rate hike
-
బిట్ కాయిన్ కి ట్రంప్ కిక్కు.. ఇన్వెస్టర్లు ఫుల్ ఖుష్..! ఇక కోట్లే..!
-
కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?
ముడిసరుకులపై మరింతగా వెచ్చించాల్సి రావడం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సమస్యగా మారాయి. ఈ అంశాల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దిగ్గజ సంస్థల మార్జిన్లు గణనీయంగా తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగం నెమ్మదించడం.. హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్), మారికో, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) తదితర దిగ్గజాలకు ఆందోళన కలిగిస్తోంది.సాధారణంగా ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో పట్టణ ప్రాంతాల్లో వినియోగం వాటా 65–68 శాతం స్థాయిలో ఉంటుంది. పామాయిల్ ధరలు పెరగడం, వినియోగదారుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం వంటి కారణాలతో జీఎస్పీఎల్కి సెప్టెంబర్ క్వార్టర్ ఒక మోస్తరుగానే గడిచింది. సింథాల్, గోద్రెజ్ నంబర్ 1, హిట్ వంటి ఉత్పత్తులను తయారు చేసే జీఎస్పీఎల్ స్టాండెలోన్ ఎబిటా మార్జిన్లు తగ్గాయి.డాబర్ ఇండియా‘అధిక ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం’ వల్ల సెప్టెంబర్ క్వార్టర్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్లు డాబర్ ఇండియా పేర్కొంది. చ్యవన్‌ప్రాశ్, పుదీన్హరా వంటి ఉత్పత్తులను తయారు చేసే డాబర్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం క్షీణించి రూ.418 కోట్లకు, ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 3,029 కోట్లకు తగ్గాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్డిమాండ్ పడిపోతుండటంపై నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని త్రైమాసికాల క్రితం వరకు ఎఫ్అండ్బీ (ఫుడ్ అండ్ బెవరేజెస్) విభాగంలో డిమాండ్ రెండంకెల స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం 1.5–2 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. మ్యాగీ, కిట్‌క్యాట్, నెస్కెఫే మొదలైన బ్రాండ్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా అమ్మకాలు దేశీయంగా కేవలం 1.2 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. ప్రథమ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ మెగా సిటీలు, మెట్రోల్లోనే సమస్యాత్మకంగా ఉన్నట్లు నారాయణన్ తెలిపారు.ఊహించిదానికన్నా ఎక్కువ ప్రభావం..పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై చేసే ఖర్చులపై ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా తెలిపారు. పరిమాణంపరంగా చూస్తే తమ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి .. ఇటీవల కొద్ది నెలలుగా నెమ్మదించినట్లు హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా తెలిపారు. గ్రామీణ మార్కెట్లు క్రమంగా పట్టణ ప్రాంతాలను అధిగమిస్తున్నాయని వివరించారు. సర్ఫ్, రిన్, లక్స్, లిప్టన్, హార్లిక్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసే హెచ్‌యూఎల్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 2.33 శాతం తగ్గింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ తదితర ఉత్పత్తుల సంస్థ ఐటీసీ మార్జిన్లు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం, అధిక స్థాయి ఆహార ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ముడివస్తువుల ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కనిపించినట్లు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేట్లు పెంచే యోచనపామాయిల్, కాఫీ, కోకో, వంటి ముడిసరుకుల ధరలు పెరగడంతో మార్జిన్లను కాపాడుకోవడానికి తాము కూడా ఉత్పత్తుల రేట్లను పెంచాలని కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు యోచిస్తున్నాయి. సహేతుక స్థాయిలో రేట్లను పెంచి, ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మార్జిన్లను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నట్లు జీఎస్పీఎల్ ఎండీ సీతాపతి తెలిపారు. పండ్లు, కూరగాయలు, నూనెలు వంటి ముడిసరుకుల ధరలు భరించలేనంత స్థాయిలో పెరిగిపోతే ఉత్పత్తుల రేట్ల పెంపునకు దారి తీసే అవకాశం ఉందని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ పేర్కొన్నారు. -
వంటనూనె ధరలు మరింత ప్రియం?
దేశీయంగా వంటనూనెల ధరలు మరింత పెరగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెలలో ప్రభుత్వం వంట నూనులకు సంబంధించి దిగుమతి సుంకాలు పెంచడంతో రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) నివేదిక తెలిపింది.ప్రభుత్వం గత నెలలో ముడి పామాయిల్, సోయాబీన్, నన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలను 27.5 శాతం పెంచింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు వరుసగా 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం అధికమయ్యాయి. దేశంలో దాదాపు 58 శాతం ముడి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నారు. రిటైల్ ధరలు సైతం అందుకు తదనుగుణంగా పెరుగుతున్నట్లు ఎన్ఈఏ నివేదించింది.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త! రియల్టీ సంస్థల నయా మోసంసాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం..గురువారం నాటికి ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల బేస్ ధరలు వరుసగా 1145 డాలర్లు/టన్ను(రూ.96వేలు), 1160/టన్ను(రూ.97వేలు), 1165/టన్ను(రూ.98వేలు)గా ఉన్నాయి. ఇది గతంలో కంటే వరుసగా 32 శాతం, 18 శాతం, 26 శాతం పెరిగింది. దాంతో రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2024 ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 2.47 శాతం వంట నూనెల ధరల ద్రవ్యోల్బణం అధికమైంది. అయితే భారత్‌లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతోనే వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచినట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. -
దూసుకుపోతున్న బంగారం ధర
-
పూల ధరలకు రెక్కలు
-
వాహనదారులకు షాక్.. సీఎన్జీ ధరలు పెంపు
కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలను ప్రభుత్వం పెంచింది. పెరిగిన రేట్లు జూన్ 22 ఉదయం 6 గంటలకు అమల్లోకి వచ్చాయి. సీఎన్జీ ధర కేజీకి ఒక్క రూపాయి పెరిగింది. ఈ పెరుగుదల తరువాత, ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఎన్జీ కేజీ ధర రూ .75.09 కు చేరింది.ఈ పెరుగుదల ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లోని అనేక నగరాల్లో సీఎన్జీ రిటైల్ ధరలను ప్రభావితం చేయనుంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో సీఎన్జీ ధరలు ఒక్క రూపాయి పెరిగాయి. ఈ నగరాల్లో ఇప్పటి వరకు రూ.78.70 ఉన్న కేజీ సీఎన్జీ ధర ఇప్పుడు రూ.79.70కి చేరింది. ఇక ఎన్సీఆర్ పరిధిలోని గురుగ్రామ్‌లో సీఎన్జీ రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతోపాటు కర్నాల్, కైతాల్లలో కూడా సీఎన్జీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఇతర నగరాల్లో ధరలుహర్యానాలోని రేవారీ, మీరట్, ముజఫర్ నగర్, ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ, రాజస్థాన్ లోని అజ్మీర్, పాలి, రాజ్ సమంద్ లలో కూడా నేటి నుంచి సీఎన్ జీ ధరలు పెరిగాయి. రేవారీలో సీఎన్జీ ధరలు కేజీకి రూ .78.70 నుంచి రూ .79.70 కు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్, ముజఫర్ నగర్, షామ్లీలో రూ.79.08 నుంచి రూ.80.08కి పెరిగింది. రాజస్థాన్ లోని అజ్మీర్, పాలి, రాజ్ సమంద్ లలో ఇప్పుడు సీఎన్జీ ధర ఒక రూపాయి పెరిగింది. ఇక్కడ రూ.81.94 ఉన్న కేజీ సీఎన్జీ ధర రూ.82.94కు పెరిగింది. -
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయి?
దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. మార్కెట్లో బంగారంపై ఉన్న డిమాండ్ దృష్ట్యా రానున్న రోజుల్లో పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 18న దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. విశాఖ పట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,800 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది. -
మార్కెట్లో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
ఫిబ్రవరి 10 నుంచి మాఘమాసం ప్రారంభమైంది. దీంతో బంగారం ధరలు స్థిరంగా లేదేంటే, తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాలు నిజం చేస్తూ ఫిబ్రవరి 11న బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా ఉన్నాయి. ఇక దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. వైజాగ్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. విజయవాడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. బెంగళూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,600గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. -
Fact Check: ‘బోలో’ శంకరా.. నిబంధనలు పాటించరా?
సాక్షి, అమరావతి : సినిమా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. అదీ.. సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి, రూపొందించిన నిబంధనలే. గతంలో విడుదలైన సినిమాలకు ఈ నిబంధనల మేరకు సమాచారాన్ని, ఆధారాలను సమర్పించి, ఆ సినిమాల నిర్మాతలు రేట్లు పెంచుకున్నారు. చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలకు నచ్చలేదట. వెంటనే అవి ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. నిబంధనలు పాటించకపోయినా, ఆధారాలు సమర్పించకపోయినా సరే.. టిక్కెట్ రేట్లు పెంచాలంటూ అడ్డగోలుగా వాదిస్తున్నాయి. నిబంధనలు పాటించినట్టు ఆధారాలు సమర్పించినందునే గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు టిక్కెట్ రేట్లను తొలి వారం రోజుల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో నిబంధనలను పాటించినట్టు ఆధారాలు సమర్పించాలని చెబితే మాత్రం భోళా శంకర్ సినిమా నిర్మాణ సంస్థ ముఖం చాటేసింది. పైగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు నిజాలివీ.. టిక్కెట్ రేట్ల పెంపునకు నిబంధనలు ఇవీ... సినిమా టికెట్ల రేట్లను తొలి వారం, పది రోజులపాటు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారుచేసింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చర్చించి మరీ ఈ విధి విధానాలను రూపొందించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 11న మెమో జారీ చేసింది. ఆ ప్రకారం హీరో హీరోయిన్, డైరెక్టర్ల పారితోíÙకాలు కాకుండా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యయం కలిపి రూ.100 కోట్లు దాటాలి. సినిమా షూటింగ్లో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో చేయాలి. సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించాలి. దాన్ని చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ధ్రువీకరించాలి. సినిమా నిర్మాణానికి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ/ ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలి. మొత్తం 12 రకాల సాధారణ పత్రాలను సమర్పించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా టిక్కెట్ రేట్లు పెంచమంటే ఎలా? భోళా శంకర్ సినిమాను నిరి్మంచిన అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ నిబంధనలను ఏవీ పట్టించుకోలేదు. తొలి వారం రోజులు టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వాలని ఆ సంస్థ రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ)కి జులై 30న దరఖాస్తు చేసింది. దానిని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ పరిశీలించింది. జీవో నంబర్ 2 ప్రకారం ఇచ్చి న ఉత్తర్వుల్లో నిబంధనలను పాటించాలని, ఆధారాలు చూపాలని ఈ నెల 2న లిఖితపూర్వకంగా చెప్పింది. కానీ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటివరకు ఆ ఆధారాలను సమర్పించలేదు. వైజాగ్ పోర్టు, అరకు ప్రాంతాల్లో 25 రోజలపాటు భోళా శంకర్ సినిమా షూటింగ్ చేసినట్టు అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అంతకు ముందు దరఖాస్తులో తెలిపింది. అందుకు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ కోరింది. దీనిని సినిమా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. నిర్మాణ వ్యయం అఫిడవిట్, జీఎస్టీ చెల్లింపులు, ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి పత్రాలు వేటినీ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పించనే లేదు. ఇవేవీ లేకుండా టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది?. ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఇదే రీతిలో అనుమతి చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఈ నిబంధనల ప్రకారమే టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ సినిమాల నిర్మాణ సంస్థలు నిర్ణీత పత్రాలతో సహా దరఖాస్తు చేశాయి. వాటిని పరిశీలించి సక్రమంగా ఉండటంతో టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం భోళా శంకర్ చిత్రం నిర్మాణ సంస్థ కూడా ఇదే రీతిలో నిబంధనలను పాటిస్తే రేట్ల పెంపునకు అనుమతిస్తామని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ స్పష్టం చేసింది. కానీ కొందరు దురుద్దేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భోళా శంకర్ సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వడం లేదంటూ కొన్ని మీడియాలతోపాటు సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారు. -
ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే?
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. బుధవారం (జూలై 26)న ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు మేర పెంచి అందర్నీ ఆశ్చర్య పర్చింది. దీంతో ఫెడ్ రేటు 5.50 శాతం వద్ద అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఫెడ్ తాజా వడ్డీ రేట్లు 22 ఏళ్లలో ఎన్నడూ చూడని గరిష్ఠాలకు చేరింది. అంతేకాదు ద్రవ్యోల్బణంపై యుద్ధం సాగుతుందని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చైర్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికా ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందనే అందోళన మరింత ముదిరింది. (శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్‌తో...) భారతీయ ఐటీ నిపుణులను ఫెడ్ మరింత ఇబ్బంది పెట్టబోతోందా? ఫెడ్ రేట్ల పెంపు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపింది. ఈ పెంపు చాలా విభాగాలకు ప్రతికూలంగా ఉంటుందని, ఆర్థిక వృద్ధి తగ్గుతుందని నిపుణుల అంచనా. వరుస వడ్డీ రేట్ల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బ తీస్తుంది. మాంద్యంలోకి నెట్టవచ్చు. కనుక యుఎస్ ఆర్థిక మందగమనంతో అనేక భారతీయ ఐటీ సంస్థలకు దెబ్బేనని భావిస్తున్నారు. మింట్ నివేదిక ప్రకారం, అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక ప్రతికూలతల కారణంగా ఐటీ దిగ్గజాల ఫలితాలు బాగా దెబ్బ తిన్నాయి. 'బిగ్ ఫోర్' టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్‌సిఎల్ టెక్ కంపెనీల రెవెన్యూ గైడెన్స్‌లో భారీ కోత విధించుకోవడం గమనార్హం. యుఎస్ మాంద్యం సుదీర్ఘ దశలోకి జారిపోతే, అది అసంభవంగా కనిపిస్తోంటే, ఇండియన్ ఐటీ కంపెనీలకు కష్టాలు మరింత తీవ్రమవుతాయని అని నిపుణులు భావిస్తున్నారు (బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం) మరోవైపు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఫెడ్ ఇకపై రేటు పెంపునకే మొగ్గు చూపుతున్న కారణంగా భారతీయ ఐటీ రంగ సంస్థలు మరింత నష్టపోతాయా? అంటే చాలా పరిమిత ప్రభావాన్ని చూపుతుందని మరికొంతమంది నిపుణులు భావిస్తున్నారు ఈక్వినామిక్స్ రీసెర్చ్ ప్రైవేట్‌లో ఫౌండర్ & రీసెర్చ్ హెడ్ జి. చొక్కలింగం, యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు ముందే, భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఎగుమతి ఆదాయాలను డాలర్ రూపంలో పూర్ సింగిల్ డిజిట్లో పెంచుకోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. భారతదేశం ఐటి ఎగుమతుల, హైబేస్ హై గ్రోత్‌కు కొనసాగించడం అనేది నిర్మాణాత్మక సమస్య అన్నారు. ఐటీ ఎగుమతులు రేట్ల పెంపుదలకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 0-0.25 శాతం శ్రేణి నుండి దాదాపు 5 శాతానికి పెరిగే కాలంలో పెద్దగా తగ్గలేదు. కాబట్టి తదుపరి పెంపుదల ఏదైనా ఐటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. అయితే ఫెడ్ రేటు పెంపు రూపాయి మారకపు రేటును ప్రభావితం చేస్తుందని అదే పరిశ్రమ మార్జిన్లను కొనసాగించడానికి సహాయపడుతుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో నిర్మాణాత్మకంగా పెద్ద విజయం సాధిస్తే, సమీప భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు మారే అవకాశం ఉంది. రెండేళ్లుగా డాలర్ పరంగా పేలవమైన అంటే 4-5 శాతం వృద్ధి ఉంటుంద నేది అంచనా. ఏదైనా మరింత గణనీయమైన రేటు పెంపుదల రూపాయి మారకపు రేటును మరింత బలహీన పరుస్తుందని చొక్కలింగం అన్నారు. అమెరికా వడ్డీ రేట్లు ప్రస్తుతం రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ద్రవ్యోల్బణ కారణంగా, అక్కడి వ్యాపారాలు అనివార్యంగా తమ ఐటీ పెట్టుబడుల్లో కోత విధిస్తాయి, అనవసరమైన ఖర్చులను తగ్గిస్తా. ఇది భారతీయ ఐటీ సంస్థల ఆర్థిక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చన్నారు ఏంజెల్ వన్ హెడ్ అడ్వైజరీ అమర్ దేవ్ సింగ్, అయితే, దేశాలు,పరిశ్రమల అంతటా తమ ఆదాయ వనరులను వైవిధ్యపరిచిన ఐటీ బిజినెస్ ప్రస్తుత మార్కెట్ ప్రమాదాలను తట్టుకునే స్థితిలోనే ఉందన్నారు. -
ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!
సాక్షి,ముంబై: బ్యాంకింగ్ దిగ్గజాలు కస్టమర్లకు భారీ షాకిచ్చాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ,పబ్లిక్ లెండర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రెండూ తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లకు (ఎంసీఎల్ఆర్) రేట్లు పెంచాయి. సవరించిన రేట్లు జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ అనూహ్యం కొన్నింటికి వడ్డీరేటును తగ్గించి, మరికొన్నింటిపై వడ్డీరేటును పెంచడం గమనార్హం. ఒక నెల ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ వడ్డీరేటు 8.50 శాతం 8.35శాతానికి దిగి వచ్చింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 8.55 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గించింది. అయితే ఆరు నెలలు, ఏడాది కాలవ్యవధి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 8.75 శాతంనుంచి 8.85 శాతానికి పెంచడం విశేషం. (సూపర్ ఆఫర్: ఐపోన్ 13పై రూ. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇదే బాటలో నడిచింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం ఓవర్‌నైట్ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8శాతంనుంచి 8.10శాతానికి పెంచింది. ఒకటి, మూడు, ఆరు నెలల రేట్లును కూడా పెంచి వరుసగా 8.20, 8.30, 8.50 శాతంగా ఉంచింది. అలాగే ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.60శాతంగానూ, మూడేళ్ల రుణాలపై వడ్డీరేటు 8.80శాతంనుంచి 8.90 శాతానికి పెంచింది. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? మరిన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్స్, బిజినెస్ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్ -
వడ్డీ రేట్లు పెరిగినా.. ఇంటి కొనుగోలులో తగ్గేదేలే!
న్యూఢిల్లీ: ఇళ్ల కొనుగోళ్ల విషయంలో ‘వడ్డీరేట్ల’ పెరుగుదల పెద్ద అడ్డంకిగా కనిపించడం లేదని రియల్టీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంకులు వడ్డీరేట్లు పెంచినప్పటికీ, రూ.30–50 లక్షలు, రూ.50–75 లక్షల విభాగాల్లో ఇళ్ల రుణ డిమాండ్ పెరిగిందని ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ (ఐఎంజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. వడ్డీరేటు పెరుగుదల తీరిదీ.. కరోనా కాలంలో 4%గా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు), 2022 మే 4న తొలిసారి 0.40% పెరి గింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో 0.5% చొప్పున పెరుగుతూ, 5.9%కి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు 0.35% ఎగసి 6.25 శాతాన్ని తాకింది. వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5% రెపో రేటు పెరిగినట్లయ్యింది. ఈ పెంపుతో ఈ రేటు 6.5%కి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి నేపథ్యం. దీనికి అనుగుణంగా బ్యాంకులు కూడా గృహ రుణ రేట్లను పెంచుతూ వచ్చాయి. వినియోగదారులు నెలవారీ చెల్లింపుల (ఈఎంఐ) భారమూ పెరిగింది. ఈ పరిణామాలపై ఐఎంజీసీ తాజా నివేదికను ఆవిష్కరించింది. నివేదికలో ముఖ్యాంశాలు.. ► తక్కువ రుణ అర్హత, అలాగే ఆకర్షణీయమైన లీజింగ్ (అద్దె) ఎంపిక విధానాల ఆవిర్భావం కారణంగా మిలీనియల్స్ (1981–1996 మధ్య జన్మించినవారు) గృహ కొనుగోలు నిర్ణయాలను ఎక్కువగా వాయిదా వేస్తున్నారు. ► రెపో రేట్ పెంపుదల భారం రుణ గ్రహీతలకు బదలాయించడం జరుగుతోంది. దీనివల్ల వినియోగదారుల నెలవారీ చెల్లింపుల (ఈఎంఐ) భారం 10 నుంచి 25 శాతం శ్రేణిలో గణనీయంగా పెరిగింది. వడ్డీరేట్లు వార్షికంగా ప్రస్తుతం 9 నుంచి 9.25 శాతం పెరిగాయి. ► ఉద్యోగ కోతల నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో గత త్రైమాసికంలో మొండిబకాయిలు (ఎన్పీఏ) కొంత పెరిగాయి. సమస్య మరింత తీవ్రమైతే ఎన్‌పీఏలూ పెరగవచ్చు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నవారు రుణ కాల వ్యవధిని పెంచుకోడానికి బ్యాంకర్‌తో చర్చించవచ్చు. ఈఎంఐల చెల్లింపునకు తమ పొదుపులనూ వినియోగించుకోవచ్చు. రుణ చెల్లింపుల వైఫల్యం జరక్కుండా సాధ్యమైనంతగా ప్రయత్నించాలి. ఐఎంజీసీ కీలకపాత్ర... ప్రైవేటు రంగంలో 2014లో ఐఎంజీసీ కార్యకలాపాలు ప్రారంభించింది. 2008లో జారీ అయిన తనఖా గ్యారెంటీ మార్గదర్శకాల ప్రకారం దీనిని ఆర్బీఐ నియంత్రిస్తుంది. ఈ కంపెనీ టాప్ 5 ఒరిజినేటర్స్సహా 17 బ్యాంకింగ్ భాగస్వాములతో పని చేస్తుంది. వీటిలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు ఉన్నాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ హౌసింగ్ వీటిలో ఉన్నాయి. ప్రత్యేకంగా గృహ రుణాలకు సంబంధించి క్రెడిట్ డిఫాల్ట్ బీమాను ఐఎంజీసీ అందిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక కస్టమర్ హోమ్ లోన్‌పై డిఫాల్ట్ అయినట్లయితే, ఐఎంజీసీ బ్యాంకుకు నష్టపరిహారం ఇస్తుంది. తద్వారా బ్యాంక్నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. భారం తగ్గింపునకు ప్రయత్నం అవసరం రుణ రేట్లు పెరిగిన ప్రస్తుత తరుణంలో రుణ గ్రహీతముందు ఇప్పుడు రెండు ఎంపికలు ఉన్నాయి. ఇందులో మొదటిది... క్రెడిట్ ప్రొఫైల్, రీపేమెంట్ చరిత్ర ప్రాతిపదికన సాధ్యమైన తక్కువకు వడ్డీని అమలుచేయించుకునేలా తమ రుణదాతతో చర్చించాలి. మీ బ్యాంకర్ అభ్యర్థనను పట్టించుకోకపోతే, తక్కువ, పోటీపూర్వక వడ్డీరేటును పొందేందుకు ఇతర బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక రెండవ ఎంపిక విషయానికి వస్తే.. కస్టమర్లు తమ వార్షిక బోనస్‌లు, పొదుపుల నుంచి పాక్షిక ప్రీ–పేమెంట్లు చేయడం వల్ల అధిక రుణ భారం నుంచి ఊరట పొందవచ్చు. గృహ రుణాల ప్రీ–పేమెంట్లకుగాను తక్కువ వడ్డీరేట్లలో వేసిన స్థిర డిపాజిట్లను కూడా ఉపసంహరించుకోవచ్చు. వినియోగదారులు తమ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకోవడం తగదు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా రాబోయే త్రైమాసికాల్లో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. రుణ తిరిగి చెల్లించే సామర్థ్యం పరంగా భద్రతను పెంపొందించుకోడానికి తగిన మార్జిన్లను చేతిలో ఉంచుకోవాలి. – అమిత్ దివాన్, ఐఎంజీసీ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ -
ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్: వడ్డీ బాదుడు షురూ!
సాక్షి,ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అన్ని కాల రుణాలపై వడ్డీ రేటు పెంపునకు నిర్ణయంచింది. ఎస్బీఐ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటును10 బీపీఎస్ పాయింట్లుపెంచింది. ఫలితంగా వడ్డీరేటు 7.85 శాతం నుంచి 7.95 శాతానికి పెంచింది. ఫలితంగా నెల కాల రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు 8.10 శాతానికి పెరిగింది. పెరిగిన వడ్డీరేట్లు ఈ రోజునుంచే( ఫిబ్రవరి 15, బుధవారం) అమల్లోకి వచ్చాయని బ్యాంకు తెలిపింది.ఒక సంవత్సరం కాల రుణాలపై కొత్త రేటు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి ,రెండేళ్ల కాలవ్యవధికి 8.50 శాతం నుంచి 8.60 శాతం. మూడేళ్ల పదవీకాలానికి రేటు 8.60 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగిందని ఎస్బీఐ తెలిపింది. తాజా నిర్ణయంతో వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, గృహ రుణాలు తీసుకున్న వారికి అదనపు భారం తప్పదు. ఇటీవలి మానిటరీ పాలసీ రివ్యూలో ఆర్బీఐ రెపోరేటు పావు శాతం పెంపు నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 25 బీపీఎస్ పాయింట్లు పెంచి 6.50 శాతంగా ఉంచిన సంగతి తెలిసిందే. ఇవీ చదవండి! MBA Chai Wala: అపుడు టీ బిజినెస్‌తో కోట్లు, ఇపుడు మళ్లీ వార్తల్లోకి..విషయం ఏమిటంటే..! గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్! తేలిగ్గా తీసుకుంటే అంతే.. -
కరోనా ముందు కంటే తక్కువే
న్యూఢిల్లీ: ఆర్థిక రంగ కార్యకలాపాలు కరోనా మహమ్మారి రావడానికి ముందు నాటి స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూనే, ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలిచేందుకు ఆర్బీఐ రేట్ల పెంపును నిదానంగా అనుసరించొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ద్రవ్యోల్బణం 5.8 శాతంగా ఉండొచ్చంటూ ఏడీబీ గతంలో వేసిన అంచనాలను, తాజాగా 6.7 శాతానికి పెంచింది. ఇక తదుపరి ఆర్థిక సంవత్సరం (2023–24)లో ద్రవ్యల్బణం 5 శాతంగా ఉండొచ్చన్న అంచనాలను 5.8 శాతానికి సవరించింది. ఇది ఆర్బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి కొంచెం తక్కువని పేర్కొంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో గరిష్ట స్థాయిల్లోనే చలిస్తుందని ఏడీబీ తన తాజా నివేదికలో అంచనా వేసింది. సరఫరా వైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గుతాయన్న ఏడీబీ.. ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకున్నందున డిమాండ్ వైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయని వివరించింది. ఆర్థిక రంగ కార్యకలాపాలు కరోనా మహమ్మారి ముందు కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆర్బీఐ కీలక రేట్ల పెంపును చేపడుతుందని.. ద్రవ్యోల్బణాన్ని అంతర్జాతీయ అంశాల కంటే స్థానిక సరఫరా సమస్యలే ప్రభావితం చేస్తున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ప్రభావం ‘‘ఆర్థిక రంగ కార్యకలాపాలు ఇంకా మెరుగుపడాల్సి ఉన్నందున ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును వచ్చే ఏడాది వరకు నిదానంగా చేపట్టొచ్చు. అదే సమయంలో రూపాయి మారకాన్ని తనంతట అదే స్థిరపడేలా వదిలేయవచ్చు. ఇది బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్‌కు సాయపడుతుంది’’అని ఏడీబీ తన నివేదికలో వివరించింది. అంతర్జాతీయ డిమాండ్ బలహీనంగా ఉన్నందున వచ్చే రెండేళ్లపాటు భారత్ వృద్ధి, ఎగుమతులు గణనీయంగా ప్రభావితమవుతాయని అంచనా వేసింది. ఈ అంశాల ఆధారంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాను ఏడీబీఏ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. -
హైదరాబాదీలకు షాక్..భారీగా పెరిగిన ఇళ్ల ధరలు!
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో నివాస గృహాల ధర ఏప్రిల్–జూన్ మధ్య చదరపు అడుగుకు సగటున రూ.9,218గా ఉంది. గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 8 శాతం పెరిగింది. మొత్తం ఎనిమిది నగరాల్లో ఈ కాలంలో సగటు ధర పెరుగుదల రేటు 5 శాతంగా ఉంది. హౌసింగ్ డిమాండ్ పునరుద్ధరణ, నిర్మాణ వ్యయాల్లో పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణమని హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ నివేదిక– 2022 తెలిపింది. రియల్టర్ల అత్యున్నత సంస్థ క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా, డేటా అనలిటిక్ సంస్థ లియాసెస్ ఫోరాస్‌లు సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికలో హైదరాబాద్‌సహా ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పూణె, అహ్మదాబాద్‌ల రెసిడెన్షియల్ ప్రాపర్టీ సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు.. ► కార్పెట్ ఏరియా (గోడలు కాకుండా ఇంటి లోపలి స్థలం) ఆధారంగా ధరలను లెక్కించడం జరిగింది. ► 2022 ఏప్రిల్–జూన్ సమయంలో భారతదేశంలో గృహాల ధరలు మహమ్మారికి ముందు స్థాయిలను అధిగమించాయి. భారీ డిమాండ్, దీనికి తగిన సరఫరాలను ఇది సూచిస్తోంది. ► భవిష్యత్తులో ధరలు భారీ ఒడిదుడుకులు లేకుండా ఒక నిర్దిష్ట శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. ► పెరుగుతున్న వడ్డీరేట్ల ప్రభావాన్ని డెవలపర్లు ముందే గ్రహించి, తగ్గింపు ఈఎంఐ పథకాలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. పండుగ ఆఫర్లు, సరఫరా పరిస్థితి బాగుండడం వంటి అంశాల నేపథ్యంలో విక్రయాల పరిమాణం మెరుగుపడే అవకాశం ఉంది. ► గృహాల ధరల పెరుగుదలకు కీలకమైన నిర్మాణ సామగ్రి రేట్లు, కార్మికుల వేతనాల వంటివి ప్రధాన కారణాలు. ► గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం డిమాండ్‌పై స్వల్పంగానే ఉండవచ్చు. సెప్టెంబర్ నుంచి విక్రయాలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ► రాబోయే పండుగ సీజన్ మార్కెట్ సెంటిమెంట్‌ను సానుకూలంగా ఉంచే అవకాశం ఉంది. ఫలితంగా వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం నెలకొంది. ► ఢిల్లీ–ఎన్సీఆర్కు సంబంధించి చూస్తే, గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌కోర్సు రోడ్డులో ఇండ్ల ధర అత్యధికంగా 21 శాతం ఎగసింది. ► అహ్మదాబాద్‌లో గృహాల ధరలు 3 సంవత్సరాలలో అత్యధికం. గాంధీనగర్ సబర్బ్‌లో అత్యధికంగా 13 శాతం పెరుగుదల కనిపించింది. ► సెంట్రల్ చెన్నైలో ధరలు దాదాపు 13 శాతం క్షీణించగా, పశ్చిమ పూనమల్లిలో అత్యధికంగా 13 శాతం పెరిగింది. ► కోల్‌కతా నైరుతి, హౌరాలో అత్యధికంగా 13 శాతం ధరలు పెరిగాయి. ► ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్) మార్కెట్లో పశ్చిమ శివారు ప్రాంతాల్లో (దహిసర్‌కు ఆవల) 12 శాతం చొప్పున ధరలు పెరిగాయి. ► పూణె మార్కెట్లోని కోత్రుడ్, బ్యానర్ గృహాల ధరలు గరిష్టంగా 9–10 శాతం శ్రేణిలో పెరిగాయి. బడా రియల్టర్ల హవా... గత దశాబ్ద కాలంలో ఇళ్ల ధరలు పెద్దగా పెరగలేదు. బిల్డర్లు చాలా తక్కువ మార్జిన్లో పనిచేస్తున్నారు. కీలకమైన నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు వినియోగదారులపై భారం మోపడం మినహా వేరే మార్గం లేదు. అయినప్పటికీ ఈ రంగంలో బడా, విశ్వసనీయ బిల్డర్లు ఇతరుల కంటే మెరుగైన డిమాండ్‌ను చూస్తున్నారు. వారు మార్కెట్లో ప్రీమియంను (అధిక ధరల స్థితిని) నియంత్రించగలుగుతున్నారు. తద్వారా ప్రయోజనమూ పొందుతున్నారు. – పంకజ్ పాల్, ఏఐపీఎల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
క్రూడ్ మోత.. పెట్రో వాత..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రానున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక వచ్చే వారం నుంచి మళ్లీ రోజువారీ పెట్రో వాత మొదలు కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రేట్ల పెంపు రూ. 6–10 శ్రేణిలో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో ఉద్రిక్తతల వల్ల కావచ్చు లేదా పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షల వల్ల కావచ్చు రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ సరఫరా దెబ్బతినే అవకాశం ఉందని అంతర్జాతీయంగా మార్కెట్లో ఆందోళన నెలకొంది. దీంతో క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కు ఏకంగా 110 డాలర్ల పైకి ఎగిసింది. 2014 తర్వాత ముడి చమురు ధర ఈ స్థాయికి ఎగియడం ఇదే ప్రథమం. ఇక భారత్ కొనుగోలు చేసే రకం క్రూడాయిల్ రేటు, ఎన్నికల హడావిడి ప్రారంభం కావడానికి ముందు .. అంటే.. గతేడాది నవంబర్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లను రోజువారీ సవరించడం నిలిపివేసే నాటికి, సగటున 81.5 డాలర్ల స్థాయిలో ఉండేది. తాజాగా చమురు శాఖ గణాంకాల ప్రకారం ఇండియన్ బాస్కెట్ క్రూడాయిల్ ధర మార్చి 1న బ్యారెల్‌కు 102 డాలర్ల పైకి చేరింది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రానున్నాయని భావిస్తున్నారు. క్రూడాయిల్ 1 డాలర్ పెరిగితే.. సాధారణంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 1 డాలర్ మేర పెరిగితే .. లీటరు ఇంధనం రేటు 48–52 పైసల చొప్పున పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)లకు పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు సాధారణంగా లభించే రూ. 2.5 మార్జిన్ కాకుండా రూ. 5.7 మేర నష్టం వస్తోంది. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు తిరిగి మామూలు స్థాయికి రావాలంటే ఇంధనాల రిటైల్ ధరలను లీటరుకు రూ. 9 (10 శాతం) మేర పెంచాల్సి రావచ్చని బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. ‘ఈ పరిస్థితిని నెగ్గుకు రావాలంటే ఎక్సయిజ్ డ్యూటీ స్వల్పంగా (లీటరుకు రూ.1–3) తగ్గించి, రిటైల్ రేట్ల పెంచే వ్యూహం అనుసరించే అవకాశం ఉంది. రాష్ట్రాల ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో అప్పట్నుంచి రోజువారీగా రేట్ల పెంపు మళ్లీ మొదలు కావచ్చు‘ అని తెలిపింది. మరికొన్ని వర్గాలు రేట్ల పెంపు రూ. 6–10 స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో తుది విడత పోలింగ్ ఫిబ్రవరి 7న ముగియనుండగా, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. సాధారణంగా ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్ రేట్లను రోజువారీ ప్రాతిపదికన మారుస్తుంటాయి. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 118 రోజులుగా పెంచలేదు. ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ. 95.41, డీజిల్ రేటు రూ. 86.67గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీ, వ్యాట్ రేటును కొంత తగ్గించడంతో ఈ రేట్లు అమలవుతున్నాయి. లేకపోతే పెట్రోల్ ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 110.04, డీజిల్ రేటు రూ. 98.42గా ఉండేది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ రేటు గతేడాది అక్టోబర్ 26న 86.40 డాలర్ల గరిష్ట స్థాయికి చేరినప్పుడు దానికి అనుగుణంగా ఈ రేట్లను సవరించారు. రూపాయికి చమురు సెగలు అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 110 డాలర్లకు చేరుకోవడం ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా క్షీణిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ అనిశ్చితుల నేపథ్యంలో భగ్గుమన్న చమురు ధరలతో భార త్ దిగుమతుల బిల్లు మరింత భారంగా మారుతోంది. తద్వారా కరెంట్ ఖాతా లోటు పెరుగుతుందనే భయాలతో రూపాయి ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రూపాయి బుధవారం 47 పైసలు పతనమై 75.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 53 పైసలు నష్టపోయి 75.86 కనిష్టాన్ని తాకింది. రష్యా ఎఫెక్ట్ .. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తిలో రష్యా వాటా 10 శాతం వరకూ ఉంటుంది. యూరప్‌లో సహజ వాయువు ఉత్పత్తిలో మూడో వంతు వాటా రష్యాదే. భారత్ దాదాపు 85 శాతం క్రూడాయిల్ అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నప్పటికీ .. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో రష్యా నుంచి కేవలం 43,400 బ్యారెళ్లు (మొత్తం చమురు దిగుమతుల్లో సుమారు 1 శాతం) దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి బొగ్గు దిగుమతులు 1.8 మిలియన్ టన్నులుగా (మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం) ఉంది. రష్యా నుంచి భారత్ 2.5 మిలియన్ టన్నుల ద్రవీకృత సహజ వాయువు కూడా దిగుమతి చేసుకుంది. భారత్ ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్య, ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాల నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తోంది. కాబట్టి ప్రస్తుతం సరఫరాపరమైన సమస్యలేమీ భారత్‌కు లేవు. కానీ రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్, గ్యాస్ తగ్గిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్, దానికి అనుగుణంగా రేటూ పెరిగిపోతోంది. ఇదే ప్రస్తుతం భారత్‌ను కలవరపర్చే అంశం. సరఫరా ఉన్నా .. తగ్గని ఆందోళన.. రష్యా నుంచి సరఫరాకు అవాంతరాల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అమెరికా సహా అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ)లోని 31 సభ్య దేశాలు తమ దగ్గరున్న నిల్వల్లో 60 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాయి. అయినా క్రూడ్ రేటు పరుగు ఆగలేదు. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ ధర బుధవారం ఒక దశలో 6.50% ఎగిసి 111.7 డాలర్లకు చేరింది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలోను మార్చి డెలివరీ కాంట్రాక్టు రూ. 436 (5.5 శాతం) పెరిగి రూ. 8,341 వద్ద ట్రేడయ్యింది. ఐఈఏ అదనంగా అందించే క్రూడాయిల్ ఏ మూలకూ సరిపోదని, రష్యా ఆరు రోజుల్లో 60 మిలియన్ బ్యారెళ్లకు మించి ఉత్పత్తి చేస్తుందని అంచనా. 150 డాలర్లకూ పెరగొచ్చు.. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి ముడిచమురు రేటు 86 డాలర్లకు దిగి రావచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. అయితే, రష్యా నుంచి ఇంధన ఎగుమతులు నిల్చిపోతే ధర 150 డాలర్లకు కూడా ఎగియవచ్చని పేర్కొంది. ‘స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆయిల్ సరఫరా పూర్తిగా నిల్చిపోతే (ఇరాన్ ఎగుమతులు మళ్లీ పునరుద్ధరించి, వ్యూహాత్మక చమురు నిల్వలను వాడుకుంటే పాక్షికంగా తగ్గవచ్చు) ముడి చమురు రేటు బ్యారెల్‌కు 150 డాలర్లకు పెరగొచ్చు. అలా కాకుండా ఇంధన లావాదేవీలను వదిలేసి.. ఆంక్షలను మిగతా విభాగాలకే పరిమితం చేస్తే మాత్రం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రేటు సగటున 110 డాలర్ల స్థాయిలో తిరుగాడవచ్చు. అప్పుడప్పుడు 120 డాలర్ల స్థాయినీ తాకుతుండవచ్చు‘ అని జేపీ మోర్గాన్ పేర్కొంది. ఉత్పత్తి పెంపుపై ఒపెక్ మల్లగుల్లాలు.. ఇంధన కొరత పరిస్థితిని చక్కదిద్దేందుకు చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ దృష్టి పెట్టింది. ఉత్పత్తిని ఎంత మేర పెంచాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. రేటు పెరగడమనేది ఉత్పత్తి దేశాలకు లాభదాయకమే అయినప్పటికీ దీనివల్ల వినియోగ దేశాలపై భారం పెరిగి అవి మాంద్యంలోకి జారుకుంటే, ఆయిల్‌కు డిమాండ్ పడిపోయే ప్రమాదం కూడా ఉందనే అభిప్రాయం నెలకొంది. ఒపెక్ దేశాలు చాలా ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టఫ్ట్స్ యూనివర్సిటీలోనిక్లైమేట్ పాలసీ ల్యాబ్ ఎండీ అమీ మయర్స్ అభిప్రాయపడ్డారు. అటు ఉక్రెయిన్‌పై దాడుల కోసం రష్యాకు భారీగా ఇంధనం అవసరం అవుతుంది కాబట్టి అది ఎక్కువగా ఎగుమతులు కూడా చేయలేకపోవచ్చని ఆమె తెలిపారు. అలాంటప్పుడు ఆ కొరతను ఎవరు భర్తీ చేస్తారన్నది కూడా ఆలోచించాల్సిన అంశమన్నారు. ప్రస్తుతానికైతే సౌదీ అరేబియాకు భారీ ఉత్పత్తి సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
కార్ల రేట్లు రయ్..!
న్యూఢిల్లీ: ముడి వస్తువుల వ్యయాలు పెరిగిపోవడంతో కార్ల తయారీ కంపెనీలు మళ్లీ రేట్ల పెంపు బాట పట్టాయి. మారుతీ సుజుకీ, ఆడి, మెర్సిడెస్ తదితర సంస్థలు జనవరి 1 నుంచి ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించాయి. పెంపు అనేది మోడల్‌ను బట్టి ఆధారపడి ఉంటుందని దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ (ఎంఎస్ఐ) తెలిపింది. ఎంత మేర పెంచేది మాత్రం వెల్లడించలేదు. ‘వివిధ ముడి వస్తువుల ధరలు ఎగియడం వల్ల వాహనాల తయారీ వ్యయాలపై గత ఏడాది కాలంగా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో అదనపు వ్యయాల భారంలో కొంత భాగాన్ని వాహనాల రేట్ల పెంపు రూపంలో కస్టమర్లకు బదలాయించక తప్పడం లేదు‘ అని కంపెనీ వివరించింది. ‘కమోడిటీల రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు కూడా గణనీయంగానే ఉండవచ్చు‘ అని ఎంఎస్ఐ సీనియర్ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యాచ్‌బ్యాక్ ఆల్టో మొదలుకుని ఎస్యూవీ ఎస్ క్రాస్ దాకా వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది. వీటి ధరలు సుమారు రూ. 3.15 లక్షల నుంచి రూ. 12.56 లక్షల వరకూ (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటున్నాయి. మారుతీ ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సార్లు రేట్లు పెంచింది. జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబర్‌లో 1.9 శాతం.. మొత్తం మీద 4.9 శాతం మేర పెంచింది. ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్‌తో పాటు ఇతర ముఖ్యమైన లోహాల ధరలు గత ఏడాది కాలంగా పెరుగుతూనే ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. వాహన తయారీ వ్యయాల్లో వీటి వాటా 75–80 శాతంగా ఉంటుందని, అందుకే ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతోందని ఆయన పేర్కొన్నారు. 2 శాతం వరకూ మెర్సిడెస్ పెంపు.. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్–బెంజ్.. జనవరి 1 నుంచి తమ కార్ల ధరలను 2 శాతం వరకూ పెంచనున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లను జోడిస్తుండటం, ముడి వస్తువుల ధరలు పెరుగుతుండటం ఇందుకు కారణమని వివరించింది. అయితే, ఎంపిక చేసిన కొన్ని మోడల్స్‌కు మాత్రమే పెంపును వర్తింపచేయనున్నట్లు పేర్కొంది. జీఎల్ఈ 400, జీఎల్ఈ 400డి ఎస్‌యూవీలను ఇప్పటికే బుక్ చేసుకుని, డెలివరీ కోసం ఏప్రిల్ నుంచి నిరీక్షిస్తున్న కస్టమర్లకు ధర పెంపుపరంగా రక్షణ ఉంటుందని వివరించింది. ఆడి 3 శాతం వరకూ.. అటు ఆడి కూడా తమ వాహనాల ధరలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 3 శాతం వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి వస్తువులు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని వివరించింది. ఏ4, ఏ6, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ తదితర మోడల్స్‌ను దేశీయంగా ఆడి విక్రయిస్తోంది. 2021లో అయిదు ఎలక్ట్రిక్ కార్లతో పాటు మొత్తం 9 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. అసాధారణంగా పెరుగుతున్న కమోడిటీల ధరలు.. కమోడిటీ ధరల పెరుగుదల భారం కంటే తాము తక్కువే పెంచామని శ్రీవాస్తవ వివరించారు. ‘గతేడాది ఏప్రిల్–మేలో కేజీ ఉక్కు ధర రూ. 38గా ఉండేది. ఈ ఏడాది అది రూ. 77కి పెరిగిపోయింది. ఇది అసాధారణ స్థాయి. ఉక్కు రేట్లు.. అలాగే ప్లాస్టిక్ ఖర్చులు కూడా భారీ స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇక చైనాలో అల్యూమినియం ఉత్పత్తి పడిపోవడంతో టన్ను ధర 1,700–1,800 డాలర్ల నుంచి ఏకంగా రూ. 2,700–2,800 డాలర్లకు ఎగిసింది. అలాగే రాగి, ఇతర విలువైన లోహాల ధరలు కూడా పెరిగిపోయాయి. రేట్లు తగ్గుతాయేమోనని మేము వేచి చూస్తూ ఉన్నప్పటికీ అది జరగలేదు. మా పరంగా మేము ఖర్చులు తగ్గించుకోవడం వంటి చర్యలు అన్నీ తీసుకున్నాం. కానీ ముడి వస్తువుల వ్యయాలు ఈ స్థాయిలో ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు. అందుకే రేట్ల పెంపు నిర్ణయం తీసుకోక తప్పలేదు‘ అని ఆయన తెలిపారు. -
సామాన్యుల నెత్తి మీద మరో పిడుగు..!
Paint Companies To Hike Prices In December Again: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు, అధిక రిటైల్ ద్రవ్యోల్భణంలో సతమతమవుతున్న సామాన్యుల నెత్తి మీద మరో భారం పడనుంది. దేశవ్యాప్తంగా పెయింట్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ముడిపదార్థాల ధరలు, ఇంధన వ్యయాలతో పోరాడుతున్న పెయింట్ కంపెనీలు మార్జిన్లను కాపాడుకునేందుకు గాను వరుసగా మరోసారి పెయింట్ధరలను పెంచనున్నాయి. పెయింట్ ఇండస్ట్రీలో సుమారు 50 శాతం మేర వాటాలను కల్గిన ఏషియన్ పెయింట్స్, బెర్జర్ కంపెనీలు వచ్చే నెల 5 నుంచి సుమారు 4-6 శాతం మేర పెయింట్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఈ కంపెనీలు దాదాపు 8-10 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఈ ఏడాది మొత్తంగా పెయింట్ ధరలు రికార్డుస్థాయిలో 19-20 శాతం మేర పెరిగాయి. దిగ్గజ పెయింట్ కంపెనీలు ధరల పెంపును ప్రకటించడంతో అక్జో నోబెల్ ఇండియా , ఇండిగో పెయింట్స్ వంటి పెయింట్ కంపెనీలు కూడా ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ద్రవ్యల్భోణం...! ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సప్లై చైన్ రంగాల్లోని అంతరాయాలు నియంత్రణలోకి వచ్చిన ముడిసరుకు ఖర్చులు తగ్గుముఖం పడతాయనే అంచనాలు తలకిందులైనాయి. పెయింట్ కంపెనీలు కనీస మార్జిన్ లాభాలను పొందేందుకుగాను కచ్చితంగా ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అమిత్ సింగల్ క్యూ2 ఫలితాల్లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. గత 40 ఏళ్లలో కనీస వస్తు ధరల్లో ఈ విధమైన ద్రవ్యోల్బణాన్ని చూడలేదని అమిత్ సింగల్ అన్నారు. ఒక వేళ ధరలను పెంచకపోతే కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్ రేట్స్ భారీగా పడిపోయే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తపరిచారు. ఆపరేటింగ్ మార్జిన్లను 18-20 శాతం స్థాయిలో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏషియన్ పెయింట్స్ మేనేజ్మెంట్ సూచించింది పెంపుదల అనివార్యం... పెయింట్ ధరల పెంపు అనివార్యమని బెర్జర్ పెయింట్స్ ఎమ్డీ, సీఈవో అభిజీత్ రాయ్ అన్నారు. FY22 క్యూ2లో దాదాపు అన్ని పెయింట్ కంపెనీలు రెండంకెల వాల్యూమ్ వృద్ధిని సాధించాయి. FY22 క్యూ4లో కనీసం నుండి 18 శాతం ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. చదవండి: పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా? -
రైల్వే స్టేషన్లో ఆ టికెట్ కన్నా ప్లాట్‌ఫామ్ టికెటే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం ధర పెరిగింది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు అని చెబుతూ గతంలో మాదిరి ఈసారి కూడా ధరలు పెంచేశారు. రూ.30 ఉన్న టికెట్‌ను రూ.50కి దక్షిణ మధ్య రైల్వే పెంచేసింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా స్టేషన్లో రద్దీని నియత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది. లాక్డౌన్ మళ్లీ విధిస్తారేమోననే భయంతో ప్రజలు, వలస కార్మికులు ఇళ్ల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణం టికెట్ కన్నా ప్లాట్‌ఫాం టికెట్ అధికంగా ఉందని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
మొబైల్స్‌పై మళ్లీ బాదుడు
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల వినియోగదారులకు మరో విడత ధరల పెంపు వడ్డన తప్పేట్లు లేదు. చిప్సెట్లకు తీవ్ర కొరత నెలకొనడంతో కంపెనీలు ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. పరిశ్రమ ఇప్పటికే విడిభాగాల కొరతను ఎదుర్కొంటూ, పన్నుల పెంపు, కరోనా కారణంగా కొన్ని నెలల పాటు అమ్మకాల్లేని పరిస్థితులను చవిచూడగా.. ఇప్పుడు చిప్సెట్ల కొరత రూపంలో మరో సమస్య వచ్చి పడింది. ధరలను మరో విడత పెంచితే 2020లో నాలుగో విడత పెంపు అవుతుంది. ఫోన్ల ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెంచొచ్చని తయారీదారులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, అంతర్జాతీయంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరం నెలకొనడంతో ఉత్పత్తులకు–ధరల మధ్య సమతుల్యం విషయంలో కంపెనీలకు సమస్య ఏర్పడింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 5.43 కోట్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు నమోదు కాగా.. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం అధికం. చైనాకు చెందిన హువావే నుంచి అతిపెద్ద కాంట్రాక్టు రావడంతో చిప్సెట్ల డిమాండ్–సరఫరా మధ్య అంతరం పెరిగిపోయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చిప్సెట్లకు హువావే భారీ ఆర్డర్ ‘‘హువావే భారీ సంఖ్యలో చిప్సెట్లను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లు సంస్థ అవసరాల పరంగా చూస్తే ఏడాదికి మించినవి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చిప్సెట్లకు తీవ్ర కొరత ఏర్పడింది’’ అని ఓ ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మరో ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ సైతం స్పందిస్తూ.. ‘‘హువావే భారీ ఆర్డర్ మధ్య స్థాయి కంపెనీలకు చిప్సెట్ల సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ కంపెనీలకు సరఫరాదారులతో స్వల్పకాల కాంట్రాక్టులే ఉన్నాయి’’ అని వివరించారు. అంతర్జాతీయంగా అతిపెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీలకు ఇటువంటి పరిస్థితుల నుంచి సాధారణంగా రక్షణ ఉంటుందని.. అయినకానీ, వాటి సరఫరాలపైనా 10–20% వరకు ప్రభావం ఉండొచ్చన్నారు. చిప్సెట్ల సరఫరా ఇప్పుడు మరీ తగ్గిపోయిందంటూ తమ అవసరాల్లో మూడు శాతం వరకే సమకూర్చుకోగలిగిన పరిస్థితి ఉందన్నారు. ఫలితంగా స్పాట్ మార్కెట్ నుంచి చిప్సెట్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని, దీంతో అక్కడ ధరలు చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. సరఫరా కొరత కారణంగా స్పాట్ మార్కెట్లో చిప్సెట్ల ధరలు 25–27 శాతం వరకు పెరిగినట్టు పరిశ్రమ అంటోంది. దీంతో మొబైల్ హ్యాండ్సెట్ తయారీ వ్యయం 8–20 శాతం వరకు పెరుగుతుంది. ఈ భారాన్ని కొంతవరకు సర్దుబాటు చేసుకునేందుకు గాను 10 శాతం వరకు ఫోన్ల ధరలను పెంచాలన్నది కంపెనీల ప్రణాళిక. వచ్చే ఏడాది మెరుగుపడొచ్చు.. చిప్సెట్ల సరఫరాలో లోటు కొంత కాలం పాటు కొనసాగొచ్చని ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. సాధారణంగా అదనపు తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలంటే అందుకు ఏడాదన్నా పడుతుందని పరిశ్రమ చెబుతోంది. వచ్చే ఏడాది మొదటి భాగంలో పరిస్థితులు కాస్త మెరుగుపడొచ్చని అంచనా వేస్తోంది. కొరత ఇప్పటికే తటాక స్థాయికి చేరిందని, రానున్న కాలంలో పరిస్థితులు కుదుటపడొచ్చని మొహింద్రూ చెప్పారు. టెక్నాలజీ వేగంగా మారిపోతున్న కాలంలో భారీ సంఖ్యలో చిప్‌లను కంపెనీలు కొని నిల్వ చేసుకోలేవని.. కొన్ని త్రైమాసికాలకే చిప్‌లు పాతబడడమే కాకుండా, పనికిరాకుండా పోతాయన్నారు. 2020లో ధరల పెంపు ఇలా.. మొబైల్ ఫోన్ల ధరల పెరుగుదల 2020 ఏప్రిల్‌లో మొదటి విడత చోటుచేసుకుంది. వీటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడమే ఇందుకు కారణమైంది. చైనా నుంచి వచ్చే విడిభాగాల ధరలు పెరగడంతో ఫోన్ల ధరలు సెప్టెంబర్‌లో మరో విడత పెరిగాయి. ఫోన్ల డిస్ప్లే ప్యానెళ్లపై డ్యూటీని కేంద్రం పెంచడంతో అక్టోబర్‌లో మరో విడత ధరలు పెరిగేందుకు దారి తీసింది. చిప్సెట్ల కొరత కారణంగా పెరిగిన తయారీ వ్యయాలు.. మరో విడత ధరలు పెరిగేందుకు దారీతీయవచ్చు. -
నెలకు 1.6 జీబీ మాత్రమే : లేదంటే మోతే!
సాక్షి, ముంబై: రానున్న కాలంలో మొబైల్ సేవల చార్జీల మోత మోగనుంది. టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఈ సంకేతాలను సోమవారం వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లో మొబైల్ సేవల ధరల పెరగనున్నాయంటూ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తక్కువ రేటుతో డేటా సేవలను అందించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తక్కువ ధరకు డేటా ఇవ్వడం వల్ల టెలికాం పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉందని మిట్టల్ అందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు 160 రూపాయలకే నెలకు 16జీబీ డేటా ఇవ్వడం బాధాకరం అన్నారు. (చదవండి : క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్) నెలకు1.6 జీబీ వినియోగానికి అలవాటు పడాలి లేదా ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే చాలా ఎక్కువ చెల్లించడానికి సిద్ధం కావాల్సిందేనని మిట్టల్ వ్యాఖ్యానించారు. అమెరికా యూరప్ లో లాగా 50-60 డాలర్లు కాకపోయినా, ఖచ్చితంగా నెలకు 160 రూపాయలకు 16జీబీ వినియోగం మాత్రం ఒక విషాదమే అని తేల్చి చెప్పారు. ఆరు నెలల కాలంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్పీయూ) 200 రూపాయలు దాటొచ్చని అంచనా వేశారు. భారతీ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన పుస్తకం విడుదల సందర్భంగా మిట్టల్ ఈ వ్యాఖ్యలు చేశారు. డేటా కోసం అయితే 100 సరిపోతుంది కానీ టీవీ, మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ లాంటి చూడాలంటే మాత్రం వాటికి కస్టమర్ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమకు 300 ఏఆర్పీయూ కావాల్సిందేనని మిట్టల్ పేర్కొన్నారు. మిట్టల్ సూచించిన లెక్కల ప్రకారం ఏఆర్పీయూ 60శాతం పెరిగితే మంచిది. కనీసం 27శాతం పెరగాలి. ప్రస్తుతం ఒక జీబీకి చెల్లిస్తున్న10 రూపాయలకు బదులుగా భవిష్యత్తులో100 రూపాయలు చెల్లించాలి. అలాగే నెలకు 45 రూపాయలు చెల్లిస్తున్న వారు రెట్టింపు కంటే ఎక్కువగా 100 రూపాయలు చెల్లించాలి. కష్ట కాలంలో కూడా టెలికాం ఆపరేటర్లు దేశానికి సేవ చేశారని, అలాగే 5జీ, ఆప్టికల్ ఫైబర్స్, సబ్ మెరైన్ కేబుల్స్ లో పెట్టుబడులు పెట్టాల్సి ఉందని మిట్టల్ వెల్లడించారు. కేవలం 2-3 ఆపరేటర్లతో సంక్షోభంలో పడిన పరిశ్రమ స్థిరంగా కొనసాగాలంటే రాబోయే 5-6 నెలల్లో ఖచ్చితంగా 200-250 మార్కును దాటాల్సిందేనని మిట్టల్ వెల్లడించారు. టెలికాం వ్యాపారం డిజిటల్ బాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా డిసెంబర్ 2019లో టారిఫ్ పెంచిన అనంతరం జూన్ 30 నాటికి తొలి క్వార్టర్ లో ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ.157కి పెరగడం గమనార్హం. -
టెల్కోల వీరబాదుడు..!
న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్, డేటా సేవలకిక కాలం చెల్లింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. టెలికం సంస్థలు పోటాపోటీగా రేట్ల పెంపుతో ప్రీ–పెయిడ్ వినియోగదారులను బాదేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్–ఐడియా, ఎయిర్టెల్, రిలయన్స్ జియో సంస్థలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. వొడా–ఐడియా, ఎయిర్టెల్ టారిఫ్‌ల పెంపు ఏకంగా 50 దాకాను, జియో టారిఫ్‌ల పెంపు 40 శాతం దాకాను ఉండనుంది. వొడా–ఐడియా, ఎయిర్టెల్ కొత్త రేట్లు డిసెంబర్ 3 నుంచి, జియో రేట్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా పరిణామంతో.. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు నెలరోజుల పాటు కనెక్షన్ కలిగి ఉండాలంటే కనీసం రూ. 49 కట్టాల్సి రానున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ‘టీ ఖర్చుకన్నా తక్కువే’..! వొడాఫోన్–ఐడియా ... 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీ గల అన్లిమిటెడ్ ప్లాన్స్‌ను సవరిస్తూ కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. మార్కెట్ స్పందనను బట్టి వీటిల్లో మార్పులు, చేర్పులు చేయడమో లేదా మరిన్ని కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టడమో జరుగుతుందని పేర్కొన్నాయి. మరోవైపు, ‘టారిఫ్ పెంపు రోజుకు కేవలం 50 పైసల నుంచి రూ. 2.85 దాకానే ఉండనుంది. మెరుగైన డేటా, కాలింగ్ ప్రయోజనాలు ఉంటాయి‘ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. బడ్డీ కొట్టులో టీ తాగేందుకు ఓ వారం ఖర్చు చేసేంత కూడా టారిఫ్‌ల పెంపు ఉండదని కంపెనీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక, జియో విషయానికొస్తే.. ‘అన్లిమిటెడ్ వాయిస్, డేటాతో సరికొత్త ఆల్–ఇన్–వన్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టబోతున్నాం. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో సముచిత వినియోగ విధానం ఉంటుంది. 300 శాతం దాకా అదనపు ప్రయోజనాలు అందించే కొత్త ప్లాన్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వస్తాయి‘ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికం టారిఫ్‌లను సవరించే విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తామని పేర్కొంది. అపరిమితంలో.. పరిమితులు... అన్లిమిటెడ్ ప్లాన్స్ అయినప్పటికీ.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో వొడా–ఐడియా, ఎయిర్టెల్ ప్లాన్స్‌లో పరిమితులు ఉన్నాయి. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌లో 1,000 నిమిషాలు, 84 రోజుల పథకాల్లో 3,000 నిమిషాలు, 365 వ్యాలిడిటీ ప్లాన్‌లో 12,000 నిమిషాల పరిమితి ఉంటుంది. దీన్ని దాటితే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చార్జీ ఉంటుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)ను లెక్కించే విషయంలో కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెల్కోలు కేంద్రానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిల కింద ఏకంగా రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడంతో వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 50,921 కోట్లు, ఎయిర్టెల్ రూ. 23,045 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. వీటన్నింటిని భర్తీ చేసుకోవడం కోసం, నెట్‌వర్క్‌పై మరింతగా ఇన్వెస్ట్ చేయడం కోసం టెలికం సంస్థలు తాజాగా చార్జీల పెంపు బాట పట్టాయి. -
హెచ్డీఎఫ్సీ దీపావళి శుభవార్త
సాక్షి, ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ దీపావళి సందర్భంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీరేటును పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. కోటి రూపాయల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. దీంతో ఎనిమిది నుంచి పది సంవత్సరాల కాల పరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటు 6.5 శాతానికి చేరింది. 3-5 సంవత్సరాల డిపాజిట్ల వడ్డీరేటు 7.25 శాతానికి, వార్షిక డిపాజిట్లపై అందించే రేటు 7.3 శాతానికి చేరింది. ఈ సవరించిన రేట్లు నిన్నటినుంచే అమల్లోకి వచ్చాయి. మరోవైపు ప్రభుత్వం రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తమ వార్షిక ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో బీవోబీ ఎంసీఎల్ఆర్ రేటు 8.20శాతం నుంచి 8.30శాతానికి చేరింది. ఈ సవరించిన వడ్డీరేటు నేటి(నవంబరు 7, బుధవారం) నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. -
టమాఠా!
దళారీల పంట పండుతోంది - 30 కిలోల బాక్సు ధర రూ.800 - వారం రోజుల క్రితం రూ.1800 - బహిరంగ మార్కెట్లో కిలో మాట రూ.80 - రైతుల జీవితాలతో చెలగాటం - మార్కెట్ సౌకర్యం లేకనే ఇలా.. కళ్యాణదుర్గం: రైతు కష్టం దళారీల పాలవుతోంది. ఆరుగాలం కష్టించినా ఆశించిన ధర అందుకోలేని పరిస్థితి నెలకొంది. వరుస కరువుతో అల్లాడుతున్న అన్నదాత.. ఈ ఏడాది కాస్త కోలుకోవచ్చని భావించినా నిరాశే మిగులుతోంది. టమాట రైతుల జీవితంతో దళారీలు ఆడుతున్న ఆట కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. ఏడాదిగా ధర లేక చతికిల పడిన రైతులను దళారీల తీరు మరింత కుంగదీస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే 30 కిలోల బాక్సు ధర రూ.1800 నుంచి రూ.800లకు పతనమైంది. సామాన్యులు మార్కెట్లో టమాట కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్న తరుణంలో.. రైతులకు కనీస ధర కూడా లభించకపోవడం గమనార్హం. జిల్లాలోనే అత్యధికంగా కళ్యాణదుర్గం డివిజన్లో టమాట పంట సాగయింది. ప్రస్తుతం 13వేల ఎకరాల్లో టమాట సాగవగా.. 7వేలకు పైగా ఎకరాల్లో పంట చేతికొచ్చింది. ఈ నేపథ్యంలో దళారీలు ధరను అమాంతం తగ్గించడం రైతులను కలవరపరుస్తోంది. దళారీల దందా కళ్యాణదుర్గం ప్రాంతంలో వందలాది మంది దళారీలు టమాట రైతులను మోసగిస్తున్నారు. చుట్టుపక్క ప్రాంతాల నుంచి పట్టణానికి రోజూ 100 లారీల టమాట విక్రయానికి వస్తుంది. ఒక్కొ లారీలో 300 నుంచి 500 వరకు టమాట బాక్సులు ఉంటాయి. దళారీలు వ్యాపారుల వద్ద 30 కిలోల బాక్సు ధర రూ.1,100లుగా ఒప్పందం చేసుకుని.. రైతుల నుంచి రూ.800లతో కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా ఒక్కో బాక్సు మీద రూ.30 కమీషన్ కూడా దండుకుంటున్నారు. మార్కెట్ సౌకర్యం లేకనే.. స్థానిక మార్కెట్ యార్డులో టమాట కొనుగోళ్లు చేపట్టకపోవడం వల్లే దళారీల ఆగడాలు అధికమయ్యాయి. పాలకులు టమాట రైతుల మోసాలను అరికట్టేందుకు ఏ మాత్రం చొరవ చూపని పరిస్థితి. కొందరు రైతులు కోలార్, అనంతపురం మార్కెట్లకు తీసుకెళ్లి అక్కడ మోసపోతుండగా, మరికొందరు రైతులు ఇక్కడి దళారీల చేతుల్లో దగా పడుతున్నారు. కష్టాలు తీరుతాయనుకున్నా వరుసగా ఎనిమిది సార్లు టమాట సాగు చేసి లక్షల్లో నష్టపోయిన. ఇప్పుడు కూడా 1.50 ఎకరాల్లో పంట సాగు చేయగా కోతకు వచ్చింది. ధర బాగుండటంతో కష్టాలు తీరుతాయనుకున్నా. దళారీలు అప్పుడే ధర తగ్గిస్తున్నారు. – సుధీర్ రైతు, కంబదూరు బాక్సు రూ.800లకే అడుగుతున్నారు రెండెకరాల్లో రూ.80వేల పెట్టుబడితో సాగుచేసిన పంట కోతకు వచ్చింది. బాక్సు రూ.800లకే అడుగుతున్నారు. ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తే మేలు జరుగుతుంది. – నారాయణప్ప రైతు, కోనాపురం మార్కెట్లో టమాట విక్రయాలకు చర్యలు మార్కెట్ యార్డులో టమాట విక్రయాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వ్యాపారులతో సంప్రదింపులు నిర్వహించాం. త్వరలోనే వ్యాపారాలు ప్రారంభిస్తాం. – రామాంజనేయులు, మార్కెట్‌యార్డు చైర్మన్ -
టన్ను చీనీ రూ.16 వేలు
అనంతపురం అగ్రికల్చర్ : స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను సరాసరి ధర రూ.16 వేలు పలికింది. పండ్లమార్కెట్కు 360 టన్నుల చీనీకాయలు రాగా వేలంలో టన్ను గరిష్టంగా రూ.21 వేలు, కనిష్టంగా రూ.10 వేలు పలికింది. సరాసరి టన్ను ధర రూ.16 వేలుగా పలికినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.