సాక్షి,ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అన్ని కాల రుణాలపై వడ్డీ రేటు పెంపునకు నిర్ణయంచింది. ఎస్‌బీఐ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ రేటును10 బీపీఎస్ పాయింట్లుపెంచింది. ఫలితంగా వడ్డీరేటు 7.85 శాతం నుంచి 7.95 శాతానికి పెంచింది. ఫలితంగా నెల కాల రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు 8.10 శాతానికి పెరిగింది.
పెరిగిన వడ్డీరేట్లు ఈ రోజునుంచే( ఫిబ్రవరి 15, బుధవారం) అమల్లోకి వచ్చాయని బ్యాంకు తెలిపింది.ఒక సంవత్సరం కాల రుణాలపై కొత్త రేటు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి ,రెండేళ్ల కాలవ్యవధికి 8.50 శాతం నుంచి 8.60 శాతం. మూడేళ్ల పదవీకాలానికి రేటు 8.60 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగిందని ఎస్‌బీఐ తెలిపింది.
తాజా నిర్ణయంతో వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, గృహ రుణాలు తీసుకున్న వారికి అదనపు భారం తప్పదు. ఇటీవలి మానిటరీ పాలసీ రివ్యూలో ఆర్‌బీఐ రెపోరేటు పావు శాతం పెంపు నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 25 బీపీఎస్ పాయింట్లు పెంచి 6.50 శాతంగా ఉంచిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి! MBA Chai Wala: అపుడు టీ బిజినెస్‌తో కోట్లు, ఇపుడు మళ్లీ వార్తల్లోకి..విషయం ఏమిటంటే..!
గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్! తేలిగ్గా తీసుకుంటే అంతే..
Comments
Please login to add a commentAdd a comment