అమాంతం పెరిగిన బంగారం ధరలు: ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్! | Gold and Silver Price Today 24th January 2025 | Sakshi
Sakshi News home page

అమాంతం పెరిగిన బంగారం ధరలు: ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్!

Published Fri, Jan 24 2025 10:43 AM | Last Updated on Fri, Jan 24 2025 11:14 AM

Gold and Silver Price Today 24th January 2025

భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి దూసుకెళ్తున్నాయి. ఈ రోజు (శుక్రవారం) కూడా పసిడి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో గోల్డ్ రేటు జీవితకాల గరిష్టాలను తాకింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 82,420 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది.

చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.  82,420 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.

దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 75,700 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 82,570 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.

ఇదీ చదవండి: పాకిస్తాన్‌లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..

వెండి ధరలు (Silver Price)
ఆరు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 1000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 10,5000కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,500 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement