US Fed Rate
-
స్టాక్ మార్కెట్లకు ఈ వారం.. ఇవే కీలకం!
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు దిక్సూచిగా నిలిచే అవకాశముంది. దేశీయంగా టోకు ధరల ద్రవ్యోల్బణం, వాణిజ్యం తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ఆ దేశ కేంద్ర బ్యాంకు పరపతి విధాన సమీక్ష కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు.వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఇటీవల దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే. వెరసి విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురువారం(19న) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణం మందగించడం, ఉపాధి మార్కెట్ పటిష్టత నేపథ్యంలో వడ్డీ రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత నెల 7న చేపట్టిన పాలసీ మినిట్స్ సైతం ఇందుకు మద్దతిస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు.ఇక ఇదే రోజున ఈ ఏడాది మూడో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు విడుదలకానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం యూఎస్ జీడీపీ 2.8 శాతం పుంజుకుంది. నేడు నవంబర్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు వెల్లడికానున్నాయి. రేపు(17న) యూఎస్ రిటైల్ సేల్స్, 18న జపాన్ వాణిజ్య గణాంకాలు తెలియనున్నాయి. వారాంతాన(20న) నవంబర్ ద్రవ్యోల్బణ రేటును జపాన్ ప్రకటించనుంది.ఆర్థిక గణాంకాలునేడు(16న) దేశీయంగా నవంబర్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ 2.36 శాతం పెరిగింది. ఇదే రోజు వాణిజ్య గణాంకాలు సైతం విడుదల కానున్నాయి. అక్టోబర్‌లో వాణిజ్య లోటు 24.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ బాటలో హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ, సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్‌లో త యారీ పీఎంఐ 57.5కు చేరగా, సర్వీసుల పీఎంఐ 58.5ను తాకింది. గత వారమిలా శుక్రవారం(13)తో ముగిసిన గత వారం దేశీ స్టాక్ ఇండెక్సులు భారీ ఆటుపోట్ల మధ్య స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ నికరంగా 424 పాయింట్లు(0.5 శాతం) పుంజుకుని 82,133 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లు(0.4 శాతం) మెరుగై 24,768 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.2 శాతం బలపడితే.. స్మాల్ క్యాప్ ఇదేస్థాయిలో నీరసించింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో 5 కంపెనీలు బలపడగా.. మరో 5 దిగ్గజాలు నీరసించాయి.దీంతో వీటి మార్కెట్ విలువ నికరంగా రూ. 1.13 లక్షల కోట్లమేర బలపడింది. ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 47,837 కోట్లు, ఇన్ఫోసిస్ విలువ రూ. 31,827 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ. 11,888 కోట్లు చొప్పున ఎగసింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ విలువకు రూ. 11,761 కోట్లు, టీసీఎస్‌కు రూ. 9,805 కోట్లు చొప్పున జమయ్యింది. అయితే ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ. 52,032 కోట్లు, ఎల్ఐసీ విలువ రూ. 32,068 కోట్లు, హెచ్‌యూఎల్ విలువ రూ. 22,561 కోట్లు చొప్పున క్షీణించింది. -
వచ్చే వారం ఏమౌతుందో.. పసిడి ప్రియుల్లో టెన్షన్!
దేశంలో బంగారం ధరలు గత సంవత్ సంవత్సరంలో విశేషమైన వృద్ధిని సాధించాయి. గత దీపావళి నుండి దాదాపు 32 శాతం పెరిగాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేటు తగ్గింపుల అంచనా, స్థిరమైన డాలర్ ఇండెక్స్, ప్రపంచ ఆర్థిక మందగమన సంకేతాలు, సెంట్రల్ బ్యాంకుల నుండి బలమైన డిమాండ్ వంటి అనేక కారణాల వల్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి.వచ్చే వారం బంగారం ధర అంచనావచ్చే వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే రెండు కీలక పరిణామాలు ఉన్నాయి. నవంబర్ 5న అమెరికా ఎన్నికలు జరగనుండగా నవంబర్ 6న ఫెడ్ పాలసీ నిర్ణయం వెలువడనుంది. వీటి ప్రభావంతో బంగారం ధరలు వచ్చే వారం అధిక అస్థిరతను చూపవచ్చని మార్కెట్ పరిశీలకులు, నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులుప్రస్తుతం ఇలా..అంతే లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు పండుగ తర్వాత కాస్త శాంతించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం (నవంబర్ 2) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,800 వద్ద ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ. 80,550 వద్ద ఉంది. వచ్చే వారం బంగారం ధరల్లో భారీ అస్థిరతలు ఉంటాయన్న అంచనాలు కొనుగోలుదారులను మరింత భయపెడుతున్నాయి. -
గరిష్టాలను చేరిన అమెరికా ఆర్థిక లోటు!
అమెరికా దేశ బడ్జెట్ లోటు గరిష్ఠాలను చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి ఇది రూ.1,538 లక్షల కోట్లను చేరింది. కొవిడ్ మహమ్మారి కాలంతో పోల్చినా ఈ లోటు అధికంగా నమోదవ్వడం ఆందోళనలు కలిగిస్తుంది. రుణ వడ్డీ, విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు..వంటివి ఇందుకు కారణమని యూఎస్ ట్రెజరీ విభాగం తెలిపింది. అయితే ఫెడ్ ఇటీవల వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంతో రానున్న రోజుల్లో ఈ లోటు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.యూఎస్ అధికారిక ట్రెజరీ డేటా ప్రకారం..సెప్టెంబరు 30 నాటికి యూఎస్ ఆర్థిక లోటు 1.83 ట్రిలియన్ డాలర్ల(రూ.1,538 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఇది అంతకుముందు 2020-21 కాలంలో గరిష్ఠంగా 1.7 ట్రిలియన్ డాలర్లు(రూ.14.2 లక్షల కోట్లు)గా ఉండేది. 2023 మధ్యలో బైడెన్ ప్రభుత్వ ప్రతిపాదనలతో యూఎస్ అత్యున్నత న్యాయస్థానం విద్యార్థుల రుణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఆర్థిక లోటు మరింత పెరిగినట్లయింది. యూఎస్ ఆర్థిక లోటు స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతానికి మించిపోయింది. ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ యుద్ధ భయాల కారణంగా 2023లో 6.2 శాతం, 2024 సెప్టెంబర్ 30 నాటికి 6.4 శాతానికి చేరింది. వడ్డీ చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వడ్డీ ఖర్చులు 254 బిలియన్ డాలర్లు(రూ.21 లక్షల కోట్లు) పెరిగి 1.1 ట్రిలియన్ డాలర్లకు(రూ.92 లక్షల కోట్లు) చేరాయి. ఇది గతంలో కంటే 29 శాతం అధికం. జీడీపీలో ఈ వడ్డీ చెల్లింపులు 3.93 శాతంగా ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు 11 శాతం పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో రానున్న రోజుల్లో కొంత వడ్డీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.ఇదీ చదవండి: స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్..కంపెనీలకు నష్టం!దేశీయంగా పెరుగుతున్న అప్పు ఆందోళనకరమే. అయితే ఆ అప్పు మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తే దాని ప్రతిఫలాలు సమీప భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి దాంతో కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి వడ్డీతో సహా భవిష్యత్తులో అప్పు తీర్చే ప్రణాళికలు ఉంటాయి. కానీ సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు ఒకవేళ అవినీతికి పాల్పడితే దానికోసం ఇతర సంస్థల నుంచి తీసుకొచ్చిన అప్పు భారంగా మారుతుంది. దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి రాబడి సృష్టించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పలితంగా దేశం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మూడు నెలల్లో రూ.5,330 కోట్ల ఒప్పందాలు
భారతీయ సాంకేతిక రంగంలోని కంపెనీలు 2024 జులై–సెప్టెంబర్ కాలంలో 635 మిలియన్ డాలర్ల (రూ.5,330 కోట్లు) విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు కన్సల్టింగ్ కంపెనీ ‘గ్రాంట్ థ్రాంటన్ భారత్’ వెల్లడించింది. అందుకుగల కారణాలు విశ్లేషిస్తూ సంస్థ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని వివరాల ప్రకారం..యూఎస్ ఫెడ్ ఇటీవల కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అది టెక్ కంపెనీలకు సానుకూలాంశంగా మారింది. లోన్లు అధికంగా జారీ చేస్తూ టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఫైనాన్స్ సంస్థలు ఆసక్తి చూపుతాయి. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత అనిశ్చితులు తొలగి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సెప్టెంబర్ త్రైమాసికంలో 79 ఒప్పందాలు జరిగాయి. గతంలో కంటే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 20 మిలియన్ డాలర్ల(రూ.168 కోట్లు)కు పైగా విలువ కలిగిన డీల్స్ 12 నమోదయ్యాయి. విలీనాలు, కొనుగోళ్లు జూన్ త్రైమాసికంతో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ఇవి గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 53 శాతం అధికమై 26 డీల్స్‌కు చేరుకున్నాయి. ఈ ఒప్పందాల విలువ 205 శాతం దూసుకెళ్లి 116 మిలియన్ డాలర్లు(రూ.975 కోట్లు)గా నమోదైంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!భారత్‌పట్ల బుల్లిష్‌గా..‘పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్‌పై చాలా బుల్లిష్‌గా ఉన్నారు. మార్కెట్లలోకి ప్రవహించే మూలధనం ప్రధాన లబ్ధిదారుల్లో భారత్ ఒకటి. వరుసలో పెద్ద సంఖ్యలో ఐపీవోలు ఉండటంతో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది పెట్టుబడిదారులు ఈ ఐపీవోల నుంచి మెరుగైన లాభాలు సంపాదించాలని భావిస్తున్నారు. ఏడాది కాలంలో స్టార్టప్ వ్యవస్థలో భారీగా నిధులు చేరాయి’ అని నివేదిక వివరించింది. -
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నాలుగేళ్ల తర్వాత కీలక వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడ్ నిర్ణయంతో ఇప్పటివరకు 5.25-5.5 శాతంగా ఉన్న వడ్డీరేట్లు 4.75-5 శాతానికి చేరినట్లయింది. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా రానున్న ద్రవ్యపరపతి సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గించాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇప్పటికే వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తన అభిప్రాయాన్ని తెలిపారు.ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచేలా ప్రణాళికలు పాటిస్తున్నామని చెప్పారు. వరుసగా జులై, ఆగస్టు నెలలోనూ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉండడంతో అందుకు అనుగుణంగా మార్కెట్ వర్గాలు వడ్డీరేట్లు తగ్గించాలని కోరుతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశ జీడీపీ సరాసరి 7.5 శాతం వృద్ధి చెందింది. కానీ గత త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల వల్ల ప్రభుత్వ వ్యయం మందగించడం ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.2023 జులై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ వరుసగా 7.44 శాతం, 6.83 శాతంగా నమోదైంది. దాంతో పోలిస్తే ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి ఈ సూచీనే ప్రామాణికంగా ఉండనుంది.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున సాయంరిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడిచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కసారిగా ఎగిసిన పసిడి
అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బుధవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరష్టాలకు పెరిగాయి.బుధవారం మధ్యాహ్నం 2:17 గంటల సమయానికి స్పాట్ బంగారం 0.9% పెరిగి ఔన్సుకు 2,592.39 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి 2,598.60 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ బుధవారం ప్రకటించిన అర శాతం రేట్ల కోతతో ద్రవ్య విధాన సడలింపు స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఫెడ్ బెంచ్‌మార్క్ రేటు ఈ సంవత్సరం చివరి నాటికి మరో అర శాతం, 2025లో పూర్తిగా ఒక శాతం తగ్గుతుందని భావిస్తున్నారు.వడ్డీ రేట్ల తగ్గింపుతో అందరి దృష్టి బంగారంపై పడింది. పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇదే సమయంలో డాలర్‌పై భారం పెరిగింది. డాలర్‌తో పోలిస్తే ఇతర కరెన్సీలను కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు బంగారం చౌకగా ఉండనుంది.ఫెడ్ రేట్ కట్ తరువాత డాలర్ 0.5% పతనమైంది. 2023 జూలై నుండి దాని కనిష్ట స్థాయికి పడిపోయింది.ఇన్వెస్టర్లు ఇప్పుడు పాలసీ మార్గంపై ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ నుంచి మరిన్ని సూచనల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా స్పాట్ వెండి సోమవారం రెండు నెలల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఔన్స్‌కు 0.6% పెరిగి 30.93 డాలర్ల వద్దకు చేరింది. -
ఊరట! పసిడికి ఫెడ్ బ్రేకులు: ఎంత తగ్గిందంటే..!
Today Gold Rate in Hyderabad అమెరికా ఫెడ్ మరోసారి రేట్ల పెంపునకే నిర్ణయించనుందన్న అంచనాల మధ్య డాలర్ బలపడుతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్ల నెమ్మదించాయి. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,943.30 డాలర్ల వద్ద ఉంది. అటు దేశీయంగా కూడా కూడా పసిడి పరుగుకు బ్రేక్‌లు పడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 వద్ద ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గి 59,450గా ఉంది. 80 వేల రూపాయల నుంచి దిగొచ్చిన కిలో వెండి ధర 76,900 వద్ద కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. (వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!) ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో (Today Gold Price in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 50 రూపాయలు క్షీణించి 54,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,550 పలుకుతోంది. అటు డాలర్ మరింత బలంపుంజుకున్నప్పటికీ, దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో లాభపడుతోంది. శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే10 పైసలు ఎగిసి 82.55వద్ద ఉంది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభం నష్టాలనుంచి కోలుకుని లాభాల్లోకి మళ్లాయి -
వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!
Today Gold and Silver Price: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుదల దీర్ఘకాలంగా కొనసాగవచ్చన్న అంచనాల మధ్య అంతర్జాతీ మార్కెట్లో పసిడి ధరలు పడిపోయాయి. దీంతో వరుసగా నాల్గో వారంలో కూడా దిగి వచ్చింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ తదుపరి రివ్యూలో కూడా వడ్డీ రేటు పెంపుదల ముందుకు సాగవచ్చని అంచనా. అలాగే తాజా డేటా ప్రకారం నిరుద్యోగ ప్రయోజనాల కోసం కొత్త క్లెయిమ్‌లను దాఖలు చేసే అమెరికన్ల సంఖ్య గత వారం పడిపోయింది. దీంతో లేబర్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగవచ్చని మరో అంచనా. అమెరికా 10-సంవత్సరాల ట్రెజరీ నోట్‌పై దిగుబడి ఆగస్ట్‌లో 4.2శాతం మార్కు కంటే పెరిగింది, 2007లో చివరిసారిగా ఈ స్థాయికిచేరింది. (బాలీవుడ్ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్) గ్లోబల్‌గా గోల్డ్ ధర ఔన్స్ ధర 1918 డాలర్లకు పడిపోయిన బంగారం ధరలు ప్రస్తుతం 0.16 శాతం పెరిగి 1,919 డాలర్లు ట్రేడవుతున్నాయి, అటు సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగాపెరిగాయి. (అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!) దేశీయంగా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా లాభపడుతున్నాయి. రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం పుత్తడి రూ.59,170 వద్ద కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.54,150 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.59,070 పలుకుతోంది. వెండి కిలోధర 76,500 వద్ద కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. రూపాయి అమెరికా డాలరుతో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి నుండి కోలుకుంది. సోమవారం 5 పైసలు పెరిగి 83.05 వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం 88.09 వద్ద కొనసాగుతోంది. అటు ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.73శాతం పెరిగి 85.42 డాలర్ల వద్దకు చేరుకుంది. -
దిగొస్తున్న పసిడి, వెండి భారీ పతనం
Gold Price Today 28th July అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేటుపెంపుతో శుక్రవారం బంగారం ధరలు దిగి వచ్చాయి. శ్రావణ శుక్రవారం సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు దిగిరావడం శుభ సంకేతంగా మారింది. అటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. యూఎస్ ఫెడ్ రీసెంట్ రివ్యూలో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేపు పెంపుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు దూసుకు పోతోందన్న అందోళన మొదలైంది. దీంతో అమెరికా కరెన్సీ డాలరు నష్టాల్లోకి జారుకుంది. ఈ ప్రభావం అంతర్జాతీయంగా, జాతీయంగా బంగారం ధరలపై చూపుతోంది. (బర్త్ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!) హైదరాబాదులో 22 క్యారట్ల బంగారం 10 గ్రాములకి 350 రూపాయలుదిగి వచ్చి ధర రూ. 55,100 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 380 పతనమై రూ. 60,110 గా ఉంది. వెండి ధర కూడా దిగి వచ్చి 80 వేల దిగువకు చేరింది. ఇటీవలి కాలంలో బాగా పెరుగుతూ వస్తున్న వెండి ధర శుక్రవారం ఏకంగా 2 వేల రూపాయలు పతనమైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 79,500 గాఉంది. (హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ!) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో పసిడి కొద్దిగా పుంజుకుంది. ఆగస్టు ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 59,565 వద్ద ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కూడా రూ.128 లేదా 0.17శాతం పెరిగి కిలోకు రూ.73,875 వద్ద ట్రేడవుతున్నాయి. (ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) అంతర్జాతీయంగా బంగారం ధరలు వోలటైల్‌గా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ 0.3శాతం పెరిగి ఔన్స్‌కు 1,951.19 డాలర్లుగా ఉంది. అంతకుముందు జూలై 12న కనిష్ట స్థాయిని తాకింది. అలాగే మునుపటి సెషన్లో 1.4 శాతం క్షీణించింది. ఈ వారంలో ఇప్పటివరకు బులియన్ 0.4శాతం పతనాన్ని నమోదుచేసింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 1,950డాలర్ల వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాల్టి బంగారం ధరలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి! -
ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే?
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. బుధవారం (జూలై 26)న ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు మేర పెంచి అందర్నీ ఆశ్చర్య పర్చింది. దీంతో ఫెడ్ రేటు 5.50 శాతం వద్ద అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఫెడ్ తాజా వడ్డీ రేట్లు 22 ఏళ్లలో ఎన్నడూ చూడని గరిష్ఠాలకు చేరింది. అంతేకాదు ద్రవ్యోల్బణంపై యుద్ధం సాగుతుందని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చైర్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికా ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందనే అందోళన మరింత ముదిరింది. (శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్‌తో...) భారతీయ ఐటీ నిపుణులను ఫెడ్ మరింత ఇబ్బంది పెట్టబోతోందా? ఫెడ్ రేట్ల పెంపు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపింది. ఈ పెంపు చాలా విభాగాలకు ప్రతికూలంగా ఉంటుందని, ఆర్థిక వృద్ధి తగ్గుతుందని నిపుణుల అంచనా. వరుస వడ్డీ రేట్ల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బ తీస్తుంది. మాంద్యంలోకి నెట్టవచ్చు. కనుక యుఎస్ ఆర్థిక మందగమనంతో అనేక భారతీయ ఐటీ సంస్థలకు దెబ్బేనని భావిస్తున్నారు. మింట్ నివేదిక ప్రకారం, అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక ప్రతికూలతల కారణంగా ఐటీ దిగ్గజాల ఫలితాలు బాగా దెబ్బ తిన్నాయి. 'బిగ్ ఫోర్' టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్‌సిఎల్ టెక్ కంపెనీల రెవెన్యూ గైడెన్స్‌లో భారీ కోత విధించుకోవడం గమనార్హం. యుఎస్ మాంద్యం సుదీర్ఘ దశలోకి జారిపోతే, అది అసంభవంగా కనిపిస్తోంటే, ఇండియన్ ఐటీ కంపెనీలకు కష్టాలు మరింత తీవ్రమవుతాయని అని నిపుణులు భావిస్తున్నారు (బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం) మరోవైపు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఫెడ్ ఇకపై రేటు పెంపునకే మొగ్గు చూపుతున్న కారణంగా భారతీయ ఐటీ రంగ సంస్థలు మరింత నష్టపోతాయా? అంటే చాలా పరిమిత ప్రభావాన్ని చూపుతుందని మరికొంతమంది నిపుణులు భావిస్తున్నారు ఈక్వినామిక్స్ రీసెర్చ్ ప్రైవేట్‌లో ఫౌండర్ & రీసెర్చ్ హెడ్ జి. చొక్కలింగం, యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు ముందే, భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఎగుమతి ఆదాయాలను డాలర్ రూపంలో పూర్ సింగిల్ డిజిట్లో పెంచుకోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. భారతదేశం ఐటి ఎగుమతుల, హైబేస్ హై గ్రోత్‌కు కొనసాగించడం అనేది నిర్మాణాత్మక సమస్య అన్నారు. ఐటీ ఎగుమతులు రేట్ల పెంపుదలకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 0-0.25 శాతం శ్రేణి నుండి దాదాపు 5 శాతానికి పెరిగే కాలంలో పెద్దగా తగ్గలేదు. కాబట్టి తదుపరి పెంపుదల ఏదైనా ఐటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. అయితే ఫెడ్ రేటు పెంపు రూపాయి మారకపు రేటును ప్రభావితం చేస్తుందని అదే పరిశ్రమ మార్జిన్లను కొనసాగించడానికి సహాయపడుతుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో నిర్మాణాత్మకంగా పెద్ద విజయం సాధిస్తే, సమీప భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు మారే అవకాశం ఉంది. రెండేళ్లుగా డాలర్ పరంగా పేలవమైన అంటే 4-5 శాతం వృద్ధి ఉంటుంద నేది అంచనా. ఏదైనా మరింత గణనీయమైన రేటు పెంపుదల రూపాయి మారకపు రేటును మరింత బలహీన పరుస్తుందని చొక్కలింగం అన్నారు. అమెరికా వడ్డీ రేట్లు ప్రస్తుతం రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ద్రవ్యోల్బణ కారణంగా, అక్కడి వ్యాపారాలు అనివార్యంగా తమ ఐటీ పెట్టుబడుల్లో కోత విధిస్తాయి, అనవసరమైన ఖర్చులను తగ్గిస్తా. ఇది భారతీయ ఐటీ సంస్థల ఆర్థిక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చన్నారు ఏంజెల్ వన్ హెడ్ అడ్వైజరీ అమర్ దేవ్ సింగ్, అయితే, దేశాలు,పరిశ్రమల అంతటా తమ ఆదాయ వనరులను వైవిధ్యపరిచిన ఐటీ బిజినెస్ ప్రస్తుత మార్కెట్ ప్రమాదాలను తట్టుకునే స్థితిలోనే ఉందన్నారు. -
డాలరు Vs ఫెడ్: మరి బంగారం, వెండి ధరలు? ఇపుడు కొనడం మంచిదేనా?
Gold and Silver Price Today: బంగారం ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా తాజాగా సోమవారం నాలుగు వారాల గరిష్టం నుంచి వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ రేట్ల పెంపు ఉండదనే అంచనాలతో పసిడి ధరలు తగ్గముఖం పట్టాయి. ఇటీవలి గరిష్టం ఔన్స్ ధర 1968 డాలర్ల నుండి వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం ఔన్సుకు 1950-1,953 డాలర్ల వద్ద కదలాడుతున్నాయి. అమెరికా డాలర్ 15 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత, గత వారం గత కొన్ని సెషన్లలో బంగారం ధరలు బాగా పుంజుకున్నాయి. అయితే, సోమవారం తెల్లవారుజామున జరిగిన డీల్స్‌లో,దేశీయ , అంతర్జాతీయ మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్‌ను చూసింది. ఎంసీఎక్స్ ఆగస్టు గడువు ముగిసిన గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల స్థాయిలకు రూ. 59,147 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో రూ. 59,130 స్థాయిలకు పడింది.అయితే విలువైన మెటల్ తక్కువ స్థాయిలలో కొనుగోళ్లతో రూ. 59,194 స్థాయిలను తాకింది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం పుత్తడి ధరల పెరుగుదలకు దోహదపడింది. ద్రవ్యోల్బణ ఒత్తిడితో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చే ఆశలు పెట్టుబడిదారుల్లో ఉన్నాయి. ఇదే చర్య బంగారం ధరలకు ఊతమిస్తుంది. జూలై 26న జరగబోయే ఫెడ్ మానిటరీ పాలసీ మీటింగ్‌పై ప్రధానంగా అందరి దృష్టి ఉంది. ఇక దేశీయంగా బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల పుత్తడి రూ.55వేలు, 24 క్యారెట్ల బంగారం రూ.60వేల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,150గానూ, 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూ.60,150 గా ధర పలుకుతోంది. (ఇది కదా లక్ అంటే.. గంటలో కోటి!) హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు పలుకుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.60వేల వద్ద ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.81500 ఉన్నది ముంబై లో 10 గ్రాముల 24 క్యారెట్ల 999 బంగారం ధర రూ.5,9450 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, 10 గ్రాముల ఆభరణం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5,7250గా ఉన్నాయి.ఈ ధరలకు జీఎస్టీ అదనం. -
మళ్లి పెరిగిన బంగారం ధర: వెయిట్ చెయ్యాలా? కొనుక్కోవాలా?
సాక్షి, ముంబై: వెండి , బంగారం ధరలు మళ్లీ నింగివైపు చూస్తున్నాయి. రెండు రోజులు కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు గురు, శుక్రవారాల్లో మళ్లీ ఊపందుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగింది. గురువారం నాటి రూ. 54,200తో పోలిస్తే రూ 54,800 పలుకుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 650 ఎగిసి రూ.59,780గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. గురువారంతో పోలిస్తే వెయ్యి రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ. 72,600గా ఉంది. అయితే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో, బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 225 లేదా 0.38శాతం తగ్గి రూ.59,340 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ మే ఫ్యూచర్స్ కిలో రూ.7 తగ్గి రూ.70,205 వద్దకు చేరింది. (ఇది చదవండి: జియో కస్టమర్లకు ట్విస్ట్: ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు) మరోవైపు ప్రతికూల ప్రపంచ సంకేతాలతో గ్లోబల్‌గా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫెడ్ రేటు పెంపు అంచనాలతో డాలర్ స్థిరంగా ఉండటంతో స్పాట్ బంగారం 0.1శాతం తగ్గి ఔన్సుకు 1,991 డాలర్లుగాఉంది. వెండి రేటు 0.01శాతం తగ్గింది. ఈ ప్రభావం దేశీయంగా ఉండే అవకాశం ఉందని అంచనా. IPL 2023: జియో అదిరిపోయే ఆరు ప్రీపెయిడ్ ప్లాన్స్ -
ముందుంది పెళ్ళిళ్ల సీజన్: దిగొస్తున్న పుత్తడి
సాక్షి,ముంబై: ఇటీవల రికార్డు స్థాయికి ఎగబాకిన బంగారం ధరలు క్రమంగి దిగివస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన సమీపిస్తున్న తరుణంలో రెండు నెలల కనిష్టం వద్ద పసిగి కొనుగోలు దారులకు ఊరనిచ్చే అంశం. అంతర్జాతీయంగా ఇటీవలి కాలంలో దాదాపు 3500 దిగొవచ్చిన పసిడి ధర మంగళవారం కూడా అదే బాటలో నడిచింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో MCXలో బంగారం ధర నేడు 55,000 స్థాయిలో ఉంది. అలాగే వెండి 63,000 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధరపై రూ.150 తగ్గి రూ.51,350గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.160 బలహీనపడి రూ.56,020గా ఉంది. అలాగే కేజీ వెండి ధరపై రూ.1000 తగ్గడంతో,రూ.69000లుగా ఉంది. అయితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధరూ స్వల్పంగా పుంజుకుని రూ.69200 పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోయింది. జూన్ 2021 నుండి అతిపెద్ద నెలవారీ నష్టానికి దారితీశాయి. సోమవారం రెండు నెలల కనిష్టానికి చేరిన తర్వాత మంగళవారం స్పాట్ బంగారం 0.1శాతం తగ్గి ఔన్సు ధర 1,816.19 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1శాతం క్షీణించి తగ్గి 1,823.30 డాలర్ల స్థాయికి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్ - రూ.51,450 చెన్నై - రూ. 52,070 ముంబై - రూ. 51,450 ఢిల్లీ - రూ. 51,600 కోల్‌కతా - రూ. 51,450 బెంగళూరు - రూ.51,500 -
చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..ఇప్పుడే ఇలా ఉంటే, మరి రాబోయే రోజుల్లో ఎలా?
బంగారం, వెండి ఆభరణాలతో భారతీయులకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినా, పండుగలు వచ్చినా బంగారం కొంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు పసిడి నగలు కొనేందుకు ఎగబడుతుంటారు. అయితే అలాంటి పసిడి ప్రియులకు బంగారం షాకిస్తూ దూసుకెళ్తుంది. బంగారం ధర ఇంతలా ఎందుకు దూసుకెళ్తుంది. గత ఆరు నెలల్లో విపరీతంగా పెరిగింది. వచ్చే 6 నెలల్లో ట్రెండ్ ఎలా ఉండబోతుంది. అసలు బంగారం ధర పెరగడానికి కారణం ఏంటి? బంగారం, వెండి ధరలు లైఫ్ టైం హై స్థాయికి చేరువవుతున్నాయి. కరనా మహమ్మారి సమయంలో బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. అప్పుడు మొదలైన పరుగు ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో కాస్త స్థిరంగా ఉన్నప్పటికీ గత 4, 5 నెలలుగా మళ్లీ దూసుకెళ్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు రూ.65 వేల (ప్రస్తుతం రూ.57,500) మార్క్ దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? బలీయమైన ఆర్థిక శక్తిగా చెలామణి అవుతున్న దేశాల్లో ఆర్ధిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణంలో క్షీణత, ఇతర దేశాల్లో వడ్డీ రేట్ల పెంపులో తటస్థం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత, ఆర్ధిక మాంద్యంలో ప్రజలకు ఖర్చు చేసే శక్తి లేకపోవడం, దేశీయంగా డిమాండ్ పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణత కారణంగా బంగారం ధరలు పెరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ కమోడిటీ రిసెర్చ్ హెడ్ హరీష్ వీ నాయర్ తెలిపారు. దేశీయంగా బంగారానికి మంచి డిమాండ్ ఉంది. అయితే కోవిడ్ సమయంలో కొనుగోలు దారులు బంగారం కొనుగోళ్ల నిర్ణయాన్ని విరమించుకున్నారు. కానీ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పసిడి విక్రయాలు గత ఆరు నెలలుగా జోరందుకున్నాయి. అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడంతో భారత్‌లో బంగారం పెరుగుదలకు ప్రధాన కారణమైంది. రాబోయే రోజుల్లో బంగారంపై డిమాండ్ పెరిగే కొద్ది ధరలు సైతం అదే స్థాయిలో పెరగడాన్ని మనం గమనిస్తాం’ అని నాయర్ పేర్కొన్నారు. బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతుందా? ఏయేటి కాయేడు బంగారం విలువ రెట్టింపు అవుతూనే ఉంటుంది. గడించిన 10ఏళ్లల్లో బంగారం వ్యాల్యూ 88 శాతం పెరిగింది. రానున్న సంవత్సరాల్లో పసిడి పరుగులు లైఫ్ టైం హై స్థాయికి చేరుకుంటాయి. ఆర్థిక, ఇతర భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య బంగారం ధరల విస్తృత ధోరణి సానుకూలంగా ఉందని నాయర్ చెప్పారు. ఇక ద్రవ్యోల్బణంతో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై తక్కువ ఆదాయం,ఈక్విటీల్లో అస్థిరతలతో ద్రవ్యల్బణం నుంచి కోలుకునేందుకు బంగారంపై పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల వద్ద ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. రూ.56,296 కోట్ల విలువైన సావరీన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. అదే విధంగా రూ.21,455 కోట్ల విలువైన గోల్డ్ ఎక్ఛేంజ్- ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లో పెట్టుబడులు పెట్టినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. భారత్‌లో బంగారంపై డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం భారత్‌లో ఉన్న మధ్య తరగతి కుటుంబాల్లో బంగారంపై డిమాండ్ 50 శాతంగా ఉంది. దానికి తోడు పాపులేషన్, గోల్డ్, గోల్డ్ జ్వువెలరీలు కీలక పాత్రపోషిస్తున్నాయి. ఇక 2009 తర్వాత గడిచిన పదేళ్ల కాలంలో అంటే 2021 వరకు బంగారం వినియోగంలో భారత్ చైనాను అధిగమించింది. 2021లో చైనా 673 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తే.. అదే ఏడాది భారత్ 611 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి రెండో స్థానంలో నిలించింది. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు భారత్‌లో బంగారం విలువ ఎలా ఉందోననే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా సీఈవో పీఆర్ సోమసుందర్ అన్నారు. -
వామ్మో..రికార్డు స్థాయికి బంగారం ధర, కారణాలేంటో తెలుసా?
సాక్షి, ముంబై: బంగారం ధర మరోసారి రికార్డు హైకి చేరింది.యూనియన్ బడ్జెట్లో దిగుమతి సుంకం పెంపునకు తోడు యూఎస్ ఫెడ్ నిర్ణయం కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంపు, ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు రివ్వున దూసుకెళ్లి గురువారం తాజా రికార్డులను తాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ధర రూ. 58,826 వద్ద ట్రేడవుతోంది. బుధవారం నాటి ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ఫలితంగా అమెరికా కరెన్సీ డాలర్ 9 నెలల కనిష్టస్థాయికి దిగజారింది. దీని ఫలితమే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీకి కారణమని బులియన్ పండితులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో, స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,951.79 డాలర్ల స్థాయి కి పెరిగింది, ఏప్రిల్ 2022 నుండి ఇదు అత్యధిక స్థాయి. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 600 రూపాయలు ఎగిసిన 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 53, 600 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 42,880 గాను ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 పెరిగి రూ. 58,470 గా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 58,470గా, 8 గ్రాముల బంగారం ధర రూ. 46,776 గాను, బడ్జెట్ 2023లో బంగారం, ప్లాటినం డోర్, బార్లతో సమానంగా సిల్వర్ డోర్, బార్లు,వస్తువులపై సుంకాన్ని పెంచాలని ప్రతిపాదించింది. వెండిపై దిగుమతి సుంకం, 7.5 నుంచి 10 శాతానికి పెంపు, అలాగే 5 శాతం వ్యవసాయం, మౌలిక సదుపాయాల సెస్‌తో పాటు, మొత్తంగా 15శాతం నికర సుంకాన్ని వసూలు చేయనున్నారు. అలాగే దిగుమతి చేసుకున్న బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలు, వస్తువులపై దిగుమతి సుంకం 20శాతం 25 శాతానికి పెరిగింది. -
పసిడి పరుగు, మూడు నెలల్లోపే అంత పెరిగిందా..!
సాక్షి,ముంబై: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి. పసిడి ధర శుక్రవారం మరో రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాములకు రూజ56,850కి చేరుకున్నాయి. డాలర్ క్షీణత , ట్రెజరీ ఈల్డ్‌ల కారణంగా బంగారం 3 నెలల గరిష్టానికి చేరింది. నవంబర్ నుంచి ప్రారంభమైన బులియన్ ర్యాలీ మధ్య గ్యాప్ ఇచ్చినా మూడు నెలలోపే 6 వేల రూపాయలు ఎగియడం గమనార్హం. గ్లోబల్ సంకేతాలతో భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్లలో బంగారం ధరలు ఈరోజు మరో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎంసీఎక్స్ బంగారం ఫ్యూచర్లు 0.3శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 56,850కి చేరగా, వెండి కిలోకు రూ. 68,743కి పలికింది. అమెరికా ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరి 1న దాని రెండు రోజుల సమావేశం ముగింపులో ఫెడరల్ రిజర్వ్ ద్వారా స్ట్రీట్ ఒక చిన్న 25-బేసిస్-పాయింట్ వడ్డీ రేటు మాత్రమే పెంపు ఉంటుందన్న అంచనాలతో బంగారం లాభపడుతుంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర 58,710 వద్ద, వెండి కిలో ధర స్వల్పంగా తగ్గి రూ. 73500 వద్ద ఉంది. -
కొంపముంచిన ఫెడ్: దలాల్ స్ట్రీట్ ఢమాల్!
సాక్షి,ముంబై: అమెరికా ఫెడ్ వ్యాఖ్యలు, అంతర్జాతీయ, భారతీయ మార్కెట్ల కొంప ముంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 879 పాయింట్లు పతనమై 61,799 వద్ద నిఫ్టీ 1.32 శాతం పతనమై 18,415 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. తద్వారా సెన్సెక్స్ 62 వేలు, నిఫ్టీ 18500 కిందికి చేరాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, రియాల్టీ షేర్లు భారీగా నష్టపోగా ముఖ్యంగా రిలయన్స్ టాప్ లూజర్‌గా ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును మరోసారి పెంచింది. అంతేకాదు ద్రవ్యోల్బణం అధికంగానే ఉందనీ, ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వడ్డీ రేట్ల పెంపు ఉండే అవకాశం ఉందన్న ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో గుబులు రేపాయి. ఫలితంగా అమ్మకాలు వెల్లువెతాయి. బ్రిటానియా, హీరో మోటో, ఎస్బీఐలైఫ్, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎండ్ , సన్‌ఫార్మా లాభ పడగా, టెక్ మహీంద్ర, టైటన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐఫర్ మోటార్స్ హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 34 పైసలు పతనమై 82.76 వద్దకు చేరింది. -
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు యూఎస్ ఫెడ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే పరిమిత శ్రేణికి లోబడే ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. దేశీయ సూచీలు ప్రపంచ మార్కెట్ల తీరును అనుసరించే వీలుందంటున్నారు. ఇదే వారంలో ఐదు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘సుధీర్ఘ ర్యాలీ తర్వాత సూచీలు స్థిరీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.., గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదు. కమోడిటీ ధరలు దిగిరావడం, కేంద్ర బ్యాంకులు సరళతర ద్రవ్య విధాన వైఖరితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి డిమాండ్ మరింత పెరగొచ్చు. నిఫ్టీ కీలకమైన తక్షణ మద్దతు 18,300 స్థాయిని నిలుపుకోగలిగింది. కొనుగోళ్లు కొనసాగితే 18,400–18,450 శ్రేణిలో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే 18,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో గతవారంలో సూచీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ప్రపంచ పరిణామాలు యూరో జోన్ సెప్టెంబర్ కరెంట్ ఖాతా లోటు డేటా రేపు(మంగళవారం) విడుదల అవుతుంది. యూఎస్, బ్రిటన్, యూరో జోన్ దేశాల నవంబర్ తయారీ, సేవా రంగ డేటా ఎల్లుండి(బుధవారం) వెల్లడి కానుంది. మరుసటి రోజున గురువారం(ఈ నెల 24న) అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్ విడుదల అవుతాయి. ఈ సందర్భంగా ఫెడ్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(జూలై 28న) నిఫ్టీ సూచీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్థిరత్వంతో పాటు వృద్ధి విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందనే సానుకూల అంశాలతో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున దేశీయ ఈక్విటీలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నవంబర్‌లో ఇప్పటి వరకు(1–17 తేదీల మధ్య) రూ.30,385 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఎఫ్ఐఐలు తమ బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ‘‘భారత కంపెనీల షేర్ల వ్యాల్యుయేషన్లు అధిక స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నందున రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్ పట్ల బేరిష్ వైఖరిని ప్రదర్శించవచ్చు. ఇదే సమయంలో చైనా, దక్షిణ కొరియా, తైవాన్ స్టాకులు ఆకర్షణీయమైన ధరల వద్ద లభ్యమవుతున్న తరుణంలో ఎఫ్ఐఐలు ఈ దేశాల వైపు మెగ్గుచూపవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. ఈ వారంలో అయిదు లిస్టింగ్‌లు ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకున్న అయిదు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ప్రత్యేక రసాయనాలు తయారు చేసే ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్, బ్యాంకింగేతర రంగ ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో నమోదుకానున్నాయి. గ్రే మార్కెట్లో ఆర్కియన్ కెమికల్ షేర్లు 25% ప్రీమియంతో, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ డిస్కౌంట్‌తో ట్రేడవుతున్నాయి. కేన్స్ టెక్నాలజీస్ ఇండియా షేర్లు మంగళవారం, ఐనాన్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ షేర్లు బుధవారం, కీస్టోన్ రియల్టర్స్ షేర్లు గురువారం లిస్ట్ కానున్నాయి. వీటిలో ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి సంస్థ కేన్స్ టెక్నాలజీస్ 30శాతం ప్రీమియంలో.., మిగతా రెండు కంపెనీ షేర్లు ఇష్యూ ధరల వద్ద స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల తీరును ఇన్వెస్టర్లు గమనించవచ్చు. -
నష్టాలనుంచి అనూహ్యంగా పుంజుకున్న సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లులాభాల్లోకి మళ్లాయి. యూఎస్ ఫెడ్ వరుస వడ్డీ వడ్డనతో నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు వెంటనే నష్టాలనుంచి తేరుకోవడం విశేషం. 278 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ప్రస్తుతం 60 పాయింట్లు లాభంతో 60965 వద్ద, నిప్టీ 16 పాయింట్లు పాజిటివ్‌గా 18099 వద్ద కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, నెస్లే, పవర్ గ్రిడ్ నష్టపోతుంగా, టైటన్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, మారుతి లాభపడుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో స్వల్ప నష్టాలతో 82.83 వద్ద ఉంది. కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా నాల్గవ సారి 75 బేసిస్ పాయింట్లు (bps) పెంచిన సంగతి తెలిసిందే. -
రుపీ క్రాష్: ముందుంది మహా పతనం!
సాక్షి, ముంబై: అమెరికా డాలరు మారకంలో రోజురోజుకు దిగజారుతున్న దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై రాయిటర్స్ పోల్ కీలక విషయాలను వెల్లడించింది. రూపాయి మరింత బలహీనపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సంవత్సరాంతానికి డాలర్‌తో రూపాయి 84.50 స్థాయికి పడిపోతుందన్న అంచనాలు ఆందోళనకు దారి తీసింది. దేశీయ వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న అమెరికా ఫెడ్ వడ్డీరేటు కారణంగా అమెరికా డాలరు మారకంలో రూపాయి ఈ ఏడాది తొమ్మిదేళ్లలో లేనంత కనిష్టానికి పడిపోతుందని రాయిటర్స్ పోల్స్ తేల్చి చెప్పింది. 14 మంది బ్యాంకర్లు, విదేశీ మారకద్రవ్య సలహాదారుల పోల్ అంచనాల ప్రకారం, డిసెంబర్ నాటికి మన రూపాయి 84.50కి మరింత పడిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సంవత్సరం రూపాయి కోలుకోదనే ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు యూఎస్ ఫెడ్ వడ్డింపుతో డాలరు ఇండెక్స్ 18శాతం జంప్ చేసింది. రాబోయే రోజుల్లో రూపాయి మరింత బలహీనత పడి అతి త్వరలోనే 84 స్థాయిని తాకనుందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ కమోడిటీస్ రాహుల్ కలంత్రి అన్నారు. డిసెంబరు నాటికి రూపాయి డాలర్‌తో పోలిస్తే 85 స్థాయికి పతకం కావచ్చు, ఎందుకంటే బాహ్య వాతావరణంలో పెద్ద మార్పులు కనిపించడం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ అభిప్రాయపడ్డారు. కాగా బుధవారం తొలిసారి 83 స్థాయిని పతనమైన రూపాయి83.21 వద్ద గురువారం మరో ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 12శాతం పడిపోయింది. 2021లో సగటున 15.3 బిలియన్ల డాలర్లతో పోలిస్తే, ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల భారతదేశం సగటు నెలవారీ వాణిజ్య లోటు 23.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది రూపాయి విలువపై ప్రభావాన్ని చూపుతోంది. అటు ఎన్ఎస్డిఎల్ డేటా ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయ ఈక్విటీల నుండి 23.4 బిలియన్ డాలర్లు, డెట్ మార్కెట్‌నుంచి 1.4 బిలియన్ డాలర్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. -
మార్కెట్లకు ఫెడ్ దెబ్బ
ముంబై: ఆర్థికవేత్తల ఆందోళనలను నిజం చేస్తూ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మూడోసారి 0.75 శాతం పెంచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 337 పాయింట్లు క్షీణించింది. 59,120 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్ల వెనకడుగుతో 17,630 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం 3.25 శాతంగా ఉన్న ఫండ్స్ రేట్లను ఈ ఏడాది చివరికల్లా 4.4 శాతానికి చేర్చే వీలున్నట్లు ఫెడ్ సంకేతాలివ్వడంతో ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 111ను దాటింది. ఫలితంగా రూపాయి ఇంట్రాడేలో 100 పైసలు కోల్పోయి చరిత్రాత్మక కనిష్టం 80.96కు చేరింది. వీటికితోడు ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సైనిక బలగాలను పెంచుతుండటంతో సెంటిమెంటు దెబ్బతిన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 17,723–17,532 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. అయితే ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడంతో ఒక దశలో సెన్సెక్స్ నామమాత్ర లాభాల్లోకి ప్రవేశించడం గమనార్హం! మీడియా అప్ ఫెడ్ బాటలో ఇతర కేంద్ర బ్యాంకులూ కఠిన విధానాలను అవలంబించనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో వర్ధమాన మార్కెట్లలో కరెన్సీలు, ఈక్విటీలు నీరసిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్ 1.4 శాతం నీరసించగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, వినియోగ వస్తువులు, ఆటో రంగాలు 1.9–0.7 శాతం మధ్య బలపడ్డాయి. బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ ద్వయం, యాక్సిస్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్, శ్రీసిమెంట్, బీపీసీఎల్ 3–1.2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టైటన్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఐషర్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐటీసీ 2.8–1.4 శాతం మధ్య ఎగశాయి. చిన్న షేర్లు ఓకే.. తాజాగా చిన్న షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్‌క్యాప్స్ 0.5–0.3 శాతం చొప్పున బలపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,510 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 263 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్ ► పట్టణీకరణతోపాటు వినియోగం పెరుగుతుండటంతో జాకీ బ్రాండ్ దుస్తుల కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 53,225 వద్ద ముగిసింది. ► రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజిస్తుండటంతో ఐటీ సేవల కంపెనీ శాక్సాఫ్ట్ షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 1,278 వద్ద స్థిరపడింది. ► ప్రమోటర్ సంస్థ విల్మర్ తాజాగా వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాలకు మద్దతునివ్వడంతో శ్రీ రేణుకా షుగర్స్ 6.5% ఎగసి 60.50 వద్ద క్లోజైంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి ► ఒకేరోజు 83 పైసలు డౌన్ ► 80.79 వద్ద ముగింపు అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఒకేరోజు భారీగా 83 పైసలు బలహీనపడి, 80.79 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన ఏడు నెలల్లో (ఫిబ్రవరి 24న 99 పైసలు పతనం) రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో బలహీనపడ్డం ఇదే తొలిసారి. అమెరికా ఫెడ్ రేటు పెంపుతోపాటు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయిని వెంటాడుతున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. బుధవారం రూపాయి ముగింపు 79.96. ట్రేడింగ్ ప్రారంభంలోనే 80.27 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఒక దశలో ఆల్‌టైమ్ ఇంట్రాడేలో 80.96కు కూడా పడిపోయింది. ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ఇక ఇన్వెస్టర్ల దృష్టి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌పై ఉన్నట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. మరోపక్క, అంతర్జాతీయ మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీల ప్రాతిపదిక లెక్కించే డాలర్ ఇండెక్స్ 20యేళ్ల గరిష్టం 111 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ భారీ నష్టంతో 81.18 వద్ద ట్రేడవుతోంది. -
ఫెడ్ సెగ: రికార్డు కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: అమెరికా డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా నష్టపోతోంది. ప్రస్తుతం 73 పైసలు కోల్పోయి 80.56 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. గురువారం ఆరంభంలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ 42 పైసలు క్షీణించి 80.38కి చేరుకుంది. ఆ తరువాత మరింత క్షీణించింది. బుధవారం 79.98 వద్ద ముగిసింది. (StockMarketOpening: లాభనష్టాల ఊగిసలాట) మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 59301 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టంతో 17673 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడవసారి వడ్డీ రేట్లను 75 బీపీఎస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా డాలరు బలం పుంజుకుంది. ఫలితంగా ఆసియా కరెన్సీలు ఒత్తిడిలో ఉన్నాయి. భవిష్యత్తు ఇంధన డిమాండ్‌పై అనుమానాల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా క్షీణించాయి. ఇదిఇలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన అంతర్జాతీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. 3 లక్షల మంది సైనికుల పాక్షిక మొబిలైజేషన్ ప్రకటన ఉక్రెయిన్‌పై యుద్ధ తీవ్రతను పెంచుతోందని భావిస్తున్నారు. -
ఫెడ్‌పై కన్ను: భారీ నష్టాల్లో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. యుఎస్ ఫెడ్ మీట్ ఫలితాలకు ముందు పెట్టుబడిదారుల అప్రమత్తత నేపథ్యంలో బుధవారం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 401 పాయింట్లు క్షీణించి 59318 వద్ద, నిప్టీ 135 పాయింట్లు పతనమై 17681 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపుఅన్ని రంగాల షేర్లుఅమ్మకాల ఒత్తిడిలోఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 0.3 శాతం క్షీణించి 41339 స్థాయిలకు చేరుకుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్ టాప్ ఇండెక్స్ డ్రాగర్స్‌గా ఉన్నాయి. నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, ఐటిసి షేర్లు టాప్ లాభాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా బలహీనంగా ఉంది. 22పైసల నష్టంతో 79.92 వద్ద ఉంది. ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ నేతృత్వంలోని పాలసీ మీట్ ఈ రోజుతో ముగియనుంది. 75 బీపీఎస్ వడ్డీ రేటు పెంపును ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నాయి. 100 బీపీఎస్ పాయింట్లు పెంచవచ్చని కూడా చాలా మంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. -
బెజోస్,మస్క్ సరే! మరి అదానీ, అంబానీ సంపద మాట ఏంటి?
సాక్షి,ముంబై: అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి బిలియనీర్లు బిలియన్ డాలర్ల సంపదను కోల్పోతున్నారు. టాప్ 10లో ఉన్న అక్కడి బిలియనీర్ల సంపదకు ఈ ఏడాది గడ్డుకాలంగా నిలుస్తోంది.ఒక్క జులై మినహా ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికా మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. ఫలితంగా ఈ ఏడాది తొలి అర్దభాగంలో ప్రపంచ కుబేరులు 1.4 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. ఫెడ్ వడ్డీరేటు తప్పదనే భయాలు ఇన్వెస్టర్లనువెంటాడుతున్నాయి. ఫలితంగా S&P 500 జూన్ 2020 నుండి అత్యధికంగా 4.4 శాతం, టెక్-హెవీ నాస్డాక్ 100 ఇండెక్స్ 5.5శాతం కుప్పకూలింది. ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ ఎనిమిది నిమిషాల ప్రసంగం తర్వాత బిలియనీర్ల సంపద ఒక రోజులో 78 బిలియన్ డాలర్ల కోల్పోయింది. అదే భయం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే దేశీయ వ్యాపార దిగ్గజాలు, ఆసియా కుబేరులు సంపద మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం. (బెజోస్ నుంచి మస్క్ దాకా, ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్) గ్లోబల్ బిలియనీర్ల జాబితా టాప్-10 లో ఒక్క రోజులొ సంపదను కోల్పోని బిలియనీర్లు ఇద్దరు మాత్రమే. వారే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ,గౌతమ్ అదానీ.బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం దేశవ్యాప్తంగా దీపావళి నాటికి తన స్వతంత్ర 5జీ సేవలను ప్రారంభించబోతున్న అంబానీ 9,775 కోట్లు సంపాదించారు. మరోవైపు ప్రస్తుతం ప్రపంచంలో మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 12,556 కోట్లు (1.58 బిలియన్ డాలర్లు ) సంపాదించడం విశేషం. ముఖ్యంగా టాప్‌లో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇద్దరూ గత 24 గంటల్లో లక్షా 50 వేల కోట్ల మేర సంపదను కోల్పోయిన సంగతి తెలిసిందే. -
బెజోస్ నుంచి మస్క్ దాకా, ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్
న్యూఢిల్లీ: అమెరికా ఎకానమీలో ముదురుతున్న మాంద్యం భయాలకు తోడు, ఊహించినదానికంటే ఎక్కువగా నమోదైన అధిక ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఫలితంగా భారీగా ఫెడ్ వడ్డింపు తప్పదనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని అత్యంత సంపన్న బిలియనీర్ల సంపద మంగళవారం నాడు 93 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఇది తొమ్మితో అత్యంత దారుణమైన రోజువారీ నష్టమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. (బెజోస్,మస్క్ సరే! మరి అదానీ, అంబానీ సంపద మాట ఏంటి?) బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెరికా కుబేరుల సంపద భారీగా తుడుచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద ఒక్క రోజు లోనే రూ. 80 వేల కోట్లు (9.8 బిలియన్ డాలర్లు)ను కోల్పోయారు.. అలాగే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నికర విలువలో రూ.70 వేల కోట్లు (8.4 బిలియన డాలర్లను) పడిపోయింది. అంతేకాదు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ , స్టీవ్ బాల్మెర్లు ఇదే బాటలో పయనించారు. వీరి సంపద మొత్తం 4 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించగా, టాప్ 10 జాబితాలోని ఇతర బిలియనీర్లు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వరుసగా 3.4 బిలియన్ డాలర్లు, 2.8 బిలియన్ డాలర్లను కోల్పోయారు. కాగా అమెరికా వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.3 శాతం మేర పెరిగింది. ఇది 8.1 శాతంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. దీంతో ఇది మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో గత ఐదు రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి.