Today Gold and Silver Prices: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరింత దిగివచ్చాయి. గత కొన్ని సెషన్లుగా నేలచూపులు చూస్తున్న పసిడి ధర శుక్రవారం దేశవ్యాప్తంగా సుమారు 300 రూపాయలు క్షీణించింది. మూడు రోజుల్లో దాదాపు వెయ్యిరూపాయలు దిగి వచ్చింది. సెప్టెంబరు 26న రూ. 54,750గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర శుక్రవారం నాటికి రూ. 54 వేల స్థాయిని కోల్పోయి 53,650 స్థాయికి దిగి వచ్చింది. మూడు సెషన్లలో 1100 దిగివచ్చింది.
హైదరాబాద్ మార్కెట్‌లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయలు క్షీణించి రూ. 53,650గా ఉంటే…24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ. 58,530గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే వెండి మాత్రం వెయ్యి రూపాయలు పుంజుకుంది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ. 77500 ఉండగా, ఢిల్లీలో రూ.74,700 పలుకుతోంది. (బ్యాంకు లాకర్‌లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?)
కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. అలాగే దేశీయంగా కూడా పెళ్లిళ్ల సీజన్‌లో పుంజుకున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు పాజటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment