Fed Rate Hike Will Impact Indian IT Players; Details Inside - Sakshi
Sakshi News home page

ఫెడ్‌ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే?

Published Thu, Jul 27 2023 3:02 PM | Last Updated on Thu, Jul 27 2023 4:36 PM

Fed rate hike will impact Indian IT players details inside - Sakshi

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. బుధవారం (జూలై 26)న ఫెడ్‌ 25 బేసిస్‌ పాయింట్లు మేర పెంచి అందర్నీ ఆశ్చర్య పర్చింది. దీంతో ఫెడ్‌  రేటు 5.50 శాతం వద్ద అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఫెడ్ తాజా  వడ్డీ రేట్లు 22 ఏళ్లలో ఎన్నడూ చూడని గరిష్ఠాలకు చేరింది. అంతేకాదు  ద్రవ్యోల్బణంపై యుద్ధం సాగుతుందని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా  చైర్ జెరోమ్ పావెల్  సంకేతాలిచ్చారు. దీంతో అమెరికా ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందనే అందోళన మరింత ముదిరింది. (శాంసంగ్‌ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్‌..అదిరిపోయే ఆఫర్‌తో...)

భారతీయ ఐటీ నిపుణులను  ఫెడ్ మరింత ఇబ్బంది పెట్టబోతోందా?
ఫెడ్ రేట్ల పెంపు ప్రపంచవ్యాప్తంగా  అలజడి రేపింది. ఈ పెంపు చాలా విభాగాలకు ప్రతికూలంగా  ఉంటుందని, ఆర్థిక వృద్ధి తగ్గుతుందని నిపుణుల అంచనా. వరుస వడ్డీ రేట్ల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బ తీస్తుంది. మాంద్యంలోకి నెట్టవచ్చు. కనుక యుఎస్‌ ఆర్థిక మందగమనంతో అనేక భారతీయ ఐటీ సంస్థలకు దెబ్బేనని భావిస్తున్నారు. 

మింట్ నివేదిక ప్రకారం, అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక ప్రతికూలతల కారణంగా ఐటీ దిగ్గజాల  ఫలితాలు బాగా దెబ్బ తిన్నాయి.  'బిగ్ ఫోర్'  టీసీఎస్‌, ఇన్ఫోసిస్, విప్రో హెచ్‌సిఎల్ టెక్ కంపెనీల రెవెన్యూ  గైడెన్స్‌లో భారీ కోత విధించుకోవడం గమనార్హం. యుఎస్ మాంద్యం సుదీర్ఘ దశలోకి జారిపోతే, అది అసంభవంగా కనిపిస్తోంటే,  ఇండియన్‌  ఐటీ కంపెనీలకు కష్టాలు  మరింత తీవ్రమవుతాయని అని నిపుణులు భావిస్తున్నారు (బ్లాక్‌రాక్‌ బ్యాక్‌ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం)

మరోవైపు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఫెడ్  ఇకపై రేటు పెంపునకే మొగ్గు చూపుతున్న  కారణంగా  భారతీయ ఐటీ రంగ సంస్థలు మరింత నష్టపోతాయా? అంటే చాలా పరిమిత ప్రభావాన్ని చూపుతుందని మరికొంతమంది నిపుణులు భావిస్తున్నారు

ఈక్వినామిక్స్ రీసెర్చ్ ప్రైవేట్‌లో ఫౌండర్ & రీసెర్చ్ హెడ్ జి. చొక్కలింగం, యూఎస్‌ ఫెడ్ రేట్ల పెంపు ముందే, భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఎగుమతి ఆదాయాలను డాలర్‌ రూపంలో పూర్‌ సింగిల్ డిజిట్‌లో పెంచుకోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. భారతదేశం ఐటి ఎగుమతుల, హైబేస్‌ హై గ్రోత్‌కు   కొనసాగించడం అనేది నిర్మాణాత్మక సమస్య అన్నారు. ఐటీ ఎగుమతులు రేట్ల పెంపుదలకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 0-0.25 శాతం శ్రేణి నుండి దాదాపు 5 శాతానికి పెరిగే కాలంలో పెద్దగా తగ్గలేదు. కాబట్టి తదుపరి పెంపుదల ఏదైనా  ఐటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. అయితే  ఫెడ్‌ రేటు పెంపు రూపాయి మారకపు రేటును ప్రభావితం చేస్తుందని అదే పరిశ్రమ మార్జిన్‌లను కొనసాగించడానికి సహాయపడుతుందన్నారు.

అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో నిర్మాణాత్మకంగా పెద్ద విజయం సాధిస్తే, సమీప భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు మారే అవకాశం ఉంది. రెండేళ్లుగా డాలర్ పరంగా పేలవమైన అంటే 4-5 శాతం వృద్ధి  ఉంటుంద నేది అంచనా. ఏదైనా మరింత గణనీయమైన రేటు పెంపుదల రూపాయి మారకపు రేటును మరింత బలహీన పరుస్తుందని చొక్కలింగం  అన్నారు.

అమెరికా వడ్డీ రేట్లు ప్రస్తుతం రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ద్రవ్యోల్బణ  కారణంగా,  అక్కడి వ్యాపారాలు అనివార్యంగా  తమ ఐటీ పెట్టుబడుల్లో కోత విధిస్తాయి, అనవసరమైన ఖర్చులను తగ్గిస్తా. ఇది  భారతీయ ఐటీ సంస్థల ఆర్థిక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చన్నారు ఏంజెల్ వన్ హెడ్ అడ్వైజరీ అమర్ దేవ్ సింగ్, అయితే, దేశాలు,పరిశ్రమల అంతటా తమ ఆదాయ వనరులను వైవిధ్యపరిచిన ఐటీ  బిజినెస్‌ ప్రస్తుత మార్కెట్ ప్రమాదాలను తట్టుకునే స్థితిలోనే ఉందన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement