Gold reserves
-
పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..
ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలో బంగారం పండింది. సింధు నదిలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (GSP) వెల్లడించింది. సుమారు 32.6 మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు 600 బిలియన్ పాకిస్తానీ రూపాయలని (రూ.18 వేలకోట్ల కంటే ఎక్కువ) అంచనా.సింధునది, హిమాలయాల దిగువన టెక్నోనిక్ ప్లేట్స్ కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల.. బంగారం అణువులు ఏర్పడుతున్నాయని, ఈ అణువులు సింధు నది ద్వారా ప్రవహిస్తూ.. పాకిస్తాన్ పరీవాహక ప్రాంతాల్లో వ్యాపించినట్లు జీఎస్పీ స్పష్టం చేసింది. ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇక మంచి రోజులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.సింధు నదిలో సుమారు 32 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండే బంగారు నిక్షేపాలను వెలికితీయడానికి.. చర్యలు చేపట్టనున్నట్లు పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖామంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ వెల్లడించారు. ప్రస్తుతం పంజావ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖ్తున్వా ప్రావీన్స్ వంటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్ వంటి ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. రూ.10 లక్షల వరకు నో ట్యాక్స్?పేద దేశంగా.. దిగజారిపోతున్న తరుణంలో పాకిస్తాన్‌కు మంచి రోజులు వచ్చాయి. ఉగ్రవాదం, అంతర్గత పోరు, సైనిక తిరుగుబాటు మధ్య ఎప్పుడూ అశాంతి నెలకొన్న దేశంలో బంగారు నిక్షేపాలు బయటపడంతో.. దేశం ఊపిరి పీల్చుకోనుంది. మళ్ళీ అభివృద్ధివైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాద దేశంగా చూస్తున్న పాక్.. భవిష్యత్తు మారే రోజులు వచ్చినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.సింధు నదిసింధు నది ప్రపంచంలోని పురాతన, పొడవైన నదులలో ఒకటి. ఇది ప్రారంభ నాగరికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. సింధు లోయ నాగరికత 3300 - 1300 BCE మధ్య దాని ఒడ్డున అభివృద్ధి చెందింది. 1947 విభజనకు ముందు, సింధు నది పూర్తిగా భారతదేశంలోనే ఉండేది. అయితే విభజన తరువాత లేదా ఇప్పుడు సింధు నది రెండింటి గుండా ప్రవహిస్తుంది. -
పసిడి కాంతుల్లో సెంట్రల్ బ్యాంకులు
ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాలతో ప్రపంచ బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. 2024 నవంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల 53 టన్నుల పసిడి నిల్వలను పెంచుకోగా, ఇందులో భారత్ రిజర్వ్ బ్యాంక్ వాటా 8 టన్నులు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → 2024లో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని స్థిరమైన, భద్రమైన అసెట్‌గా భావించి, కొనుగోళ్లకు ఆసక్తి ప్రదర్శించాయి. ముఖ్యంగా 2024 చివరి భాగాన్ని పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపాయి. → అమెరికా ఎన్నికల అనంతరం నవంబర్‌లో బంగారం ధరలు తగ్గాయి. దీనిని కొనుగోళ్లకు ఒక మంచి అవకాశంగా సెంట్రల్ బ్యాంకుల భావించాయి. → నవంబర్‌లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు అయ్యింది. దీనితో భారత్ సెంట్రల్ బ్యాంక్ వద్ద మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరాయి. → 2024లో రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ కొనసాగింది. మొదటి స్థానంలో పోలాండ్ ఉంది. పోలాండ్ నేషనల్ బ్యాంకు నవంబర్‌లో 21 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 90 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. → ఉజ్బెకిస్తాన్ కేంద్ర బ్యాంకు 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 11 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.దీనితో ఈ దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 382 టన్నులకు చేరాయి. → కజికిస్గాన్ నేషనల్ బ్యాంక్ నవంబర్‌లో 5 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, మొత్తం దేశ బంగారం నిల్వలు 295 టన్నులకు చేరాయి. → చైనా పీపుల్స్ బ్యాంక్ (పీబీఓసీ) ఆరు నెలల విరామం తర్వాత బంగారం కొనుగోళ్లను పునఃప్రారంభించి, నవంబర్‌లో 5 టన్నులు కొనుగోళ్లు జరిగింది. వార్షికంగా నికర కొనుగోళ్లు 34 టన్నులు. మొత్తం పసిడి నిల్వలు 2,264 టన్నులకు (మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలో 5 శాతం) చేరాయి. → జోర్డాన్ నవంబర్‌లో 4 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగింది. జూలై తర్వాత దేశం పసిడి కొనుగోళ్లు జరిపింది నవంబర్లోనే కావడం గమనార్హం. దేశం మొత్తం పసిడి నిల్వలు 73 టన్నులకు ఎగశాయి. → టర్కీ నవంబర్‌లో జరిపిన కొనుగోళ్ల పరిమాణం 3 టన్నులు. → చెక్ నేషనల్ బ్యాంక్ వరుసగా 21 నెలలుగా కొనుగోళ్లు జరుపుతోంది. నవంబర్‌లో జరిపిన కొనుగోళ్లు 2 టన్నులు. వార్షికంగా కొనుగోళ్లు 20 టన్నులు. దీనితో బ్యాంకు వద్ద మొత్తం నిల్వలు 50 టన్నులపైకి ఎగశాయి. → ఘనా నేషనల్ బ్యాంక్ నవంబర్‌లో టన్నుల కొనుగోళు చేయగా, వార్షికంగా చేసిన కొనుగోళ్లు 10 టన్నులు. దీనితో దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 29 టన్నులకు చేయాయి. ఎకానమీ స్థిరత్వానికి పసిడి నిల్వలు కీలకమని ఘనా భావిస్తోంది.