state government.
-
Fact Check: పరిమితికి లోబడ్డా పైశాచిక రాతలే!
సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రామోజీలో ఆవేశం శృతిమించుతోంది. సీఎం వైఎస్ జగన్ ‘సిద్ధం’ సభలు కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమవుతుండడంతో ఆయనలో కడుపుమంట తారాస్థాయికి చేరుతోంది. ఫలితంగా తన క్షుద్రపత్రిక ఈనాడులో రాతలు అదుపు తప్పడమే కాదు పట్టాలూ తప్పుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం అదే పనిగా అశుద్ధ కథనాలు వండివారుస్తున్న రామోజీ అప్పులపై అదే పనిగా కొట్టిన డప్పే మళ్లీ మళ్లీ కొడుతూ తన కడుపు ఉబ్బరాన్ని తీర్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. నిజానికి.. అప్పులపై నానా చెత్త పోగేసి విషం కక్కుతున్న ఆయన ఒకసారి కాగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి చూస్తే బాబు హయాంలో ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి ఎంత అప్పుచేశారో తెలుస్తుంది. అలాగే, వైఎస్సార్సీపీ హయాంలో కూడా ఆర్థిక సంఘం సిఫార్సులు ఏమిటి? ఎంత అప్పు చేశారనేది అర్థమైపోతుంది. కానీ, రామోజీ అలా చేయరు. ఎందుకంటే.. తన ఆత్మబంధువు చంద్రబాబు బండారం బయటపడిపోతుంది కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై రామోజీ ప్రచారం చేస్తున్న అబద్ధాల కుప్పలోని ‘ఫ్యాక్ట్‌చెక్’ఏమిటంటే.. బాబుకు, జగన్‌కు తేడా ఇదీ.. వైఎస్ జగన్ సర్కారు అప్పులపై నిత్యం అక్కసును రంగరించి తప్పుడు గణాంకాలతో డప్పు వాయించడంవల్ల నీ పత్రిక, నీ పరువు దిగజార్చుకోవడం తప్ప మరొకటి ఉండదు రామోజీ. వాస్తవానికి.. అప్పు చేయడం తప్పని ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడూ అనలేదు. పరిమితికి మించి అప్పు చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. అయినా, చేసిన అప్పులతో ఒక శాశ్వత కట్టడం కూడా కట్టకుండా కేవలం హంగులు, ఆర్భాటాలు, విలాసాలకు వృధా వ్యయం చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. పరిమితికి మంచి అప్పులు చేసినా మేనిఫెస్టోలో రైతులకు.. మహిళా సంఘాలకు, యువత తదితర రంగాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు. అసలు చంద్రబాబు తన ఐదేళ్లు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి అప్పులు చేశారని కాగ్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ రెండేళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగానే అప్పులుచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి తగ్గిపోవడంతో వ్యయం పెరిగినా పరిమితికి లోబడే అప్పులు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసింది. మీ చంద్రబాబు మాదిరిగా రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హామీలను జగన్ సర్కారు గాలికొదిలేయకుండా నవరత్నాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా హామీలను నెరవేర్చింది. నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నా ఏడుపేనా? మరోవైపు.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో పరిమితి ఉన్నప్పటికీ ఏకంగా రూ.26,668.46 కోట్లు తక్కువగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పుచేసింది. రాష్ట్ర విభజనానంతరం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జగన్ సర్కారు అతి తక్కువగా 2.18 శాతం ద్రవ్యలోటు రికార్డు చేసింది. కోవిడ్ లాంటి సంక్షోభం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఏ ఏడాది కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేయలేదు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసినా ఈనాడు రామోజీకి అది కనిపించలేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నా నిత్యం అప్పులపై తప్పుడు గణాంకాలతో ఈనాడు రామోజీ విషం కక్కుతున్నారు. నిజానికి.. అప్పులుచేసి రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కట్టకుండా, ఎన్నికల హామీలు అమలుచేయకుండా కన్సల్టెన్సీల పేరుతో, గ్రాఫిక్స్ పేరుతో, పోలవరం, తాత్కాలిక రాజధానికి బస్సుల్లో జనాన్ని పంపించి భజనలు చేయించుకోవడానికి చేసిన వృధా వ్యయాన్నే విపక్ష నేతగా జగన్ అప్పట్లో తప్పుబట్టారు ఇప్పుడు రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ మరోపక్క పరిమితికి లోబడే అప్పులు చేస్తూ ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తూ లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లను వారి ఖాతాల్లో జమచేశారు. అప్పుల గణాంకాలన్నీ కాగ్, ఆర్బీఐ నివేదికల్లో ఉన్నాయి. కళ్లు కనిపిస్తుంటే ఒకసారి చూడు రామోజీ యనమల మాటలు మర్చిపోతే ఎలా? ఇక ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి మీ బాబు ఐదేళ్లతో పాటు ఎన్నికల ముందు ఏప్రిల్, మే నెలలో కలిసి మొత్తం రూ.37,354 కోట్లు ఎక్కువగా అప్పుచేశారు. బాబు హయాంలో చేసిన ఎక్కువ అప్పుల కారణంగా ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయాల్సిన అప్పుల్లో కేంద్రం కోత విధించింది. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పరిమితి ఉన్నప్పటికీ ఇప్పటివరకు రూ.366.06 కోట్లు తక్కువ అప్పుచేసింది. వచ్చే ప్రభుత్వానికి అప్పు కూడా పుట్టకుండా మేమే అప్పులు చేశామని అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్న మాటలు మర్చిపోతే ఎలా రామోజీ? గుర్తున్నాసరే జగన్ సర్కారును తప్పుపట్టడమే పని కాబట్టి నిత్యం అప్పులపై తప్పుడు గణాంకాలతో డప్పు వాయిస్తున్నావా రామోజీ? అలాగే, చంద్రబాబు హయాంలో అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి 21.87 శాతం ఉండగా.. ఇప్పుడు వైఎస్సార్సీపీ హయాంలో అది 12.13 శాతమే ఉంది. అప్పులు, ఆదాయ, వ్యయాల గణాంకాలన్నీ ప్రతీనెలా కాగ్ తన వెబ్సైట్లో ఉంచుతోంది. ఇది ఒక్క ఏపీవే కాకుండా అన్ని రాష్ట్రాల గణాంకాలు ఉంచుతోంది. ఇందులో దాపరికం ఎక్కడిది? నీవన్నీ తప్పుడు రాతలు తప్ప అందులో ఒక్కటీ వాస్తవంలేదు రామోజీ.. బాబుకు, జగన్‌కు తేడా ఇదీ.. వైఎస్ జగన్ సర్కారు అప్పులపై నిత్యం అక్కసును రంగరించి తప్పుడు గణాంకాలతో డప్పు వాయించంవల్ల నీ పత్రిక, నీ పరువు దిగజార్చుకోవడం తప్ప మరొకటి ఉండదు రామోజీ. వాస్తవానికి.. అప్పు చేయడం తప్పని ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడూ అనలేదు. పరిమితికి మించి అప్పు చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. అయినా, చేసిన అప్పులతో ఒక శాశ్వత కట్టడం కూడా కట్టకుండా కేవలం హంగులు, ఆర్భాటాలు, విలాసాలకు వృధా వ్యయం చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. పరిమితికి మంచి అప్పులు చేసినా మేనిఫెస్టోలో రైతులకు.. మహిళా సంఘాలకు, యువత తదితర రంగాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు. అసలు చంద్రబాబు తన ఐదేళ్లు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి అప్పులు చేశారని కాగ్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ రెండేళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగానే అప్పులుచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి తగ్గిపోవడంతో వ్యయం పెరిగినా పరిమితికి లోబడే అప్పులు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసింది. మీ చంద్రబాబు మాదిరిగా రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హమీలను జగన్ సర్కారు గాలికొదిలేయకుండా నవరత్నాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా హామీలను నెరవేర్చింది. ఇదీ మీ బాబుకు వైఎస్ జగన్‌కు ఉన్న తేడా రామోజీ. -
10 లక్షల మంది బాలికలకు ‘స్వేచ్ఛ’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న బాలికలకు ‘స్వేచ్ఛ’ పథకం కింద శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు నెలల కాలానికి గాను మొదటి విడతగా జూన్‌లో ప్యాడ్స్ అందించగా, రెండో విడత పంపిణీని అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నారు. బాలికల స్కూల్ డ్రాప్ అవుట్‌కు కారణమవుతున్న రుతుక్రమ సమయంలో ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. కౌమారదశలో ఉన్న బాలికలు రుతుస్రావం సమయంలో పాఠశాల, కాలేజీ మానేస్తున్నారు. దీంతో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు రుతుక్రమం సమయంలో బాలికల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ ప్యాడ్స్‌ను ప్రభుత్వమే రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న 10,144 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థినులకు అందిస్తోంది. గతంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టగా, ఈ ఏడాది నుంచి పాఠశాల విద్యాశాఖలోని మధ్యాహ్న భోజన విభాగానికి అప్పగించారు. వచ్చే నెలలో 4 కోట్ల ప్యాడ్స్ పంపిణీకి ఏర్పాట్లు దేశంలో 23 శాతం మంది విద్యార్థినులు బహిష్టు సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 10,144 స్కూళ్లు, కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న 10 లక్షల మంది విద్యార్థినులకు ఒకొక్కరికి నెలకు 10 ప్యాడ్స్ చొప్పున ఏడాదికి 12 కోట్ల ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.35 కోట్ల నిధులను వెచ్చింది. ప్రతి నాలుగు నెలలకు ఒక పర్యాయం పంపిణీ కార్యక్రమం చేపడుతోంది. ఈ విద్యా సంవత్సరంలో సెపె్టంబర్ వరకు అవసరమైన ప్యాడ్స్‌ను జూన్ నెలలో అందించగా, రెండో విడత పంపిణీని అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు. దీంతో రుతుక్రమంలో ఎదురయ్యే సమస్యలు, నివారణ చర్యలపై విద్యార్థినుల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి పాఠశాలలోను నెలకు ఒకసారి మహిళా ఉపాధ్యాయులు, మహిళా పోలీసుల ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నారు. వినియోగించిన ప్యాడ్స్‌ను పర్యావరణ హితంగా నాశనం చేసేందుకు ప్రత్యేక డస్ట్బిన్లు, యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. -
రైల్వే విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట్: రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని... తెలంగాణలో అత్యంత తక్కువగా రైల్వే లైన్లు ఉండటంతో ఇక్కడ భారీ ఎత్తునరైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కానీ గతేడాదిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సహాయ నిరాకరణ వల్ల రాష్ట్రంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు, భూసేకరణలో బాధ్యతారాహిత్యంగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట.. తెలంగాణలో రైల్వే వ్యవస్ధ అభివృద్ధికి 30 ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 83,543 కోట్లు మంజూరు చేయడంతోపాటు 5,239 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో, ఏకకాలంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని వివరించారు. దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. దీంతోపాటు 8 లైన్ల డబ్లింగ్, 3 ట్రిప్లింగ్, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపిందని, ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సర్వే పూర్తవగానే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు రైల్వే శాఖ ఆమోదముద్ర వేయగా అందులో 21 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ. 2,300 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. తెలంగాణలో 2014కు ముందు ఏడాదికి సగటున 17.4 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం అధికారంతోకి వచ్చాక రాష్ట్రంలో ఏటా సగటున 55 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. -
కస్టోడియల్ మరణంపై సీసీటీవీ ఫుటేజీ అందజేయండి
సాక్షి, హైదరాబాద్: కస్టోడియల్ మరణం చోటుచేసుకున్న హైదరా బాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోని జూలై 7వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజీని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ఫుటేజీని చాంబర్‌లోగానీ, లేదా వీలైతే కోర్టుహాల్‌లోగానీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఎన్నిచోట్ల పనిచేస్తున్నాయి.. ఎన్నిచోట్ల పనిచేయడంలేదు.. లాంటి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో భవన నిర్మాణకార్మికుడు గత నెల 7న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. బిహార్‌కు చెందిన నితీశ్ నానక్‌రాంగూడలో భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి భద్రతాసిబ్బంది, కార్మికులు రెండువర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నితీశ్‌ని అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పత్రికల్లో వచ్చిన నితీశ్ మృతి వార్తపై న్యాయవాది రాపోలు భాస్కర్ స్పందించి కస్టోడియల్ మరణంపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 15 రోజులు గడువు కావాలి.. ‘మద్యం సేవించేందుకు అర్థరాత్రి భవన నిర్మాణకార్మికులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఈ వివాదంలో నితీశ్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు మూడు రోజులపాటు లాకప్‌లో ఉంచి విచారణ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన నితీశ్‌ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లే అతడు చనిపోయా డని పత్రికల్లో వచ్చింది. అయితే ఆయన గుండెపోటుతోనే చని పోయాడని పోలీసులు పేర్కొంటున్నారు’అని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువా రం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఫుటేజీ సమర్పిస్తామని చెప్పారు. దీనికి 15 రోజుల గడువు కావాలని కోరారు. గుండెపోటు కారణంగానే బాధితుడు మృతి చెందాడన్నారు. సీసీటీవీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ ఫుటేజీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. -
బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య పెండింగ్ బిల్లుల జగడం మళ్లీ రాజుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం పంపించగా.. వారం రోజుల నుంచి రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023 కూడా వీటిలో ఉంది. గవర్నర్ ఆమోదించాక, ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్లను జారీ చేశాక ఈ బిల్లులు చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి. రెండోసారి పంపినా నిరీక్షణ గవర్నర్ తమిళిసై గతంలో తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన మరో బిల్లుతో కలిపి మొత్తం 4 బిల్లులను ప్రభుత్వం ఇటీవల రెండోసారి అసెంబ్లీలో ఆమోదించింది. వీటితోపాటు మరో 8 కొత్త బిల్లులను సైతం ఆమోదించి.. మొత్తం 12 బిల్లులను రాజ్‌భవన్‌కు పంపింది. వీటి విషయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపిస్తే.. గవర్నర్ ఆమోదించక తప్పదని రాజ్యాంగంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు సదరు నాలుగు బిల్లులను ఆమోదించడం తప్ప గవర్నర్‌కు గత్యంతరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరికొన్ని రోజులు గవర్నర్ స్పందన కోసం నిరీక్షించిన అనంతరం.. పెండింగ్ బిల్లుల వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రెండు నెలల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. ఆలోగానే బిల్లులను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థులపై ‘పరిశీలన’! గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎరుకల సామాజికవర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బలహీనవర్గాల నుంచి దాసోజు శ్రవణ్‌లను నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ గత నెల 31న తీర్మానం చేసి పంపినా.. గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీలుగా నియమించేందుకు వారికి ఉన్న అర్హతలను గవర్నర్ పరిశీలిస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు గతంలో కొంతకాలం బీజేపీలో పనిచేసి.. తర్వాత బీఆర్ఎస్లో చేరినవారే. గతంలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ సమ్మతించకపోవడం నేపథ్యంలో.. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. నెలల తరబడి పరిశీలనలోనే..! పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై న్యాయ సలహా కోరినట్టు సమాచారం. బిల్లులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా? లేదా? అన్న అంశంపై పరిశీలన కోసం తనకు అవసరమైనంత సమయం తీసుకుంటానని గవర్నర్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నెలల తరబడి బిల్లులు రాజ్‌భవన్ ‘పరిశీలన’లో ఉండిపోతున్నాయి. రాజ్‌భవన్‌లో ఉన్న బిల్లులు ఇవీ.. రెండోసారి ఆమోదించి పంపినవి.. తెలంగాణ మున్సిపల్ బిల్లు–2022 తెలంగాణ ప్రైవేటు వర్సిటీల బిల్లు–2022 రాష్ట్ర పంచాయతీరాజ్ బిల్లు–2023 తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్) బిల్లు–2022 తొలిసారిగా ఆమోదించి పంపినవి.. తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ) బిల్లు – 2023 తెలంగాణ మున్సిపాలిటీల (రెండో సవరణ) బిల్లు–2023 తెలంగాణ ఆర్టీసీ బిల్లు (సర్కారులో ఉద్యోగుల విలీనం) – 2023 తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) బిల్లు–2023 తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ బిల్లు–2023 తెలంగాణ స్టేట్ మైనారిటీస్ కమిషన్ బిల్లు–2023 ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు–2023 టిమ్స్ వైద్య సంస్థల బిల్లు–2023 -
పాలమూరుకు లైన్ క్లియర్!
కుట్రలను ఛేదించి.. కేసులను అధిగమించి.. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులపై మంత్రి హరీశ్‌రావు ట్వీట్ సాక్షి, హైదరాబాద్: కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ పర్యావరణ అనుమతులు సాధించారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం సీఎం కేసీఆర్ సాధించిన మరో అపూర్వ, చరిత్రాత్మక విజయం..’’అని హరీశ్ పేర్కొన్నారు. కేసీఆర్ మొక్కవోని దీక్షకు, ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడుగా సాధించిన ఫలితం ఇదని.. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భంగా మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టమని అభివర్ణించారు. సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ/ఈఏసీ) పలు షరతులతో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫార్సు చేసింది. గత నెల 24న జరిగిన సమావేశం నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి. దీంతో త్వరలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ కానున్నాయి. రూ.55,086.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో మొత్తం 8,83,945 హెక్టార్ల ఆయకట్టుకు ప్రభుత్వం నీరు అందించనుంది. ఆ అధికారులపై చర్యలు తీసుకున్నాకే.. పర్యావరణ అనుమతులు లేకుండానే పనులను చేపట్టినందుకుగాను.. ప్రాజెక్టును ప్రతిపాదించిన అధికారి (ప్రాజెక్టు ప్రపోనెంట్)పై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 19 కింద రాష్ట్ర ప్రభుత్వం/కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ షరతు విధించింది. పర్యావరణ అనుమతుల జారీకి ముందే ఈ చర్యల వివరాలను సమర్పించాలని.. అనుమతులు జారీ చేసే వరకు పనులేవీ చేపట్టరాదని స్పష్టం చేసింది. రూ.106 కోట్ల జరిమానా.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో.. పర్యావరణ ప్రభావం మదింపు (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ఈఐఏ) నోటిఫికేషన్ 2006ను నీటిపారుదల శాఖ ఉల్లంఘించినట్టు నిపుణుల మదింపు కమిటీ గతంలోనే నిర్థారించింది. ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీకి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను అమలు చేయాల్సి ఉంటుందని తేల్చింది. ఈ క్రమంలో.. పర్యావరణ పునరుద్ధరణకు రూ.72.63 కోట్లు, ప్రకృతి వనరుల వృద్ధికి రూ.40.2 కోట్లు, సామాజిక వనరుల అభివృద్ధికి రూ.40.8 కోట్లు కలిపి మొత్తం రూ.153.7 కోట్లతో ఎస్ఓపీ ప్రణాళికలు అమలు చేస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించగా.. నిపుణుల కమిటీ ఆమోదించింది. ఈ మొత్తానికి ఐదేళ్ల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని షరతు విధించింది. ఇక అనుమతులు లేకుండానే రూ.21,200 కోట్లతో పనులు చేసినందున.. నిబంధనల ప్రకారం అందులో 0.5శాతం (రూ.106 కోట్లు) జరిమానాగా పీసీబీకి చెల్లించాలని ఆదేశించింది. కోర్టు కేసుల చిక్కులు తొలగినట్టే! పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. అయినా పనులు కొనసాగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానకి రూ.920.85 కోట్ల భారీ జరిమానా కూడా విధించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందింది. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలను మాత్రమే తరలించేలా ప్రాజెక్టు పనులకు సుప్రీం నుంచి అనుమతులు పొందింది. కానీ ఏకంగా 120 టీఎంసీల నీటి తరలింపునకు వీలుగా ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేస్తోందని ధ్రువీకరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు తాజాగా సుప్రీంకోర్టులో సంయుక్తంగా అఫిడవిట్ దాఖలు చేశాయి. దీంతో కోర్టు ధిక్కరణ చర్యలకు ఆస్కారం ఉండటంతో నీటిపారుదల శాఖవర్గాలు ఆందోళనలో పడ్డాయి. అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో దానిపై విచారణ జరగనుండగా.. ఆలోపే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో న్యాయపరమైన చిక్కులు తొలగిపోనున్నాయి. నిపుణుల కమిటీ షరతుల్లో ముఖ్యమైనవి పర్యావరణ/సామాజిక నష్టాన్ని నిర్దేశిత గడువులోగా పునరుద్ధరించాలి. మూడేళ్లలోగా రూ.153.7 కోట్లతో నష్ట నివారణ ప్రణాళిక అమలు పూర్తి చేయాలి. ఎన్జీటీ ఆదేశాల మేరకు నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు నష్ట నివారణ చర్యలుండాలి. అన్ని రిజర్వాయర్లకు 500 మీటర్ల దూరం వరకు పెద్దెత్తున మొక్కలు నాటి అందులో కనీసం 90శాతాన్ని సంరక్షించాలి. వాటర్షెడ్ల అభివృద్ధి ప్రణాళిక, వన్యమృగాల సంరక్షణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. ప్రాజెక్టు ఉద్యోగాలు, ఇతర అవకాశాల్లో స్థానిక గ్రామస్తులకు, నిర్వాసితుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఎల్రక్టీ్టషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి వృత్తుల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, వైద్యం వంటి మౌలిక వసతులు కల్పించాలి. ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామస్తులకు సోలార్ ప్యానెళ్లు అందజేయాలి. ప్రభావిత గ్రామాల్లో బయో గ్యాస్ ప్లాంట్లు నెలకొల్పాలి. -
Fact Check: ‘బోలో’ శంకరా.. నిబంధనలు పాటించరా?
సాక్షి, అమరావతి : సినిమా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. అదీ.. సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి, రూపొందించిన నిబంధనలే. గతంలో విడుదలైన సినిమాలకు ఈ నిబంధనల మేరకు సమాచారాన్ని, ఆధారాలను సమర్పించి, ఆ సినిమాల నిర్మాతలు రేట్లు పెంచుకున్నారు. చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలకు నచ్చలేదట. వెంటనే అవి ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. నిబంధనలు పాటించకపోయినా, ఆధారాలు సమర్పించకపోయినా సరే.. టిక్కెట్ రేట్లు పెంచాలంటూ అడ్డగోలుగా వాదిస్తున్నాయి. నిబంధనలు పాటించినట్టు ఆధారాలు సమర్పించినందునే గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు టిక్కెట్ రేట్లను తొలి వారం రోజుల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో నిబంధనలను పాటించినట్టు ఆధారాలు సమర్పించాలని చెబితే మాత్రం భోళా శంకర్ సినిమా నిర్మాణ సంస్థ ముఖం చాటేసింది. పైగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు నిజాలివీ.. టిక్కెట్ రేట్ల పెంపునకు నిబంధనలు ఇవీ... సినిమా టికెట్ల రేట్లను తొలి వారం, పది రోజులపాటు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారుచేసింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చర్చించి మరీ ఈ విధి విధానాలను రూపొందించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 11న మెమో జారీ చేసింది. ఆ ప్రకారం హీరో హీరోయిన్, డైరెక్టర్ల పారితోíÙకాలు కాకుండా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యయం కలిపి రూ.100 కోట్లు దాటాలి. సినిమా షూటింగ్లో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో చేయాలి. సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించాలి. దాన్ని చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ధ్రువీకరించాలి. సినిమా నిర్మాణానికి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ/ ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలి. మొత్తం 12 రకాల సాధారణ పత్రాలను సమర్పించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా టిక్కెట్ రేట్లు పెంచమంటే ఎలా? భోళా శంకర్ సినిమాను నిరి్మంచిన అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ నిబంధనలను ఏవీ పట్టించుకోలేదు. తొలి వారం రోజులు టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వాలని ఆ సంస్థ రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ)కి జులై 30న దరఖాస్తు చేసింది. దానిని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ పరిశీలించింది. జీవో నంబర్ 2 ప్రకారం ఇచ్చి న ఉత్తర్వుల్లో నిబంధనలను పాటించాలని, ఆధారాలు చూపాలని ఈ నెల 2న లిఖితపూర్వకంగా చెప్పింది. కానీ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటివరకు ఆ ఆధారాలను సమర్పించలేదు. వైజాగ్ పోర్టు, అరకు ప్రాంతాల్లో 25 రోజలపాటు భోళా శంకర్ సినిమా షూటింగ్ చేసినట్టు అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అంతకు ముందు దరఖాస్తులో తెలిపింది. అందుకు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ కోరింది. దీనిని సినిమా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. నిర్మాణ వ్యయం అఫిడవిట్, జీఎస్టీ చెల్లింపులు, ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి పత్రాలు వేటినీ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పించనే లేదు. ఇవేవీ లేకుండా టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది?. ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఇదే రీతిలో అనుమతి చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఈ నిబంధనల ప్రకారమే టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ సినిమాల నిర్మాణ సంస్థలు నిర్ణీత పత్రాలతో సహా దరఖాస్తు చేశాయి. వాటిని పరిశీలించి సక్రమంగా ఉండటంతో టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం భోళా శంకర్ చిత్రం నిర్మాణ సంస్థ కూడా ఇదే రీతిలో నిబంధనలను పాటిస్తే రేట్ల పెంపునకు అనుమతిస్తామని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ స్పష్టం చేసింది. కానీ కొందరు దురుద్దేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భోళా శంకర్ సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వడం లేదంటూ కొన్ని మీడియాలతోపాటు సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారు. -
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా..ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘రాష్ట్రంలో వరద కారణంగా ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? డిజాస్టర్ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారు? గోదావరి తీర ప్రాంత గ్రామాల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు? బాధితులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా? వరదలపై వార్‌రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికలప్పుడు ఏర్పాటు చేస్తారు కానీ.. వరదలు లాంటి అత్యవసర సమయంలో ఏర్పాటు చేయరా?..’అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఓ నివేదికను సోమవారం అందజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వెల్లడించడం లేదని, రక్షణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం లేదు.. ‘వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో వరదల కారణంగా 19 మంది మృతి చెందారని పత్రికల్లో వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. వరదలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కేంద్రం మరోసారి తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరదల నుంచి ప్రజలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత మంది మరణించారు? లాంటి వివరాలను వెల్లడించడం లేదు. కడెం ప్రాజెక్టు వద్ద తీవ్ర భయానక పరిస్థితి కొనసాగుతోంది. ప్రాజెక్టు తెగితే వందల గ్రామాలు నీట మునగడంతో పాటు లక్షల మంది నిరాశ్రయులుగా మారే అవకాశం ఉంది..’అంటూ న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్‌కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ‘వరద బాధితులకు తక్షణమే కనీస సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేయాలి. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని భద్రతా చట్ట ప్రకారం చర్యలు చేపట్టి వెంటనే రక్షించాలి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి..’అని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదు పరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై మొదటి హక్కు రాష్ట్రానికే
సాక్షి, అమరావతి : జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే మొదటి హక్కు అని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. డిపాజిటర్ల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకే ఆస్తులపై రెండు దర్యాప్తు సంస్థల జప్తు ఉత్తర్వుల వల్ల డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చాలన్న ప్రభుత్వ ప్రయత్నాల్లో తీవ్ర జాప్యం జరిగి బాధితులు నష్టపోతారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులను తిరిగి మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడం ఎంత వరకు సమంజసమో తేల్చాలని కోర్టును అభ్యర్థించారు.మనీలాండరింగ్, దివాలా చట్టాల కింద చేసిన జప్తులకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన జప్తునకు మధ్య వైరుద్ధ్యం లేదని తెలిపారు.డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అగ్రిగోల్డ్ ఎగవేసిన మొత్తాలను తిరిగి చెల్లిస్తోందని నివేదించారు. రూ.20 వేలు, అంతకన్నా తక్కువ డిపాజిట్లు చేసిన వారికి ఇప్పటికే రూ.900 కోట్ల మేర తిరిగి చెల్లించినట్లు చెప్పారు. మనీలాండరింగ్, దివాలా చట్టాలు డిపాజిటర్ల పరిరక్షణకు ఉద్దేశించినవి కావని చెప్పారు. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈడీ గానీ, బ్యాంకులు గానీ నీరుగార్చలేవని అన్నారు. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణంలో నిందితులు వారిని వారు రక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఇతర ఏ దర్యాప్తు సంస్థా నిరోధించలేదని తేల్చి చెప్పారు. ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర ఉందని చెప్పారు.అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి కొన్న తమ ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు, కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ నుంచి కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్మెంట్లను సైతం సీఐడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ప్లాట్ల యజమానులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నారు. గురువారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. -
కరోనాపై కంగారొద్దు.. అప్రమత్తమైన రాష్ట్ర వైద్యశాఖ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్యశాఖ ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే తొలి నుంచి కరోనా వైరస్ నియంత్రణ పట్ల పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ఒకవేళ మన వద్ద కేసుల నమోదు పెరిగినా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా గ్రామస్థాయిలోనే అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలతో పాటు, పాజిటివ్ రోగులకు వైద్యసేవలను అందుబాటులో ఉంచుతోంది. విలేజ్ క్లినిక్స్‌లో ర్యాపిడ్ కిట్లు గ్రామాల్లో ప్రజలకు వైద్యసేవలను చేరువ చేయడానికి 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో కరోనా పరీక్షతో పాటు 14 రకాల రోగ నిర్ధారణకు ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విలేజ్ క్లినిక్‌లో కనీసం 10 కరోనా పరీక్షల ర్యాపిడ్ కిట్లను వైద్యశాఖ నిరంతరం అందుబాటులో ఉంచుతోంది. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలినవారి నమూనాలను ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లకు పంపి పరీక్షించనున్నారు. రాష్ట్రంలో 13 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కేసులు అధికం కొత్త వేరియంట్ కేసుల నమోదుపైనా వైద్యశాఖ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పాజిటివ్ రోగుల నమూనాలను విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపి పరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు తేలింది. గత నెల ఒకటో తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ మధ్య పాజిటివ్ రోగుల 167 నమూనాలను సీక్వెన్సింగ్ చేశారు. వీటిలో అత్యధికంగా 84 కేసులు ఎక్స్‌బీబీ.1.16 రకం ఉన్నాయి. ఎక్స్‌బీబీ.1 రకం కేసులు 13, ఎక్స్‌బీబీ.2.3. వేరియంట్ కేసులు 17, మిగిలినవి ఇతర వేరియంట్లుగా తేలింది. ఎనీటైమ్ అందుబాటులో పడకలు, మందులు కరోనా తొలి వేవ్ నుంచి వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ.. ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ నిల్వలు, ఇతర చికిత్స వనరులను ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉంచుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో 12,292 సాధారణ, 34,763 ఆక్సిజన్, 8,594 ఐసీయూ, 1,092 పీడియాట్రిక్ ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి. 5,813 వెంటిలేటర్లు, 5,610 పీడియాట్రిక్ వెంటిలేటర్లు, 297 నియోనాటల్ వెంటిలేటర్లు, 3,902 డీటైప్ సిలిండర్లు, 15,565 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 170 పీఎస్ఏ ప్లాంట్లు ఉన్నాయి. వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి 2,64,109 ర్యాపిడ్ కిట్లు, 4,88,962 వీటీఎం–ఆర్టీపీసీఆర్ కిట్లు ఉన్నాయి. చికిత్సలో వాడే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు 1.39 లక్షలు, ఇతర మందుల నిల్వలు సరిపడా ఉన్నాయి. వందశాతం రెండుడోసుల వ్యాక్సినేషన్ రాష్ట్రంలో 18 ఏళ్లుపైబడిన 3.95 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయాల్సిందిగా లక్ష్యం ఉంది. ఈ క్రమంలో లక్ష్యానికి మించి 4.35 కోట్ల మందికి ఇప్పటికే రెండుడోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలందరికీ రెండుడోసుల వ్యాక్సిన్ వేశారు. 18–59 మధ్య వయసుగల 2.30 కోట్ల మందికి ప్రికాషన్ డోసు టీకాను వైద్యశాఖ వేసింది. ఆందోళనకర పరిస్థితి లేదు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి నియంత్రణలో ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ కేసులు పెరిగినా సమర్థంగా నియంత్రించడానికి అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయి. ఫీవర్ సర్వేను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం 49వ రౌండ్ ఫీవర్ సర్వే చేపడుతున్నాం. అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి అవసరం మేరకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైరస్ బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. సాధారణ ప్రజలు సైతం సమూహాల్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించాలి. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్యకార్యదర్శి వైద్య, ఆరోగ్యశాఖ -
డీఎస్సీ జోష్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర సర్కారు స్పష్టతనిచ్చింది. పక్షం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. భారీ సంఖ్యలో భర్తీ అయ్యే ఉపాధ్యాయ ఉద్యోగాలకోసం గంపెడాశలు పెట్టుకున్న యువత.. వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తే జిల్లాలో 1,300 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదికను జిల్లా విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించింది. ఎస్జీటీ ఖాళీలు 849.. ఇతర జిల్లాలతో పోలిస్తే ఉపాధ్యాయ ఖాళీలు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓపెన్ కేటగిరీ పోస్టులపై ఇతర జిల్లాల అభ్యర్థులనుంచి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే జిల్లాలో స్థానిక, స్థానికేతర ఉపాధ్యాయుల వ్యత్యాసం నిబంధనలకు మించి ఉండడంతో తాజాగా నిర్వహించే డీఎస్సీ స్థానికులకే పరిమితం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిఉంది. ప్రస్తుతం విద్యాశాఖ గుర్తించిన ఖాళీల్లో 849 ఎస్జీటీలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ నోట డీఎస్సీ మాట వినపడగానే టీచర్ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న యువతలో ఉత్సాహం రెట్టింపయింది. పక్షం రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడంతో ఉద్యోగాన్ని దక్కించుకునేందుకు అభ్యర్థులు ప్రత్యేక శిక్షణ కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని దిల్సుఖ్నగర్, నారాయణగూడ, సికింద్రాబాద్, అమీర్‌పేట, మోహిదీపట్నం ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లల్లో జిల్లాకు చెందిన పలువురు శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా డీఎస్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో కోచింగ్ సెంటర్లు ఫీజులను అమాంతం పెంచేశాయి. ఇదివరకు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ శిక్షణ సంస్థ రూ.10వేల ఫీజు తీసుకుంటుండగా.. ప్రస్తుతం రూ.15వేలకు పెంచినట్లు కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థి డి.నర్సింగ్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు.