
ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి(Gold) ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. మన దేశంలో అయితే దీన్ని మరింత విలువైన లోహంగా భావిస్తారు. కొందరు బంగారాన్ని తమ గౌరవానికి సూచికగా భావిస్తే..ఇంకొందరు దీన్నో పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. దాంతో దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పసిడికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇటీవల దీని తులంధర ఏకంగా రూ.88 వేలు దాటిపోయింది. త్వరలో బంగారం రేటు రూ.ఒక లక్ష కూడా చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో అధికంగా బంగారం నిల్వలున్నాయో కింద తెలుసుకుందాం.
యునైటెడ్ స్టేట్స్ 8,133.46 టన్నులు
జర్మనీ 3,351.53 టన్నులు
ఇటలీ 2,451.84 టన్నులు
ఫ్రాన్స్ 2,436.94 టన్నులు
చైనా 2,264.32 టన్నులు
స్విట్జర్లాండ్ 1,039.94 టన్నులు
భారతదేశం 853.63 టన్నులు
జపాన్ 845.97 టన్నులు
తైవాన్, చైనా 422.69 టన్నులు
పోలాండ్ 419.70 టన్నులు
ఇదీ చదవండి: అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..
చైనాలో భారీ బంగారు గని
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్ జియాంగ్ కౌంటీలో ఇటీవల సుమారు రూ.7,09,577,16,96,000 విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వల గనిని కనుగొన్నారు. ఈ నిక్షేపం వాంగు గోల్డ్‌ఫీల్డ్స్‌లో బయటపడినట్లు తెలియజేస్తున్నారు. ఇక్కడ భూగర్భ శాస్త్రవేత్తలు 2,000 మీటర్ల లోతు వరకు విస్తరించిన 40 బంగారు నిక్షేపాలను గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వీటిలో కనీసం 300 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని తేలినట్లు సమాచారం. 3,000 మీటర్ల వరకు విస్తరించిన లోతైన ఈ గనిలో మరింత నిల్వలు ఉండవచ్చని అంచనా. దాంతో ఇందులో మొత్తంగా సుమారు 1,000 మెట్రిక్ టన్నుల వరకు బంగారం ఉంటుందని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment