Sarangapani
-
మూవీ ప్రమోషన్లలో అలేఖ్య చిట్టి పికిల్స్.. ప్రియదర్శి ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో ప్రియదర్శి సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కోర్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హింట్ అందుకున్న ప్రియదర్శి.. సారంగపాణి జాతకం అంటూ మరోసారి అభిమానలను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా.. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ రూప కొదువాయూర్ కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్‌తో కలిసి ప్రియదర్శి ఓ వీడియోను చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం ఆధారంగా సారంగపాణి జాతకం ప్రమోషన్ వీడియో చేశారు. దీనిపై హీరో ప్రియదర్శి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మాట్లాడారు.ప్రియదర్శి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో మేజర్ ట్రెండ్‌ను చూసే మేము అలా చేద్దామని అనుకున్నాం. దాని ద్వారా ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం. రీల్ చూసి మేము అలా చేద్దామని అనుకున్నాం. అంతే కానీ ఎక్కడా కానీ మేము అలేఖ్య పచ్చళ్ల గురించి మాట్లాడలేదు. నా వ్యక్తిగత సినిమా కోసం వారి కామెంట్స్‌ను వాడుకోను. ఎక్కడా కూడా వాళ్లను కించపరిచేలా చేయలేదు.' అని క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. -
'ప్రియదర్శి సారంగపాణి జాతకం'.. బోల్డ్ డైలాగ్‌తో రిలీజైన ట్రైలర్
కోర్ట్ మూవీ సూపర్ హిట్ తర్వాత ప్రియదర్శి మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జెంటిల్మన్, సమ్మోహనం లాంటి హిట్ చిత్రాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. సారంగపాణి జాతకం మూవీలో రూప కొదువాయూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.మూవీ ప్రమోషన్లలో భాగంగా సారంగపాణి జాతకం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వెన్నెల కిశోర్, ప్రియదర్శి మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. అన్ని నువ్వే చేసుకోవడానికి ఇదేం హస్తప్రయోగం కాదు.. హత్యా ప్రయత్నం అంటూ వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. ఈ చిత్రంలో వీకే నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందించారు. -
సారంగపాణి వినోదం
‘జెంటిల్మన్, సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందిన మూడో చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా తీయాలనే నా కల ‘సారంగపాణి జాతకం’తో నెరవేరింది. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీ అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మా చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేద్దామనుకున్నాం. అయితే బయ్యర్ల సూచన మేరకు, మరిన్ని మంచి థియేటర్ల సౌలభ్యత కోసం 25న రిలీజ్ చేస్తున్నాం. ‘బలగం, 35 చిన్న కథ కాదు, కోర్టు’ సినిమాలతో ప్రియదర్శి స్థాయి పెరిగింది. ‘సారంగపాణి జాతకం’తో వంద శాతం వినోదం పంచుతారాయన. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను’’ అని తెలిపారు. -
'ముందు కెరీర్‌పై ఫోకస్ పెట్టు..' ఏంటి బ్రో ఇలా వాడేస్తున్నారు!
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. గతంలో మన చాలామందిని చూశాం. కేవలం సోషల్ మీడియా వల్ల ఓవర్ నైట్‌లో స్టార్స్ అయిపోయిన వాళ్లున్నారు. ఇటీవల ఎక్కడ చూసిన కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వివాదం మరింత వైరల్ కావడంతో కొందరైతే ఏకంగా రీల్స్ కూడా చేసేస్తున్నారు.అయితే తాజాగా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదాన్ని ఏకంగా సినిమా ప్రమోషన్స్‌లోనూ వాడేస్తున్నారు. టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. హీరోయిన్ రూప కొడువాయూర్తో కలిసి ప్రియదర్శి ప్రమోషన్స్ చేశారు.అయితే ఇద్దరు కలిసి అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం తరహాలో సారంగపాణి జాతకం ప్రమోషన్ చేశారు. ఇందులో హీరోయిన్ ఓ డ్రెస్ చూపిస్తూ చాలా బాగుంది కదా.. అంటూ ప్రియదర్శిని అడుగుతుంది. అది చూసిన హీరో వావ్ సూపర్.. రేటు చూసి రూ.14999 నా అంటూ నోరెళ్లబెడతాడు. ఆ తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ స్టైల్లో హీరోకు ఇచ్చి పడేస్తుంది. ముందు కెరీర్‌పై ఫోకస్ చేయ్.. డ్రెస్సె కొనలేనివాడిని.. ప్రేమ, పెళ్లి జోలికి పోవద్దు.. అంటూ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ప్రియదర్శితో మాట్లాడుతుంది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్‌ను ఇలా కూడా వాడేస్తున్నారా? అంటూ పోస్టులు పెడుతున్నారు.#alekhyachittipickles ni ila KudaVaaduthunnara😭😂#SarangapaniJathakam pic.twitter.com/KfgAzzS6PH— Urstruly Vinodh (@UrsVinodhDHFM) April 5, 2025 -
సమ్మర్లో సారంగపాణి
ప్రియదర్శి, రూపా కొడవయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను గత ఏడాది డిసెంబరులోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో తాజాగా ‘సారంగపాణి జాతకం’ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.‘‘మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేక అతను చేతలతో చేసే పనులతో ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ మూవీని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాం’’ అని ఈ సినిమాను ఉద్దేశించి మేకర్స్ తెలిపారు. ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, నరేశ్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్. -
క్రిస్మస్ కాదు టాలీవుడ్‌కి మినీ సంక్రాంతి
మరో నాలుగు రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ కానుంది. దీంతో ఈ వారం.. రిలీజైన తర్వాత వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కానీ క్రిస్మస్కి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కుప్పలతెప్పలుగా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఏకంగా డజను సినిమాలు క్రిస్మస్ వీకెండ్లో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి వాటి సంగతేంటి?తెలుగు సినిమాల విషయానికొస్తే డిసెంబరు 20న అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' వస్తుంది. రీసెంట్గా రిలీజైన రా అండ్ రస్టిక్ టీజర్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నిజ జీవిత కథ ఆధారంగా తీశారు. దీనిపై అల్లరి నరేశ్ అంచనాలు పెట్టుకున్నారు. ప్రియదర్శి 'సారంగపాణి' కూడా ఇదే రోజున రిలీజ్ కానుంది. సున్నితమైన కామెడీ సినిమాలు తీస్తాడనే పేరున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఇది హిట్ అవ్వడం వీళ్ల కెరీర్‌కి కీలకం.(ఇదీ చదవండి: నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్ర ప్రసాద్)20నే 'మ్యాజిక్' అనే తెలుగు సినిమా కూడా రాబోతుంది. 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీన్ని తీశారు. అనిరుధ్ మ్యూజిక్. ఇప్పటికైతే ఎలాంటి అంచనాల్లేవు. అదే రోజున విజయ్ సేతుపతి-వెట్రిమారన్ తమిళ డబ్బింగ్ మూవీ 'విడుదల 2' కూడా రానుంది. దీనికి సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. అలానే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర 'యూఐ' కూడా ఇదే రోజున థియేటర్లలోకి రానుంది.హాలీవుడ్ నుంచి 'ముఫాసా' అనే కార్టూన్ మూవీ కూడా 20వ తేదీనే థియేటర్లలోకి రానుంది. సిటీల్లో మాత్రం పెద్ద చిత్రాలకు ఇది కాంపిటీషన్ అని చెప్పొచ్చు. మహేశ్ బాబు, షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు.. దీనికి ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చెప్పారు. ఇది ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.(ఇదీ చదవండి: అఫీషియల్: చరణ్ సినిమాలో 'మీర్జాపుర్' మున్నా భయ్యా)డిసెంబరు 25న అంటే క్రిస్మస్ రోజున రాబోతున్న తెలుగులో సినిమాల్లో కాస్త చెప్పుకోదగింది నితిన్ 'రాబిన్ హుడ్'. శ్రీలీల హీరోయిన్, 'భీష్మ' లాంటి హిట్ తర్వాత నితిన్-వెంకీ చేసిన మూవీ కావడంతో ఓ మాదిరి అంచనాలున్నాయి. ఈ రోజున రిలీజయ్యే వాటిలో ఇదొక్కటే తెలుగు మూవీ. ఇది కాకుండా మ్యాక్స్ (కన్నడ డబ్బింగ్), మార్కో (మలయాళ డబ్బింగ్), బరోజ్ (మలయాళ డబ్బింగ్), బేబీ జాన్ (హిందీ) చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. డిసెంబరు 27న 'పతంగ్' అనే తెలుగు సినిమా కూడా ఉందండోయ్.ఇలా క్రిస్మస్ వీకెండ్లో ఏకంగా 12 వరకు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓ రకంగా చూసుకుంటే 'పుష్ప 2' తర్వాత, సంక్రాంతికి ముందు ఇన్ని మూవీస్ రావడం సాహసమనే చెప్పాలి. మినీ సంక్రాంతికి అని చెప్పొచ్చేమో!(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
'సారంగపాణి జాతకం'లో ఫుల్ కామెడీ (టీజర్)
ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూర్తిగా నవ్వులు పూయించేలా టీజర్ ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఓ పరిపూర్ణ హాస్యభరిత చిత్రంగా ‘సారంగపాణి జాతకం’ తెరకెక్కింది. తాజాగా విడుదలైన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. -
భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా?
ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది.ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఓ పరిపూర్ణ హాస్యభరిత చిత్రంగా ‘సారంగపాణి జాతకం’ ఉంటుంది. ఈ నెల 21న టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
జాతకాలు చెబుతానంటోన్న టాలీవుడ్ హీరో..!
ఇటీవలే డార్లింగ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో ప్రియదర్శి పులికొండ. నభా నటేశ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సారంగపాణి జాతకం'. ఈ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.ఇవాళ ప్రియదర్శి బర్త్‌డే కావడంతో సారంగపాణి జాతకం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయిచండం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ… 'నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే సారంగపాణి జాతకం. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే హాస్య చిత్రమని' అన్నారు.ఇప్పుడే మొదలైంది, త్వరలో మీకే తెలుస్తుంది 🤩😉Taking you on a jam-packed comedy ride with our #SarangapaniJathakam 🖐🏻🔍@krishnasivalenk #MohanKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @ItsActorNaresh @TanikellaBharni #Vennelakishore #AvasaralaSrinivas @harshachemudu… https://t.co/80Zwnf84Fv— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) August 25, 2024 -
డాక్టర్ సారంగపాణికి మలేసియా ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: మలేసియాలో జరిగే వర్మ, ఆయుర్వేద, సిద్ధ, యోగా అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం నగరానికి చెందిన డాక్టర్ ఎస్. సారంగపాణికి దక్కింది. ఈ మేరకు మలేసియా సొసైటీ ఆఫ్ ఆయుష్ మెడిసిన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. సెలంగొర్‌లోని మహసా యూనివర్సిటీలో ఈనెల 6 నుంచి 8 వరకు జరిగే సమ్మేళనానికి ఆయన హాజరవుతారు. ఆయుర్వేదం ద్వారా అందిస్తున్న వివిధ చికిత్సా పద్ధతులు, వాటి ప్రయోజనాలు, శాస్త్రీయ పరిశోధనల పురోభివృద్ధి గురించి ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగాలు ఉంటాయి. ఆయుర్వేదంలో సుశృతునిచే చెప్పబడిన క్షారసూత్ర, క్షార కర్మ, రక్తమోక్షణ, జలగ చికిత్సలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు శాస్త్రీయంగా ఎలా నిరూపించబడ్డాయో ప్రపంచ దేశాలకు వైద్యులకు తెలియజేసే అవకాశం ఈ సదస్సు ద్వారా కలుగుతుందని డాక్టర్ సారంగపాణి అన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలో విశేష అనుభం ఉన్న ఆయన డాక్టర్ బీర్ఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం సీసీఐఎం ఎడ్యుకేషన్ కమిటీకి గతంలో మార్గదర్శకుడిగా, వైస్ చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. -
వడదెబ్బతో ఇద్దరి మృతి
భానుడి ప్రతాపం నానాటికీ పెరుగుతోంది. వరంగల్ జిల్లాలో వడదెబ్బతో ఆదివారం ఇద్దరు మృతిచెందారు. ఖానాపురం వుండలం రాగంపేటకు చెందిన మొగిళి సత్యం(86) సుమారు 20 కిలోమీటర్ల దూరంలో గల వుండలంలోని చిలుకవ్మునగర్‌లోని తవు బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రవుంలో వడదెబ్బకు గురై చిలుకవ్మునగర్ సమీపంలో రోడ్డు పక్కనే మృతి చెందాడు. మరో ఘటనలో వరంగల్ నగరంలోని కరీమాబాద్ తొట్లవాడకు చెందిన పాకాల సారంగపాణి(58) మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చే శాడు. ఆ తర్వాత కాసేపటికే కళ్లుతిరిగి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. -
జీవితమే ఒక ‘ఆట’
ఈ చిత్రాలు చూశారా.. ఓ ఫొటో ఇండియూ ఖోఖో కప్పు సాధించిన జట్టు సభ్యులతో సారంగపాణి.. మరో చిత్రంలో కటింగ్ చేస్తున్నది కూడా సారంగపాణియే.. జాతీయ స్థారుులో ఆడిన వ్యక్తి సెలూన్ షాప్‌లో పనిచేయడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా.. ఇదీ నిజం..! ఎన్ని పతకాలు సాధించినా.. అవార్డులు వరించినా.. ఏవీ కడుపునింపలే.. ప్రస్తుతం కులవృత్తే ఆకలి తీరుస్తోంది! ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఉద్యోగం ఇవ్వాలని సారంగపాణి కోరుతున్నాడు.. ఖిల్లా నుంచి మొదలు.. వరంగల్ కోటకు చెందిన నాగవెల్లి సారంగపాణికి చిన్నతనం నుంచే ఆటలపై ఎంతో ఆసక్తి ఉండేది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న సారంగపాణికి ఖోఖో అంటే చచ్చేంత ప్రాణం. అయితే ఖోఖోపై అతడికి ఉన్న అభిరుచిని గమనించిన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అందులో నైపుణ్యాలు నేర్పించారు. ఇందులో భాగంగా పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏటా నిర్వహించే పోటీల్లో సారంగపాణి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించేవాడు. కాగా, 1999లో మణిపూర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు సారథ్యం వహించి బ్రౌంజ్ మెడల్‌ను సంపాదించాడు. 1996లో మొదటిసారిగా అం తర్జాతీయస్థాయిలో కోల్‌కతాలో నిర్వహించిన ఏషియన్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టోర్నమెంట్లో భారతజట్టు బం గారు పతకం సాధిం చేందుకు సారంగపాణి ఎంతో కృషిచేశాడు. ప్రోత్సాహం కరువు.. నిరుపేద కుటుంబానికి చెందిన సారంగపాణికి ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాడు. ఖోఖోలో మేరునగధీరుడిగా పేరుగాంచిన సారంగపాణికి కొన్ని నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులు నీడలా వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో 2001 వరకు పోటీ ల్లో పాల్గొన్న అతడు ది క్కుతోచని పరిస్థితిలో ఖోఖోకు స్వస్తిపలికి కు టుంబపోషణ కోసం కులవృత్తి సెలూన్‌షాపు ను పెట్టుకుని పనిచేస్తున్నాడు. దీంతో రోజు వచ్చే అరకొర సంపాదన తో అనారోగ్యంతో బా ధపడుతున్న తల్లికి వైద్యం చేయిస్తూ జీవిస్తున్నాడు. మంత్రి హామీ బుట్టదాఖలు.. అంతర్జాతీయస్థాయి క్రీడాకారుడిగా పేరు సంపాదించిన సారంగపాణికి అప్పటి హోంశా ఖ మంత్రి దేవేందర్‌గౌడ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే మంత్రి హామీ అమలు కోసం ప్రభుత్వం వద్దకు తిరిగినా సారంగపాణికి ఉద్యో గం రాలేదు. అటు ఉద్యోగం రాక... షాపు సరిగ్గా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో కొన్నేళ్ల నుంచి సారంగపాణి మరో షాపులో కూలీగా పనిచేస్తున్నాడు. సారంగపాణి ట్రాక్ రికార్డ్ పశ్చిమబెంగాల్లో 1988లో నిర్వహించి న సబ్‌జూనియర్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. మహారాష్ట్రలోని సతారాలో 1992లో జరిగిన నేషనల్ స్కూల్‌గేమ్స్‌లో రజత పతకం సాధించాడు. 1996లో కోల్క తాలో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్‌లో ఏపీ జట్టుకు బంగారు పతకాన్ని సాధించిపెట్టాడు. మణిపూర్‌లో 1999లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఏపీ తరపున ఆడి బ్రౌంజ్మెడల్ సాధించాడు. అలాగే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 1998లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో చాంపియన్ సాధించాడు. 1994లో హర్యానాలో జరిగిన సీనియర్ ఖోఖో పోటీల్లో చాంపియన్‌షిప్ సాధిం చాడు. అలాగే పలు పోటీల్లో ప్రతిభ కనబరిచాడు.