Gold Price Today 28th July అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేటుపెంపుతో శుక్రవారం బంగారం ధరలు దిగి వచ్చాయి. శ్రావణ శుక్రవారం సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు దిగిరావడం శుభ సంకేతంగా మారింది. అటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. యూఎస్ ఫెడ్ రీసెంట్ రివ్యూలో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేపు పెంపుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు దూసుకు పోతోందన్న అందోళన మొదలైంది. దీంతో అమెరికా కరెన్సీ డాలరు నష్టాల్లోకి జారుకుంది. ఈ ప్రభావం అంతర్జాతీయంగా, జాతీయంగా బంగారం ధరలపై చూపుతోంది. (బర్త్ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!)
హైదరాబాదులో 22 క్యారట్ల బంగారం 10 గ్రాములకి 350 రూపాయలుదిగి వచ్చి ధర రూ. 55,100 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 380 పతనమై రూ. 60,110 గా ఉంది. వెండి ధర కూడా దిగి వచ్చి 80 వేల దిగువకు చేరింది. ఇటీవలి కాలంలో బాగా పెరుగుతూ వస్తున్న వెండి ధర శుక్రవారం ఏకంగా 2 వేల రూపాయలు పతనమైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 79,500 గాఉంది. (హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ!)
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో పసిడి కొద్దిగా పుంజుకుంది. ఆగస్టు ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 59,565 వద్ద ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కూడా రూ.128 లేదా 0.17శాతం పెరిగి కిలోకు రూ.73,875 వద్ద ట్రేడవుతున్నాయి. (ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?)
అంతర్జాతీయంగా బంగారం ధరలు వోలటైల్‌గా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ 0.3శాతం పెరిగి ఔన్స్‌కు 1,951.19 డాలర్లుగా ఉంది. అంతకుముందు జూలై 12న కనిష్ట స్థాయిని తాకింది. అలాగే మునుపటి సెషన్‌లో 1.4 శాతం క్షీణించింది. ఈ వారంలో ఇప్పటివరకు బులియన్ 0.4శాతం పతనాన్ని నమోదుచేసింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 1,950డాలర్ల వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాల్టి బంగారం ధరలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి!
Comments
Please login to add a commentAdd a comment