సింగపూర్ అమ్మకాలు.. కాగా, సింగపూర్ మానిటరీ అథారిటీ నవంబర్‌లో 5 టన్నుల బంగారాన్ని విక్రయించింది. 2024లో ఇప్పటి వరకు 7 టన్నుల నికర అమ్మకాలు జరిపింది. దీనితో మొత్తం నిల్వలు 223 టన్నులకు తగ్గాయి. -
భారత్ బంగారం.. 882 టన్నులు
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అక్టోబర్‌లో 27 టన్నుల పసిడిని జోడించింది. దీనితో దేశం మొత్తం పసిడి నిల్వ 882 టన్నులకు చేరింది. ఇందులో భారత్‌లో 510 టన్నుల బంగారం నిల్వ ఉండగా, మిగిలిన పరిమాణాన్ని న్యూయార్క్, లండన్‌సహా మరికొన్ని చోట్ల ఉన్న గోల్డ్ వాల్ట్‌లలో రిజర్వ్ చేసింది.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ తాజా వివరాలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు అక్టోబర్‌లో 60 టన్నులు జోడించడం విశేషం. కాగా, జనవరి నుంచి అక్టోబర్ వరకూ భారత్ మొత్తం 77 టన్నుల బంగారాన్ని సమకూర్చుకుంది. 2023లో ఇదే కాలంతో పోలిస్తే ఆర్బీఐ బంగారం జోడింపు ఐదు రెట్లు పెరిగిందని డబ్ల్యూజీసీ తెలిపింది.ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!భారత్ తర్వాత టర్కీ, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు అక్టోబర్‌లో వరుసగా 17, 8 టన్నుల బంగారాన్ని తమ నిల్వలకు జోడించాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకూ ఈ రెండు దేశాలూ వరుసగా 72, 69 టన్నులను తమ బంగారు నిల్వలకు జోడించి మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగించాయని డబ్ల్యూజీసీ పేర్కొంది. -
చైనాలో బంగారు పంట
బీజింగ్: చైనాలో అతి భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయి. సెంట్రల్ హూనాన్ ప్రావిన్స్‌లో పింగ్‌జియాండ్ కౌంటీలోని వాంగూ గోల్డ్ ఫీల్డ్‌లో ఇటీవల తవ్వకాల్లో వీటిని గుర్తించారు. ఇక్కడ ఏకంగా 1,000 టన్నులకు (10 లక్షల కిలోలకు) పైగా పసిడి లోహం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకేచోట ఈ స్థాయిలో నిల్వలను గుర్తించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. భూ ఉపరితలం నుంచి 2 కి.మీ. దిగువన 300 టన్నులు, 3 కి.మీ. దిగువన 700 టన్నులు ఉన్నట్లు చెబుతున్నారు. దీని విలువ 80 బిలియన్ డాలర్ల (రూ.6.76 లక్షల కోట్లు) పైమాటే! సెంట్రల్ హునాన్ ప్రావిన్స్‌ను ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రతి టన్ను మట్టిలో 8 గ్రాముల బంగారముంటేనే దాన్ని హెచ్చు నాణ్యత కలిగిన ముడి ఖనిజంగా పరిగణిస్తారు. అలాంటిది హునాన్‌లో టన్ను మట్టిలో ఏకంగా 138 గ్రాముల చొప్పున స్వచ్ఛమైన స్వర్ణం ఉందని తేల్చారు. అంటే అత్యధిక నాణ్యత కలిగిన ముడి ఖనిజమని పేర్కొంటున్నారు. కళ్లు చెదిరే రీతిలో బంగారం నిల్వలు బయటపడడంతో చైనా గోల్డ్ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభించనుంది. ప్రపంచ గోల్డ్ మార్కెట్‌ను డ్రాగన్ దేశం శాసించే రోజులు రాబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బంగారం ఉత్పత్తిలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచమంతటా ఏటా ఉత్పత్తయ్యే బంగారంలో చైనా వాటా 10 శాతం. ఇకపై అది మరింత పెరుగబోతోంది. రోజురోజుకూ పసిడి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా భారీగా లబ్ధి పొందనుంది. -
తగ్గిన విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు నవంబర్ ఒకటి నాటికి 682.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంత క్రితం వారంతో పోలిస్తే నిల్వలు 2.67 బిలియన్ డాలర్లు క్షీణించాయి. సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు భారత్‌లో గరిష్ట స్థాయిని తాకి 704.885 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.బంగారం నిల్వలు 1.224 బిలియన్ డాలర్లు ఎగసి 69.751 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్ఈఆర్) ఒక మిలియన్ డాలర్లు తగ్గి 18.219 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వలు నాలుగు మిలియన్ డాలర్లు అధికమై 4.311 బిలియన్ డాలర్లకు ఎగశాయి. -
171.6 టన్నుల బంగారు ఆభరణాలు!
బంగారంపై మక్కువ రోజురోజుకూ పెరుగుతోంది. గోల్డ్ కొనుగోలును చాలామంది పెట్టుబడిగా భావిస్తారు. అందుకే భారత్‌లో వాటి రిజర్వ్‌లు పెరుగుతున్నాయి. బంగారు ఆభరణాల డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 171.6 టన్నులకు చేరిందని నివేదికల ద్వారా తెలిసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో దీని డిమాండ్ 155.7 టన్నుల కంటే ఈసారి 10 శాతం పెరిగింది. దిగుమతి సుంకం తగ్గింపుతో ఆభరణాలకు అనూహ్య డిమాండ్ పెరిగిందని.. 2015 తర్వాతి కాలంలో ఒక ఏడాది మూడో త్రైమాసికంలో ఆభరణాలకు గరిష్ట డిమాండ్ ఏర్పడినట్టు ప్రపంచ పసిడి మండలి(వర్ల్డ్ గోల్డ్ కౌన్సిల్) ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు.బంగారంపై సుంకం తగ్గింపుతో బంగారం ధరలు తగ్గుతాయని తొలుత అందరూ భావించారు. కానీ అదనంగా ఇతర అంశాలు తొడవ్వడంతో దేశీయంగా డిమాండ్ పెరగడానికి దారితీసినట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఆర్బీఐ నుంచి బంగారం కొనుగోళ్లు కొనసాగడం, మంచి వర్షాల సీజన్ డిమాండ్‌కు ప్రేరణగా నిలిచినట్టు పేర్కొంది. నివేదిక ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్లో ఆర్బీఐ 13 టన్నుల మేర కొనుగోలు చేసింది. ఆర్బీఐ వద్ద నిల్వలు 854 టన్నులుఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో, ఏప్రిల్–జూన్ కాలంలో 18 టన్నుల చొప్పున ఆర్బీఐ బంగారం కొనుగోలు చేసింది. దీంతో బంగారం నిల్వలు 854 టన్నులకు చేరాయి. 2023 చివరితో పోల్చి చూస్తే ఇది 6% పెరిగాయి. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడుల డిమాండ్ 76.7 టన్నులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 54.5 టన్నులతో పోల్చి చూస్తే 41 శాతం పెరిగినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. పునర్వినియోగానికి సిద్ధం చేసిన (రీసైకిల్డ్) ఆభరణాల పరిమాణం 23.4 టన్నులుగా ఉంది.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!ఇక ముందూ బలమైన డిమాండ్ డిసెంబర్ త్రైమాసికంలోనూ బంగారం డిమాండ్ బలంగా కొనసాగుతుందని సచిన్ జైన్ పేర్కొన్నారు. పండగ సీజన్‌తోపాటు వివాహాల కోసం కొనుగోళ్లు డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయన్నారు. బంగారం ధరలు పెరగడం దిగుమతి సుంకం ప్రయోజనాన్ని పూర్తిగా హరించిందని..దీంతో కొందరు పెట్టుబడి దృష్ట్యా బంగారం ధరలు తగ్గే వరకు వేచి చూడొచ్చని అభిప్రాయపడ్డారు. -
మన బంగారం విదేశాల్లో ఎందుకు? ఆసక్తికర కారణాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూకే నుంచి సుమారు 100 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది. 1991లో భారత్ విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. రాబోయే నెలల్లో మరింత బంగారాన్ని బదిలీ చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ పరిణామాల అనంతరం టన్నుల కొద్దీ మన బంగారాన్ని విదేశాలలో ఎందుకు ఉంచారు అన్న సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. దానికి సమాధానమే ఈ కథనం..వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతు ఇవ్వడానికి హామీగా, విలువ నిల్వగా బంగారం నిల్వలను కలిగి ఉంటాయి. చరిత్రాత్మకంగా, గోల్డ్ స్టాండర్డ్ యుగంలో ఈ నిల్వలను డిపాజిటర్లు, నోట్ హోల్డర్లకు వాగ్దానాలను చెల్లించడానికి ఉపయోగించేవారు. నేడు, ఇవే బంగారం నిల్వలు ఆయా దేశాల కరెన్సీల విలువకు మద్దతు ఇస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తున్నాయి.బంగారం నిల్వలు ఎందుకు?కేంద్ర బ్యాంకులు అనేక కారణాల వల్ల బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది. జాతీయ ఆర్థిక నిర్వహణకు కీలకమైన బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. బంగారాన్ని కలిగి ఉండటం దేశ విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడానికి సహాయపడుతుంది. ఏదైనా ఒక కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.మన దగ్గరున్న బంగారం ఎంతంటే..2024 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం, భారత్ దేశీయంగా 308 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తన కరెన్సీకి మద్దతుగా కలిగి ఉంది. అదనంగా 100.28 టన్నుల బంగారం స్థానికంగా బ్యాంకింగ్ విభాగం ఆస్తిగా ఉంది. మొత్తంగా 413.79 మెట్రిక్ టన్నుల బంగారం విదేశాల్లో ఉంది. స్థానికంగా ఉన్న బంగారాన్ని ముంబై, నాగపూర్ లోని హై సెక్యూరిటీ వాల్ట్ లలో భద్రపరుస్తారు.827.69 మెట్రిక్ టన్నుల సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్ లో భారత్ ప్రపంచంలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇది దాని విదేశీ మారక నిల్వలలో 8.9 శాతం. ఇక 8,133.5 మెట్రిక్ టన్నులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల బంగారం నిల్వల్లో ఇది 71.3 శాతం. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ గణనీయమైన బంగారు నిల్వలు ఉన్న ఇతర దేశాలలో ఉన్నాయి.విదేశాలలో నిల్వ చేయడమెందుకు?అనేక ఇతర దేశాల మాదిరిగానే, భారత్ కూడా అనేక కారణాల వల్ల తన బంగారు నిల్వలలో కొంత భాగాన్ని విదేశీ వాల్ట్‌లలో నిల్వ చేస్తోంది. బంగారాన్ని ఇతర దేశాలలో నిల్వ చేయడం వల్ల భౌగోళిక రాజకీయ అస్థిరత లేదా ప్రాంతీయ సంఘర్షణలు నుంచి భద్రత లభిస్తుంది.లండన్, న్యూయార్క్, జ్యూరిచ్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ లావాదేవీలు, మార్పిడిలు లేదా రుణాలకు పూచీకత్తుగా సులభంగా పొందవచ్చు.బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయడానికి చారిత్రక, భద్రతా కారణాలు కూడా ఉన్నాయి. నమ్మకమైన సంరక్షకులుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలకు ఉన్న ఖ్యాతి, వాటితో ఉన్న చారిత్రక సంబంధాలు విదేశాల్లో బంగారాన్ని నిల్వ చేయాలనే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వాల్ట్ లలో అధునాతన భద్రతా చర్యలు ఉంటాయి. నిల్వల భద్రతను నిర్ధారిస్తాయి.ప్రధాన అంతర్జాతీయ గోల్డ్ వాల్ట్స్ ఇవే..బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బంగారు నిల్వల ప్రధాన కస్టోడియన్‌గా ఉంది. సమగ్ర నిఘా వ్యవస్థలు, కఠినమైన యాక్సెస్ ప్రోటోకాల్స్‌తో సహా విస్తృతమైన భద్రతా చర్యలను అందిస్తుంది. యూకేతో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలు, బ్యాంక్ ఖ్యాతి.. ఇక్కడ బంగారాన్ని నిల్వ చేయడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.స్విట్జర్లాండ్ లోని బేసెల్ లో ఉన్న బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సహకారానికి దోహదపడుతుంది. ఇది కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలకు ప్రత్యేకంగా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. బంగారం నిల్వల భద్రత, ప్రాప్యతను పెంచుతుంది.అమెరికాలోని ఫోర్ట్ నాక్స్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, జర్మనీలోని డ్యుయిష్ బుండెస్ బ్యాంక్, ఫ్రాన్స్‌లోని బాంక్యూ డి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో ఉన్న స్విస్ నేషనల్ బ్యాంక్ మరియు జ్యూరిచ్ వాల్ట్స్ ఇతర అంతర్జాతీయ గోల్డ్ వాల్ట్స్లలో ఉన్నాయి. -
బంగారుకొండను పేరుస్తున్న ఆర్బీఐ..!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2024 జనవరి-ఏప్రిల్ మధ్యకాలంలో 24 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2023 ఏడాదిలో చేసిన మొత్తం కొనుగోళ్లు 16 టన్నుల కంటే ఇది చాలాఎక్కువ. ఏప్రిల్ 26, 2024 నాటికి ఆర్బీఐ వద్ద విదేశీ మారక నిల్వల్లో భాగంగా 827.69 టన్నుల బంగారం ఉన్నట్లు ఆర్బీఐ నివేదించింది. 2023 డిసెంబర్ చివరి నాటికి అది 803.6 టన్నులుగా ఉంది.ఇండియా మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా డిసెంబర్ 2023 చివరి నాటికి 7.75 శాతంగా ఉందని ఆర్బీఐ చెప్పింది. అది ఏప్రిల్ 2024 చివరి నాటికి 8.7 శాతానికి పెరిగింది. ఇటీవల గోల్డ్రేటు పెరగడంతో రిజర్వ్ బంగారం విలువ అధికమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకుల మాదిరిగానే కరెన్సీ అస్థిరతను కట్టడి చేసేందుకు ఆర్బీఐ పసిడి నిల్వలను పెంచుకున్నట్లు తెలిపింది.‘పెరుగుతున్న అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరతల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరుచుకోవాలని భావిస్తున్నాయి. దాంతో సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న క్యాష్ రిజర్వ్‌లను వివిధ మార్గాల్లో నిల్వచేస్తున్నాయి. అందులో ప్రధానంగా బంగారంవైపు మొగ్గు చూపుతున్నాయి. 2024 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్బ్యాంక్లు 290 టన్నుల బంగారాన్ని కోనుగోలు చేశాయి. మొత్తం ప్రపంచ పసిడి డిమాండ్‌లో నాలుగింట ఒక వంతు వాటా ఈ బ్యాంకుల వద్దే ఉంది. ఏదైనా అనిశ్చితి ఎదురైతే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేది బంగారమేనని అన్ని దేశాలు విశ్వసిస్తున్నాయి’ అని ఆర్బీఐ ఆర్థికవేత్తలు నెలవారీ బులెటిన్‌లో ప్రచురించారు.ఇదీ చదవండి: ‘వర్కింగ్ ఏజ్’ జనాభా తగ్గడమే పెద్ద సవాలుభారత్లో బంగారాన్ని ప్రధానంగా వినియోగిస్తున్నప్పటికీ ఆర్బీఐ చాలాకాలంపాటు పసిడి నిల్వలను భారీగా కూడబెట్టలేకపోయింది. 1991లో విదేశీ మారకద్రవ్య సంక్షోభం సమయంలో బంగారం నిల్వల్లో చాలాభాగం తాకట్టుపెట్టి ఆర్బీఐ విమర్శలు ఎదుర్కొంది. అప్పటినుంచి క్రమంగా బంగారం రిజర్వ్‌లను పెంచుకుంటోంది. కరోనా తర్వాత 2022లో పసిడి కొనుగోలుపై దూకుడుగా వ్యవహరించింది. జనవరి 2024 నుంచి కొనుగోలు కార్యకలాపాలను మరింత పెంచింది. -
ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 795 టన్నులు
ముంబై: ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు ఏడాది కాలంలో 5 శాతం పెరిగాయి. ఈ ఏడాది మార్చి చివరికి 794.64 టన్నులకు చేరాయి. ఇందులో 56.32 మెట్రిక్ టన్నులు గోల్డ్ డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. 2022 మార్చి నాటికి ఇవి 760.42 టన్నులుగా ఉన్నాయి. అప్పటికి గోల్డ్ డిపాజిట్లు 11.08 మెట్రిక్ టన్నులతో పోలిస్తే, గణనీయంగా వృద్ధి చెందాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సంలో ఆర్బీఐ 34.22 టన్నుల బంగారం నిల్వలను పెంచుకుంది. మార్చి చివరినాటికి ఆర్బీఐ వద్దనున్న 794.64 టన్నుల బంగారంలో 437.22 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద సురక్షితంగా ఉందని, 301.10 టన్నులు దేశీయంగా నిల్వ ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 2023 మార్చి నాటికి ఆర్బీఐ వద్దనున్న మొత్తం విదేశీ మారకం నిల్వల విలువలో (డాలర్లలో) బంగారం నిల్వల విలువ 7.81 శాతానికి పెరిగింది. 2022 సెప్టెంబర్ నాటికి ఇది 7.06 శాతంగా ఉంది. ఆర్బీఐ వద్ద విదేశీ మారకం నిల్వలు 2022 సెప్టెంబర్ నాటికి 532.66 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023 మార్చి నాటికి 578.45 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ మొత్తంలో విదేశీ కరెన్సీ ఆస్తుల రూపంలో 509.69 బిలియన్ డాలర్లు ఉంది. 411.65 బిలియన్ డాలర్లను సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 75.51 బిలియన్ డాలర్లు ఇతర సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్లలో ఇన్వెస్ట్ చేసి ఉంది. 22.52 బిలియన్ డాలర్లు విదేశీ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. -
రియల్ కేజీఎఫ్.. దేశంలోనే అత్యధిక బంగారం నిల్వలు.. ఎక్కడంటే!
బంగారం గనుల నేపథ్యంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ సినిమా యావత్ దేశాన్ని ఊర్రూతలూగించిన సంగతి తెలిసిందే. నిన్న వరకు రీల్ లైఫ్‌లో బంగారం గనులు నేడు రియల్ లైఫ్‌లోనూ అదే తరహాలో బంగారం నిల్వ ఉన్నట్లు బీహార్‌లోని జముయి జిల్లాలో బయట పడింది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని జముయి జిల్లా దేశంలోనే అతిపెద్ద బంగారం నిల్వలు ఉన్నాయని ఈ జిల్లా పరిధిలో బంగారం తవ్వకానికి అనుమతులు జారీ చేసే యోచనలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. జముయి జిల్లాలోని కర్మతియా, ఝఝా, సోనో వంటి ప్రాంతాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు సూచించిన జీఎస్ఐ నిర్ధారణలను విశ్లేషించిన తర్వాత పలు సంస్ధలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ కమ్ మైన్స్ కమిషనర్ హర్జోత్ కౌర్ బమ్రాహ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల వ్యవధిలో జీ3 (ప్రిలిమినరీ) దశ అన్వేషణ కోసం కేంద్ర ఏజెన్సీ లేదా ఏజెన్సీలతో ఎంఓయూ సంతకం చేసే అవకాశం ఉందని ఆమె చెప్పారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వే ప్రకారం జముయి జిల్లాలోని గోల్డ్ రిజర్వులో 222.88 మిలియన్ టన్నుల బంగారం, 37.6 టన్నుల ఖనిజాలు ఉన్నాయని తెలుస్తోంది. దేశంలో బంగారు నిల్వల్లో అత్యధిక వాటా బీహార్‌లో ఉందని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గత ఏడాది లోక్‌సభకు తెలియజేశారు. బీహార్‌లో 222.885 మిలియన్ టన్నుల బంగారు లోహం ఉందని, ఇది దేశంలోని మొత్తం బంగారం నిల్వల్లో 44 శాతం అని లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. -
రెండేళ్లలో భారీగా పెరిగిన ఆర్బీఐ పసిడి నిల్వలు
అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత్ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తన పసిడి నిల్వల పెంపుపై దృష్టి సారిస్తోంది. 2021 క్యాలెండర్ ఇయర్ మొదటి ఆరు నెలల్లో(జనవరి-జూన్) రికార్డు స్థాయిలో 29 టన్నులు కొనుగోలు చేసింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఆర్బీఐ పసిడి నిల్వలు 27 శాతం పెరగడం గమనార్హం. ఆర్బీఐ నిర్వహణలో ఉండే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా ఉండే పసిడి పరిమాణం 2021 జూన్ 30 నాటికి 705.6 టన్నులకు చేరింది. 2018 ప్రారంభంలో ఈ పరిమాణం 558.1 టన్నులు. (చదవండి: ఇక ఇంటర్నెట్ లేకున్నా డెబిట్ కార్డులు వాడొచ్చు!) ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం ఫారెక్స్ నిల్వల్లో 2021 ఆగస్టు 27తో ముగిసే త్రైమాసికానికి పసిడి వాటా దాదాపు 6 శాతంగా ఉంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం, ఆగస్టు 27వ తేదీతో ముగిసిన వారంలో(అంతక్రితం ఆగస్టు 22తో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 633.558 బిలియన్ డాలర్లకు(దాదాపు రూ.46 లక్షల కోట్లు) చేరాయి. ఇందులో పసిడి నిల్వల వాటా 37.441బిలియన్ డాలర్లు. ఇందుకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు చూస్తే.. 705 టన్నులకుపైగా పసిడి నిల్వలతో భారత్ ఈ విషయంలో 9వ ర్యాంక్‌లో నిలుస్తోంది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం 2021 జూన్‌లో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు 32 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. ఇందులో ఆర్బీఐ వాటా ఒక్కటీ చూస్తే, 30 శాతం ఉంది. అంటే దాదాపు 9.4 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. ఆర్బీఐ బంగారం కొనుగోళ్ల గణాంకాలను పరిశీలిస్తే, 2009 నవంబర్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ నుంచి భారీగా 200 టన్నులను కొనుగోలు చేసింది. 2018 మార్చిలో 2.2 టన్నులను కొంది. 2021లో ఒకేసారి 9.4 టన్నుల పసిడిని కొనుగోలు చేసింది. ఈ విషయంలో ఆర్థిక నిపుణులు తెలుపుతున్న సమాచారం ప్రకారం, దాదాపు దశాబ్దం తర్వాత గడచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇతర సెంట్రల్ బ్యాంకుల బాటలోనే ఆర్బీఐ కూడా పసిడి కొనుగోళ్లపై దృష్టి సారించింది. 2018 మార్చి నుంచి భారత్ పసిడి నిల్వలకు దాదాపు 147 టన్నులు (26.6%) జతయ్యాయి. 2018 క్యాలెండర్ ఇయర్ నుంచి ఆర్బీఐ ప్రతి సంవత్సరం సగటున 39.5 టన్నుల పసిడిని కొనుగోలు చేస్తోంది. 2021 తొలి ఆరు నెలల్లోనే ఈ కొనుగోళ్లు 29 టన్నులు. గడచిన మూడు సంవత్సరాలు మొదటి ఆరు నెలల్లో కొనుగోలు చేసిన సగటుకన్నా ఇది ఎంతో అధికం. 2018లో ఆర్బీఐ మొత్తం 42.3 టన్నుల పసిడి కొనుగోళ్లలో మొదటి ఆరు నెలల్లో కొన్నది 8.1 టన్నులు. 2019లో వరుసగా ఈ అంకెలు 34.5 టన్నులు, 17.7 టన్నులు. 2020లో ఈ సంఖ్య లు వరుసగా 41.7, 26.4 టన్నులుగా ఉన్నాయి. సావరిన్ క్రెడిట్ వర్తీనెస్‌ను సంరక్షించుకోడానికి పసిడి నిల్వలు కీలకమైనవని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రయోజనాలు ఎన్నో.. సెంట్రల్ బ్యాంక్ పసిడి నిల్వలపై మేము పరిశోధన చేశాం. ఇది ఎన్నో రకాలుగా ప్రయోజనం చేకూర్చే అంశం. ఇక్కడ మనం అంతర్జాతీయ తీవ్ర అనిశ్చిత ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే దేశాల రుణ భారాలను పరిశీలించాలి. ద్రవ్యోల్బణం, కరెన్సీ సంక్షోభం వంటి ఎన్నో సమస్యలు ప్రపంచ దేశాల్లో కనిపిస్తాయి. ఆయా సమస్యల పరిష్కారాల్లో పసిడి నిల్వలు కీలక ప్రాత పోషిస్తాయి. అలాగే ఆర్థిక సంక్షోభాల సమయంలో సావరిన్ క్రెడిట్ డిఫాల్డ్ స్వాప్ (సీడీఎస్) సమస్యలను అధిగమించడానికి బంగారం ఎంతగానో దోహదపడుతుంది. - ఐఐఎం, అహ్మదాబాద్ పరిశోధనా నివేదిక -
ఆ మాత్రం బంగారానికి హడావిడి అవసరమా..?
సాక్షి, న్యూఢిల్లీ : యూపీలోని సోన్‌భద్రలో 3000 టన్నుల బంగారు నిల్వలు బయటపడ్డాయని ప్రభుత్వం ఆర్భాటం చేయడం పట్ల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విస్మయం వ్యక్తం చేశారు. ‘తొలుత 5 మిలియన్ టన్నుల ఎకానమీ అంటూ డప్పుకొట్టారు..ఆ తర్వాత 3350 టన్నుల బంగారం నిల్వలంటూ ఊదరగొడితే అది కేవలం 160 కేజీలేనని వెల్లడైంద’ని శశిథరూర్ ట్వీట్ చేశారు. యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో 3000 టన్నుల బంగారు నిల్వలు బయటపడ్డాయన్న వార్తలను తోసిపుచ్చిన జీఎస్ఐ అక్కడ కేవలం 160 కిలోల బంగారు నిల్వలే ఉంటాయని అంచనా వేస్తున్నట్టు జీఎస్ఐ స్పష్టం చేసింది. కాగా సోన్‌భద్ర జిల్లాలోని సోన్ పహాడి, హర్ధి ప్రాంతాల్లో 3250 టన్నుల విలువైన బంగారు నిక్షేపాలను గుర్తించామని జిల్లా మైనింగ్ అధికారి కేకే రాయ్ శుక్రవారం రాత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి : ఆర్టికల్ 370 : పాక్ తీరును ఎండగట్టిన శశిథరూర్ -
బంగారం నిక్షేపాలు అబద్ధం: జీఎస్ఐ
కోల్‌కతా/సోన్‌భద్ర: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3వేల టన్నుల బంగారం నిల్వలు బయటపడ్డాయంటూ వచ్చిన వార్తలు వట్టివేనని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)స్పష్టం చేసింది. ‘సోన్‌భద్రలో అంత భారీగా బంగారు నిల్వలను మేం కనుగొనలేదు. అటువంటి సమాచారమేదీ మేం ఇవ్వలేదు’ అని జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఎం.శ్రీధర్ కోల్‌కతాలో శనివారం మీడియాకు తెలిపారు. తమ అన్వేషణలో ఇదే జిల్లాలో దాదాపు 52వేల టన్నుల ఇనుప ఖనిజం బయటపడిందనీ, ఇందులో టన్నుకు 3.03 గ్రాముల చొప్పున సాధారణ స్థాయిలో బంగారం ఉన్నట్లు తేలిందన్నారు. బహుశా ఈ వార్తనే సోన్‌భద్ర జిల్లా అధికారులు మరోలా వెల్లడించి ఉంటారని అన్నారు. -
సోన్‌భద్రలో భారీగా బంగారం నిల్వలు
సోన్‌భద్ర: ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు బయటపడ్డాయి. దాదాపు 3 వేల టన్నుల ముడి బంగారం నిల్వలను గుర్తించామని జియాలజీ, మైనింగ్ విభాగం శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత ధరల ప్రకారం వాటి విలువ రూ. 12 లక్షల కోట్లు ఉంటుంది. సోన్‌భద్ర దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటి. బంగారం నిల్వలను గుర్తించిన పర్వతం 108 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాన్ని వేలం వేసేందుకు ఈ– టెండర్లను కూడా ఆహ్వానించారు. 2005లోనే ఇక్కడ ఖనిజ నిక్షేపాలను గుర్తించే కార్యక్రమం ప్రారంభించామని సోన్‌భద్ర జిల్లా మైనింగ్ ఆఫీసర్ కేకే రాయ్ తెలిపారు. బంగారం గనికి సంబంధించిన నివేదిక ఈ రోజే అందిందన్నారు. ఈ ప్రాంతం లో యురేనియం సహా విలువైన ఖనిజ నిక్షేపాలు కూడా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. -
దేశంలో 47 శాతం బంగారం వీరి దగ్గరే!
భారత్‌లో బంగారానికి భారీగానే డిమాండ్ ఉంటుంది. బంగారాన్ని కొనడానికే కాని అమ్మకానికి ఎవరూ ఇష్టపడరు. మరికొంతమంది బ్లాక్‌మనీని దాచుకోవడానికి బంగారాన్ని సురక్షిత మార్గంగా ఎంచుకుంటారు. అసలు భారత్‌లో బంగారం ఎవరి వద్ద ఎక్కువుందో తెలుసా? మూడు అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థలు.. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫిన్‌కార్ప్ సంస్థల వద్దే దేశంలో 47 శాతం బంగారం ఉందట. గత రెండేళ్లలో ఈ మూడు సంస్థలు కనీసం వారి బంగారం నిల్వలను 195 టన్నుల నుంచి 263 టన్నులకు పెంచుకున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టులో వెల్లడైంది. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఈ మూడు సంస్థలు కేరళకు చెందినవే. ఆ మూడు సంస్థల్లో కూడా ముత్తూట్ ఫైనాన్స్ దేశీయ అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థగా పేరుగాంచుతోంది. గత రెండేళ్లలో ఈ సంస్థ 116 టన్నుల నుంచి 150 టన్నులకు పైగా బంగారం నిల్వలను పెంచుకుంది. ఈ నిల్వలు సింగపూర్(127.4 టన్నులు), స్వీడన్(125.7 టన్నులు), ఆస్ట్రేలియా(79.9 టన్నులు), కువైట్(79 టన్నులు), డెన్మార్క్(66.5 టన్నులు), ఫిన్లాండ్(49.1 టన్నులు) ల కంటే ఎక్కువగా ఉన్నాయి. మిగతా రెండు కంపెనీలు మణప్పురం ఫైనాన్స్ వద్ద 65.9 టన్నులు, ముత్తూట్ ఫిన్కార్పొ వద్ద 46.88 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇవన్నీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలుగా తమ కార్యకాలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు బంగారం విలువపై 75 శాతం వరకు రుణాన్ని ఇస్తాయి. పాత నోట్లను రద్దు చేసిన మొదటి రెండు వారాల్లోనే ఈ గోల్డ్ లోన్ బిజినెస్‌లు 65-70 శాతం క్షీణించాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఈ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలు చెక్, స్వైపింగ్ మిషన్ లాంటి వాటిని ఎంచుకుంటున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత్ 558 టన్నుల బంగారం నిల్వలతో 11వ అతిపెద్ద దేశంగా ఉంది. బంగారం నిల్వలో 8,143 టన్నులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. దాని తర్వాతి స్థానంలో 3,378 టన్నులతో జర్మనీ నిలుస్తోంది. గ్లోబల్‌గా బంగారానికి నమోదవుతున్న డిమాండ్‌లో భారత్ నుంచే 30 శాతం డిమాండ్ ఉందని తెలిసింది. -
దేవుడి బంగారం.. గాలిలో దీపం!
* గోల్డ్ డిపాజిట్ స్కీంలో పెట్టాలనే ఆదేశానికి తిలోదకాలు * నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు లాకర్లకు తరలింపు * వడ్డీ పొందాల్సిందిపోయి ఎదురు చార్జీల చెల్లింపు * బయటపెట్టిన ఆడిట్ విభాగం * తేరుకొని లెక్కలు సేకరిస్తున్న దేవాదాయశాఖ సాక్షి, హైదరాబాద్: దేవుడి మాన్యానికే కాదు.. స్వామి బంగారానికీ రక్షణ కరువైంది. విరాళాలు, కానుకల రూపంలో భక్తులు సమర్పించిన బంగారం సరైన లెక్కాపత్రం లేకుండా లాకర్లలో మగ్గుతోంది. ఏ లాకర్లో ఎంత పుత్తడి ఉందనే వివరాలు లేకుండా పోయాయి. ఇటీవల బ్యాంకులు, వాటి ఏటీఎంలపై దొంగలు గురిపెడుతున్న నేపథ్యంలో దేవుడి సొత్తు గాలిలో దీపమైంది. బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టొద్దని, కిలోకు మించి స్వర్ణం ఉంటే స్టేట్‌బ్యాంక్ గోల్డ్ డిపాజిట్ బాండ్ స్కీమ్‌లో ఉంచి వడ్డీ పొందాలనే ప్రభుత్వ ఆదేశాన్ని తోసిరాజని ఆలయ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆడిట్ తనిఖీలో ఈ విషయం బట్టబయలైంది. ఆడిట్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా మచ్చుకు 12 ఆలయాలను పరిశీలించగా, 9 చోట్ల నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని లాకర్లలో మగ్గబెట్టినట్టు తేలింది. కేంద్రం అమలుచేస్తున్న గోల్డ్ డిపా జిట్ స్కీం గురించి కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ఆడిట్ విభాగం శ్రీముఖం పంపేసరికి నాలుక్కరుచుకున్న దేవాదాయశాఖ అన్ని ఆల యాల్లో బంగారు నిల్వలపై లెక్కలు సేకరిం చడం మొదలెట్టింది. గుర్తించిన బంగారాన్ని స్టేట్‌బ్యాంకులో డిపాజిట్ చేయాలా, లేదా కేంద్ర పథకం కింద ఉంచాలా అన్న దానిపై స్పష్టత కోసం ప్రభుత్వానికి ఫైల్ పంపింది వడ్డీ గోవిందా! రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో దేవుళ్లకు స్వర్ణాభరణాలున్నాయి. ఇవి కాకుండా భక్తుల కానుకలు, విరాళాల రూపంలో బంగారం సమకూరుతోంది. అది చిన్న ముక్కలు, బిస్కెట్లు, ఇతర ఆకృతుల్లో ఉంటోంది. ఆభరణాల రూపంలో ఉన్నవాటిని వేడుకలు, పండగల సమయంలో అలంకరించాలని, ఇతర రూపంలో ఉన్న బంగారం కిలోకు మించితే స్టేట్‌బ్యాంక్‌లోని గోల్డ్ డిపాజిట్ పథకం కింద జమచేసి వడ్డీ పొందాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2009లో ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని చాలా ఆలయాలు పట్టించుకోలేదు. ఆడిట్ గుర్తించిన ఆలయాలు.. బంగారు నిల్వలు బాసర సరస్వతీ ఆలయం-10.26 కిలోలు, కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం-7.3 కిలోలు, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ దేవాలయం- 5.70 కిలోలు, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం- 3.49 కిలోలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం-2.8 కిలోలు, చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయం-2.1 కిలోలు, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం-1.8 కిలోలు, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం-1.6 కిలోలు, నల్లగొండ జిల్లా చెరువుగట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయం-1.2 కిలోలు. -
తగ్గిన విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు జనవరి 2వ తేదీతో ముగిసిన వారాంతానికి 319.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు వారంతో (డిసెంబర్ 26) పోల్చితే 471 మిలియన్ డాలర్లు తగ్గాయి. అమెరికా డాలర్ల రూపంలో ఉండే ఫారిన్ కరెన్సీ అసెట్స్ విలువ 863 మిలియన్ డాలర్లు తగ్గి, 294.53 బిలియన్ డాలర్లుగా ఉంది. మారక విలువల్లో తగ్గుదల దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఇక ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వలు 1.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం నిల్వల విలువ డిసెంబర్ 26తో పోల్చితే 18.98 బిలియన్ డాలర్ల నుంచి 19.37 బిలియన్ డాలర్లకు ఎగసింది.