Today Gold and Silver Price: దేశంలో వెండి, బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌మార్కెట్ పసిడి ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు 100 రూపాయలకుతగ్గి, 54,950వద్ద ఉంది. తద్వారా 55వేల దిగువకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10గాముల బంగారం ధర 110రూపాయలు క్షీణించి 59,950 వద్ద ఉంది. వెండి ధర కూడా అదే బాటలోఉంది. కిలో వెండి ధర రూ.600 క్షీణించి రూ. 76,700 వద్ద ఉంది. (HBDMaheshBabu: మహేష్‌బాబు నెట్‌వర్త్, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్, ఈ విషయాలు తెలుసా?)
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వరుసగా రెండు రోజులు భారతీయ మార్కెట్లో దిగువన ఉన్న ధరలు (ఆగస్టు 9 బుధవారం) బంగారం వెండి ధరలు రెండూ పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 82 పెరిగి 10 గ్రాములకు రూ.59,347గా ఉంది. అదేవిధంగా, సెప్టెంబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్ కూడా రూ. 309 లేదా 0.44 శాతం పెరిగి MCXలో కిలోకు రూ. 70,538 వద్ద ట్రేడవుతున్నాయి. (దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు
రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ యూఎస్ వృద్ధ రేటును డౌన్‌గ్రేడ్ గ్లోబల్‌గా బంగారం ధరలు మునుపటి సెషన్‌లోని నెల కనిష్టంనుంచి తిరిగి పుంజుకున్నాయి. తాజా మెటల్ నివేదిక ప్రకారం, స్పాట్ బంగారం 0345 GMT నాటికి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 1,929.99 డాలర్ల వద్ద ఉంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,963.80 డాలర్ల వద్ద ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment