమాధానమే 'ఉలవచారు బిర్యాని' సినిమా. నటీనటుల ఫెర్మార్మెన్స్: బ్రహ్మచారి పాత్రలో కాళిదాసుగా ప్రకాశ్ రాజ్, గౌరిగా స్నేహలు నటించారు. విభిన్నమైన పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్ కు కాళిదాసు పాత్ర కొత్తేమి కాదు. కాళిదాసు పాత్ర ప్రకాశ్ రాజ్ స్థాయికి సరిపడేంత రేంజ్ లో లేకపోవడం అభిమానుల్లో ఆసక్తిని కలిగించలేకపోయింది. కాళిదాసు, గౌరీ పాత్రలు క్యారెక్టరైజేషన్ గొప్పగా లేకపోవడంతో వారిద్దరికి కూడా వారి సత్తాను ప్రదర్శించాల్సిన స్కోప్ లేకుండా పోయింది. కథలో వేగం, ఉద్వేగం లేకపోవడంతో మొదటి భాగంలోనే ప్రేక్షకుడికి విషయం లేదని అంశం బోధపడుతుంది. దీనికి తోడు రెండవ భాగం కూడా సాగదీయడంతో ఓ దశలో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నటించిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఊర్వశి, ఎంఎస్ నారాయణ, బ్రహ్మజీ, దేవయానిల పాత్రల ప్రాధాన్యత కూడా అంతంతమాత్రమే. టెక్నిషియన్స్ పనితీరు: కథలో పస లేకున్నా ఫోటోగ్రఫీతో ప్రీతా ఆకట్టుకున్నారు. ఇళయరాజా సంగీతం కూడా ఈ చిత్రంపై ఆసక్తిని కలిగించలేకపోయింది. ఫీల్ ఉన్న పాటల్ని ఇళయరాజా అందించినప్పటికి.. చిత్రీకరణ విషయంలో తేలిపోయాయనే చెప్పవచ్చు. ప్రతిభావంతుడైన నటుడిగా ప్రేక్షకులు హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రకాశ్ రాజ్ 'ఉలవచారు బిర్యాని' నిర్మాత, దర్శకుడిగా ప్రకాశ్ రాజ్ సినీ అభిమానులను మెప్పించలేకపోయారు. కథలో క్లారిటీ లేకపోవడం, కాళిదాసు, గౌరీల, నవీన్, మేఘనల మధ్య ప్రేమ కథలకు సరియైన న్యాయం చేయలేకపోవడం, ప్రేమ కథలో ఫీల్ లోపించడం, గిరిజన సామాజిక అంశాన్ని ప్రేమ కథలో జొప్పించడానికి చేసిన ప్రయత్నాలు చిత్ర విజయానికి అనుకూలంగా మారలేకపోయాయి. ప్రకాశ్ రాజ్ నుంచి భారీగా ఆశించి... మంచి ఆకలితో థియేటర్ కెళ్లిన ప్రేక్షకుడికి రుచి లేని 'ఉలవచారు బిర్యాని'ని వడ్డించారని చెప్పవచ్చు. -
ఆ ఘనత తేజూస్‌కే దక్కింది
‘‘తేజూస్ నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. వాళ్ల నాన్న నాకు మంచి మిత్రుడు. తేజూస్ ఎనర్జీ చూసి, తప్పకుండా నటుడవుతాడనుకునేవాణ్ణి. కానీ, నా బేనర్ ద్వారానే హీరో అవుతాడని ఊహించలేదు’’ అన్నారు కేయస్ రామారావు. ప్రకాశ్‌రాజ్, స్నేహ ఓ జంటగా, తేజూస్, సంయుక్త మరో జంటగా రూపొందిన చిత్రం ‘ఉలవచారు బిర్యాని’. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. తెలుగు వెర్షన్ నిర్మించిన కేయస్ రామారావు మాట్లాడుతూ - ‘‘ప్రకాశ్‌రాజ్‌కి తేజూస్ని పరిచయం చేసినప్పుడు తేలికగా తీసుకున్నాడు. ఆ తర్వాత తనలో మంచి హీరో మెటీరియల్ ఉందనే నమ్మకం ఆయనకు కుదిరింది. నాకు తెలిసి ఏ హీరో ఒకేసారి మూడు భాషల ద్వారా పరిచయం కాలేదు. ఆ ఘనత తేజూస్‌కే దక్కింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయాలనుకుంటున్నాం. ఇళయరాజాగారు స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. రీ-రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా కుదిరింది. ఈ వేసవికి రాబోతున్న చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు. తేజూస్ మాట్లాడుతూ - ‘‘ఎప్పటికైనా కె.యస్. రామారావుగారి బేనర్లో చేయాలనుకున్నాను కానీ, నా తొలి సినిమాకే అది కుదరడం, ప్రకాశ్‌రాజ్‌గారి కాంబినేషన్లో, ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో ప్రకాశ్‌రాజ్‌గారు నా మామయ్యగా నటించారు. మొదటి రోజు ఆయన కాంబినేషన్లో సీన్ చేయడానికి కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ, సులువుగానే చేయగలిగాను. అయితే కన్నడ, తమిళ భాషలు తెలియదు కాబట్టి, అక్కడ కష్టమైంది’’ అని చెప్పారు. తేజ దగ్గర ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేశానని, ఓ ఏడెనిమిదేళ్ల తర్వాత డెరైక్షన్ చేస్తానని పేర్కొన్నారు.