గతవారం దసరాకు థియేటర్ల దగ్గర బోలెడంత హడావుడి కనిపించింది. ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో ఫుల్ డల్ అయిపోయింది. చెప్పుకోదగ్గర ఒక్క తెలుగు సినిమా లేదు. ఇప్పుడు ఓ తెలుగు మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. వినాయక చవితికి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకెళ్లిపోతా.. నిఖిల్ vs గౌతమ్)
'హుషారు' సినిమాతో కాస్తోకూస్తో గుర్తింపు తెచ్చుకున్న తేజుస్ కంచర్ల.. రీసెంట్‌గా 'ఉరుకు పటేల' మూవీ చేశాడు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 7న రిలీజ్ చేశారు. కానీ అదే టైంలో దళపతి విజయ్ 'ద గోట్', '35: ఇది చిన్న కథ కాదు' అనే కాస్త చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజయ్యాయి. దీంతో 'ఉరుకు పటేల' వచ్చినట్లు కూడా చాలామందికి తెలియలేదు. ఇలా థియేటర్లలోకి వచ్చి అలా వెళ్లిపోయింది.
ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో ఒక పల్లెటూరిలో తీసిన థ్రిల్లర్ కామెడీ మూవీ ఇది. ప్రేమించిన అమ్మాయి, తన కుటుంబం హీరోని ఎందుకు చంపాలనుకుంటుంది అనే పాయింట్‌తో ఈ సినిమానీ తీశారు. వీకెండ్ టైమ్ పాస్ చేద్దామనుకుంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు.
(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్!)
Comments
Please login to add a commentAdd a comment