Today Gold and Silver Prices: దేశంలో బంగారం , వెండి ధరలు పైపైకే చూస్తున్నాయి. గతరెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర సోమవారం మరింత ఎగిసింది. అటు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా పరుగాపక పయనిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పెరుగుతున్న చమురు, డాలరు బలం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) (సెప్టెంబర్ 18, సోమవారం నా డు )లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి.అక్టోబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 105 పెరిగి 10 గ్రాములకు రూ.59,098గా ఉంది. అదేవిధంగా, డిసెంబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్ కూడా రూ. 307 లేదా 0.43 శాతం పెరిగి MCXలో కిలోకు రూ. 72,461 వద్ద ట్రేడవుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల పసిడి ధర 140 రూపాయిలు పెరిగి, 10గ్రాములకు 55,050 గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పుంజుకుని 60.050పలుకుతోంది. అటు వెండి కిలో స్వల్పంగా 200 రూపాయిలు తగ్గి కిలో వెండి 74,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
అటు వరస లాభాలకుచెక్ చెప్పిన దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాల్లోకి జారుకున్నాయి.మరోవైపు పెరుగుతున్న చమురు ధరల కారణంగా భారత కరెన్సీ రూపాయి డాలరు మారకంలో 83.22 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment