బిగ్‌బాస్ హౌస్‌లో బూతులు తిట్టడం, ఫిజికల్‌గా కొట్టడం లాంటివి చేయకూడదు. కానీ ప్రస్తుతం నడుస్తున్న 'ఓవర్ స్మార్ట్' గేమ్ చూస్తుంటే కొట్టుకోవడానికి, గొడవలు పడటానికే ఇది పెట్టారా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్‌లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండు టీమ్స్ ఆపసోపాలు పడ్డాయి. ఈ క్రమంలో గౌతమ్-నిఖిల్ మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఇంతకీ గురువారం (అక్టోబర్ 17) ఎపిసోడ్‌లో ఏమేం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.
తెలివి చూపించిన యష్మి
ఎంతకీ ఛార్జింగ్ ఇవ్వకపోయేసరికి రాయల్స్ టీమ్.. కిడ్నాప్ ప్లాన్ వేశాడు. తేలిగ్గా ఉంటాడని చెప్పి మణికంఠని లాగేశారు. కానీ ఓజీ క్లాన్ టీమ్ ఇంతా దీనికి అడ్డుపడింది. అందరూ మణికంఠని డిఫెండ్ చేస్తుంటే చాకచక్యంగా యష్మిని అవినాష్ లోపలికి లాగేశాడు. వెంటనే తేజ డోర్ మూసేశాడు. ఇక యష్మిని బయటకు తీసుకొచ్చేందుకు ఓజీ క్లాన్ తెగ ప్రయత్నించింది. లోపలున్న యష్మి కేబుల్ కలిపేసి అవినాష్ ఛార్జింగ్ పెట్టేసుకున్నాడు. ఎంత గింజుకున్నా కుదరకపోయేసరికి కేబుల్ తెగ్గొట్టి, ఊడిపోయిందని తెలివి చూపించింది. దీంతో ఈమెని వదిలేయాల్సి వచ్చింది.
(ఇదీ చదవండి: ఆ విషయంలో వాళ్లిద్దరిని వేడుకున్నా: సమంత)
మణికంఠ వల్ల గొడవ
ఉదయం లేవడమే బిగ్‌బాస్ ఓ ప్రకటన చేశాడు. సైరన్-సైరన్ రావడానికి మధ్యలో ఛార్జింగ్ పాట్ని పగలగొట్టారని, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ నుంచి ఓ సభ్యుడిని టాస్క్ నుంచి తప్పించాలని ఆదేశించాడు. ఇక ఎవరినీ పక్కనబెట్టేద్దామా అని ఓజీ క్లాన్ ఆలోచిస్తుండగా మణికంఠ వల్ల మరో గొడవ జరిగింది. బాత్రూమ్‌లోకి వెళ్లిన మణికంఠ, విష్ణుప్రియని రాయల్ క్లాన్ లాక్ చేశారు. అనుమతి లేకుండా లోపలికి వచ్చాం కాబట్టి రెండు పాయింట్ల ఛార్జింగ్ ఇస్తామని నిఖిల్ అన్నాడు. ఇంతలో రాయల్ క్లాన్.. మణికంఠ నుంచి బలవంతంగా ఛార్చింగ్ చేసేందుకు ప్రయత్నించారు.
నిఖిల్ వర్సెస్ గౌతమ్
బాత్రూం బయటున్న తేజని నిఖిల్ పక్కకి లాగేశాడు. దీంతో నిఖిల్‌ని గౌతమ్ వెనక నుంచి గట్టిగా పట్టేసుకున్నాడు. అలా ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇద్దరూ కిందపడిపోయారు. అయితే గౌతమ్ చేతులతో గుద్దుతున్నాడని నబీల్ ఆరోపించాడు. దీంతో ఆవేశపడిపోయిన గౌతమ్.. తోయలేదు అంటూ మీదకొచ్చేశాడు. నిఖిల్‌ని పక్కకు లాగేశాడు. దీంతో కోపంలో గౌతమ్ మెడ పట్టుకుని సోఫాపైకి విసిరేశాడు. కొడితే నేను కొడతా అని నిఖిల్ అనేసరికి.. కావాలని కొట్టలే అని గౌతమ్ రెచ్చిపోయాడు. అక్కడి నుంచి గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. కొట్టినట్లు ఉంటే బిగ్‌బాస్ నుంచి బయటకెళ్లిపోతా అని గౌతమ్ సవాలు చేశాడు.
మణికంఠ భయంభయం
బాత్రూం దగ్గర ఇచ్చిన మాట ప్రకారం మెహబూబ్‌కి నిఖిల్ ఓ పాయింట్ ఇచ్చాడు. మరోవైపు రాయల్ క్లాన్ చెప్రిన ప్రకారం పృథ్వీని టాస్క్ నుంచి తప్పుకోవాలని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఇదంతా చూసి బెదిరిపోయిన మణికంఠ.. హరితేజ దగ్గరకెళ్లి నన్ను గేమ్ నుంచి తీసేయండి. ఆడేవాళ్లతో ఆడండి. వాళ్లకి చీఫ్ అవ్వాలని ఉంది. నాకు దెబ్బలు తగిలితే ఏంటి పరిస్థితి అని తన బాధలు చెప్పుకొన్నాడు. కాసేపటి తర్వాత కూడా నా శరీరం సహకరించట్లేదు. గేమ్ ఇంత కష్టంగా ఉంటుందని అనుకోలేదు అని చెప్పడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. శుక్రవారం ఎపిసోడ్‌లో ఈ టాస్క్‌కి ముగింపు ఉండొచ్చు.
(ఇదీ చదవండి: తొలి రోజే తనతో ప్రేమలో పడిపోయా: హీరో కిరణ్ అబ్బవరం)
Comments
Please login to add a commentAdd a comment