Indian IT industry
-
ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే?
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. బుధవారం (జూలై 26)న ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు మేర పెంచి అందర్నీ ఆశ్చర్య పర్చింది. దీంతో ఫెడ్ రేటు 5.50 శాతం వద్ద అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఫెడ్ తాజా వడ్డీ రేట్లు 22 ఏళ్లలో ఎన్నడూ చూడని గరిష్ఠాలకు చేరింది. అంతేకాదు ద్రవ్యోల్బణంపై యుద్ధం సాగుతుందని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చైర్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికా ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందనే అందోళన మరింత ముదిరింది. (శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్‌తో...) భారతీయ ఐటీ నిపుణులను ఫెడ్ మరింత ఇబ్బంది పెట్టబోతోందా? ఫెడ్ రేట్ల పెంపు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపింది. ఈ పెంపు చాలా విభాగాలకు ప్రతికూలంగా ఉంటుందని, ఆర్థిక వృద్ధి తగ్గుతుందని నిపుణుల అంచనా. వరుస వడ్డీ రేట్ల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బ తీస్తుంది. మాంద్యంలోకి నెట్టవచ్చు. కనుక యుఎస్ ఆర్థిక మందగమనంతో అనేక భారతీయ ఐటీ సంస్థలకు దెబ్బేనని భావిస్తున్నారు. మింట్ నివేదిక ప్రకారం, అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక ప్రతికూలతల కారణంగా ఐటీ దిగ్గజాల ఫలితాలు బాగా దెబ్బ తిన్నాయి. 'బిగ్ ఫోర్' టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్‌సిఎల్ టెక్ కంపెనీల రెవెన్యూ గైడెన్స్‌లో భారీ కోత విధించుకోవడం గమనార్హం. యుఎస్ మాంద్యం సుదీర్ఘ దశలోకి జారిపోతే, అది అసంభవంగా కనిపిస్తోంటే, ఇండియన్ ఐటీ కంపెనీలకు కష్టాలు మరింత తీవ్రమవుతాయని అని నిపుణులు భావిస్తున్నారు (బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం) మరోవైపు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఫెడ్ ఇకపై రేటు పెంపునకే మొగ్గు చూపుతున్న కారణంగా భారతీయ ఐటీ రంగ సంస్థలు మరింత నష్టపోతాయా? అంటే చాలా పరిమిత ప్రభావాన్ని చూపుతుందని మరికొంతమంది నిపుణులు భావిస్తున్నారు ఈక్వినామిక్స్ రీసెర్చ్ ప్రైవేట్‌లో ఫౌండర్ & రీసెర్చ్ హెడ్ జి. చొక్కలింగం, యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు ముందే, భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఎగుమతి ఆదాయాలను డాలర్ రూపంలో పూర్ సింగిల్ డిజిట్లో పెంచుకోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. భారతదేశం ఐటి ఎగుమతుల, హైబేస్ హై గ్రోత్‌కు కొనసాగించడం అనేది నిర్మాణాత్మక సమస్య అన్నారు. ఐటీ ఎగుమతులు రేట్ల పెంపుదలకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 0-0.25 శాతం శ్రేణి నుండి దాదాపు 5 శాతానికి పెరిగే కాలంలో పెద్దగా తగ్గలేదు. కాబట్టి తదుపరి పెంపుదల ఏదైనా ఐటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. అయితే ఫెడ్ రేటు పెంపు రూపాయి మారకపు రేటును ప్రభావితం చేస్తుందని అదే పరిశ్రమ మార్జిన్లను కొనసాగించడానికి సహాయపడుతుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో నిర్మాణాత్మకంగా పెద్ద విజయం సాధిస్తే, సమీప భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు మారే అవకాశం ఉంది. రెండేళ్లుగా డాలర్ పరంగా పేలవమైన అంటే 4-5 శాతం వృద్ధి ఉంటుంద నేది అంచనా. ఏదైనా మరింత గణనీయమైన రేటు పెంపుదల రూపాయి మారకపు రేటును మరింత బలహీన పరుస్తుందని చొక్కలింగం అన్నారు. అమెరికా వడ్డీ రేట్లు ప్రస్తుతం రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ద్రవ్యోల్బణ కారణంగా, అక్కడి వ్యాపారాలు అనివార్యంగా తమ ఐటీ పెట్టుబడుల్లో కోత విధిస్తాయి, అనవసరమైన ఖర్చులను తగ్గిస్తా. ఇది భారతీయ ఐటీ సంస్థల ఆర్థిక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చన్నారు ఏంజెల్ వన్ హెడ్ అడ్వైజరీ అమర్ దేవ్ సింగ్, అయితే, దేశాలు,పరిశ్రమల అంతటా తమ ఆదాయ వనరులను వైవిధ్యపరిచిన ఐటీ బిజినెస్ ప్రస్తుత మార్కెట్ ప్రమాదాలను తట్టుకునే స్థితిలోనే ఉందన్నారు. -
ఐటీ పరిశ్రమకు వై2కే తరహా అవకాశం
న్యూఢిల్లీ: కరోనా తర్వాతి ప్రపంచం భారత ఐటీ పరిశ్రమకు వై2కే తరహా సందర్భం వంటిదని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు, భారీ అవకాశాలను సొంతం చేసుకునేందుకు పరిశ్రమ ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2021’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నైపుణ్యాలపై ఐటీ పరిశ్రమ మరింతగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని చంద్రశేఖర్ ప్రస్తావించారు. తగినంత పని లేదని కొన్నేళ్ల క్రితం చెప్పిన కంపెనీలే.. ఇప్పుడు విదేశాల్లో నియామకాలు చేపడుతూ పెద్ద ఎత్తున నైపుణ్య వనరులను నిలుపుకుంటున్నట్టు తెలియజేశారు. ‘‘ప్రపంచం ఎంతగానో మారిపోయింది. డిజిటైజేషన్ ఆకాశామే హద్దుగా కొనసాగుతోంది. కనుక డిటిజైషన్కు, నైపుణ్యాలకు డిమాండ్ భారీగా పెరిగింది. మనం కరోనా తర్వాతి ప్రపంచంలో ఉన్నామని గుర్తించాలి. భారత ఐటీ పరిశ్రమకు ఇది వై2కే తరహా సందర్భం’’ అని చంద్రశేఖర్ అన్నారు. అవకాశాలను వెంటనే సొంతం చేసుకోలేకపోతే మరొకరు వీటిని తన్నుకుపోయే అవకాశం ఉంటుందన్నారు. ‘‘పరిశ్రమ, పరిశ్రమ సంఘాలు ముందుకు రావాలి. నైపుణ్య శిక్షణ, నెట్వర్క్ విస్తరణకు నూరు శాతం కష్టించి పనిచేయాలి’’ అని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణలో, యూనికార్న్‌ల ఏర్పాటులో ఫిన్‌టెక్ కంపెనీల (టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల కంపెనీలు) పాత్రను ఆయన ప్రస్తావించారు. ప్లాట్‌ఫామ్‌ల ఆధారిత పరిష్కారాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాయని ప్రశంసించారు. -
ఐటీ వృద్ధి 2.3 శాతం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయాలు 2.3 శాతం వృద్ధి చెంది 194 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. అలాగే ఎగుమతులు 1.9 శాతం పెరిగి 150 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఈ మేరకు అంచనాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఐటీ సంస్థలు నికరంగా నియామకాలు చేపట్టాయని తెలిపింది. కొత్తగా 1.38 లక్షల ఉద్యోగాలు కల్పించడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 44.7 లక్షలకు చేరిందని పేర్కొంది. ‘కరోనా సంక్షోభం నుంచి దేశీ పరిశ్రమ మరింత పటిష్టంగా బైటిపడింది. కోవిడ్ ఎదుర్కొనడంలో చుక్కానిగా నిల్చింది‘ అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తెలిపారు. లిస్టెడ్ కంపెనీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం 15 బిలియన్ డాలర్ల దాకా విలువ చేసే కాంట్రాక్టులు కుదిరే అవకాశాలు ఉన్నట్లు ఘోష్ వివరించారు. 2021లో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు.. టెక్నాలజీపై వ్యయాలు మరింత పెంచుకోనున్నట్లు సీఈవోల సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు. నాస్కామ్ సదస్సులో ప్రధాని ప్రసంగం.. బుధవారం జరిగే 29వ నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం (ఎన్టీఎల్ఎఫ్) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు. కరోనా మహమ్మారి నుంచి బైటపడి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలు ప్రధానాంశంగా నాస్కామ్ దీన్ని నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 17 నుంచి 19 దాకా ఈ సదస్సు జరుగుతుంది. -
ఇన్ఫోసిస్‌లో ఎగిసిన కరోడ్‌పతి ఉద్యోగులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 2019-20లో రూ కోటికి పైగా వార్షిక వేతనం అందుకుంటున్న కరోడ్‌పతుల జాబితా 74కి పెరిగింది. ఇదే కంపెనీలో అంతకుముందు ఏడాది కోటీశ్వరుల సంఖ్య 60 కావడం గమనార్హం. అధిక వేతన రాబడితో కరోడ్‌పతులుగా ఎదిగిన వారిలో అత్యధికులు వైస్- ప్రెసిడెంట్, సీనియర్ వైస్-ప్రెసిడెంట్ హోదాలో ఉన్నవారే. గతంలో మంజూరు చేసిన షేర్లు ఈ ఏడాది అందిరావడం వాటి విలువ ఆధారంగా వార్షిక వేతన రాబడి పెరిగింది. గత ఏడాది భారత్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగుల సగటు వేతన పెంపు 7.3 శాతంగా ఉంది. 2019-20లో ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ మొత్తం పారితోషికం రూ. 34.27 కోట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మొత్తంలో జీతంతో కలుపుకుని పరిహారం రూ .16.85 కోట్లు కాగా, స్టాక్ ఆప్షన్ల మార్గంలో రూ .17.04 కోట్లు, ఇతరత్రా చెల్లింపుల కింద రూ. 38 లక్షలు ఈయనకు చెల్లించినట్లు కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది భారత్‌లో అత్యధిక వేతనం అందుకుంటున్న ఐటీ సీఈఓ సలిల్ పరేఖ్ కావడం విశేషం. కాగా, మున్ముందు సవాళ్లతో కూడిన సమయాన్ని ఎదుర్కోవడం నిజమైన పరీక్షని, సవాళ్లను సాంకేతికతో దీటుగా ఎదుర్కొనేలా కార్యోన్ముఖులు కావాలని వాటాదారులకు రాసిన లేఖలో ఇన్ఫోసిస్ చీఫ్ నందన్ నిలేకాని పేర్కొన్నారు. చదవండి : టెకీలకు ఇన్ఫీ షాక్ -
ఇవ్వడంలో మనదే పైచేయి
సాక్షి, అమరావతి: ఉపాధి కోసం అమెరికా వెళ్లినా.. అక్కడే కంపెనీలు స్థాపించినా.. తమదే పైచేయని భారతీయులు నిరూపిస్తున్నారు. తమది ఇచ్చే చెయ్యేగాని, తీసుకునే చెయ్యి కాదని తేల్చి చెబుతున్నారు. అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే అమెరికన్లకు భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువని ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, సర్వీసెస్(నాస్కామ్) నివేదిక వెల్లడించింది. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ భారతీయుల పాత్ర కీలకం. కానీ, వీసాల జారీలో భారతీయుల పట్ల అమెరికా చూపుతున్న వివక్షను నిపుణులు తప్పుబడుతున్నారు. ‘విన్ అండ్ విన్’జోడీ అయిన భారత్, అమెరికాలు వీసాల జారీతోపాటు అన్ని అంశాల్లో సహకరించుకోవాలని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతున్నారు. వాళ్లకు ఇస్తున్న జీతాలే ఎక్కువ భారతీయులు తమ ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారనే భావన అమెరికన్లలో ఉంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. నాస్కామ్ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. అమెరికాలో భారతీయులు పొందుతున్న ఉద్యోగ అవకాశాల కంటే.. భారతీయ కంపెనీలు అమెరికన్లకు కల్పిస్తున్న ఉద్యోగాలే ఎక్కువ. అంతేకాదు, అమెరికాలో భారతీయులు పొందుతున్న జీతాల కంటే... భారతీయ కంపెనీలు అమెరికన్లకు చెల్లిస్తున్న వేతనాలే ఎక్కువ. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులు సగటున పొందుతున్న వార్షిక వేతనం 94,800 డాలర్లు. కానీ భారతీయ కంపెనీలు అక్కడి అమెరికన్ ఉద్యోగులకు చెల్లిస్తున్న సగటు వార్షిక జీతం 96,300 డాలర్లు. ఈ లెక్కన, భారతీయ కంపెనీలే అమెరికన్లకు సగటున ఏడాదికి 1,500 డాలర్లు ఎక్కువగా చెల్లిస్తున్నాయి. అమెరికాలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ 52 కంపెనీలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అమెరికాకు చెందిన ‘ఐహెచ్ఎస్ మార్కిట్ రీసెర్చ్’ వెల్లడించింది. 2018లో భారతీయ కంపెనీలు అమెరికన్లకు ప్రత్యక్షంగా 1.80 లక్షలు, పరోక్షంగా 3.40 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. అంటే 5.20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాయి. అంతేకాదు, అమెరికాలో 2016లో 2.60 శాతం, 2018లో 3.80 శాతం ఉద్యోగాలు కల్పించాయి. వీసాల జారీలో మాత్రం చిన్నచూపు అమెరికా ఆర్థిక పురోభివృద్ధికి ఇంతగా దోహపడుతున్నప్పటికీ భారతీయులకు వీసాల మంజూరులో కఠిన ఆంక్షలు విధిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక కొత్తగా హెచ్–1బీ వీసాల జారీ మరింత కఠినతరంగా మారింది. ఇప్పటికే భారతీయుకలు ఎక్కువగా వీసాలు ఇస్తున్నామన్న అమెరికా వాదన అహేతుకమని నిపుణులు చెబుతున్నారు. 2016లో హెచ్–1బీ వీసాల కోసం అందిన భారతీయుల దరఖాస్తుల్లో 5 శాతం తిరస్కరణకు గురయ్యాయి. 2018లో దాదాపు 50 శాతం దరఖాస్తులను తిరస్కరించడం, 2020 జనవరి నాటికి 2 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగులో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికా ‘జీడీపీ’కీ వెన్నుదన్ను అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారతీయ కంపెనీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 2017లో అమెరికా జీడీపీకి అక్కడి భారతీయ కంపెనీలు 57.20 బిలియన్ డాలర్లు సమకూర్చాయి. అమెరికా జీడీపీకి ఆ దేశంలోని ఆరు రాష్ట్రాలు సమకూర్చినదాని కంటే భారతీయ కంపెనీలే ఎక్కువ సమకూర్చ డం అసాధారణమని ‘ఐహెచ్ఎస్ మార్కిట్ రీసెర్చ్’ పేర్కొంది. వీసాల జారీలో సమతుల్యత ఉండాలి భారతీయ కంపెనీలకు తగినన్ని వీసాలు జారీ చేయడం లేదు. అమెరికా వీసాల జారీలో భారత కంపెనీలు, బహుళ జాతి కంపెనీల మధ్య సమతుల్యత ఉండాలి. సమాన అవకాశాలు కల్పిస్తేనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. – కేశవ్ మురుగేశ్, నాస్కామ్ చైర్మన్ విరివిగా వీసాల జారీ.. ప్రయోజనకరం ‘భారతీయులు 50 ఏళ్లుగా అమెరికాలో సంపద సృష్టికర్తలుగా గుర్తింపు పొందారు. ఐటీ ఉద్యోగి నుంచి సీఈవో వరకు భారతీయులు నిరుపమాన సేవలు అందిస్తున్నారు. భారతీయులకు ఎంత విరివిగా వీసాలు జారీ చేసి ప్రోత్సహిస్తే మన దేశంతోపాటు అమెరికా కూడా అంతగా పురోభివృద్ధి సాధిస్తుంది. భారతీయుల వీసాల జారీకి కనీస వేతనాలకు బదులు వృత్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రొ. పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ -
దేశీయ ఐటీకి మంచి రోజులు వస్తున్నాయ్!
హైదరాబాద్ : అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. మన దేశీయ ఐటీకి మంచి రోజులు వస్తున్నాయట. ఈ విషయాలను సీనియర్ ఇండస్ట్రీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశీయ ఐటీకి 2018 మంచి ఏడాది కాబోతుందని, టెక్ వ్యయాల వృద్ధికి, క్లయింట్ల నుంచి డిమాండ్‌కు 2018 మెరుగ్గా ఉంటుందని ఇండస్ట్రీ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా దేశీయ ఐటీకి అతిపెద్ద మార్కెట్ మాత్రమే కాదని, వృద్ది అవకాశాలు సంపాదించడానికి ఇది చాలా క్లిష్టమైనదని కూడా మాజీ ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ వీ బాలక్రిష్ణన్ చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బాగుందని, 2-2.25 శాతం వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ గార్టనర్ రిపోర్టు తీసుకుంటే ఈ ఏడాది మొత్తం ఐటీ వ్యయాలు 4 శాతం నుంచి 4.5 శాతం పెరిగే అవకాశముందని, అంటే అక్కడ వృద్ధి ఉందని బాలక్రిష్ణన్ తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బాగుందని, ఇది దేశీయ ఐటీ కంపెనీలకు ఒక ఆశలాంటిదని పేర్కొన్నారు. 2017-18లో దేశీయ ఐటీ ఎగుమతులు 7-8 శాతం వృద్దిని నమోదుచేస్తాయని నాస్కామ్ కూడా అంచనావేస్తోందని, దేశీయ మార్కెట్ 10-11 శాతం వృద్ధి ఉంటుందని, అంటే మొత్తంగా ఈ ఏడాది బాగుంటుందని బాలక్రిష్ణన్ చెప్పారు. అన్ని పెద్ద కంపెనీల్లో డిజిటల్ వర్క్ రెండెంకల వృద్దిని నమోదుచేస్తుందని, సంప్రదాయ వ్యాపారాల్లో అంత వృద్ధి ఉండదని ఇన్ఫోసిస్ మరో మాజీ సీఎఫ్ఓ టీవీ మోహన్ దాస్ పాయ్ కూడా తెలిపారు. వ్యాపారాల్లో డిజిటల్ 20-25 శాతం వృద్ధి చూడొచ్చన్నారు. -
ఐటీ మునుపటి కళ తప్పింది: విదేశీ మీడియా
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ పదవులకు విశాల్ సిక్కా రాజీనామా నేపథ్యంలో భారతీయ ఐటీ రంగం ఎగుమతులు గత ఏడేళ్లలో ఎన్నడూలేని విధంగా కుదేలైన తీరును విదేశీ మీడియా విశ్లేషించింది. దేశీయ ఐటీ సేవల ఎగుమతులు ఏడేళ్ల కనిష్ట స్థాయిలో పతనమవడం ఆందోళన రేకెత్తిస్తున్నదని, కరెంట్ ఖాతా లోటును పెంచడమే కాకుండా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పాలకులు కలత చెందుతున్నట్టు ఫారెన్ మీడియా పేర్కొంది. కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్‌కు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఇబ్బందికరమని వ్యాఖ్యానించింది. హెచ్1బీ వీసాలపై ట్రంప్ వైఖరి భారత్ ఇంజనీర్లు అమెరికాలో అడుగుపెట్టేందుకు అవరోధమని ఎకనమిక్ సర్వే విస్పష్టంగా పేర్కొనడాన్ని విదేశీ మీడియా ప్రస్తావించింది. ఆటోమేషన్ దెబ్బతో భారత్‌లో 69 శాతం ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయన్న వరల్డ్ బ్యాంక్ నివేదిక, 2020 వరకూ భారత్‌లో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు కోల్పోతాయని హెడ్ హంటర్స్ ఇండియా అంచనాలూ టెక్నోక్రాట్ల దుస్థితికి అద్దంపడుతున్నాయని పేర్కొంది. -
ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సిక్కా
దేశీయ ఐటీ ఇండస్ట్రీ అతిగా వీసా సిస్టమ్ పై ఆధారపడిందని, హెచ్-1బీపై తక్కువ వేతనాలతో విదేశీయులను భారీగా నియమించుకుంటూ వీసా ప్రొగ్రామ్ ను దుర్వినియోగం పాలుచేస్తుందంటూ అమెరికా ఏకధాటిగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఈ ఆరోపణలు గుప్పించడమే కాకుండా, ట్రంప్ ప్రభుత్వం ఏకంగా వీసా ప్రొగ్రామ్ లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తోంది. అయితే దేశీయ ఐటీ ఇండస్ట్రీ అతిగా హెచ్-1బీ వీసాపై ఆధారపడిందనే ఆరోపణలను ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తీవ్రంగా ఖండించారు. ''హెచ్-1బీ వీసాలపై ఆధారపడి పనిచేస్తున్నాం అనడం సరియైనది కాదు. ఉదాహరణకు గత 10 ఏళ్లలో చూసుకుంటే, ఏడాదికి 65వేల హెచ్-1బీ వీసాలు గ్రాంట్ అయ్యాయని లెక్కలోకి వేసుకుంటే, 10ఏళ్లలో ఆ సంఖ్య 6,50,000కు పెరుగుతుంది. కానీ ఇన్ఫోసిస్ కలిగి ఉన్నది 2 లక్షల మందినే. టీసీఎస్ సంఖ్య సుమారు మాకంటే రెండింతలు ఉంటుంది అంతే'' అని సిక్కా చెప్పారు. ఈ అంచనాలను తీసుకుంటే, దేశీయ ఐటీ ఇండస్ట్రీ విపరీతంగా హెచ్-1బీ వీసాలపై ఆధారపడిందని అనడం సరియైనది కాదని అన్నారు. హెచ్-1బీ వీసాలపై ఆధారపడిన దేశీయ ఐటీ కంపెనీల బిజినెస్ మోడల్ పరిస్థితేమిటనే ప్రశ్నపై ఆయన ఈ విధంగా స్పందించారు. వీసా సిస్టమ్ దుర్వినియోగం పరుస్తున్నాయంటూ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.వచ్చే వారంలో డొనాల్డ్ ట్రంప్ తో తొలిసారి భేటీ కాబోతున్న మోదీ ఈ వీసా సమస్యను చర్చించబోతున్నారు. త్వరగా మార్పులు చెందుతున్న ఇన్ఫోటెక్ వాతావరణంలో గ్లోబల్ లీడర్ షిప్ స్థానంలో కొనసాగాలంటే ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఎంతో వినూత్నమైన ప్రాంతాలపై దృష్టిసారించాలని, కొత్త వాటిపై దృష్టిసారించాలని సిక్కా చెప్పారు. ఆర్టిఫియల్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఓపెనింగ్స్, వాయిస్ ఇంటర్ ఫేస్, ఛాట్ ఇంటర్ ఫేస్, వర్చ్యువల్ రియాల్టీ, సైబర్ సెక్యురిటీ వంటి అంశాలపై ఫోకస్ చేయాలన్నారు. -
భారీగా దెబ్బతిన్న ఐటీ ఇండస్ట్రి
154 బిలియన్ డాలర్ల గల దేశీయ ఐటీ పరిశ్రమ ఇన్ని రోజులు ఓ కలల ప్రపంచంగా ఉండేది. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి ఎక్కడం, ముంచుకొస్తున్న ఆటోమేషన్ ప్రభావం ఐటీ రంగం తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ దెబ్బతో ఉద్యోగాలు భారీగా ఊడటమే కాకుండా.. కొత్త వారికి ఉద్యోగాలు కల్పించడానికి కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. అన్ని రంగాల్లో కెల్లా ఐటీ పరిశ్రమలోనే నియామకాల ప్రక్రియ భారీగా దెబ్బతిన్నిందని తాజా అధ్యయన రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. 2017 మే నెలలో ఏడాది ఏడాదికి ఐటీ కంపెనీల నియామకాలు 17 శాతం మేర పడిపోయినట్టు వెల్లడైంది. ఐటీ ఇండస్ట్రిలో నెలకొన్న ఈ పరిస్థితి మరికొంత కాలం పాటు కొనసాగుతుందని తెలిపాయి. ఇతర టెక్ ఉద్యోగాలు బీపీఓ 10 శాతం, టెలికాం 7 శాతం కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. నోకరీ.కామ్, ఇన్ఫో ఎడ్జ్ ఇండియా డాక్యుమెంట్ల ఆధారంగా ఈ అధ్యయనాలు వెల్లడయ్యాయి. మొత్తంగా టెక్ పరిశ్రమ భారీగా దెబ్బతిన్నింది కానీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లో నియామకాలు 18 శాతం పడిపోయినట్టు తెలిసింది. కన్ స్ట్రక్షన్ రంగంలో అసలు ఉద్యోగాలే లేవని అధ్యయనం తెలిపింది. అయితే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగ నియామకాలు 8 శాతం, 4 శాతం పెరిగినట్టు తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఎక్కువగా కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమల్లో ఆటో ఇండస్ట్రి 20 శాతంతో అత్యధిక రేటు సంపాదించినట్టు తెలిపాయి. మొత్తంగా 2017 మే నెలలో కొత్త ఉద్యోగాల వృద్ధి 4 శాతం నెగిటివ్ గా నమోదైంది. అయితే ఐటీ ఇండస్ట్రిలో నెలకొన్న ఉద్యోగాల కోతపై రీసెర్చ్ సంస్థలు, ఇండస్ట్రి బాడీ భిన్నమైన రిపోర్టులు ఇస్తూ ఎంప్లాయీస్ లో భయాందోళనలు రేపుతున్నాయి. రీసెర్చ్ సంస్థలు భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని చెబుతుండగా.. నాస్కామ్ మాత్రం ఆ రిపోర్టులను కొట్టిపారేస్తోంది. -
ఐటీ ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లివే!
దేశీయ ఐటీ ఇండస్ట్రీ రెండు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని టెక్ నిపుణలంటున్నారు. ఒకటి ఆటోమేషన్, మరొకటి కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు ప్రవేశపెడుతున్న కఠినతర నిబంధనలు. ఈ రెండు ఐటీ ఇండస్ట్రీకి పెద్ద సవాళ్లుగా మారుతున్నాయన్నారు. ఆటోమేషన్తో మిషన్ల వాడకం పెరిగి వేల కొద్దీ ఉద్యోగాలు ఊడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దేశీయ ఐటీ కీలకమార్కెట్గా ఉన్న అమెరికాలో వీసా నిబంధనలు మార్చడం కూడా పెద్ద పెనుముప్పుగానే మారుతుందన్నారు. ఆటోమేషన్తో ధరలు తగ్గినప్పటికీ, చాలామంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ వీసా నిబంధనలు కఠినతరం చేయడం ఐటీకి వ్యయాలు పెరిగి, మార్జిన్లపై ప్రభావం చూపుతుందని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన నాస్కామ్ లీడర్షిప్ ఈవెంట్లో ఐటీ నిపుణులు ఈ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. అయితే టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం మిషన్లతో భయపడాల్సి వస్తుందని పేర్కొంటూనే ఆటోమేషన్ మరింత క్రియేటివ్ ఉద్యోగాలకు నాంది పలుకుతుందన్నారు. పునరావృత ఉద్యోగాలను తీసివేసి, ఇంజనీర్లకు, డెవలపర్లకు మరింత క్రియేటివ్ రోల్స్‌కు సాయం చేస్తుందని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావ్ తెలిపారు. ట్రంప్ వీసా నిబంధనల్లో మార్పులు చేయడం కంటే ఆటోమేషన్ అత్యంత ప్రమాదకరమైందని మరో టాప్ ఐటీ సంస్థ జనరల్ మేనేజర్ చెప్పారు. -
బ్రిటన్ వీసా నిబంధనలపై స్పందించిన నాస్కామ్
-
బ్రిటన్ వీసా నిబంధనలపై స్పందించిన నాస్కామ్
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రభుత్వ వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై సాఫ్ట్ వేర్ బాడీ నాస్కామ్ ఇండియా స్పందించింది. ఇది మనదేశ ఐటీ నిపుణుల భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని పడవేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటుగా యూకే ప్రతిపాదిత మార్పులు రెండు దేశాల ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని ఒక ఇమ్మిగ్రేషన్ సమస్య కాకుండా వాణిజ్య ప్రాధాన్యత గల అంశంగా చూడాలని కోరుతూ ఒక ప్రకటన జారి చేసింది. ఈ మేరకు భారత ప్రభుత్వం కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని సూచించింది. ముఖ్యంగా బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా భారత పర్యటన సందర్భంగా నైపుణ్యం గల ఐటి వలసల విధానంపై చర్చించాలని నాస్కామ్ కోరింది. భారత బ్రిటన్ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా దీనిపై చర్చలు జరపాలంది. ఈ విషయంలోరెండు దేశాలు చొరవ తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. బ్రిటన్ ఆర్థికవ్యవస్థలో భారత ఐటీ కంపెనీలు కీలక పాత్రను పోషిస్తున్నాయని నాస్కామ్ వివరించింది. ఉత్పాదకతలో, ఉద్యోగాల సృష్టిలో, సంపద వృద్ధిలో ప్రధాన పాత్ర కలిగి ఉన్నాయని తెలిపింది. తద్వారా ఆ దేశం గణనీయమైన ఆర్ధిక పరిపుష్టిని సాధిస్తోందనీ, ప్రపంచవ్యాప్త పోటీలో తన స్తానాన్ని మెరుగుపరుచుకుంటోందని పేర్కొంది. నిపుణులైన ఐటీ ఉద్యోగులను కట్టడి చేయడమంటే తమ దేశ ఆర్థికవృద్ధిని కట్టడిచేయడమేనని తెలిపింది. ప్రతిభావంతులైన నిపుణుల మార్పిడి కారణంగానే భారతదేశం, బ్రిటన్ మధ్య స్నేహ సంబంధాలు విలసిల్లాయని నాస్కామ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ అంశమే మూలస్తంభంగా రెండు దేశాల మధ్య సహజ వ్యాపార సంబంధాలు కొనసాగాయని గుర్తు చేసింది.