Today Gold and Silver prices: బంగారం, వెండి ధరలు మళ్లీ మండుతున్నాయి. ఆల్ టై హై నుంచి కొద్దిగా వెనక్కి తగ్గినప్పటికీ, డాలర్ బలంతో మళ్లీ భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు వేగం పుంజకున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.54,750గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 270పెరిగి రూ. 59,670 పలుకుతోంది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలోకు రూ. 200 పెరిగిన వెండి ధర కిలోకు 77. 100గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
MCX మార్కెట్‌లో వరుసగా రెండో రోజు జంప్
ఆగస్టు 29, మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం , వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 90 లేదా 0.15 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.58,949గా ఉంది.అదేవిధంగా, సెప్టెంబరు 5, 2023న మెచ్యూరయ్యే వెండి ఫ్యూచర్లు కూడా రూ. 162 లేదా 0.22 శాతం పెరిగి కిలోకు రూ. 73,700 వద్ద ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయంగా బంగారం, వెండి ధర
స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 1,924.84కి చేరుకుంది, ఆగస్టు 10 నుండి అత్యధికం. అమెరికా బంగారం ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,952.90 డాలర్ల వద్ద ఉన్నాయి. వెండి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 24.32 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫెడ్ సెప్టెంబర్ పాలసీ నిర్ణయం, ఆగస్ట్ లేబర్ మార్కెట్ డేటా ఆధారంగా బంగారం ధరలు కదలాడుతాయని మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయింది. సోమవారం నాటి ముగింపు 82.62 తో పోలిస్తే మంగళవారం 82.70 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment