నిజామాబాద్ బిజినెస్/ కామారెడ్డి, న్యూస్‌లైన్: బంగారం ధరలు పెరగడమేగానీ తగ్గిన సందర్భాలు తక్కువే. 2012 ఏప్రిల్‌లో బంగారం ధరలు భా రీగా పడిపోయాయి. తరువాత ఎగబాకి, వారం క్రితం వరకు తులం ధర రూ. 30 వేల వరకు ఉండింది. రూ పాయి విలువ పెరుగుతున్న కొద్దీ బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. గడచిన నాలుగైదు రోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. శనివారం 24 క్యా రెట్ల 10 గ్రాముల బంగారం రూ. 28, 300 పలికింది. ధరలు మరింత తగ్గవచ్చని ప్రసార మాధ్యమాల ద్వా రా తెలుసుకున్న కొనుగోలుదారులు బంగారం కొనుగోళ్లకు కాస్త విరామం ఇచ్చినట్టే కనిపిస్తోంది.
దీంతో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి. తప్పని సరి పరిస్థితు ల్లో మాత్రమే బంగారాన్ని వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. పది గ్రాముల మేలిమి బంగారం రూ. 25 వేల స్థాయికి దిగవచ్చని ప్రచారం జరగడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రెండు మాసాలుగా వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో రూ. కోట్ల విలువైన బంగారం అమ్మకాలు సాగాయి. ముహూర్తాలు ఉండడంతో కొందరికి బంగారం కొనుగోలు తప్పడం లేదు.
ఇంకా తగ్గుతాయా!
బంగారం ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. ధరలు మరింత దిగివచ్చిన తరువాతనే కొనాలని భావిస్తున్నారు. అమ్మకందార్లు కూడా ఎక్కువ మొత్తంలో నిల్వలు పెట్టుకోవడం లేదని తెలుస్తోంది. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ధరలు ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితులతో ఆచితూచి అడుగేస్తున్నారు. బంగారం ఆభరణాలంటే ఇష్టపడే మహిళలు తగ్గుతున్న ధరలతో ఆనందపడుతున్నారు. మరింత తగ్గితే ఎక్కువ బంగారం కొనుగోలు చేయవచ్చని ఆరాటపడుతున్నారు. కొత్త డిజైన్లలో ఆభరణాలు చేయించుకునేందుకు గాను బంగారం కొనుగోళ్లను చాలా మంది వాయి దా వేసుకుంటున్నారు.
జిల్లాలో రోజుకు దాదాపు రూ. 10 కోట్ల విలువ చేసే బంగారం అమ్మకా లు జరుగుతాయి. గతంలో బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం, దీనికితోడు రూపాయి పతనం కూడా తోడవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో కొంతకాలంగా బంగారం ధర తగ్గినప్పటికీ దేశీయంగా మాత్రం స్థిరంగా కొనసాగింది. ప్రస్తుతం నరేంద్రమోడి నేతృత్వంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడబోతుండటంతో ఎఫ్‌ఐఐ నిధుల ప్రవాహంతో పాటు రూపాయి విలువ పెరిగి బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.
పసిడి మురిపిస్తోంది
Published Sun, May 25 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement