గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ రోజు (మే 28) పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో తులం గోల్డ్ రేటు మునుపటి కంటే రూ.200 పెరిగింది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది.
చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 200 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 220 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 67400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 73530 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయలకు చేరింది. నిన్న రూ. 250 నుంచి రూ. 270 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు రూ. 200 , రూ. 220 వరకు పెరిగాయి.
వెండి ధరలు
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి, కానీ వెండి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఈ రోజు (మే 29) వెండి ధర రూ. 3500 పెరిగి రూ. 96500 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో వెండి ధరలు ఏకంగా ఒక లక్షకు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment