ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సిక్కా
ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సిక్కా
Published Thu, Jun 22 2017 2:03 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM
దేశీయ ఐటీ ఇండస్ట్రీ అతిగా వీసా సిస్టమ్ పై ఆధారపడిందని, హెచ్-1బీపై తక్కువ వేతనాలతో విదేశీయులను భారీగా నియమించుకుంటూ వీసా ప్రొగ్రామ్ ను దుర్వినియోగం పాలుచేస్తుందంటూ అమెరికా ఏకధాటిగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఈ ఆరోపణలు గుప్పించడమే కాకుండా, ట్రంప్ ప్రభుత్వం ఏకంగా వీసా ప్రొగ్రామ్ లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తోంది. అయితే దేశీయ ఐటీ ఇండస్ట్రీ అతిగా హెచ్-1బీ వీసాపై ఆధారపడిందనే ఆరోపణలను ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తీవ్రంగా ఖండించారు. ''హెచ్-1బీ వీసాలపై ఆధారపడి పనిచేస్తున్నాం అనడం సరియైనది కాదు. ఉదాహరణకు గత 10 ఏళ్లలో చూసుకుంటే, ఏడాదికి 65వేల హెచ్-1బీ వీసాలు గ్రాంట్ అయ్యాయని లెక్కలోకి వేసుకుంటే, 10ఏళ్లలో ఆ సంఖ్య 6,50,000కు పెరుగుతుంది. కానీ ఇన్ఫోసిస్ కలిగి ఉన్నది 2 లక్షల మందినే. టీసీఎస్ సంఖ్య సుమారు మాకంటే రెండింతలు ఉంటుంది అంతే'' అని సిక్కా చెప్పారు.
ఈ అంచనాలను తీసుకుంటే, దేశీయ ఐటీ ఇండస్ట్రీ విపరీతంగా హెచ్-1బీ వీసాలపై ఆధారపడిందని అనడం సరియైనది కాదని అన్నారు. హెచ్-1బీ వీసాలపై ఆధారపడిన దేశీయ ఐటీ కంపెనీల బిజినెస్ మోడల్ పరిస్థితేమిటనే ప్రశ్నపై ఆయన ఈ విధంగా స్పందించారు. వీసా సిస్టమ్ దుర్వినియోగం పరుస్తున్నాయంటూ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.వచ్చే వారంలో డొనాల్డ్ ట్రంప్ తో తొలిసారి భేటీ కాబోతున్న మోదీ ఈ వీసా సమస్యను చర్చించబోతున్నారు.
త్వరగా మార్పులు చెందుతున్న ఇన్ఫోటెక్ వాతావరణంలో గ్లోబల్ లీడర్ షిప్ స్థానంలో కొనసాగాలంటే ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఎంతో వినూత్నమైన ప్రాంతాలపై దృష్టిసారించాలని, కొత్త వాటిపై దృష్టిసారించాలని సిక్కా చెప్పారు. ఆర్టిఫియల్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఓపెనింగ్స్, వాయిస్ ఇంటర్ ఫేస్, ఛాట్ ఇంటర్ ఫేస్, వర్చ్యువల్ రియాల్టీ, సైబర్ సెక్యురిటీ వంటి అంశాలపై ఫోకస్ చేయాలన్నారు.
Advertisement