Chiranjeevi Megastar
-
Fact Check: ‘బోలో’ శంకరా.. నిబంధనలు పాటించరా?
సాక్షి, అమరావతి : సినిమా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. అదీ.. సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి, రూపొందించిన నిబంధనలే. గతంలో విడుదలైన సినిమాలకు ఈ నిబంధనల మేరకు సమాచారాన్ని, ఆధారాలను సమర్పించి, ఆ సినిమాల నిర్మాతలు రేట్లు పెంచుకున్నారు. చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలకు నచ్చలేదట. వెంటనే అవి ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. నిబంధనలు పాటించకపోయినా, ఆధారాలు సమర్పించకపోయినా సరే.. టిక్కెట్ రేట్లు పెంచాలంటూ అడ్డగోలుగా వాదిస్తున్నాయి. నిబంధనలు పాటించినట్టు ఆధారాలు సమర్పించినందునే గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు టిక్కెట్ రేట్లను తొలి వారం రోజుల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో నిబంధనలను పాటించినట్టు ఆధారాలు సమర్పించాలని చెబితే మాత్రం భోళా శంకర్ సినిమా నిర్మాణ సంస్థ ముఖం చాటేసింది. పైగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు నిజాలివీ.. టిక్కెట్ రేట్ల పెంపునకు నిబంధనలు ఇవీ... సినిమా టికెట్ల రేట్లను తొలి వారం, పది రోజులపాటు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారుచేసింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చర్చించి మరీ ఈ విధి విధానాలను రూపొందించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 11న మెమో జారీ చేసింది. ఆ ప్రకారం హీరో హీరోయిన్, డైరెక్టర్ల పారితోíÙకాలు కాకుండా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యయం కలిపి రూ.100 కోట్లు దాటాలి. సినిమా షూటింగ్లో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో చేయాలి. సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించాలి. దాన్ని చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ధ్రువీకరించాలి. సినిమా నిర్మాణానికి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ/ ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలి. మొత్తం 12 రకాల సాధారణ పత్రాలను సమర్పించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా టిక్కెట్ రేట్లు పెంచమంటే ఎలా? భోళా శంకర్ సినిమాను నిరి్మంచిన అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ నిబంధనలను ఏవీ పట్టించుకోలేదు. తొలి వారం రోజులు టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వాలని ఆ సంస్థ రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ)కి జులై 30న దరఖాస్తు చేసింది. దానిని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ పరిశీలించింది. జీవో నంబర్ 2 ప్రకారం ఇచ్చి న ఉత్తర్వుల్లో నిబంధనలను పాటించాలని, ఆధారాలు చూపాలని ఈ నెల 2న లిఖితపూర్వకంగా చెప్పింది. కానీ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటివరకు ఆ ఆధారాలను సమర్పించలేదు. వైజాగ్ పోర్టు, అరకు ప్రాంతాల్లో 25 రోజలపాటు భోళా శంకర్ సినిమా షూటింగ్ చేసినట్టు అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అంతకు ముందు దరఖాస్తులో తెలిపింది. అందుకు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ కోరింది. దీనిని సినిమా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. నిర్మాణ వ్యయం అఫిడవిట్, జీఎస్టీ చెల్లింపులు, ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి పత్రాలు వేటినీ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పించనే లేదు. ఇవేవీ లేకుండా టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది?. ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఇదే రీతిలో అనుమతి చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఈ నిబంధనల ప్రకారమే టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ సినిమాల నిర్మాణ సంస్థలు నిర్ణీత పత్రాలతో సహా దరఖాస్తు చేశాయి. వాటిని పరిశీలించి సక్రమంగా ఉండటంతో టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం భోళా శంకర్ చిత్రం నిర్మాణ సంస్థ కూడా ఇదే రీతిలో నిబంధనలను పాటిస్తే రేట్ల పెంపునకు అనుమతిస్తామని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ స్పష్టం చేసింది. కానీ కొందరు దురుద్దేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భోళా శంకర్ సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వడం లేదంటూ కొన్ని మీడియాలతోపాటు సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారు. -
ఇళ్ల నిర్మాణంలో అవినీతి గురించి నాకు తెలియదు.. చిరు కీలక వ్యాఖ్యలు
పెద్దరికం అనుభవించాలని తనకు లేదని, ఇండస్ట్రీలో తనకంటే పెద్దవాళ్లు చాలామంది ఉన్నారని చిరంజీవి అన్నారు. చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''సినీ కార్మికులకు సొంత ఇల్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.అనిల్, దొరై ఎంతో కష్టపడి గృహా సముదాయాన్ని పూర్తి చేశారు.దాసరి నారాయణ, రాఘవేంద్రరావు వంటి పెద్దలు దీనికి చాలా కృషి చేశారు. ఎం. ప్రభాకర్ రెడ్డి దూరదృష్టి వల్లే కార్మికుల కల సాకారమైంది.భారతదేశంలో ఎక్కడా ఇలాంటి గృహసముదాయం లేదు. ఇక చిత్రపురి కాలనీలో అవినీతి, అవకతవకలు జరిగాయని అన్నారు.. కానీ ఆ విషయం గురించి నాకు తెలియదు కాబట్టి మాట్లాడటం అసంబద్ధమే అవుతుంది. సినీ కార్మికులకు ఎప్పుడు, ఏ సహాయం కావాలన్నా నేను సపోర్ట్‌గా ఉంటాను. కార్మికులకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజంకాస్తా. కోరుకున్న దానికంటే భగవంతుడు నాకు ఎక్కువే ఇచ్చాడు. నన్ను అందరూ చిత్ర పరిశ్రమకు పెద్దోడు అంటున్నారు.పెద్దరికం అనుభవించాలని నాకు లేదు నాకంటే చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్లు చిన్నవాళ్లుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద చేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదములు'' అంటూ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాకు యువ హీరోలు పోటీ కాదు.. నేనే వాళ్లకు పోటీ: చిరంజీవి
-
నాకు వారు పోటీ కాదు.. నేనే వారికి పోటీ: మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో అవార్డ్ స్వీకరించారు. ఈ వేడుకల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డును కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ వేడుకలో సతీసమేతంగా ఆయన హాజరయ్యారు. అవార్డు అందుకున్న మెగాస్టార్ వేదికపైనే భావోద్వేగానికి గురయ్యారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. 2022 సంవత్సరానికిగాను భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇదివరకే ప్రకటించారు. (చదవండి:మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం.. కేంద్రమంత్రి ప్రశంసలు) చిరంజీవి మాట్లాడుతూ.. 'నాకు యువహీరోలు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ. ఈ అవార్డు నా అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నింపింది. ఈ క్షణం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నా. నా చివరి శ్వాస వరకు సినిమాల నుంచి తప్పుకోను. నేను ఎప్పుడు మీతోనే ఉంటా. మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా. మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కుడున్నా వారి ప్రేమకు నేను దాసోహం. ఆ ప్రేమ కావాలి. ఆ ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ అందరికీ జీవితాంతం కృతజ్ఞతగా ఉంటా. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు. నా స్నేహితుడు అక్షయ్ కుమార్ ఇక్కడే ఉన్నారు. నేను ఈ స్థాయికి వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో నేను ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నా. కానీ అప్పుడు దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫోటో లేదని బాధపడ్డా. కానీ ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది. ' అంటూ చిరు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. మెగాస్టార్ మాట్లాడుతూ..' నేను ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించా. శివ శంకర్ వరప్రసాద్ అనే నాకు.. సినీ పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చింది. 45 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా. రాజకీయంలోకి వెళ్లడం వల్ల కొన్నాళ్లు విరామం వచ్చింది. పాలిటిక్స్‌లోకి వెళ్లడం వల్ల సినిమా విలువేంటో అర్థమైంది. ఏ రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. కానీ చిత్ర పరిశ్రమలో లేదు. ఇక్కడ ప్రతిభ ఒక్కటే కొలమానం.' అని అన్నారు. -
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం.. కేంద్రమంత్రి ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. ఆయనను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపుతో గౌరవించింది. 2022 సంవత్సరానికిగాను భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డును మెగాస్టార్ అందుకోనున్నారు. ఇప్పటికే గోవాలో చలన చిత్రోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కాగా... ఈ నెల 28 వరకు జరగనున్నాయి. ఈ అవార్డుకు చిరంజీవి ఎంపిక కావడం పట్ల కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో నటుడిగా రాణిస్తోన్న చిరంజీవి... 150 సినిమాలు పూర్తి చేసి తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని చిరంజీవిని కొనియాడారు. ఈ వేడుకల్లో 79 దేశాలకు చెందిన 280 చిత్రాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1978లో సినీ రంగంలో అడుగుపెట్టిన చిరంజీవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారకమైన పద్మభూషణ్ 2006లో చిరంజీవిని వరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. చిరంజీవి 2012 నుంచి2014 వరకు కేంద్ర పర్యాటక మంత్రిగా సేవలందించారు. Indian Film Personality of the Year 2022 award goes to 𝐌𝐞𝐠𝐚𝐬𝐭𝐚𝐫 𝐂𝐡𝐢𝐫𝐚𝐧𝐣𝐞𝐞𝐯𝐢 With an illustrious career spanning almost four decades, he has been a part of more than 150 feature films 📽️https://t.co/1lSx81bGMw#IFFI #AnythingForFilms #IFFI53 @KChiruTweets pic.twitter.com/AY6UzMhfix — PIB India (@PIB_India) November 20, 2022 -
మెగాస్టార్‌కు విద్యార్థుల సర్ప్రైజ్.. ఒకేసారి ఆరు వేలమంది కలిసి..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దీపావళి సందర్భంగా విడుదల చేసిన టైటిల్, మెగాస్టార్ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా దర్శకుడు తన ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. (చదవండి: మెగా 154 టైటిల్ వచ్చేసింది, ఆకట్టుకుంటున్న చిరు మాస్ లుక్) హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్శిటీ విద్యార్థులు చిరంజీవిపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' లుక్‌ను విద్యార్థులు రీ క్రియేట్ చేశారు. యూనివర్శిటీ మైదానంలో సుమారు ఆరువేల మంది విద్యార్థులు కూర్చుని మెగాస్టార్ రూపాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించి విజువల్స్‌ను యూనివర్శిటీలో జరిగిన క్యాన్సర్‌పై పోరాటం కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్‌కు సర్ప్రైజ్ ఇస్తూ వీడియోను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రేమకు ఫిదా అయిన చిరు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ పట్ల మీకున్న ప్రేమ ఈ వీడియో చూస్తే తెలుస్తోంది అంటూ దర్శకుడు బాబీ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. దీనిపై నెటిజన్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. What a great tribute to our Megastar @KChiruTweets garu from the students and Management of Mallareddy college 👌👏👏 Clearly shows your love and affection towards BOSS 🙌, Big thanks from me and the entire team of #WaltairVeerayya 🙏❤️@MythriOfficial https://t.co/nv932COUnH — Bobby (@dirbobby) October 30, 2022 -
మెగా ఫ్యాన్స్‌కు దీపావళి సర్ప్రైజ్.. ఆ మూవీ క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. అదే జోష్‌తో తన నెక్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు మెగాస్టార్. భోళా శంకర్, డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో చిరు 154వ చిత్రంగా మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. దీపావళి కానుకగా మెగా154 అఫీషియల్ టైటిల్ టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈనెల 24 ఉదయం 11.07 నిమిషాలకు బాస్ వస్తున్నాడు అంటూ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉండగా.. అక్టోబర్ 24న క్లారిటీ రానుంది. This Diwali it's Gonna be a "MEGA BLAST" 💥💥💣 💣 Our #Mega154 Title Teaser Launch on 24th October at 11.07 AM❤️🔥 Trust me,... Poonakalu Loading 🔥🤙 Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/ZRZmvUoKAl — Bobby (@dirbobby) October 20, 2022 -
Chiranjeevi: అల్లూరి ఖ్యాతి ప్రపంచమంతా వ్యాప్తి
సాక్షి, భీమవరం: మన్యం వీరుడు, త్యాగధనుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించడంతో అల్లూరి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహం ఆవిష్కరణ సభలో చిరంజీవి పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనుండటం అద్భుతం, అమోఘమని కొనియాడారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు అల్లూరి అని కొనియాడారు. ఆంధ్ర, తెలంగాణ క్షత్రియ సేవాసమితి ప్రధాన కార్యదర్శి నడింపల్లి నానిరాజు మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ఆయన పేరుతో జిల్లా ఏర్పాటుచేయడం తెలుగువారికి గర్వకారణమన్నారు. ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. చిరంజీవికి సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ ఆలింగనం భీమవరంలో సభా వేదికపై చిరంజీవిని ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాగా సభా వేదికపై చిరంజీవిని సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో వారిద్దరి ఆత్మీయ కలయికను చూసి జనం ఉప్పొంగిపోయారు. ముందుగా చిరంజీవి వేదికపైకి చేరుకోవడంతో సభా ప్రాంగణం ఈలలు, చప్పట్లతో మారుమోగింది. అనంతరం వేదికపైకి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. చిరంజీవిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా మాట్లాడటం చూసి సభికులు మరింత ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. తిరుగులేని ప్రజానాయకుడిగా వెలుగొందుతున్న సీఎం వైఎస్ జగన్, సినిమాల్లో తిరుగులేని హీరో చిరంజీవిని ఒకే వేదికపై చూసి ప్రజలు కరతాళధ్వనులతో తమ ఆనందం వ్యక్తం చేశారు. -
మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' రిలీజ్ అయ్యేది అప్పుడే..!
Chiranjeevi Acharya Movie Release Date: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమాలోని 'లాహే లాహే', 'నీలాంబరి' సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 'లాహే లాహే' పాట అయితే యూట్యూబ్‌లో 60 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. అయితే పాటలు, నటీనటుల లుక్స్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ సినిమా విడుదలపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆచార్య రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఆచార్య సినిమాను ఫిబ్రవరి 04, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) అలాగే ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ నక్సలైట్ సిద్ధగా కనిపించనున్నారు. ఇవాళ సినిమా విడుదల తేది ప్రకటన తర్వాత సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను నవంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీనిని 'ధర్మమే సిద్ధ' అంటూ మెగాస్టార్ చిరింజీవి షేర్ చేయగా, 'గుర్తుండిపోయే పాత్ర సిద్ధ. పవర్ఫుల్ టీజర్ రానుంది'. అని రామ్ చరణ్ ట్వీటారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) Siddha is a memorable character for many reasons. Powerful Teaser is on its way!#SiddhasSaga on Nov 28th.#Acharya #AcharyaOnFeb4th Megastar @KChiruTweets #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/gUs7iiJOaK — Ram Charan (@AlwaysRamCharan) November 24, 2021 ఇదిలా ఉంటే తొలుత దర్శకుడు ఆచార్యను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జనవరి 7వ తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు తేదీలకు పెద్దగా గ్యాప్ లేకపోవడంతో డిసెంబర్ 17న ‘ఆచార్య’ విడుదల చేయాలని కొరటాల నిర్ణయించారట. అయితే ఇదే తేదిన ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తామని అప్పట్లో మేకర్స్ తెలిపారు. కానీ పుష్ప షూటింగ్‌ను ఇంకా పూర్తి చేసుకోలేదు. డిసెంబర్ 17 వరకు పుష్ప షూటింగ్ పూర్తవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. అందుకే చివరిగా ఫిబ్రవరి 04, 2022ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది చదవండి: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'లాహే లాహే' సాంగ్ -
సైదాబాద్ నిందితుడి మృతిపై చిరు ఏమన్నారంటే..
వారం రోజులుగా తెలంగాణలోని సింగరేణి ప్రాంతానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి హత్యాచార కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిందితుడు రాజుకు తగిన శిక్ష వేయాలని కొందరు, మరణ శిక్షే సరైనదని మరొకొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ జాబితాలో సామాన్యులు, సెలబ్రిటీలు ఉన్నారు. ఆ కీచకుడి మరణ వార్త అందరిలోనూ కాస్త సంతోషాన్ని నింపిందనే చెప్పాలి. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ మృతి స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ ద్వారా తన స్పందించారు. అందులో.. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు అనే కిరాతకుడు తనకు తాను శిక్షను విధించుకోవడం బాధిత కుటుంబంతో పాటు మిగతా అందరికి కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజ చొరవ చూపాలి. అలాంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా గురువారం ఘనపూర్ రైల్వే ట్రాక్ఫై రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి చేతిపై ఉన్న మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు ఆ మృతదేహం రాజుదేనని నిర్థారించారు. ప్రస్తుతం రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Let’s not allow such dastardly acts to recur and let’s do whatever it takes towards this goal! #JusticeForChaithra pic.twitter.com/yWX5bwDloN — Chiranjeevi Konidela (@KChiruTweets) September 16, 2021 చదవండి: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసు: కెల్విన్‌తో ఫోన్‌కాల్స్ మర్మమేమిటి? -
చిరంజీవి ‘ఛాలెంజ్’ పాఠాలు
Happy Birthday Chiranjeevi: ఓలా ఈ-బైక్.. ఇండియన్ వెహికిల్ మార్కెట్లో ఒక సంచలనం. కేవలం రూ. 499లతో ప్రీ-బుకింగ్‌తో 24 గంటల్లో వెయ్యి నగరాల్లో లక్ష ఫ్రీ బుకింగ్‌లు. సంచలనాలకు తెరలేపి.. ఓ చెదరని రికార్డును నెలకొల్పింది ఓలా. కానీ, 37 ఏళ్ల క్రితమే ఇలాంటి సినారియోను చూపించింది ఓ తెలుగు సినిమా. స్కూటర్ ఫ్యాక్టరీకి లైసెన్స్ రావడం, ఆ వెంటనే స్కూటర్లు కావాల్సిన వాళ్లు మూడు రోజుల ముందు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చని ప్రకటన ఇవ్వడం, ఆ కాలానికి తగ్గట్లు డ్రాఫ్ట్‌లు, చెక్‌లు ఎలాంటి పేమెంట్లు అయినా యాక్సెప్ట్ చేయడం. వెరసి ఈ ప్రకటనతోనే హీరో తాను అనుకున్న యాభై లక్షలు సంపాదించడం, పందెంలో నెగ్గడం.. ‘ఛాలెంజ్’ ద్వారా గాంధీ పాత్ర చెప్పిన గెలుపు ‘చిరు’ పాఠం చాలామందికి గుర్తుండే ఉంటుంది. చిరంజీవి వరుస కమర్షియల్ సక్సెస్ సినిమాల్లో ‘ఛాలెంజ్’ ఒకటి. యండమూరి ‘డబ్బు టూ ది పవర్ ఆఫ్ డబ్బు’ నవలకు సినిమాటిక్ మార్పుల ఆధారంగా కోదండరామిరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం.. అప్పట్లో ఓ సెన్సేషన్. నిరుద్యోగ యువత బలహీనతలతో ఆడుకోవాలని ప్రయత్నించే బడావ్యాపారి రామ్మోహన్రావు ప్రకటనలకు.. టిట్ ఫర్ ట్యాట్ ఇస్తాడు నిరుద్యోగి(మొదటి సీన్ తర్వాత అనాథ కూడా) గాంధీ. ఆపై ఐదేళ్లలో యాభై లక్షల సంపాదన పందెం.. ప్రతిగా రామ్మోహన్రావు కూతురు హారికతో వివాహం ‘ఛాలెంజ్’తో అసలు కథ మొదలవుతుంది. ఈ పందెంలో గాంధీని వెనక్కిలాగాలని రామ్మోహన్రావు చేసే ప్రయత్నమంటూ ఉండదు. కానీ, తన బుద్ధితో.. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ రేపి పందెంలో గెలుస్తాడు గాంధీ. బలమైన కథాకథనాలు, బలమైన క్యారెక్టర్లు, సంగీతం.. అన్నింటికి మించి నిరుద్యోగ రేటు ఎక్కువగా టైమింగ్‌లో రిలీజ్ కావడం ఛాలెంజ్ సక్సెస్‌కు కారణాలయ్యాయి. గాంధీ బుర్రకు సలాం తెలివితేటలు ఉంటే డబ్బు దానంతట అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. అసాధ్యం అనే పదాన్ని అని చెరిపేస్తున్న రోజుల్లో.. యువత సాధించలేనిది ఏదీ లేదు, డబ్బు కంటే విలువైనవి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి.. ఇలాంటి సందేశాలెన్నో ఛాలెంజ్ ఇచ్చింది. అదే టైంలో పైసా పెట్టుబడిలేని ‘సలహా ఇవ్వడం’ (కన్సల్టెన్సీ తరహా కాన్సెప్ట్) అనే వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించే హీరో, బిజినెస్ ట్రిక్‌ల ద్వారా ప్రత్యర్థిని దెబ్బకొట్టే సీక్వెన్స్‌లు, అగ్రెసివ్‌గా గాంధీ పాత్ర చెప్పే డైలాగులు, కమర్షియల్ ఎలిమెంట్లు.. అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పది పైసల నుంచి మొదలు.. తల్లి మందులకు డబ్బుల్లేక దొంగతనం చేసే గాంధీ.. అంత్యక్రియల కోసం వార్డెన్ ప్రకాశంతో రాజీపడడం, అదే టైంలో భార్య చికిత్స కోసం వచ్చిన రామ్మోహన్రావు దర్పాన్ని ప్రదర్శించడం, తన లెక్కతో హారిక నుంచి డబ్బు రాబట్టుకునే గాంధీ.. అప్పటిదాకా తన నేర్చుకున్న చదువును పక్కనపెట్టి.. జీవిత పాఠంలోకి అడుగుపెడతాడు. తెలివైన లక్ష్మి చెంత చేరి.. ఆమె అభిమానం-ప్రేమను పొందుతాడు. డబ్బు సంపాదించే పందెంలో అవ్వ నుంచి పది పైసలతో కొండంత ఆత్మవిశ్వాసంతో స్ఫూర్తి పొందుతాడు. ప్రత్యర్థి కూతురైన హారిక నుంచి సాయం, లక్ష్మి-విద్యార్థిల సహకారం అందుకుని గెలుపు బావుట ఎగరేస్తాడు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులకు, మానసిక సంఘర్షణలకు లోనవుతాడు గాంధీ. ఛాలెంజ్ నేర్పే పాఠాలు ► ఐదేళ్లలో యాభై లక్షలు సంపాదిస్తానంటూ గాంధీ ఛాలెంజ్ చేసిన తర్వాత అతని మొదటి పెట్టుబడి కేవలం పది పైసలు. అది కూడా గుడి మెట్ల మీద భిక్షం ఎత్తుకునే అవ్వ ఇస్తుంది. దీంతో ఎమోషనల్ అయిన గాంధీ తన వ్యాపారంలో అవ్వకు భాగస్వామ్యం ఇస్తానంటూ మాటిస్తాడు. ఆ క్షణంలో ఎమోషనల్‌గా వ్యాపారంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ గాంధీ పాత్ర చక్కగా వివరిస్తుంది. ► ఓ సీన్లో జూదానికి సంబంధించిన విషయంలోనూ మెళకువల్ని చెబుతాడు గాంధీ. జూదం నిరంతరం సాగే ప్రక్రియ అని. మన దగ్గరే ఆడేంత డబ్బులు ఉండవని, లాభాల్లో ఉన్నప్పుడే జూదం ఆపడం తెలివైన వాడి లక్షణం అంటూ అవతలి వ్యక్తితో అంటూనే ఓ సలహా ఇస్తుంది గాంధీ పాత్ర. ► ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఎంట్రప్రెన్యూర్కి ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఎంతో అవసరం అనేది ప్రాథమిక సూత్రం. దీని ఆధారంగానే తన గాంధీ 50 లక్షల సంపాదన ప్రయత్నాలు మొదలవుతాయి. ► దారితప్పుతున్న నిరుద్యోగ యువతను.. ఓ దారికి తీసుకొచ్చి ప్రభుత్వ పథకానికి ముడి పెట్టి చట్టబద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తొలిసారిగా డబ్బు సంపాదన వేట మొదలు పెడతాడు. ► వ్యాపారానికి బ్రాండింగ్ అనేది ఎంత ముఖ్యమో చెప్పేందుకు వీలుగా ఇళ్లు, కారు కొనుగోలు చేసి, దాని వల్ల వచ్చిన ఇమేజ్‌తో క్యాపిటల్ సంపాదనలో పడిపోతాడు ► తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో విద్యార్తి వంటి పాత్ర ద్వారా ఓ చక్కని లేబర్ని ఎంపిక చేసుకుంటాడు. ► ప్రత్యర్థి రామ్మోహన్ ప్రమోటర్‌గా ఉన్న బ్యాంకు నుంచే లోను పొందేందుకు గాంధీ, విద్యార్థిలు ఇద్దరు వేర్వేరుగా లోన్ కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారంలో శత్రువుకి శత్రువు మిత్రుడు అనే వ్యాపార సూత్రాన్ని పక్కాగా అమలు చేస్తారు. తమ వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి సంపాదిస్తాడు. ► పెట్టుబడి మొత్తం ఒకే చోట పెట్టకూడదనేది వ్యాపారంలో ముఖ్యమైన సూత్రాల్లో ఒకటి. జెఫ్ బేజోస్, ఎలన్మస్క్లాంటి కుబేరుల మొదలు షేర్ మార్కెట్ ఎనలిస్టుల వరకు ప్రతీ ఒక్కరూ చెప్పే మాట ఇదే. అంతేకాదు రకరకాల వ్యాపారాలతో వాళ్లు లాభాలు అర్జిస్తున్నారు కూడా. ఛాలెంజ్ గాంధీ సైతం ఓ వైపు పేపర్ ఫ్యాక్టరీ పనుల్లో ఉంటూనే మరో వైపు స్కూటర్ ఫ్యాక్టరీ పనులు కూడా మొదలెట్టి. తన ప్రత్యర్థికి అందనంత వేగంతో వ్యూహాలు అమలు చేస్తుంటాడు. ► షేర్ మార్కెట్ గురించి అంతగా పరిచయం లేని రోజుల్లో.. దాని గురించి వివరించే ప్రయత్నం చేసిన మొదటి సినిమా కూడా ఇదే. ► చివరగా.. డబ్బు మీద మనిషికి ఎంత గౌరవం ఉన్నా.. ఈ భూమ్మీద డబ్బు కంటే విలువైనవి ఉన్నాయంటూ రామ్మోహన్‌తో చెప్పే ముగింపు ఆకట్టుకుంటుంది. డబ్బు మోజులో పడి.. సంపాదనలో పడ్డ మనిషికి.. మిగతా వాటికి సమయం ఉండదు. ఆఖరికి బంధాలు, విలువల్ని కూడా ఒక్కోసారి పక్కనపెట్టాల్సి వస్తుంది. పేకాట క్లబ్ ద్వారా సంపాదించిన డబ్బును చూపించి.. చట్టానికి-న్యాయానికి తేడాలు చెప్పే గాంధీ.. చివరల్లో గడువు దగ్గర పడుతుంటే ఆ రెండూపట్టింపు లేనట్లు వ్యవహరించాడేమో అనిపించకమానదు. దుస్తులు అమ్ముకునే వ్యాపారికి.. అడల్ట్ ఐడియా ఇచ్చి ఒకానొక దశలో దిగజారి ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ, ఆరాచశక్తులుగా మారే యువతకు అవకాశాల ద్వారా మంచి బాటలోకి తీసుకురావడం, విద్యార్థిని వెన్ను తట్టి ప్రోత్సహించడం ఆకట్టుకుంటాయి. చివర్లో వ్యాపార సూత్రాల్ని పక్కాగా పాటించి గెలుపురామ్మోహన్రావు అహం-అహంకారం మీద దెబ్బకొట్టడం ఆడియొన్స్‌ను అంతతేలికగా మరిచిపోనివ్వదు. పోటీ ప్రపంచంలో మోసాన్ని మోసం తోనే జయించడం, పోటీ ప్రపంచం దిగజారుడుతత్వం, ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు పాటించాల్సిన సూత్రాలను ఆ కాలానికి తగ్గట్లు చూపించినప్పటికీ.. అవి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటి పరిస్థితులకైనా సరిపోయేవిలా ఉంటాయనడంలో అతిశయోక్తి కాదు. - చిరు బర్త్‌డే సందర్భంగా ప్రత్యేక కథనం -
చిరు న్యూలుక్ వైరల్.. ఫీలవుతున్న పవన్ ఫ్యాన్స్ .. కారణం అదేనా?
ఫ్యాన్స్ తమ హీరోల విషయంలో చిన్న విషయాన్ని కూడా పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తారన్న సంగతి తెలిసిందే. అంతెందుకు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అభిమానులు రెచ్చిపోయిన ఘటనలు బోలెడు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విషయంలో ఏ చిన్న విషయమైనా.. ఆయన అభిమానులు ఓ రేంజ్లో స్పందిస్తారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అది పవన్ ఫ్యాన్స్‌ను ఫీలయ్యేలా చేస్తోందట. ఇటీవల సోషల్‌మీడియా వాడుకలో వచ్చినప్పటి నుంచి అందులో పోస్ట్ చేసే వాటిలో ఏ చిన్న పొరపాటు కూడా వెంటనే వైరల్‌గా మారి అందరికీ చేరుతోంది. ఇక అందులో కంటెంట్ కొంచెం అటు ఇటుగా ఉన్న రచ్చ రచ్చ అవుతోంది. అయితే తాజాగా చిరు యంగ్‌గా కనపడుతున్న ఫోటోను మెగా బ్రదర్ నాగబాబు షేర్ చేయగా అది నెట్టింట వైరల్‌గా మారి తెగ హల్చల్ చేస్తోంది. అసలు చిక్కు ఈ ఫోటోతోనే వచ్చింది. ఆ ఫోటోలో.. చిరంజీవిని మధ్యలో ఉంచి చుట్టూ మెగా హీరోలని ఉంచాడు. ఆ పిక్కి కామెంట్ పెట్టిన నాగబాబు.. ఈ పిక్‌లో ఉన్న మెగా హీరోలు అందరిలో కెల్లా మీరే యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్లో కానీ ఎవరూ మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నయ్యా’’ అంటూ చిరు పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే నాగబాబు షేర్ చేసిన ఈ ఫొటోలో రామ్ చరణ్ , అల్లు అర్జున్, వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ లు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ మిస్ అయ్యాడు . దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. కాగా పవన్ అభిమానులు ఈ అంశంపై సోషల్‌మీడియాలో నాగబాబు పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. మరికొందరు మాత్రం నాగబాబు మనసులో తన తమ్ముడు కూడా ఇంకా యంగ్‌గా ఉన్నాడని భావిస్తున్నట్టున్నాడు అందుకే ఫొటో మిస్ చేశాడేమో అని కామెంట్స్ పెడుతున్నారు. -
ఆచార్యతో కలిసి నడిచిన సిద్ధ
మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కమర్షియల్ చిత్రాల్లో సందేశాన్ని జోడించి హిట్ చిత్రాకలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న కొరటాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అపడేట్‌ను నిన్న చిరు విడుదల చేశారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా 27 మార్చి 2021న ‘నా సిద్ధ వస్తున్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు. చెప్పినట్లుగానే సిద్ధ పాత్రలో చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ శనివారం విడుదలైంది. మెగాపవర్ స్టార్ నిన్న ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజుగా తన లుక్‌తో ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఈ రోజు సిద్ధగా ఇంకో లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇక పోస్టర్ విషయానికొస్తే, రామ్ చరణ్ చిరు తుపాకులు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న ఈ ఫోటో చూసి మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఫస్ట్‌లుక్ ఫోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి సోషల్ మీడియా యూజర్లు, ఇతర ప్రముఖులు మెగాస్టార్లో మునుపటి గ్రేస్ ఇంకా తగ్గలేదంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నట్లు నెట్టింట కామెంట్ల రూపంలో తమ ప్రేమను తెలుపుతున్నారు. మే 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఆచార్య’ చిత్రాన్ని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. 140 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆలయం సెట్‌కే చాలా ఖర్చపెట్టినట్లు టాక్ .ఇందులో కాజల్ అగర్వాల్, సోను సూద్, రామ్‌చరణ్, పూజా హెగ్డే, జిషు సేన్‌గుప్తా, సౌరవ్ లోకేష్ ఉన్నారు. మణిశర్మఈ చిత్రానిక సంగీతం అందించనున్నారు. గతంలో చిరు-మణిశర్మ కాంబినేషన్లో పలు చిత్రాలు రాగా అన్నిమ్యూజికల్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆల్ ది బెస్ట ఫర్ ‘ఆచార్య’ ( చదవండి: 'రామరాజు'గా రామ్‌చరణ్ పోస్టర్ విడుదల ) ఆచార్య "సిద్ధ " ...#HappyBirthdayRamcharan#Siddha #Acharya#AcharyaOnMay13 pic.twitter.com/Nk34oWYKRI — Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2021 -
రాజకీయాల్లో సినీ స్టార్ల ప్రాభవం అంతరించినట్లే!
సినిమాలంటే వెర్రెత్తిపోయే తమిళనాడులో కూడా ఎన్నికల సమరంలో రాజకీయ ప్రత్యర్థులను సినిమా సూపర్ స్టార్లు ఊడ్చిపారేసే కాలం ముగిసిపోయినట్లేనా? వెండితెర ఇలవేల్పు అయిన ఎన్టీరామారావును సీఎంగా గెలి పించిన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదా? బహుశా రజనీకాంత్ దీన్ని గుర్తించే కాబోలు.. చివరి నిమిషంలో రాజకీయాల్లోకి రావడం నా వల్ల కాదనేశారు. రజనీకాంత్‌ను దాటి ముందుకెళ్లిన మరో సూపర్ స్టార్ కమలహాసన్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్–మే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలను ఎక్కువగా గెల్చుకోకపోవచ్చు కానీ అగ్రస్థానంలో నిలబడాలని పోరాడుతున్న రెండు ప్రధాన ద్రావిడ పార్టీలలో ఏదో ఒక పార్టీకి కమల్ సమస్యలు సృష్టించవచ్చు. 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి పాత్రను గుర్తుంచుకోండి చాలు. తెలుగు మాట్లాడే ప్రాంతంలో రజనీకాంత్ కంటే చిరంజీవి ఎక్కువ క్రేజ్ ఉన్న సూపర్‌స్టార్. 2008లో ప్రజారాజ్యం పేరిట తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించి సీఎం అవ్వాలని తీవ్రంగా కృషి చేశారు. అయితే రియల్ లైఫ్‌కి రీల్ లైఫ్‌కి చాలా తేఢా ఉంటుంది. అందుకే ప్రజారాజ్యం పోటీ చేసిన 296 అసెంబ్లీ స్థానాల్లో 276 స్థానాలను కోల్పోయింది. చివరకు కులపరంగా మెజారిటీ ఉండే తన సొంత ఊరు పాలకొల్లులో ఓడిపోయి పరాభవాన్ని చవి చూశారు. చిరు రాజకీయ జీవితాన్ని చాలా సన్నిహితంగా చూసిన రజనీకాంత్ కీలక సమయంలో చాలా తెలివిగా తనదైన నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు చిరంజీవి కూడా కనుమరుగైపోయారు. ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే, కమల హాసన్ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు శాతం ఓట్ల షేరుకు పరిమితమైపోయారు. అయితే తమిళ రాజకీయ దిగ్గజాలైన కరుణానిధి, జయలలిత కన్నుమూసిన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని పూరించే విషయంలో సమీపానికి కూడా కమల్ చేరుకోలేకపోయారు. తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ప్రస్తుత సీఎం ఎడపాడి పళనిస్వామి పూరించేశారని, అన్నాడీఎంకేపై పట్టు సాధించడమే కాకుండా ఒకమేరకు సత్పరిపాలనను అందిస్తున్నారన్న వాస్తవాన్ని గమనించడంలో కమల్ బహుశా విఫలమై ఉండవచ్చు. అదే సమయంలో డీఎంకే పార్టీ శ్రేణులపై ఎంకే స్టాలిన్ తన పట్టును స్థిరపర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ కాంత్ చిట్టచివరలో రాజకీయాల్లోంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయ ప్రాభవాన్ని ఉపయోగించుకుని తమిళనాడులో భారీ స్థాయిలో ప్రవేశించాలనుకున్న బీజేపీ పథకాలకు కూడా రజనీ గండికొట్టారు. మరి కమలహాసన్ కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కానీ రాజకీయంగా బలమైన పాత్ర పోషించగలరా? తెలుగు ప్రజలు దేవుడిగా భావించే ఎన్టీఆర్ సొంత రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 మాసాల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బలమైన కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ నాయకులను నిర్లక్ష్యంగా చూడటంతో జాతీయ పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రులను రెచ్చగొట్టిన ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వం లోనూ, ప్రతిపక్షంలోనూ పాతుకుపోయిన రాజకీయ నేతలను పక్కకునెట్టి ఒక సినీ స్టార్ ఆవిర్భవించే పరిస్థితులు లేవనే చెప్పాలి. పెద్ద రాజకీయ పార్టీలు జరిపే రాజకీయ సమరంలో వోట్లను చీల్చివేసే తరహా పాత్ర పోషణకే ప్రస్తుతం చిత్రసీమ ప్రముఖులు పరిమితం కావచ్చు. సినిమాలంటే పిచ్చిప్రేమ చూపించే తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కలలు పండించుకోవాలని చూస్తున్న ఏ సినిమా స్టార్‌కైనా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే తమిళనాడులో సినీ హీరోలు విజయవంతమైన రాజకీయ నేతలుగా మారే రోజులకు కాలం చెల్లిపోయినట్లే. లక్ష్మణ వెంకట కూచి వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు -
కలకలం రేపుతున్న నాదెండ్ల వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో పవన్‌కు తోడుగా నిలుస్తానని చిరంజీవి గతంలోనే హామీ ఇచ్చారని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. నాదెండ్ల ప్రకనటతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం విజయవాడలో జనసేన కార్యకర్తలో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌ను మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది కూడా చిరంజీవేనని పేర్కొన్నారు. రాజకీయాల్లో పవన్‌కు తన పూర్తి సహకారం ఉంటుందని అంతర్గత భేటీలో చిరుతో తనతో చెప్పారని మనోహర్ వెల్లడించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మనోహర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఫలితాలు వెలువడ్డ తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. -
గుండు వెనుక ఉన్న అసలు నిజం ఇదే!
-
చిరంజీవి గుండు వెనుక ఉన్న అసలు నిజం ఇదే!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా సరికొత్త లుక్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఈ లుక్‌లో చిరు గుండుతో, మీసాలు లేకుండా కనిపించారు. ఒక స్టైలిష్ కళ్లజోడు పెట్టుకొని ఉన్న ఫోటోను ఆయన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘అర్బన్ మాంక్’ లుక్ అనే పేరుపెట్టారు. చిరును ఆ లుక్‌లో చూసిన అభిమానులతో పాటు రామ్ చరణ్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. పలువురు చిరు న్యూలుక్ సూపర్ అంటూ స్పందించారు. అయితే తాజాగా విడుదలయిన వీడియోతో చిరు గుండు వెనుక ఉన్న అసలు నిజం బయటపడిపోయింది. చిరు ఓ సినిమాలో క్యారెక్టర్ కోసం నిజంగానే గుండు చేయించుకొని ఉంటారని అందరూ భావించారు. అయితే చిరంజీవి గుండు చేయించుకోలేదని, ముగ్గురు మేకప్ ఆర్టిస్ట్‌లు కష్టపడి చిరుకు ఆ లుక్ తెచ్చినట్లు తెలుస్తోంది. మీరు కూడా ఒకసారి చిరు ‘అర్బన్ మాంక్’ మేకింగ్ వీడియోని చూసేయండి. చదవండి: సన్యాసిలా ఆలోచించగలనా? -
మెగాస్టార్ సినిమాలో మిల్కీ బ్యూటీ!
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాను చిరంజీవి తనయుడు మెగా పవర్‌స్టార్ రాంచరణ్, నిరంజన్‌రెడ్డిలు కొణిదెల ప్రొడక్షన్లో నిర్మిస్తున్నారు. హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పేరును ప్రకటించినప్పటి నుంచి చిరు సినిమాలో పలువురు అగ్రనటులు కీలక పాత్రలో కనిపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: మెగాస్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ?) ఈ పాత్ర కోసం మొదట దర్శక నిర్మాతలు కీర్తి సురేష్ పేరును అనుకున్నట్లు గత వారం వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా తమన్నా పేరును ఖరారు చేశారంట. ఇటీవల తమన్నాకు వీడియో కాల్ ద్వారా దర్శకుడు పాత్రను వివరించగా వెంటనే మిల్కీ బ్యూటీ ఓకే చెప్పినట్లు సినీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇప్పటికే చిరు ‘సైరా నర్సింహారెడ్డి’లో తమన్నా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇందులో ఆమె పాత్రకు మంచి స్పందన కూడా వచ్చింది. మెగాస్టార్ 152వ చిత్రమైన ‘ఆచార్య’కు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను మార్చి మొదటి వారంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ‘ఆచార్య’ షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభంకానుంది. (చదవండి: ‘ఆచార్య’లో మహేశ్.. చిరు స్పందన) -
మెగాస్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ?
సాక్షి, హైదరాబాద్: క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ చిత్రంలో నటించబోతున్నారు. సాహో డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో చేయాల్సిన పాత్ర కూడా వుంది. మలయాళ లూసిఫర్ చిత్రంలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ఆ పాత్రను పోషించారు. (లూసిఫర్‌కి విలన్?) అయితే తెలుగులో మాత్రం మొదట్లో ఆ పాత్రకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, అందులో నిజం లేదని తేలిపోయింది. ఇక ఇప్పుడు ఆ పాత్ర కోసం విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్ రౌడీని సంప్రదించారని, అయితే దీనికి సంబంధించి విజయ్ ఇంకా ఏ విషయం ఫైనల్ చేయనట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా, ఈ సినిమాలో ఆ పాత్ర షూటింగ్‌కు తక్కువ రోజులో అవసరమవుతాయి కాబట్టి విజయ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చని అంటున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం లూసిఫర్ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. (ముంబై కాదు... హైదరాబాద్‌లోనే!) -
'భళ్లాల దేవుడు ప్రేయసి వలలో చిక్కుకున్నాడు'
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇదే విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు రానా. తన ప్రేయసి మిహీకా బజాజ్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన రానా.. తను నా ప్రతిపాదనకు అంగీకరించింది అంటూ పేర్కొన్నారు. రానా ట్వీట్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి 'కంగ్రాచ్యులేషన్ మై బోయ్. చివరికి భళ్లాల దేవుడి అంతటి ధీశాలి కూడా ప్రేయసి వలలో చిక్కుకున్నాడు. ఈ లాక్ డౌన్ మీకు వెడ్ లాక్ కావాలి. ఇద్దరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. శతమానం భవతి' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై రానా, మిహీక బజాజ్ ఇరువురు స్పందిస్తూ చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు. చదవండి: ఆమె యస్ చెప్పింది : రానా రానా ప్రేయసి మిహీక వివరాలు ఇవే.. Congratulations my Boy @RanaDaggubati Finally the mighty #BhallalaDeva is struck by #Cupid & Getting hitched. #Lockdown leads to #WedLock. God Bless You Both! శతమానం భవతి. @MiheekaBajaj pic.twitter.com/fDdHbjhivz — Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2020 -
నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్ దిశ కేసులోని నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందించారు. దిశ ఘటనలోని నిందితులు ఎన్కౌంటర్లో మృతి చెందారన్న వార్తను ఉదయం చూశానని.. నిజంగా ఇది ఆ కుటుంబానికి సత్వర న్యాయం అని భావించినట్టు ఆయన చెప్పారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించే విషయమన్నారు. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలన్నారు. ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ తల్లిదండ్రుల ఆవేదనకు కొంత ఊరట లభించిందని తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కిరావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ఆయన ప్రశంసలు కురిపించారు. సీపీ సజ్జనార్ లాంటి వ్యక్తులు ఉన్న పోలీస్ వ్యవస్థకు.. కేసీఆర్ ప్రభుత్వానికి చిరంజీవి అభినందనలు తెలియజేశారు. చదవండి: భగవంతుడే పోలీసుల రూపంలో: బాలకృష్ణ 'తమ్ముడు చేసిన పని వారికి కఠినమైన సందేశం' ఈ ఎన్కౌంటర్ హెచ్చరిక కావాలి: అనుపమ -
శ్రీదేవి, రేఖలకు ఏఎన్ఆర్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభ చూపిన వారికి అందించే ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరావు జాతీయ పురస్కారాలను గురువారం కమిటీ ప్రకటించింది. 2018-19కి గానూ దివంగత నటి శ్రీదేవి బోనీకపూర్‌తో పాటు, మరో సీనియర్ హీరోయిన్ రేఖ.. ఏఎన్ఆర్ అవార్డులను అందుకోనున్నారు. కాగా 2013లో ఏఎన్ఆర్ అవార్డును అందుకున్న అలనాటి అందాల నటి శ్రీదేవి మరోసారి ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. నవంబరు 17న అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించే ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డులను అందించనున్నారని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీకపూర్ ఈ పురస్కారాన్నిస్వీకరించనున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా (ఏసీఎఫ్ఎం) తృతీయ కాన్వకేషన్ (స్నాతకోత్సవం)ను కూడా నిర్వహించనున్నట్టు తెలిపింది. కాగా ఏఎన్ఆర్ తొలి జాతీయ అవార్డును బాలీవుడ్ హీరో దేవానంద్, 2017లో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. అలనాటి మేటి నటి అంజలీదేవి (2007), నర్తకి, నటి వైజయంతిమాల (2008), నేపథ్య గాయని లతా మంగేష్కర్ (2009), దర్శకుడు కె. బాలచందర్ (2010), దర్శకురాలు హేమమాలిని (2011), రచయిత దర్శకుడు శ్యామ్ బెనగల్ (2012), బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ (2014), సూపర్‌స్టార్ కృష్ణ(2015) ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖులు. -
శంకర్‌దాదాకి డీఎస్పీ మ్యూజికల్ విషెస్ చూశారా?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి, ప్రముఖ సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి అప్ కమింగ్ మూవీ సైరాపై స్పందిస్తూ.. సైరా టీజర్ అదిరిపోయింది సర్.. ఫ్యాన్స్ అందరిలాగానే మేం కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. చిరంజీవి ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన డీఎస్పీ ప్రధానంగా తమ (చిరంజీవి, డీఎస్పీ) కాంబినేషన్లోని పాపులర్ సాంగ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ పాటతో సైరా సరసింహారెడ్డికి సూపర్ డూపర్ మ్యూజికల్ విషెస్ తెలిపారు. దీంతో మెగా అభిమానులు లైక్‌లు, రీట్వీట్లతో పండగ చేసుకుంటున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 64వ పుట్టినరోజును (ఆగస్టు 22) పురస్కరించుకొని, మెగా అభిమానులు బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా వేడుకలను జరుపుకున్నారు. చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా వస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అక్టోబర్ 2న ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రిలీజైన సైరా టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది. Wishing our Dearest 1 & Only #MEGASTAR #Annayya #Chiranjeevi Sir a SUPER DUPER MUSICAL HAPPY BIRTHDAY !!😁🎵🎶🎹❤️🎂🎂🎂🎂🎂🎂🎂🎂 Love frm my Whole Team❤️😍#SyeRaaNarasimhaReddy #HBDMegaStarChiranjeevi @KonidelaPro #RamCharan @upasanakonidela @IAmVarunTej @IamSaiDharamTej pic.twitter.com/v5jNjLc7oB — DEVI SRI PRASAD (@ThisIsDSP) August 22, 2019 -
‘చిరు’నామం.. ఏదీ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు, నర్సాపురం: మెగాస్టార్ చిరంజీవి 2009లో పీఆర్పీ పెట్టి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు, ఆ పార్టీలో కీలకనేతగా ఉన్న పవన్ కల్యాణ్ అన్న గొప్పతనంపై ప్రతీ వేదికపైనా గొంతు చించుకున్నారు. తన పునాది అన్నయ్య, తన అభివృద్ధి అన్నయ్య అంటూ లెక్చర్లు ఇస్తూనే ప్రచారం సాగించారు. పైగా ఆ ఎన్నికల్లో పీఆర్పీకి మెగా ఫ్యామిలీ మొత్తం స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించారు. సీన్ కట్‌చేస్తే 2019 ఎన్నికలు వచ్చే నాటికి పవన్ జనసేన పేరుతో సొంత పార్టీతో పోటీలో నిలిచారు. గత 15 రోజులుగా జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పవన్ హెలికాప్టర్ ద్వారా సుడిగాలి ప్రచారం సాగిస్తున్నారు. అనేక వేదికలపై ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. తాను ఓ కానిస్టేబుల్ కొడుకునని పదేపదే జనానికి పరిచయం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ పవన్ నిర్వహించిన ఎన్నికల సభల్లో ఎక్కడా అన్న చిరంజీవి పేరు మాత్రం నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. వేదిక ఎక్కినా కూడా నేను కానిస్టేబుల్ కొడుకును, నేను కానిస్టేబుల్ కొడుకును ఇదే జపం. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి పవన్ ఇదే తంతు. ఇదిలా ఉంటే ఒక్క పవన్‌కల్యాణ్ మాత్రమే కాదు, చిరంజీవి మరో సోదరుడు నాగేంద్రబాబు కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అదీ చిరంజీవి సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో నాగేంద్రబాబు పోటీలో ఉన్నారు. చిరంజీవి ఏ వేదిక ఎక్కినా కూడా తన తమ్ముడు నాగేంద్రబాబు తనకు తమ్ముడు మాత్రమే కాదని, వర్ణనకు అందని అనుబంధం తమదని చెపుతుంటారు. మరి అలాంటి తమ్ముడు పోటీలో ఉన్నా చిరు ఏమీ పట్టనట్టు విదేశాలకు వెళ్లిపోయారు. మెగా ఫ్యామిలీ నుంచి కనీసం ఎవరూ ప్రచారానికి రానేలేదు. ఈ ఘటనల నేపథ్యంలో అసలు మెగా ఫ్యామిలీలో లోగుట్టు ఏమిటనే ప్రశ్న జనం మదిని తొలిచేస్తోంది. చివరిరోజు మెరిసిన బన్ని.. సొంత జిల్లాలో భీమవరం అసెంబ్లీ స్థానానికి పవన్ కల్యాణ్ పోటీలో నిలిచారు. సొంత పార్లమెంట్ నియోజకవర్గం నరసాపురంలో చిరంజీవి తమ్ముడు, పవన్ అన్నయ్య నాగేంద్రబాబు పోటీలో నిలిచారు. ఇక మెగా ఫ్యామిలీ మొత్తం డెల్టాలో ప్రచారానికి దిగుతారని అంతా అనుకున్నారు. గతంలో చిరంజీవి పాలకొల్లులో పోటీ చేసినప్పుడు పవన్, బన్ని, అల్లు అరవింద్, చివరకు చిరంజీవి సతీమణి సురేఖ కూడా ప్రచారం చేశారు. ఇక ప్రస్తుత జనసేన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగేంద్రబాబు అయితే పాలకొల్లులోనే మకాం వేశారు. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన ప్రచారానికి దూరంగా ఉన్నారు. చివరిరోజు మంగళవారం ప్రచారంలో అల్లు అర్జున్ పాలకొల్లులో మామయ్య పక్కన మెరిశారు. మళ్లీ వెంటనే నరసాపురంలో జరిగిన సభకు బన్ని డుమ్మా కొట్టారు. అల్లు ఫ్యామిలీకి కూడా నరసాపురంతో అనుబంధం ఉంది. మరి బన్ని సైతం చినమామయ్య గెలుపుకోసం కొద్ది నిమిషాలే కేటాయించడం ఏమిటనేది అర్థంకాని విషయం. ఇక నాగేంద్రబాబు కుమార్తె, కుమారుడు వరుణ్‌తేజ్‌లు కూడా చివరి రోజుల్లో తూతూ మంత్రంగా ప్రచారం చేశారు. అది కూడా వారు తండ్రి నాగేంద్రబాబు కోసం ప్రచారం చేశారే తప్ప.. భీమవరంలో పోటీలో ఉన్న కల్యాణ్ బాబాయ్ కోసం కష్టపడ్డట్టుగా కనిపించలేదని జనం గుసగుసలాడుతుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి కనీసం ఓ ప్రకటన కూడా లేదు మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె పోటీలో ఉంటే, ఇష్టం లేకపోయినా కూడా జూనియర్ ఎన్టీఆర్, అతని మరో సోదరుడు కల్యాణ్‌రామ్‌లు సోదరి గెలపు కోసం ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. అక్కడ ఆమె ఓ ఎమ్మెల్యేగా మాత్రమే పోటీలో ఉంది. అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా భవిష్యత్ తేల్చుకోవడం కోసం ప్రజల ముందుకు వస్తున్నారు. ఇంత ప్రాముఖ్యం ఉన్నా కూడా చిరు ఫ్యామిలీ పెద్దల నుంచి జూనియర్ ఎన్టీఆర్ తరహాలో ప్రకటన కూడా రాకపోవడానికి కారణం ఏమిటో జనానికి అంతు చిక్కడంలేదు. చిరు వారసుడు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉపాసన, మేనల్లుడైన మరో యువహీరో సాయిధర్మతేజ్ లాంటి వాళ్లంతా ఏమైనట్లో అర్థంకాని ప్రశ్న. ఇక ఉండటానికి నామమాత్రంగా కాంగ్రెస్‌లో ఉన్నా క్రియాశీల రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉన్న చిరంజీవి ఇలాంటి కీలక సమయంలో జపాన్ పర్యటనకు వెళ్లిపోవడం కొసమెరుపు. -
సొంతూరును పట్టించుకోని ‘చిరు’ బ్రదర్స్
సాక్షి, నరసాపురం : ‘పేరుకే పెద్ద మనుషులు కాని వారివి చాలా చిన్న మనసులు. ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరుకు ఏదో చేయాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది కాని ఈ మెగా ఫ్యామిలీ మాత్రం సొంతూరును పట్టించుకోలేదు. మీ గుర్తుగా ఊరిలో గ్రంథాలయం కాని, ప్రభుత్వ ఆసుపత్రి కాని నిర్మించుకునేందుకు సొంతింటిని ఇవ్వాలని గ్రామస్తులు కోరినా పెడచెవిన పెట్టి డబ్బు కోసం ఇంటిని అమ్ముకున్న చరిత్ర వీరి సొంతం..’ మెగా ఫ్యామిలీ మొత్తానికి నరసాపురంతో పాటుగా జిల్లా మొత్తం అనుబంధం ఉంది. కానీ జిల్లాపై వారు ప్రేమ చూపిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. దేశంలో ఎంతో మంది ప్రముఖులు తమతమ జీవితాల్లో ఉన్నత శిఖరాలు చేరిన తరువాత జన్మభూమిపై మమకారాన్ని చూపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. చిరంజీవి ఫ్యామిలీ మాత్రం ఈ విషయంలో కనీసంగా పట్టించుకోకపోవడం గమనార్హం. చిరంజీవి తండ్రి వెంకట్రావుది పెనుగొండ. కానీ అత్తగారి ఊరు మొగల్తూరులో స్థిరపడ్డారు. మొగల్తూరులో ఉండగా చిరంజీవి నరసాపురం మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. నాగేంద్రబాబు కూడా ఇక్కడే పుట్టారు. చిరంజీవి తండ్రి ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేయడంతో అనేక ప్రాంతాలకు బదిలీ అయ్యేవారు. దీంతో ముగ్గురు బ్రదర్స్ మొగల్తూరులో అమ్మమ్మగారి ఇంటి వద్దే ఉండేవారు. చిరంజీవి, నాగేంద్రబాబులకు అయితే ఎక్కువ అనుబంధం ఉంది. ఈ ఇద్దరూ మొగల్తూరు హైస్కూల్లోనే చదవుకున్నారు. చిరంజీవి డిగ్రీ నరసాపురం వైఎన్ కళాశాలలో పూర్తి చేశారు. తన మొట్టమొదటి నాటకాన్ని వైఎన్ కళాశాలలోని అరబిందో ఆడిటోరియంలో చిరంజీవి ప్రదర్శించారు. కేవలం పుట్టిన ఊరుగానే కాదు మెగా బ్రదర్స్ ఎదుగుదలకు పునాదిపడ్డ ప్రాంతం నరసాపురం. కానీ వారి గుర్తుగా ఇక్కడ ఏమీ ఉండదు. వారు చిత్ర పరిశ్రమలో ఎదిగిన తరువాత ఈ ప్రాంతం వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. తీరప్రాంతం కావడం తరచూ అనేక ప్రకృతి విపత్తులు ఈ ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. అలాంటి సమాయాల్లో కూడా ఈ ప్రాంతం వారికి గుర్తుకే రాలేదు. మళ్లీ చిరంజీవి పీఆర్పీ స్థాపించిన తరువాతే ఈ ప్రాంతంలో అడుగుపెట్టారు. పురిటిగడ్డకు ఏమీ చేయలేదనే విమర్శలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. చిరంజీవి సాయం నిరాకరించిన మొగల్తూరులోని కళాశాల ఇక్కడ కనిపిస్తున్న కళాశాల మొగల్తూరులోనిది. మొగల్తూరు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టి పెరిగిన గ్రామం. నరసాపురం లోక్‌సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగేంద్రబాబు బాల్యం మొత్తం గడిచింది ఈ గ్రామంలోనే. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చిన్ననాడు తిరుగాడిన నేల ఇది. సినీ వినీలాకాశంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ మెగా బ్రదర్స్‌కు.. 1988లో స్థాపించిన ఈ కళాశాలకు ఎంతో సంబంధం ఉంది. మూరుమూల తీరప్రాంతం కావడంతో ఇక్కడ కళాశాల స్థాపించాలని నిర్ణయించిన గ్రామ పెద్దలకు ఆర్థికంగా చిక్కులు వచ్చాయి. ఇక్కడ పుట్టి పెరిగి సినీ హీరోగా వెలుగొందుతున్న చిరంజీవి వారికి గుర్తుకు వచ్చారు. కళాశాల స్థాపనకు సహకరించాలని గ్రామపెద్ద అందే భుజంగరావు తదితరులు అనేకమార్లు చిరంజీవిని కలిశారు. నాగేంద్రబాబుకు కూడా విషయం చెప్పి, అన్నను ఒప్పించాలని కోరారు. కానీ కనీసంగా కూడా వారి నుంచి సహకారం రాలేదన్నది అందే భుజంగరావు లాంటి పెద్దల ఆవేదన. దీంతో గ్రామంలోని అందేవారి కుటుంబమే అందే బాపన్న పేరుతో జూనియర్ కళాశాలను స్థాపించారు. తరువాత ఇందులోనే కోట్ల వెంకట రంగారావు డిగ్రీ కళాశాలను కూడా 1994లో ఏర్పాటు చేశారు. అభిమానులు చిరంజీవి పేరుతో గ్రంథాలయం కట్టారు మొగల్తూరు గ్రామంలోకి ప్రవేశించగానే పైన చిరంజీవి బొమ్మతో ఉన్న గ్రంథాలయం కనిపిస్తుంది. అయితే ఈ భవనంలో కూడా చిరు ఫ్యామిలీ సాయం రూపాయి కూడా లేదు. చిరంజీవి అభిమానులు చందాలు వసూలు చేసి ప్రభుత్వ గ్రంథాలయానికి భవనం కట్టించారు. చిరంజీవి బొమ్మ పెట్టుకున్నారు. సొంతూరులో గ్రంథాలయం తమ పేరుపై కడుతున్నారని తెలిస్తే, ఓ మాదిరి వ్యక్తి సైతం తనకు తోచిన సహాయం చేస్తారు. కానీ ఈ విషయంలోనూ తమ దారి అదికాదని నిరూపించారు మెగా బ్రదర్స్. వైఎన్ కళాశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిగ్రీ మూడేళ్లు చిరంజీవి ఇక్కడ చదివారు. నాగేంద్రబాబు సైతం ఇంటర్ ఇక్కడే చదివారు. కానీ కళాశాల అభివృద్ధికి ఎలాంటి సాయం చేసి ఎరుగరు. ఈ కళాశాలలో చదువుకున్న సినీ నటుడు కృష్ణంరాజు, దర్శకుడు దాసరి నారాయణరావు లాంటి వారు తమతమ పేర్లపై ఒక్కో భవనాన్ని కట్టించి ఇచ్చారు. కానీ వ్యక్తిగతంగా చిరు బ్రదర్స్ కళాశాల అభివృద్ధికి సాయం చేసిన పాపాన పోలేదు. అలాగే ఊరిలో స్నేహితులకు తోడ్పాటు ఇచ్చే విషయంలో కూడా శ్రద్ధ చూపలేదు. సొంత ఊరికి పైసా పెట్టలేదని విమర్శలు రావడంతో చిరంజీవి రాజ్యసభ సభ్యుడైన తరువాత ఎంపీ ల్యాండ్స్ రూ. 5 కోట్లు విడుదల చేయించి మొగల్తూరు మండలం పేరుపాలెంలో రోడ్లు, డ్రెయిన్స్ కట్టించి చేతులు దులుపుకున్నారు. అదే ఎంపీ ల్యాండ్స్ నుంచి వైఎన్ కళాశాలకు రూ. 15 లక్షలు ఇప్పించి విమర్శలను కడిగేసే చిరు ప్రయత్నం చేశారు గానీ జేబులో సొంత రూపాయి మాత్రం తీయనేలేదు. ఇక్కడ కనిపిస్తున్న పెంకుటింటికి మరో చరిత్ర ఉంది. సినీ ప్రపంచంలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుని, దానితో పాటే కోట్లు గడించిన మెగా ఫ్యామిలీకి చెందిన ఇల్లు ఇది. సాక్షాత్తు చిరంజీవి అమమ్మగారి ఇల్లు. ఈ ఇంట్లో ఉండే చిరంజీవి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకూ చదివారు. ఈ ఇంటిలోనే అద్దం ముందు నిల్చుని డాన్స్‌లు ప్రాక్టీస్ చేశారు. ఈ ఇంటిలో నుంచే సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. తరువాత మెగాస్టార్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చున్నారు. చిరంజీవి మేనమామకు చెందిన ఇల్లయినా కూడా, ఈ ఇల్లు చిరంజీవి అధీనంలోనే ఉండేది. అయితే చిరంజీవి జ్ఞాపకంగా ఈ ఇంటిని గ్రామంలో ఓ మోడల్‌గా తీర్చిదిద్దాలని గ్రామస్తులు, అభిమానులు కలలు కన్నారు. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ ఇంటిని గ్రామానికి ఇవ్వాలని చిరు అండ్ బ్రదర్స్‌ను అడిగారు. ఈ ఇంటిలో గ్రంథాలయం గానీ, ప్రభుత్వ ఆసుపత్రిగానీ ఏర్పాటు చేస్తామని మీ జ్ఞాపకంగా ఉంటుందని అడిగించారు. కానీ 1999లో కేవలం 1.25 లక్షల రూపాయలకు ఇంటిని వేరే వారికి అమ్మేసుకుని, పురిటి గడ్డలో చిన్నపాటి జ్ఞాపకాన్ని కూడా మిగల్చకుండా కక్కుర్తి చూపింది ఈ మెగా ఫ్యామిలీ. మేనమామ ఇల్లయినా కూడా ఆ సొమ్మేదో చిరు ఫ్యామిలీ చెల్లించి, ఈ ఇంటిని గ్రామానికి ఇవ్వడానికి ఈ మెగా బ్రదర్స్‌కు రూ 1.25 లక్షలు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ సొంతూరిపై కూడా పిసరంతైనా మమకారం లేదని నిరూపిస్తోంది ఈ ఘటన. సాయంచేసే మనసు లేదు చిరంజీవికి గాని, వారి సోదరులకు గానీ ఇతరులకు సాయం చేసే మనసు లేదు. నేను దగ్గరి నుంచి గమనించారు. మొగల్తూరులో కళాశాల పెట్టాలని అనుకున్నప్పుడు అనేకసార్లు చిరంజీవిని కలిశాము. అతనితో ఊళ్లో చదువుకున్న వాళ్లని కూడా తీసుకెళ్లేవాడిని. ఒకసారి కృష్ణంరాజుతో కూడా చెప్పించాము. చిన్నవాడు నాగేంద్రబాబుకు కూడా విషయం తెలుసు. సినిమాల్లో అంత ఎత్తుకు ఎదిగారు, ఎవ్వరికీ పైసా సాయం చేయలేదు. సొంత ఊరు, సొంత మనుషులకే ఏమీ చేయని వారు ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి ప్రజాసేవ చేస్తారంటే ఎలా నమ్మాలి. – అందే భుజంగరావు, పేరుపాలెం, మొగల్తూరు మండలం ఊరిపై వారికి పెద్దగా ప్రేమ ఉండదు చిరంజీవి, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాము. నేను ఒక సంవత్సరం సీనియర్ని. చిరంజీవి కుటుంబం ఇక్కడి నుంచి వెళ్లిన తరువాత ఈ ఊరిని అసలు పట్టించుకోలేదు. పెద్ద స్టార్ అయ్యాడు గానీ, ఈ ఊరిని అభివృద్ధి చేద్దాము, ఇక్కడి వారిని డెవలప్ చేద్దామని ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఊరిలో సొంత ఇంటిని కూడా అమ్మేసుకున్నారు. పవన్ కల్యాణ్ పెద్దగా తెలియదు కానీ, నాగేంద్రబాబు కూడా ఇక్కడే తిరిగేవారు. – పువ్వాడ శేషగిరి, మొగల్తూరు మనం గొప్పలు చెప్పుకోవడమే చిరంజీవి నా వద్దే చదువుకున్నాడు. 9, 10 తరగతులప్పుడు నావద్దే చదువుకున్నాడు. వాళ్ల నాన్నకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్స్ రావడంతో వేరే చోటుకు వెళ్లారు. కానీ అమ్మమ్మ ఊరు కావడంతో సెలవులకు ఇక్కడ (మొగల్తూరు)కే వచ్చే వారు. నాగేంద్రబాబు కూడా ట్యూషన్‌కు వచ్చేవాడు. పెద్ద వాళ్లు అయ్యారు. చిరంజీవిది మొగల్తూరు అని మనం గొప్పలు చెప్పుకోవడమే తప్పిస్తే వారు సొంతూరుకు చేసింది ఏమీలేదు. – పులగండం వెంకటేశ్వరరావు, చిరంజీవికి చదువు చెప్పిన టీచర్