బంగారంపై మక్కువ రోజురోజుకూ పెరుగుతోంది. గోల్డ్ కొనుగోలును చాలామంది పెట్టుబడిగా భావిస్తారు. అందుకే భారత్‌లో వాటి రిజర్వ్‌లు పెరుగుతున్నాయి. బంగారు ఆభరణాల డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 171.6 టన్నులకు చేరిందని నివేదికల ద్వారా తెలిసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో దీని డిమాండ్ 155.7 టన్నుల కంటే ఈసారి 10 శాతం పెరిగింది. దిగుమతి సుంకం తగ్గింపుతో ఆభరణాలకు అనూహ్య డిమాండ్ పెరిగిందని.. 2015 తర్వాతి కాలంలో ఒక ఏడాది మూడో త్రైమాసికంలో ఆభరణాలకు గరిష్ట డిమాండ్ ఏర్పడినట్టు ప్రపంచ పసిడి మండలి(వర్ల్డ్ గోల్డ్ కౌన్సిల్) ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు.
బంగారంపై సుంకం తగ్గింపుతో బంగారం ధరలు తగ్గుతాయని తొలుత అందరూ భావించారు. కానీ అదనంగా ఇతర అంశాలు తొడవ్వడంతో దేశీయంగా డిమాండ్ పెరగడానికి దారితీసినట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఆర్‌బీఐ నుంచి బంగారం కొనుగోళ్లు కొనసాగడం, మంచి వర్షాల సీజన్ డిమాండ్‌కు ప్రేరణగా నిలిచినట్టు పేర్కొంది. నివేదిక ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్‌లో ఆర్‌బీఐ 13 టన్నుల మేర కొనుగోలు చేసింది.
ఆర్‌బీఐ వద్ద నిల్వలు 854 టన్నులు
ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో, ఏప్రిల్–జూన్ కాలంలో 18 టన్నుల చొప్పున ఆర్‌బీఐ బంగారం కొనుగోలు చేసింది. దీంతో బంగారం నిల్వలు 854 టన్నులకు చేరాయి. 2023 చివరితో పోల్చి చూస్తే ఇది 6% పెరిగాయి. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడుల డిమాండ్ 76.7 టన్నులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 54.5 టన్నులతో పోల్చి చూస్తే 41 శాతం పెరిగినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. పునర్‌వినియోగానికి సిద్ధం చేసిన (రీసైకిల్డ్) ఆభరణాల పరిమాణం 23.4 టన్నులుగా ఉంది.
ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!
ఇక ముందూ బలమైన డిమాండ్
డిసెంబర్ త్రైమాసికంలోనూ బంగారం డిమాండ్ బలంగా కొనసాగుతుందని సచిన్ జైన్ పేర్కొన్నారు. పండగ సీజన్‌తోపాటు వివాహాల కోసం కొనుగోళ్లు డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయన్నారు. బంగారం ధరలు పెరగడం దిగుమతి సుంకం ప్రయోజనాన్ని పూర్తిగా హరించిందని..దీంతో కొందరు పెట్టుబడి దృష్ట్యా బంగారం ధరలు తగ్గే వరకు వేచి చూడొచ్చని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment