సాక్షి, అమరావతి : సినిమా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. అదీ.. సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి, రూపొందించిన నిబంధనలే. గతంలో విడుదలైన సినిమాలకు ఈ నిబంధనల మేరకు సమాచారాన్ని, ఆధారాలను సమర్పించి, ఆ సినిమాల నిర్మాతలు రేట్లు పెంచుకున్నారు. చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలకు నచ్చలేదట. వెంటనే అవి ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి.
నిబంధనలు పాటించకపోయినా, ఆధారాలు సమర్పించకపోయినా సరే.. టిక్కెట్ రేట్లు పెంచాలంటూ అడ్డగోలుగా వాదిస్తున్నాయి. నిబంధనలు పాటించినట్టు ఆధారాలు సమర్పించినందునే గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు టిక్కెట్ రేట్లను తొలి వారం రోజుల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో నిబంధనలను పాటించినట్టు ఆధారాలు సమర్పించాలని చెబితే మాత్రం భోళా శంకర్ సినిమా నిర్మాణ సంస్థ ముఖం చాటేసింది. పైగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు నిజాలివీ..
టిక్కెట్ రేట్ల పెంపునకు నిబంధనలు ఇవీ...
సినిమా టికెట్ల రేట్లను తొలి వారం, పది రోజులపాటు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారుచేసింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చర్చించి మరీ ఈ విధి విధానాలను రూపొందించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 11న మెమో జారీ చేసింది. ఆ ప్రకారం హీరో హీరోయిన్, డైరెక్టర్ల పారితోíÙకాలు కాకుండా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యయం కలిపి రూ.100 కోట్లు దాటాలి.
సినిమా షూటింగ్‌లో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో చేయాలి. సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించాలి. దాన్ని చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ధ్రువీకరించాలి. సినిమా నిర్మాణానికి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ/ ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు సమర్పించాలి. మొత్తం 12 రకాల సాధారణ పత్రాలను సమర్పించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
నిబంధనలు పాటించకుండా టిక్కెట్ రేట్లు పెంచమంటే ఎలా?
భోళా శంకర్ సినిమాను నిరి్మంచిన అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ నిబంధనలను ఏవీ పట్టించుకోలేదు. తొలి వారం రోజులు టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వాలని ఆ సంస్థ రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ)కి జులై 30న దరఖాస్తు చేసింది. దానిని ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ పరిశీలించింది.
జీవో నంబర్ 2 ప్రకారం ఇచ్చి న ఉత్తర్వుల్లో నిబంధనలను పాటించాలని, ఆధారాలు చూపాలని ఈ నెల 2న లిఖితపూర్వకంగా చెప్పింది. కానీ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటివరకు ఆ ఆధారాలను సమర్పించలేదు. వైజాగ్ పోర్టు, అరకు ప్రాంతాల్లో 25 రోజలపాటు భోళా శంకర్ సినిమా షూటింగ్ చేసినట్టు అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అంతకు ముందు దరఖాస్తులో తెలిపింది.
అందుకు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ కోరింది. దీనిని సినిమా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. నిర్మాణ వ్యయం అఫిడవిట్, జీఎస్టీ చెల్లింపులు, ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు వంటి పత్రాలు వేటినీ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పించనే లేదు. ఇవేవీ లేకుండా టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది?.
ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఇదే రీతిలో అనుమతి
చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఈ నిబంధనల ప్రకారమే టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ సినిమాల నిర్మాణ సంస్థలు నిర్ణీత పత్రాలతో సహా దరఖాస్తు చేశాయి. వాటిని పరిశీలించి సక్రమంగా ఉండటంతో టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం
భోళా శంకర్ చిత్రం నిర్మాణ సంస్థ కూడా ఇదే రీతిలో నిబంధనలను పాటిస్తే రేట్ల పెంపునకు అనుమతిస్తామని ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ స్పష్టం చేసింది. కానీ కొందరు దురుద్దేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భోళా శంకర్ సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వడం లేదంటూ కొన్ని మీడియాలతోపాటు సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment