
సోన్‌భద్ర: ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు బయటపడ్డాయి. దాదాపు 3 వేల టన్నుల ముడి బంగారం నిల్వలను గుర్తించామని జియాలజీ, మైనింగ్ విభాగం శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత ధరల ప్రకారం వాటి విలువ రూ. 12 లక్షల కోట్లు ఉంటుంది. సోన్‌భద్ర దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటి. బంగారం నిల్వలను గుర్తించిన పర్వతం 108 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాన్ని వేలం వేసేందుకు ఈ– టెండర్లను కూడా ఆహ్వానించారు. 2005లోనే ఇక్కడ ఖనిజ నిక్షేపాలను గుర్తించే కార్యక్రమం ప్రారంభించామని సోన్‌భద్ర జిల్లా మైనింగ్ ఆఫీసర్ కేకే రాయ్ తెలిపారు. బంగారం గనికి సంబంధించిన నివేదిక ఈ రోజే అందిందన్నారు. ఈ ప్రాంతం లో యురేనియం సహా విలువైన ఖనిజ నిక్షేపాలు కూడా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment