సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రామోజీలో ఆవేశం శృతిమించుతోంది. సీఎం వైఎస్ జగన్ ‘సిద్ధం’ సభలు కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమవుతుండడంతో ఆయనలో కడుపుమంట తారాస్థాయికి చేరుతోంది. ఫలితంగా తన క్షుద్రపత్రిక ఈనాడులో రాతలు అదుపు తప్పడమే కాదు పట్టాలూ తప్పుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం అదే పనిగా అశుద్ధ కథనాలు వండివారుస్తున్న రామోజీ అప్పులపై అదే పనిగా కొట్టిన డప్పే మళ్లీ మళ్లీ కొడుతూ తన కడుపు ఉబ్బరాన్ని తీర్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. నిజానికి.. అప్పులపై నానా చెత్త పోగేసి విషం కక్కుతున్న ఆయన ఒకసారి కాగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి చూస్తే బాబు హయాంలో ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి ఎంత అప్పుచేశారో తెలుస్తుంది.
అలాగే, వైఎస్సార్‌సీపీ హయాంలో కూడా ఆర్థిక సంఘం సిఫార్సులు ఏమిటి? ఎంత అప్పు చేశారనేది అర్థమైపోతుంది. కానీ, రామోజీ అలా చేయరు. ఎందుకంటే.. తన ఆత్మబంధువు చంద్రబాబు బండారం బయటపడిపోతుంది కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై రామోజీ ప్రచారం చేస్తున్న అబద్ధాల కుప్పలోని ‘ఫ్యాక్ట్‌చెక్’ఏమిటంటే..
బాబుకు, జగన్‌కు తేడా ఇదీ..
వైఎస్ జగన్ సర్కారు అప్పులపై నిత్యం అక్కసును రంగరించి తప్పుడు గణాంకాలతో డప్పు వాయించడంవల్ల నీ పత్రిక, నీ పరువు దిగజార్చుకోవడం తప్ప మరొకటి ఉండదు రామోజీ. వాస్తవానికి.. అప్పు చేయడం తప్పని ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడూ అనలేదు. పరిమితికి మించి అప్పు చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. అయినా, చేసిన అప్పులతో ఒక శాశ్వత కట్టడం కూడా కట్టకుండా కేవలం హంగులు, ఆర్భాటాలు, విలాసాలకు వృధా వ్యయం చేయడాన్నే ఆయన తప్పుబట్టారు.
పరిమితికి మంచి అప్పులు చేసినా మేనిఫెస్టోలో రైతులకు.. మహిళా సంఘాలకు, యువత తదితర రంగాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు. అసలు చంద్రబాబు తన ఐదేళ్లు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి అప్పులు చేశారని కాగ్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోవిడ్ రెండేళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగానే అప్పులుచేసింది.
కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి తగ్గిపోవడంతో వ్యయం పెరిగినా పరిమితికి లోబడే అప్పులు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేసింది. మీ చంద్రబాబు మాదిరిగా రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హామీలను జగన్ సర్కారు గాలికొదిలేయకుండా నవరత్నాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా హామీలను నెరవేర్చింది.
నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నా ఏడుపేనా?
మరోవైపు.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో పరిమితి ఉన్నప్పటికీ ఏకంగా రూ.26,668.46 కోట్లు తక్కువగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పుచేసింది. రాష్ట్ర విభజనానంతరం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జగన్ సర్కారు అతి తక్కువగా 2.18 శాతం ద్రవ్యలోటు రికార్డు చేసింది. కోవిడ్ లాంటి సంక్షోభం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఏ ఏడాది కూడా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేయలేదు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసినా ఈనాడు రామోజీకి అది కనిపించలేదు. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నా నిత్యం అప్పులపై తప్పుడు గణాంకాలతో ఈనాడు రామోజీ విషం కక్కుతున్నారు.
నిజానికి.. అప్పులుచేసి రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కట్టకుండా, ఎన్నికల హామీలు అమలుచేయకుండా కన్సల్టెన్సీల పేరుతో, గ్రాఫిక్స్ పేరుతో, పోలవరం, తాత్కాలిక రాజధానికి బస్సుల్లో జనాన్ని పంపించి భజనలు చేయించుకోవడానికి చేసిన వృధా వ్యయాన్నే విపక్ష నేతగా జగన్ అప్పట్లో తప్పుబట్టారు ఇప్పుడు రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ మరోపక్క పరిమితికి లోబడే అప్పులు చేస్తూ ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తూ లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లను వారి ఖాతాల్లో జమచేశారు. అప్పుల గణాంకాలన్నీ కాగ్, ఆర్‌బీఐ నివేదికల్లో ఉన్నాయి. కళ్లు కనిపిస్తుంటే ఒకసారి చూడు రామోజీ
యనమల మాటలు మర్చిపోతే ఎలా?
ఇక ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి మీ బాబు ఐదేళ్లతో పాటు ఎన్నికల ముందు ఏప్రిల్, మే నెలలో కలిసి మొత్తం రూ.37,354 కోట్లు ఎక్కువగా అప్పుచేశారు. బాబు హయాంలో చేసిన ఎక్కువ అప్పుల కారణంగా ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేయాల్సిన అప్పుల్లో కేంద్రం కోత విధించింది. అయితే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పరిమితి ఉన్నప్పటికీ ఇప్పటివరకు రూ.366.06 కోట్లు తక్కువ అప్పుచేసింది.
వచ్చే ప్రభుత్వానికి అప్పు కూడా పుట్టకుండా మేమే అప్పులు చేశామని అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్న మాటలు మర్చిపోతే ఎలా రామోజీ? గుర్తున్నాసరే జగన్ సర్కారును తప్పుపట్టడమే పని కాబట్టి నిత్యం అప్పులపై తప్పుడు గణాంకాలతో డప్పు వాయిస్తున్నావా రామోజీ? అలాగే, చంద్రబాబు హయాంలో అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి 21.87 శాతం ఉండగా.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ హయాంలో అది 12.13 శాతమే ఉంది. అప్పులు, ఆదాయ, వ్యయాల గణాంకాలన్నీ ప్రతీనెలా కాగ్ తన వెబ్‌సైట్‌లో ఉంచుతోంది. ఇది ఒక్క ఏపీవే కాకుండా అన్ని రాష్ట్రాల గణాంకాలు ఉంచుతోంది. ఇందులో దాపరికం ఎక్కడిది? నీవన్నీ తప్పుడు రాతలు తప్ప అందులో ఒక్కటీ వాస్తవంలేదు రామోజీ..
బాబుకు, జగన్‌కు తేడా ఇదీ..
వైఎస్ జగన్ సర్కారు అప్పులపై నిత్యం అక్కసును రంగరించి తప్పుడు గణాంకాలతో డప్పు వాయించంవల్ల నీ పత్రిక, నీ పరువు దిగజార్చుకోవడం తప్ప మరొకటి ఉండదు రామోజీ. వాస్తవానికి.. అప్పు చేయడం తప్పని ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడూ అనలేదు. పరిమితికి మించి అప్పు చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. అయినా, చేసిన అప్పులతో ఒక శాశ్వత కట్టడం కూడా కట్టకుండా కేవలం హంగులు, ఆర్భాటాలు, విలాసాలకు వృధా వ్యయం చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. పరిమితికి మంచి అప్పులు చేసినా మేనిఫెస్టోలో రైతులకు.. మహిళా సంఘాలకు, యువత తదితర రంగాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు.
అసలు చంద్రబాబు తన ఐదేళ్లు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి అప్పులు చేశారని కాగ్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోవిడ్ రెండేళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగానే అప్పులుచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి తగ్గిపోవడంతో వ్యయం పెరిగినా పరిమితికి లోబడే అప్పులు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేసింది.
మీ చంద్రబాబు మాదిరిగా రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హమీలను జగన్ సర్కారు గాలికొదిలేయకుండా నవరత్నాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా హామీలను నెరవేర్చింది. ఇదీ మీ బాబుకు వైఎస్ జగన్‌కు ఉన్న తేడా రామోజీ.
Comments
Please login to add a commentAdd a comment