ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలో బంగారం పండింది. సింధు నదిలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (GSP) వెల్లడించింది. సుమారు 32.6 మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు 600 బిలియన్ పాకిస్తానీ రూపాయలని (రూ.18 వేలకోట్ల కంటే ఎక్కువ) అంచనా.
సింధునది, హిమాలయాల దిగువన టెక్నోనిక్ ప్లేట్స్ కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల.. బంగారం అణువులు ఏర్పడుతున్నాయని, ఈ అణువులు సింధు నది ద్వారా ప్రవహిస్తూ.. పాకిస్తాన్ పరీవాహక ప్రాంతాల్లో వ్యాపించినట్లు జీఎస్‌పీ స్పష్టం చేసింది. ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇక మంచి రోజులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
సింధు నదిలో సుమారు 32 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండే బంగారు నిక్షేపాలను వెలికితీయడానికి.. చర్యలు చేపట్టనున్నట్లు పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖామంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ వెల్లడించారు. ప్రస్తుతం పంజావ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖ్తున్వా ప్రావీన్స్ వంటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్ వంటి ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఇదే జరిగితే.. రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్?
పేద దేశంగా.. దిగజారిపోతున్న తరుణంలో పాకిస్తాన్‌కు మంచి రోజులు వచ్చాయి. ఉగ్రవాదం, అంతర్గత పోరు, సైనిక తిరుగుబాటు మధ్య ఎప్పుడూ అశాంతి నెలకొన్న దేశంలో బంగారు నిక్షేపాలు బయటపడంతో.. దేశం ఊపిరి పీల్చుకోనుంది. మళ్ళీ అభివృద్ధివైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాద దేశంగా చూస్తున్న పాక్.. భవిష్యత్తు మారే రోజులు వచ్చినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.
సింధు నది
సింధు నది ప్రపంచంలోని పురాతన, పొడవైన నదులలో ఒకటి. ఇది ప్రారంభ నాగరికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. సింధు లోయ నాగరికత 3300 - 1300 BCE మధ్య దాని ఒడ్డున అభివృద్ధి చెందింది. 1947 విభజనకు ముందు, సింధు నది పూర్తిగా భారతదేశంలోనే ఉండేది. అయితే విభజన తరువాత లేదా ఇప్పుడు సింధు నది రెండింటి గుండా ప్రవహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment