మరో నాలుగు రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ కానుంది. దీంతో ఈ వారం.. రిలీజైన తర్వాత వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కానీ క్రిస్మస్‌కి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కుప్పలతెప్పలుగా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఏకంగా డజను సినిమాలు క్రిస్మస్ వీకెండ్‌లో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి వాటి సంగతేంటి?
తెలుగు సినిమాల విషయానికొస్తే డిసెంబరు 20న అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' వస్తుంది. రీసెంట్‌గా రిలీజైన రా అండ్ రస్టిక్ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నిజ జీవిత కథ ఆధారంగా తీశారు. దీనిపై అల్లరి నరేశ్ అంచనాలు పెట్టుకున్నారు. ప్రియదర్శి 'సారంగపాణి' కూడా ఇదే రోజున రిలీజ్ కానుంది. సున్నితమైన కామెడీ సినిమాలు తీస్తాడనే పేరున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఇది హిట్ అవ్వడం వీళ్ల కెరీర్‌కి కీలకం.
(ఇదీ చదవండి: నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్ర ప్రసాద్)
20నే 'మ్యాజిక్' అనే తెలుగు సినిమా కూడా రాబోతుంది. 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీన్ని తీశారు. అనిరుధ్ మ్యూజిక్. ఇప్పటికైతే ఎలాంటి అంచనాల్లేవు. అదే రోజున విజయ్ సేతుపతి-వెట్రిమారన్ తమిళ డబ్బింగ్ మూవీ 'విడుదల 2' కూడా రానుంది. దీనికి సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. అలానే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర 'యూఐ' కూడా ఇదే రోజున థియేటర్లలోకి రానుంది.
హాలీవుడ్ నుంచి 'ముఫాసా' అనే కార్టూన్ మూవీ కూడా 20వ తేదీనే థియేటర్లలోకి రానుంది. సిటీల్లో మాత్రం పెద్ద చిత్రాలకు ఇది కాంపిటీషన్ అని చెప్పొచ్చు. మహేశ్ బాబు, షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు.. దీనికి ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చెప్పారు. ఇది ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.
(ఇదీ చదవండి: అఫీషియల్: చరణ్ సినిమాలో 'మీర్జాపుర్' మున్నా భయ్యా)
డిసెంబరు 25న అంటే క్రిస్మస్ రోజున రాబోతున్న తెలుగులో సినిమాల్లో కాస్త చెప్పుకోదగింది నితిన్ 'రాబిన్ హుడ్'. శ్రీలీల హీరోయిన్, 'భీష్మ' లాంటి హిట్ తర్వాత నితిన్-వెంకీ చేసిన మూవీ కావడంతో ఓ మాదిరి అంచనాలున్నాయి. ఈ రోజున రిలీజయ్యే వాటిలో ఇదొక్కటే తెలుగు మూవీ. ఇది కాకుండా మ్యాక్స్ (కన్నడ డబ్బింగ్), మార్కో (మలయాళ డబ్బింగ్), బరోజ్ (మలయాళ డబ్బింగ్), బేబీ జాన్ (హిందీ) చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నాయి. డిసెంబరు 27న 'పతంగ్' అనే తెలుగు సినిమా కూడా ఉందండోయ్.
ఇలా క్రిస్మస్ వీకెండ్‌లో ఏకంగా 12 వరకు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓ రకంగా చూసుకుంటే 'పుష్ప 2' తర్వాత, సంక్రాంతికి ముందు ఇన్ని మూవీస్ రావడం సాహసమనే చెప్పాలి. మినీ సంక్రాంతికి అని చెప్పొచ్చేమో!
(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment