Megastar
-
గిన్నిస్‌బుక్‌లో చిరంజీవి.. ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్! మెగాస్టార్ రేంజ్ ఇది..
-
మెగాస్టార్ బర్డే.. ఘనంగా సెలెబ్రేట్ చేసిన ఫ్యాన్స్..
-
క్లాస్ అయినా మాస్ అయినా.. వన్ అండ్ ఓన్లీ బాస్.. హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ (ఫొటోలు)
-
తనను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది: మెగాస్టార్ ట్వీట్ వైరల్
నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ పరువు. జూన్ 14న ఓటీటీకి వచ్చేసిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు.పరువు సీజన్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఓ చక్కటి ప్లాన్‌తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు. చివరకి ఈ జంట తప్పించుకుందా లేదా అనే విషయంపై చాలా ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. తెలుగు ఓటీటీలో అద్భుతమైన కంటెంట్ అందించిన సుష్మిత కొణిదెలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. నా సోదరుడు నాగబాబు అద్బుతంగా నటించారని చిరంజీవి కొనియాడారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, మిత్ తివారి కీలక పాత్రలు పోషించారు.Congratulations #Paruvu team on the huge success👏. Proud of you @sushkonidela for creating this groundbreaking Telugu OTT content and my dear brother @NagaBabuOffl for a brilliant performance. ఒక చక్కటి plan తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై MLA గారి…— Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2024 -
చిరంజీవికి అరుదైన గౌరవం.. మెగా కోడలు తర్వాత!
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. చిరుకు దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది. ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది. ఈ వీసాతో దుబాయ్‌లో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసం ఉండేందుకు అనమతి లభిస్తుంది. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలు అందిస్తోంది.అయితే ఇప్పటికే ఈ వీసా అందుకున్న వారిలో తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి అగ్రహీరోలు కూడా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ సైతం వారి సరసన చేరనున్నారు. అయితే మెగాస్టార్ కంటే ముందే మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. చిరుకంటే ముందుగా రామ్ చరణ్ భార్య, ఆయన కోడలు ఉపాసన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా ఈ వీసాను చిరంజీవికి ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార్ ఫేమ్, వశిష్ట డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Megastar @KChiruTweets has been awarded the Golden Visa by the UAE (Dubai) government, facilitated by Emirates First!✨#Chiranjeevi #Vishwambhara #TeluguFilmNagar pic.twitter.com/ND4DOVrvDk— Telugu FilmNagar (@telugufilmnagar) May 27, 2024 -
చిరంజీవి గారు లేకపోతె నేను లేను
-
తెలంగాణ సీఎంకు అభినందనలు.. చిరంజీవి ట్వీట్!
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనుముల రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ సీఎంకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతే కాకుండా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు, మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కాగా.. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చాయి. అధికారంలో బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో సభలో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. Hearty Congratulations to Sri @revanth_anumula garu on being sworn in as the new Chief Minister of Telangana. 💐 May our state achieve greater growth and prosper further under your leadership! Hearty Congratulations to Dy. CM Sri @BhattiCLP garu & all the members of the new… — Chiranjeevi Konidela (@KChiruTweets) December 7, 2023 -
వెకేషన్‌కు మెగాస్టార్ దంపతులు.. సోషల్ మీడియాలో పోస్ట్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అంతే కాకుండా చిరంజీవి తన పాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో మెగాస్టార్ విదేశాలకు పయనమయ్యారు. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) వెకేషన్‌కు అమెరికా వెళ్తున్నట్లు మెగాస్టార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్బంగా సతీమణితో విమానంలో దిగిన ఫోటోలను షేర్ చేశారు. షూటింగ్‌లతో ఎప్పుడు బిజీగా ఉండే చిరంజీవి.. కాస్తా తీరిక సమయం లభిస్తే విదేశాల్లో వాలిపోతుంటారు. కాగా.. రామబ్రహ్మం సుంకర నిర్మించిన భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించగా.. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతమందించారు. వెకేషన్ నుంచి తిరిగొచ్చాక గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు మెగాస్టార్ ట్వీట్లో పేర్కొన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని చిరంజీవి వెల్లడించారు. (ఇది చదవండి: మీ క్యాలెండర్లో ఇది మార్క్ చేసుకోండి: చిరంజీవి) Off to US on a short holiday with Surekha to refresh and rejuvenate before I join the shoot of my next, a hilarious family entertainer being produced by @GoldBoxEnt ! pic.twitter.com/rWTihORaWZ — Chiranjeevi Konidela (@KChiruTweets) July 7, 2023 -
రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?
మెగా ఇంట్లో ఈ ఏడాది పండగ వాతావరణం నెలకొంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మెగా వారసురాలు అడుగుపెట్టింది. జూన్ 20న రామ్ చరణ్ భార్య ఉపాసన పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. తాజాగా మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) ఈ వేడుకలో తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉప్సీల బిడ్డ పేరును క్లీంకార అంటూ రివీల్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వేడుకలో ఉపాసన తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే మెగా వారసురాలి పేరుపై ఉపాసన మదర్ శోభన కామినేని ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఉపాసన బిడ్డ పేరును ప్రస్తావిస్తూ ఫోటోలను షేర్ చేసింది. మొదట ఉపాసన పుట్టినప్పుడు ఈ పేరునే పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఉపాసన బిడ్డకు ఈ పేరు పెట్టడంతో చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది. ఉపాసన రిప్లై ఈ పోస్ట్ చూసిన ఉపాసన కూడా స్పందించింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో తన తల్లి శోభన పోస్ట్‌ను షేర్ చేసింది. లవ్ యూ మామ్ అంటూ మదర్‌కు ధన్యవాదాలు తెలిపింది. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే) View this post on Instagram A post shared by Shobana Kamineni (@shobanakamineni) -
అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం: మెగాస్టార్
ఎంతగొప్ప పేరు గలవాడైనా ఆమె ముందు ఎప్పటికీ చిన్నవాడే. ఎందుకంటే ఈ సృష్టికి నిన్ను పరిచయం చేసిన ఆమె కంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇవాళ మదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: కోల్‌కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?) మెగాస్టార్ ట్వీట్ రాస్తూ.. 'అనురాగం, మమకారం... ఈ రెండిటికి అర్థమే అమ్మ .. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి హ్యాపీ మదర్స్ డే' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భోళాశంకర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. సుశాంత్ లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నారు. అనురాగం, మమకారం... ఈ రెండిటికి అర్ధమే అమ్మ ... అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మ ని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి #HappyMothersDay🙏💐 pic.twitter.com/6Xm4l1R14d — Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2023 -
చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్
దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన గొప్ప నటి. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు అభిమానులు ఏకంగా గుడినే నిర్మించారంటే ఖుష్బూకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకొవచ్చు. ఆమెతో కలిసి నటించేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపేవారట. (ఇది చదవండి: నా బెడ్ రూమ్‌లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్ ఉంటాయి: ఖుష్బూ) అలాగే ఖుష్బు కూడా దాదాపు అందరికి స్టార్లలతో కలిసి నటించింది. కానీ తన అభిమాన హీరోతో కలిసి రొమాన్స్ చేసే అవకాశం రాలేదని ఇప్పటికీ బాధపడుతోంది. అయితే ప్రస్తుతం ఆమె గోపీచంద్ నటించిన రామబాణంలో కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్) ఖుష్బూ.. మాట్లాడుతూ.. 'మెగాస్టార్ ఓ లెజెండ్. ఆయనకు వర్క్‌పై ప్యాషన్. ప్రతి రోజు సెట్స్‌లో కొత్తగా కనిపిస్తారు. ప్రతి రోజు ఇంకా ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. నా జీవితంలో బిగ్గెస్ట్ డ్రీమ్ చిరంజీవితో రొమాన్స్ చేయడం. ఇప్పటివరకు అది నెరవేరలేదు. స్టాలిన్‌లో మేము నటించాం. కానీ ఆయనతో ఏదైనా లవ్ స్టోరీ లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఉంది. అది నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నా. రామబాణం నిర్మాత నన్ను కలిశారు. చాలా బాగా మాట్లాడుతారు. సక్సెస్ఫుల్ నిర్మాత కూడా. రామబాణం మూవీ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రం. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి సినిమాకు రిలీజ్ అయినప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటా.' అని అన్నారు. -
నితిన్, రష్మిక మందన చిత్రం మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో ప్రారంభం (ఫొటోలు)
-
నా జీవితంలో అత్యంత ప్రభావవంతులు వీరిద్దరే: మెగాస్టార్
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని మహిళలందరికీ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భార్య సురేఖ, అమ్మ అంజనా దేవితో దిగిన ఫోటోను షేర్ చేశారు. ట్విటర్లో మెగాస్టార్ రాస్తూ..' ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో తమ సరైన స్థానాన్ని పొందేందుకు పోరాడిన, పోరాడుతున్న స్ఫూర్తిదాయకమైన మహిళలందరికీ వందనం. భవిష్యత్ తరాలకు మీరే ఆదర్శం. నా జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు వీరిద్దరే.' అంటూ పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. #HappyWomensDay to ALL the Women of the world! Saluting all the inspirational women who have fought & are fighting to claim their rightful space & place in the world. You are the Wind beneath the Wings of future generations! Here are the Two most influential women of My life 💐🙏 pic.twitter.com/JZhKHHAY1b — Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2023 -
ఆ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది.. చిరు ఎమోషనల్ ట్వీట్
హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ దారుణం రాజధాని నగరంలో కలకలం రేపింది. దీనిపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ పిల్లల భద్రతపై రాజీ పడవద్దని సూచించారు. తాజాగా ఈ ఘటనపై మెగాస్టార్ చిరు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పసిబిడ్డపై జరిగిన అఘాయిత్యం తనను తీవ్రంగా కలచివేసిందని ఎమోషనల్ అయ్యారు. దీనికి కారణమైన కఠినాతి కఠినంగా శిక్షించాలని చిరంజీవి ట్వీట్ చేశారు. విద్యాసంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్ వేదికగా కోరారు. (చదవండి: డీఏవీ స్కూల్ చిన్నారిపై వేధింపుల ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన శేఖర్ కమ్ముల) మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'బంజారాహిల్స్‌లోని పాఠశాలలో చిన్నారిపై జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను తీవ్రంగా కలిచివేసింది. నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన ఘటన చాలా బాధాకరం. ఇలాంటి ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. అంతే కాకుండా అన్ని విద్యాసంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యతగా భావిస్తున్నా.' అంటూ మెగాస్టార్ ఎమోషనలల్ పోస్ట్ చేశారు. Let such Horrors not recur ever again! pic.twitter.com/s1tzujCevh — Chiranjeevi Konidela (@KChiruTweets) October 25, 2022 -
మెగా ఫ్యాన్స్‌కు దీపావళి సర్ప్రైజ్.. ఆ మూవీ క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. అదే జోష్‌తో తన నెక్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు మెగాస్టార్. భోళా శంకర్, డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో చిరు 154వ చిత్రంగా మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. దీపావళి కానుకగా మెగా154 అఫీషియల్ టైటిల్ టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈనెల 24 ఉదయం 11.07 నిమిషాలకు బాస్ వస్తున్నాడు అంటూ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉండగా.. అక్టోబర్ 24న క్లారిటీ రానుంది. This Diwali it's Gonna be a "MEGA BLAST" 💥💥💣 💣 Our #Mega154 Title Teaser Launch on 24th October at 11.07 AM❤️🔥 Trust me,... Poonakalu Loading 🔥🤙 Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/ZRZmvUoKAl — Bobby (@dirbobby) October 20, 2022 -
గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పవర్‌పుల్ డైలాగ్స్
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'గాడ్ ఫాదర్' ట్రైలర్ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ సందడి చేస్తోంది. 'మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక.. అన్ని రంగులు మారతాయి' అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్లో చిరంజీవి యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. కీలక పాత్రలో నటించిన సల్మాన్ యాక్షన్ కూడా అదిరింది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఇంకెందుకు ఆలస్యం ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ మీరూ చూసేయండి. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్ ఈ చిత్రం. అనంతపురంలో భారీస్థాయిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాడ్ ఫాదర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. (చదవండి: గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్బంప్స్ ఖాయం) -
రామ్ చరణ్‌పై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్.. చిరుత టూ ఆర్ఆర్ఆర్..!
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌పై తన ప్రేమను చాటుకున్నారు. నటుడిగా కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరు ఎమోషనల్ అయ్యారు. చిరుతతో మొదలై మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వరకు చరణ్ ప్రస్థానాన్ని మెగాస్టార్ కొనియాడారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌తో సినిమా చేసే స్థాయికి ఎదిగాడని చిరు ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్బంప్స్ ఖాయం) 'తన వర్క్, డెడికేషన్ అన్నీ చూసి ఎంతో గర్విస్తున్నా. భవిష్యత్తులో రామ్ చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలి. నిన్ను చూసి గర్విస్తున్నా. నువ్వు సాధించాల్సివి ఇంకా ఉన్నాయి. వాటి కోసం ముందుకెళ్లు.' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ పదిహేనేళ్ల సినీ ప్రస్థానంపై మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇవాళ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. Supremely pleased at his passion, body of work, dedication and his innate urge to excel at what he does. Proud of you my boy! Here’s to greater heights and greater glories that await you! Go for it! May the Force be with you!@AlwaysRamCharan pic.twitter.com/kby2zqzRbm — Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022 -
హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?
చాలా గ్యాప్ తర్వాత, కొత్త ప్రయోగమైన 'బింబిసార' హిట్‌తో సక్సెస్ వైపు దూసుకుపోతున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. కథనే నమ్ముకుని విభిన్నమైన చిత్రాలను నటుడిగా ఎంకరేజ్ చేయడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్న కల్యాణ్ రామ్‌కు, ఓటీటీ వేళ థియేటర్లకు 'బింబిసార' విజయం ఒక ఆశా కిరణం. ఈ సక్సెస్‌పై కల్యాణ్ రామ్ ఆనంద వ్యక్తం చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే 'బింబిసార' విజయంతో కొందరు మాత్రం రచ్చ చేస్తున్నారు. 'మెగాస్టార్' ట్యాగ్ జోడించి #MegastarKalyanRam అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిపై ట్రోలింగ్‌కు సైతం దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్‌కు 'మెగాస్టార్' ట్యాగ్ తగిలించడం అంతా అవసరమా? అనే విషయంపై ఓ చిన్న లుక్ వేద్దామా. 'బాల గోపాలుడు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నందమూరి కల్యాణ్ రామ్ 2003లో వచ్చిన 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. ఈ సినిమాతో పాటు అదే సంవత్సరంలో విడుదలైన 'అభిమన్యు' అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం అతనొక్కడే. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కల్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా 2005లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అప్పటి నుంచి హీరోగా విభిన్నమైన కథలను ఎంచుకోవడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్నాడు. ఇలా హీరోగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరిట నిర్మాతగా ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలను నిర్మించాడు. కానీ ఏ ఒక్క చిత్రానికి స్టార్ డైరెక్టర్‌తో సినిమాను రూపొందించలేదు. అయితే 2016లో ఇజం సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసినా, అప్పుడు పూరి వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోని తొలి చిత్రం అతనొక్కడేతో సురేందర్ రెడ్డిని పరిచయం చేస్తే, 2009లో జయీభవతో నరేన్ కొండెపాటిని, 2013లో ఓం త్రీడీ చిత్రంతో సునీల్ రెడ్డిని, 2015లో పటాస్ సినిమాతో అనిల్ రావిపూడిని డైరెక్టర్‌గా తెలుగు చిత్రసీమకు ఇంట్రడ్యూస్ చేశాడు కల్యాణ్ రామ్. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రెండో సినిమాగా 2008లో విడుదలైన హరే రామ్‌ను హర్షవర్ధన్‌తో నిర్మించాడు. అప్పటికే ఈ డైరెక్టర్ బాలకృష్ణతో విజయేంద్ర వర్మ తెరకెక్కించి ప్లాప్ మూటగట్టుకున్నాడు. డైరెక్టర్ స్వర్ణ సుబ్బరావు తన పేరును హర్షవర్ధన్‌గా మార్చుకుని ఈ చిత్రం చేయడం విశేషం. తర్వాత తనతో అభిమన్యు తెరకెక్కించిన డైరెక్టర్ మల్లికార్జున్‌కు అవకాశం ఇస్తూ కత్తి సినిమాను నిర్మించాడు. ఇక తాజాగా నిర్మించిన 'బింబిసార' సినిమా డైరెక్టర్ వశిష్ఠ ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు. వశిష్ఠ అసలు పేరు వెంకట్ కాగా పలువురు ముద్దుగా వేణు అని కూడా పిలిచేవారు. 2007లో 'ప్రేమలేఖ రాశా' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. గీత రచయిత కులశేఖర్ డైరెక్టర్‌గా మారిన ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా చేసింది. అయితే పలు కారణాల వల్ల విడుదల కానీ ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. హీరోగా తొలి అపజయాన్ని మూటగట్టుకున్న వెంకట్ నటనకు స్వస్తి పలికి దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. ఫైనల్‌గా సోషియో ఫాంటసీ కథతో 'బింబిసార' సినిమాను తెరకెక్కించి విజయం సాధించాడు. ఇలా ముందు నుంచి చూసుకుంటే కల్యాణ్ రామ్ ఏ రోజు కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ల వెంట పడలేదు. కథను, కొత్త దర్శకులు, ప్లాప్ డైరెక్టర్లు అనే భేదం లేకుండా ప్రతిభను నమ్మి.. నిర్మాతగా అవకాశాలిస్తూ నిజమైన హీరో అనిపించుకున్నాడు కల్యాణ్ రామ్. ఒక కొత్త దర్శకున్ని నమ్మి, నిర్మాతగా రూ. 45 కోట్ల బడ్జెట్ పెట్టడంతోపాటు హీరోగా 'బింబిసార' కోసం కష్టపడిన కల్యాణ్ రామ్ ఫ్యాషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పడంలో, ఈవిల్ టు గుడ్ అని ఓ టైమ్ ట్రావెల్ మూవీని నిర్మించడానికి చేసిన కృషిని ప్రశంసించడంలో ఎలాంటి తప్పులేదు. కానీ ఇదే అదనుగా కొంతమంది కల్యాణ్ రామ్ నిజమైన మెగాస్టార్ అని, చిరును కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం సరైంది కాదు. ఎందుకంటే చిరంజీవి నటన, అభినయం, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పునాది రాళ్లు, ప్రాణం ఖరీదు సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగారు. డ్యాన్స్, ఫైటింగ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు, డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ అంచెలంచలుగా ఎదిగి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి స్టార్డమ్ సాధించారు. నేటితరం యువ హీరోలకు, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని వంటి స్టార్స్‌కు చిరునే ఆదర్శం. ఇప్పటికీ ఆయన నటనలో, డ్యాన్స్‌లో ఎలాంటి మార్పు కనపడదు. ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోవచ్చేమో కానీ, నటనలో మాత్రం చిరు ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. పైగా ఏ సినిమా హిట్ అయినా, తన చిత్రం విజయం సాధించినట్లుగా మనస్ఫూర్తిగా అభినందిస్తుంటారు. కొత్త టాలెంట్‌ను, సరికొత్త కథా చిత్రాలను ఎంకరేజ్ చేస్తారు. ఇందుకు, ఇటీవల విడుదలైన విక్రమ్, మేజర్ చిత్రాలను ప్రశంసించడం, నాగ చైతన్య కీ రోల్ ప్లే చేసిన హిందీ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'ను తెలుగులో సమర్పించడం, అలాగే బెస్ట్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్న సూర్యను మెచ్చుకోవడం, మంచి నటుడిగా మారిన తన అభిమాని సత్యదేవ్‌ను పొగిడటమే కాకుండా అవకాశాలు అందించడం, అంతేందుకు ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం సినిమాల తర్వాతి రోజే అంటే ఆగస్టు 6న ఆ చిత్రాలను ప్రశంసలతో ముంచెత్తడం వంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. బింబిసార, సీతారామం చిత్రాలను 'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటను, మరింత ఉత్సాహాన్నిచ్చాయి' అని కొనియాడుతూ తెలుగు సినిమా కోసం, అభివృద్ధి కోసం, ఇండస్ట్రీకి పెద్ద కొడుకుగా అహర్నిశలు కృషి చేస్తున్న చిరును.. తెలుగు సినీ ఇండస్ట్రీకి నిజమైన మెగాస్టార్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. Hearty Congratulations Team #SitaRamam & Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022 ఇక మెగాస్టార్ ట్యాగ్‌ను కల్యాణ్ రామ్‌కు జోడించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం, చిరుపై కామెంట్స్ చేయడం వంటివి పలువురి అత్యుత్సాహమని తెలుస్తోంది. ఎందుకంటే, సినిమా హిట్టయిన, ఫట్టయిన విభిన్న కథలతో ముందుకొస్తూ హీరోగా, నిర్మాతగా కల్యాణ్ రామ్ కష్టపడుతున్నారనేది వాస్తవమే. అలాంటప్పుడు.. ఒక ఉదాహరణగా తీసుకుంటే, కర్మ, క్షణం, గూఢచారి, మేజర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలకు కథ అందిస్తూ, ఒక డిఫరెంట్ జోనర్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్‌కు కూడా మెగాస్టార్ ట్యాగ్ ఇవ్వొచ్చా? అనే ప్రశ్న ఎదురవుతుంది. సో.. ఎవరి స్టార్డమ్ వారిదే. ఎవరి కృషికైన గుర్తింపు ఉంటుంది. మెగాస్టార్, సూపర్ స్టార్ వంటి తదితర ట్యాగ్లు హీరోలపై అభిమానాన్ని వ్యక్తపరిచే విధంగా ఉండాలే తప్ప ఇంకొకరిని కించపరిచేలా ఉండకూడదు. Big congratulations to #Bimbisara team . Very interesting & an engaging fantasy film . Impactful presence by @NANDAMURIKALYAN garu . My respect for him for always bringing in new talent into the industry & attempting new kind of films. — Allu Arjun (@alluarjun) August 7, 2022 నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ కలిసి నటించి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరం. ఈ 'ఆర్ఆర్ఆర్' చిత్రమే కాకుండా 1999లో రిలీజైన 'సుల్తాన్' మూవీలో బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించి తామంతా ఒక్కటే అని నిరూపించారు. హీరోల్లో సక్యత బాగానే ఉన్నా.. కొంతమంది మాత్రం ట్రోలింగ్లతో సమయాన్ని వృథా చేసుకోవడం బాధాకరమైన విషయమేగా మాస్టారు!. కాగా ఓటీటీలని, థియేటర్లకు ఎవరు రావట్లేదనే తదితర అంశాలతో సతమతమవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి బింబిసార, సీతారామం వంటి చిత్రాలు కొత్త ఉత్సాహాన్ని అందించాయి. ఇలాంటి తరుణంలో ట్యాగ్‌లను పక్కనపెట్టి సినీ పరిశ్రమ అంతా ఒకే కుటుంబమని భావిస్తే తెలుగు సినిమా ఖ్యాతి ఖండంతరాలు దాటే అవకాశముంది. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?
Chiranjeevi Birthday Special: మెగాస్టార్ చిరంజీవి.. భారత సినీ పరిశ్రమకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఆయన. తొలుత సహానటుడిగా ఎంట్రి ఇచ్చిన ఆయన విలన్‌గా ఆ తర్వాత హీరో ఎదిగారు. బాక్సాఫీసుకు బ్లాక్బస్టర్లను అందిస్తూ సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా ఎదిగారు. సినిమాల్లో ‘స్వయం కృషి’తో ఎదిగిన ఆయన తన నటన, డ్యాన్స్‌తో అభిమానుల గుండెల్లో మెగాస్టార్‌గా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా హీరోగా నేటితరం యువ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడం ఒక్క ఆయనకే చెల్లింది. దాదాపు 150పైగా చిత్రాల్లో నటించిన చిరు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించి మెగాస్టార్ అంటే ఒక ఓ బ్రాండ్ అనేంతగా పేరు తెచ్చుకున్నారు. అభిమానులంతా మెగాస్టార్ మెగాస్టార్ అంటూ జపం చేసే ఈ బిరుదు ఆయనకు ఎలా వచ్చిందో మీకు తెలుసా?. అసలు ఆయనకు ఈ బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా? మరి తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. (చదవండి: ఆ కారణంగా 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' ఏర్పాటైంది..) ఎన్టీఆర్, కృష్ణ వంటి సూపర్స్టార్లు తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న సమయంలో చిరంజీవితో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత కేఎస్. రామారావు. చిరంజీవి, కేఎస్ రామారావుల కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అభిలాష’. యండమూరి వీరేంద్రనాథ్ నవలా ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అదే యండమూరి నవల ఆధారంగా కొందండరామి రెడ్డీ దర్శకత్వంలో నిర్మాత కేఎస్ రామరావు నిర్మాణంలో చిరు హీరోగా ‘ఛాలెంజ్’ ‘రాక్షసుడు’ చిత్రాలు తెరకెక్కించారు. ఈ సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించాయి. అయితే రాక్షసుడు మూవీతోనే చిరంజీవి తమ్ముడు నాగబాబు నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చిరంజీవి, కేఎస్ రామారావు కలయికలో వచ్చిన నాలుగవ చిత్రం ‘మరణ మృదంగం’. ఇది కూడా యండమూరి వీరేంద్రనాథ్ నవలా ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ సాదించింది. ఈ చిత్రం టైటిల్‌తోనే అప్పటి వరకు సుప్రీం హీరో ఉండే చిరంజీవి పేరు మెగాస్టార్ చిరంజీవిగా మారింది. సినిమా పేర్లు పడుతుండగా హీరో పేరు రాగానే మెగాస్టార్ అని రావడంతో థియేటర్ అంతా అభిమానుల ఈళలతో మారుమోగిందట. ఈ సినిమాతో నిర్మాత కేఎస్ రామారావు చిరంజీవికి అందించిన అరుదైన బిరుదు ఇది. అప్పటి వరకు చిరును సుప్రీం హీరోగా పిలుచుకునే అభిమాలంతా మెగాస్టార్‌గా పిలవడం ప్రారంభించారు. -
ఆ హీరోకు బిల్డర్ టోకరా..
న్యూఢిల్లీ : పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ షోల్లో నటించిన భోజ్‌పురి సినిమా మెగాస్టార్ రవికిషన్ ఓ బిల్డర్ చేతిలో మోసపోయారు. ముంబైలో రూ 1.5 కోట్లు వెచ్చించి ఫ్లాట్‌ను బుక్ చేసిన రవికిషన్‌కు ఇంతవరకూ బిల్డర్ ఫ్లాట్‌ను అప్పగించకపోవడంతో నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ బిల్డర్స్ వద్ద రూ 1.5 కోట్లు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకున్న రవికిషన్‌కు ఇప్పటివరకూ బిల్డర్లు ఫ్లాట్‌ను అప్పగించలేదు. కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ బిల్డర్లు జితేంద్ర జైన్, జినేంద్ర జైన్, కేతన్ షాలపై రవికిషన్ ఫిర్యాదు చేశారు. సునీల్ నాయర్ అనే వ్యక్తిని కూడా బిల్డర్లు రూ 6.5 కోట్ల మేర మోసగించినట్టు ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ మరో నిర్మాణ రంగ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన జేవీ గ్రూప్ ఫిర్యాదుదారులు ఇద్దరికీ కలిపి రూ 8 కోట్ల మేర టోకరా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. -
చిరు హరిత సవాలు
-
చిరు చాలెంజ్.. ఎవరికో తెలుసా?
హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ చాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. బడా బడా పొలిటీషయన్లతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొని ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. కేటీఆర్, కవిత, సచిన్, రాజమౌళి, మహేష్ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే ఇందులో పాల్గొన్నారు కూడా. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో పాల్గొని మరికొందరికి సవాల్ వేశారు. ఎన్టీవీ ఛానెల్ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన సవాల్‌ను స్వీకరించిన చిరు.. ఇంట్లో మూడు మొక్కలు నాటి కొందరిని నామినేట్ చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తోపాటు, మీడియా దిగ్గజం రామోజీరావు, సోదరుడు పవన్ కల్యాణ్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెగాస్టార్ పాటకు.. అమెరికాలో డ్యాన్స్!
-
మెగాస్టార్ పాటకు.. అమెరికాలో స్టాండింగ్ ఒవేషన్!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీఇచ్చిన ఖైదీ నంబర్ 150 ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసినిమాతో తనలోని గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు మెగాస్టార్. మెగా మేనియాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన ఈ సినిమా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఓ అంతర్జాతీయ రియాలిటీ షోలో ఖైదీ నంబర్ 150 సినిమాలోని సన్నజాలి లా నవ్వేస్తోందిరో పాటకు డ్యాన్స్చేశారు అక్కడి డ్యాన్సర్. ఫాక్స్ టీవీలో నిర్వహించే షో టైం ఎట్ ది అపోలో షోలో ఈ పాటను ప్రదర్శించారు. ఎమ్మీ అవార్డ్ విన్నర్ స్టీవ్ హార్వే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో ష్రాయ్ ఖన్నా టీం ఈ పాటను ప్రదర్శించారు. మెగాస్టార్ పాట అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. డ్యాన్స్ పూర్తయిన తరువాత ఆడిటోరియంలోని ఆడియన్స్ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ష్రాయ్ ఖన్నా టీంను అభినందించారు. ఈ వీడియోను మెగా అభిమానుల కోసం తన ఫేస్ బుక్ పేజ్‌లో షేర్ చేశాడు చిత్ర నిర్మాత చిరు తనయుడు రామ్ చరణ్.