
కోర్ట్ మూవీ సూపర్ హిట్ తర్వాత ప్రియదర్శి మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జెంటిల్‌మన్, సమ్మోహనం లాంటి హిట్ చిత్రాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. సారంగపాణి జాతకం మూవీలో రూప కొదువాయూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.
మూవీ ప్రమోషన్లలో భాగంగా సారంగపాణి జాతకం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వెన్నెల కిశోర్, ప్రియదర్శి మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. అన్ని నువ్వే చేసుకోవడానికి ఇదేం హస్తప్రయోగం కాదు.. హత్యా ప్రయత్నం అంటూ వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. ఈ చిత్రంలో వీకే నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందించారు.