Gold And Silver Price: Check The Latest Rates On August 3, 2023 - Sakshi
Sakshi News home page

శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి

Published Thu, Aug 3 2023 12:10 PM | Last Updated on Thu, Aug 3 2023 1:07 PM

Gold And Silver Price Check Latest Rates On August 3 2023 - Sakshi

Gold And Silver Check Latest Rates: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు వరుసగా దిగి వస్తున్నాయి.  ఆగస్టు 3న దేశవ్యాప్తంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా వెండి ధర భారీ పతనాన్ని నమోదు చేసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది.  (టమాటా షాక్‌: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!)

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24క్యారెట్ల బంగారం 160 క్షీణించి 59,950 పలుకుతోంది.  22  క్యారెట్ల పసిడి రూ. 54, 950 వద్ద ఉంది. కిలో వెండి ధర ఏకంగా 1800 రూపాయిలు తగ్గి,  రూ. 78500 పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో  దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 

 దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల కోసం క్లిక్‌ చేయండి

ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 150  క్షీణించి రూ. 55,100 వద్ద, రూ. 160 పడిన 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 60,100గా ఉంది. వెండి ధర  కిలోకు 2300  పతనమై రూ. 75,000గా ఉంది. (విమాన ప్రయాణీకులకు బంపర్‌ ఆఫర్‌:మెగా సేల్‌)

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గురువారం నాడు 10 గ్రాముల రూ. 59,415 వద్ద  ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో రూ. 59,373 వద్ద కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.  వెండి కిలోకు రూ.72,696 వద్ద  కొనసాగుతోంది.  అంతర్జాతీయ మార్కెట్‌లోబంగారం ధరలు ట్రాయ్ ఔన్స్‌కు దాదాపు 1,937.25 డాలర్లుగా ఉన్నాయి. వెండి ఔన్స్ ధర 23.68 డాలర్లుగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement