బ్రిటన్ ప్రభుత్వ వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై సాఫ్ట్ వేర్ బాడీ నాస్కామ్ ఇండియా స్పందించింది. ఇది మనదేశ ఐటీ నిపుణుల భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని పడవేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటుగా యూకే ప్రతిపాదిత మార్పులు రెండు దేశాల ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని ఒక ఇమ్మిగ్రేషన్ సమస్య కాకుండా వాణిజ్య ప్రాధాన్యత గల అంశంగా చూడాలని కోరుతూ ఒక ప్రకటన జారి చేసింది.