Today Gold and Silver Prices: దేశీయ మార్కెట్లో వెండి బంగారం ధరలు మళ్లి దిగివస్తున్నాయి. గత కొన్ని సెషన్లుగా లాభ నష్టాల మధ్య బంగారం ధర బుధవారం మరింత పడింది. ద్రవ్యోల్బణం,పెరుగుతున్న వడ్డీ రేట్లు, డాలర్ బలం కారణంగా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి 280 రూపాయలు క్షీణించి రూ. 59,450 వద్ద ఉంది.అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 250 పతనమై 54,500వద్ద ఉంది. కిలో వెండి ధర 600 రూపాయలు తగ్గి 74, 200 గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి 59,450 గాను, 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి 54, 500 గాను ఉంది. అలాగే కిలో వెండి రూ. 77వేలు పలుకుతోంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.58,843 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో, ట్రాయ్ ఔన్స్‌కు 1,903.35 డాలర్లుగా ఉన్నాయి. వెండి కూడా 71,260 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ ఇండెక్స్‌లో బలం పుంజుకోవడంతో బంగారం ధరలు నిన్న ఏకంగా 1.59 శాతం నష్టపోయాయి.
మరోవైపు గత రెండు సెషన్లుగా బలహీనంగా ఉన్న దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం పాజిటివ్‌గా ఉన్నాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినా కొనుగోళ్లు పుంజుకోవడం లాభాల్లోకి మళ్లాయి. నిఫ్టీ 19700 పైకి, సెన్సెక్స్ 66వేల ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. రూపాయి కూడా స్వల్ప లాభాలతో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment