మెగా ఫ్యాన్స్‌కు దీపావళి సర్‌ప్రైజ్.. ఆ మూవీ క్రేజీ అప్‌డేట్‌ | Megastar Latest Movie Mega154 Crazy Update For Diwali Festival | Sakshi
Sakshi News home page

Mega154 Crazy Update: మెగా154 క్రేజీ అప్‌డేట్.. ఆ రోజే అఫీషీయల్ టైటిల్ టీజర్‌

Published Fri, Oct 21 2022 6:35 PM | Last Updated on Fri, Oct 21 2022 6:36 PM

Megastar Latest Movie Mega154 Crazy Update For Diwali Festival - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. అదే జోష్‌తో తన నెక్ట్‌ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు మెగాస్టార్. భోళా శంకర్‌, డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంతో చిరు 154వ చిత్రంగా మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. దీపావళి కానుకగా మెగా154 అఫీషియల్ టైటిల్‌ టీజర్‌ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈనెల 24 ఉదయం 11.07 నిమిషాలకు బాస్‌ వస్తున్నాడు అంటూ పోస్టర్‌ను ట్వీట్‌ చేశారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

 కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య టైటిల్‌ పరిశీలనలో ఉండగా.. అక్టోబర్‌ 24న క్లారిటీ రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement