
Gold and Silver Price Today: బంగారం ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా తాజాగా సోమవారం నాలుగు వారాల గరిష్టం నుంచి వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ రేట్ల పెంపు ఉండదనే అంచనాలతో పసిడి ధరలు తగ్గముఖం పట్టాయి. ఇటీవలి గరిష్టం ఔన్స్ ధర 1968 డాలర్ల నుండి వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం ఔన్సుకు 1950-1,953 డాలర్ల వద్ద కదలాడుతున్నాయి.
అమెరికా డాలర్ 15 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత, గత వారం గత కొన్ని సెషన్లలో బంగారం ధరలు బాగా పుంజుకున్నాయి. అయితే, సోమవారం తెల్లవారుజామున జరిగిన డీల్స్‌లో,దేశీయ , అంతర్జాతీయ మార్కెట్‌లో కొంత ప్రాఫిట్ బుకింగ్‌ను చూసింది. ఎంసీఎక్స్ ఆగస్టు గడువు ముగిసిన గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల స్థాయిలకు రూ. 59,147 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో రూ. 59,130 స్థాయిలకు పడింది.అయితే విలువైన మెటల్ తక్కువ స్థాయిలలో కొనుగోళ్లతో రూ. 59,194 స్థాయిలను తాకింది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?)
అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం పుత్తడి ధరల పెరుగుదలకు దోహదపడింది. ద్రవ్యోల్బణ ఒత్తిడితో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చే ఆశలు పెట్టుబడిదారుల్లో ఉన్నాయి. ఇదే చర్య బంగారం ధరలకు ఊతమిస్తుంది. జూలై 26న జరగబోయే ఫెడ్ మానిటరీ పాలసీ మీటింగ్‌పై ప్రధానంగా అందరి దృష్టి ఉంది.
ఇక దేశీయంగా బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల పుత్తడి రూ.55వేలు, 24 క్యారెట్ల బంగారం రూ.60వేల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,150గానూ, 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూ.60,150 గా ధర పలుకుతోంది. (ఇది కదా లక్ అంటే.. గంటలో కోటి!)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు పలుకుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.60వేల వద్ద ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.81500 ఉన్నది ముంబై లో 10 గ్రాముల 24 క్యారెట్ల 999 బంగారం ధర రూ.5,9450 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, 10 గ్రాముల ఆభరణం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5,7250గా ఉన్నాయి.ఈ ధరలకు జీఎస్టీ అదనం.
Comments
Please login to add a commentAdd a comment