ornaments
-
రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?
రత్నాభరణాల పరిశ్రమలో ఉత్పత్తవుతున్న వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) ప్రభుత్వాన్ని కోరింది. జీఎస్టీకి సంబంధించి రాబోయే బడ్జెట్లో తీసుకోబోయే నిర్ణయాలపై వివిధ విభాగాల నుంచి ప్రభుత్వం వినతులు కోరింది. అందులో భాగంగా జీజేసీ రత్నాభరణాల ఉత్పత్తిపై జీఎస్టీని తగ్గించాలని తెలిపింది.ఈ సందర్భంగా జీజేసీ ఛైర్మన్ రాజేశ్ రోక్డే మాట్లాడుతూ..‘జెమ్స్ అండ్ జువెలరీ రంగం ఉత్పత్తి చేస్తున్న వస్తువులపై జీఎస్టీ(GST)ని 1 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రస్తుతం అది 3 శాతంగా ఉంది. జీఎస్టీని తగ్గిస్తే వినియోగదారులపై వ్యయ భారం తగ్గుతుంది. రాబోయే బడ్జెట్లో వ్యాపారాలకు, తయారీ రంగానికి ఊతమిచ్చేలా పన్నుల హేతుబద్ధీకరణ ఉండాలని తెలియజేశాం. వరుసగా పెరుగుతున్న బంగారం రేట్లకు అనుగుణంగా ప్రస్తుత జీఎస్టీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ఇది పరిశ్రమకు, అంతిమ వినియోగదారులకు భారంగా మారుతోంది. సహజ వజ్రాలు, ల్యాబ్‌లో తయారు చేసే వజ్రాలకు మధ్య తేడా గుర్తించేలా పకడ్బందీ విధానాలు ఉండాలి. ప్రస్తుతం సహజ వజ్రాలు(Natural diamonds), ప్రయోగశాలలో తయారు చేసే వజ్రాలపై ఒకే జీఎస్టీ రేటు ఉంది. ల్యాబ్‌లో తయారు చేసే వజ్రాలపై జీఎస్టీ తగ్గించాలి’ అన్నారు.ఇదీ చదవండి: అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐజ్యువెలరీ పరిశ్రమకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని, రాష్ట్రాల వారీగా స్పెషల్ నోడళ్లను ఏర్పాటు చేయాలని జీజేసీ ప్రభుత్వాన్ని కోరింది. ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నట్లు జీజేసీ తెలిపింది. వచ్చే సమావేశాల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. పన్ను రేటు తగ్గింపు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అధికారిక కొనుగోళ్లు పెరుగుతాయని జీజేసీ వైస్ ఛైర్మన్ అవినాష్ గుప్తా అన్నారు. ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న గృహ బంగారాన్ని వెలికితీసే కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని తెలిపారు. -
171.6 టన్నుల బంగారు ఆభరణాలు!
బంగారంపై మక్కువ రోజురోజుకూ పెరుగుతోంది. గోల్డ్ కొనుగోలును చాలామంది పెట్టుబడిగా భావిస్తారు. అందుకే భారత్‌లో వాటి రిజర్వ్‌లు పెరుగుతున్నాయి. బంగారు ఆభరణాల డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 171.6 టన్నులకు చేరిందని నివేదికల ద్వారా తెలిసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో దీని డిమాండ్ 155.7 టన్నుల కంటే ఈసారి 10 శాతం పెరిగింది. దిగుమతి సుంకం తగ్గింపుతో ఆభరణాలకు అనూహ్య డిమాండ్ పెరిగిందని.. 2015 తర్వాతి కాలంలో ఒక ఏడాది మూడో త్రైమాసికంలో ఆభరణాలకు గరిష్ట డిమాండ్ ఏర్పడినట్టు ప్రపంచ పసిడి మండలి(వర్ల్డ్ గోల్డ్ కౌన్సిల్) ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు.బంగారంపై సుంకం తగ్గింపుతో బంగారం ధరలు తగ్గుతాయని తొలుత అందరూ భావించారు. కానీ అదనంగా ఇతర అంశాలు తొడవ్వడంతో దేశీయంగా డిమాండ్ పెరగడానికి దారితీసినట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఆర్బీఐ నుంచి బంగారం కొనుగోళ్లు కొనసాగడం, మంచి వర్షాల సీజన్ డిమాండ్‌కు ప్రేరణగా నిలిచినట్టు పేర్కొంది. నివేదిక ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్లో ఆర్బీఐ 13 టన్నుల మేర కొనుగోలు చేసింది. ఆర్బీఐ వద్ద నిల్వలు 854 టన్నులుఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో, ఏప్రిల్–జూన్ కాలంలో 18 టన్నుల చొప్పున ఆర్బీఐ బంగారం కొనుగోలు చేసింది. దీంతో బంగారం నిల్వలు 854 టన్నులకు చేరాయి. 2023 చివరితో పోల్చి చూస్తే ఇది 6% పెరిగాయి. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడుల డిమాండ్ 76.7 టన్నులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 54.5 టన్నులతో పోల్చి చూస్తే 41 శాతం పెరిగినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. పునర్వినియోగానికి సిద్ధం చేసిన (రీసైకిల్డ్) ఆభరణాల పరిమాణం 23.4 టన్నులుగా ఉంది.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!ఇక ముందూ బలమైన డిమాండ్ డిసెంబర్ త్రైమాసికంలోనూ బంగారం డిమాండ్ బలంగా కొనసాగుతుందని సచిన్ జైన్ పేర్కొన్నారు. పండగ సీజన్‌తోపాటు వివాహాల కోసం కొనుగోళ్లు డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయన్నారు. బంగారం ధరలు పెరగడం దిగుమతి సుంకం ప్రయోజనాన్ని పూర్తిగా హరించిందని..దీంతో కొందరు పెట్టుబడి దృష్ట్యా బంగారం ధరలు తగ్గే వరకు వేచి చూడొచ్చని అభిప్రాయపడ్డారు. -
మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది రేపే తెరుచుకోనుంది.ఈ రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి.ఆదివారం పూరీలోని ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు.46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా.. సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. అయితే.. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరేకృష్ణ మహాపాత్ర అంటున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు కూడా.👉పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. 👉అయితే.. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.👉భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ.. ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు.👉ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే.. హైకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ రఘుబీర్ దాస్ కమిషన్ బృందం భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. 👉జగన్నాథుని రత్న భాండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది. ఆ సమయంలో రత్న భాండాగారంలో రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు లభించాయి. 👉కాగా, 1978లో జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు లభించాయి. 1982 – 1985 సంవత్సరాలలో రత్న భండాగారం తెరచుకుంది. కానీ అప్పటికి విషయాలు లెక్కించలేదు.👉జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం (ఒక భరీ సుమారు 12 గ్రాములతో సమానం), 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు.👉రఘుబీర్ కమిటీ నివేదికపై జులై 10లోగా స్పందన తెలియజేయాలంటూ ఒడిశా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాళాలు ఎలా మాయమయ్యాయని.. డూప్లికేట్ తాళాలతో వాటిని తెరవాల్సిందేనని విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. రాజకీయం చేయొద్దని బీజేడీ కోరినా.. బీజేపీ, కాంగ్రెస్‌లు వెనక్కి తగ్గలేదు. అయితే ఈలోపే ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ.. ఎన్నికల హామీ మేరకు రత్న భాండాగారం తెరిపించేందుకు సిద్ధమైంది.👉ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో.. ఈ నెల 14న(ఆదివారం) రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి ఆ కమిటీ సిఫార్సు చేసింది.👉జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను బిశ్వనాథ్ కమిటీనే తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యతను అప్పజెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో.. రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కిస్తారని తెలుస్తోంది. -
బాలరామునికి నేపాల్ నుంచి కానుకలు!
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైనది మొదలు బాలరాముని దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా బాలరాముని దర్శనం కోసం జనం తరలివస్తున్నారు. తాజాగా నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్ పి సౌద్ అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకునేందుకు వచ్చారు. ఆయన తనతోపాటు బాలరామునికి ఐదు కానుకలు తీసుకువచ్చారు. అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో నేపాల్ విదేశాంగ మంత్రికి యూపీకి చెందిన సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. నేపాల్ విదేశాంగ మంత్రితో పాటు ఆయన భార్య జ్యోత్స్నా సౌద్ కూడా అయోధ్యకు వచ్చారు. ఈ దంపతులు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేపాల్ విదేశాంగ మంత్రి రామ్‌లల్లాకు ఐదు రకాల వెండి ఆభరణాలను సమర్పించారు. వీటిలో విల్లు, గద, కంఠహారం, చేతులు, కాళ్లకు ధరించే కంకణాలు మొదలైనవి ఉన్నాయి. విదేశాంగ మంత్రి సౌద్ అయోధ్యను సందర్శించడానికి వచ్చిన నేపాల్ ప్రభుత్వ తొలి మంత్రి. ఆయన సరయూ నది ఒడ్డున సాయంత్రం జరిగే హారతిలో కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే హనుమాన్‌గర్హి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. -
శ్రావణమాసంలో బంగారం కొంటున్నారా?ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
భారతీయ మహిళలకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ శ్రావణమాసం వచ్చిందంటే చాలు బంగారం కొనేందుకు మరింత ఆసక్తి చూపిస్తుంటారు. అధిక మాసం ముగిసి నిజ శ్రావణ మాసంలోకి అడుగు పెట్టడంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు..ఇలా ఒకటేమిటి వరుసగా శుభకార్యాలు జరగనున్నాయి. ఈ క్రమంలో వ్రతాలు, పూజల నేపథ్యంలో షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుంది. మరీ ముఖ్యంగా బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మరి బంగారం వేసుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుందని మీకు తెలుసా? బంగారం వెనకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తరాలు మారుతున్నా బంగారానికి ఉన్న ఆధరణ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ట్రెండ్‌కి తగ్గట్లు కొత్తకొత్త డిజైన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. సాదారణంగానే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారం షాపుల వైపు చూసే మగువలు ఇక శ్రావణమాసం వచ్చిందంటే మరింత ఆసక్తి కనబరుస్తుంటారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు. దీంతో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఇక అప్పట్లో ఏడువారాల నగలు ఎక్కువగా ధరించేవారు. ఆ పేరులోనే నిండుదనం ఉంది. ఎంత బంగారం ఉన్నా ఏడువారాల నగలు అనగానే వచ్చే ఆ ఆనందమే వేరు. ఇంతకీ ఏడువారాల నగలలకున్న ప్రత్యేకత ఏంటంటే.. ఆదివారం- సూర్యుడు: కెంపులు పొదిగిన కమ్మలు, హారం సోమవారం - చంద్రుడు: ముత్యాల హారాలు, గాజులు మంగళవారం- కుజుడు: పగడాల దండలు, ఉంగరాలు బుధవారం - బుధుడు: పచ్చల పతకాలు, గాజులు గురువారం - బృహస్పతి: పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు శుక్రవారం - శుక్రుడు: వజ్రాల హారాలు, ముక్కుపుడక శనివారము - శని: నీలమణి హారాలు.. ఇలా ఏడువారాల నగలను ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం వీటిని ధరించేవారు. దీనివల్ల ఆయువు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. బంగారం అనేది అలంకార ప్రాయం అని మాత్రమే అనుకుంటారు..కానీ బంగారు ఆభరణాలు వేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. ►చర్మానికి వచ్చే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ను దరిచేరకుండా బంగారం కాపాడుతుందట. ► బంగారు ఆభరణాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంపై ఏదైనా గాయాలు తగిలినా త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. ► బాడీ టెంపరేచర్‌ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ► ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరమై మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ► ఆర్థరైటిస్‌తో బాధపడేవాళ్లు బంగారు ఆభరణాలు ధరించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందట ►ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. బంగారం వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట ► దీర్ఘాయువును పెంచడంలో కూడా బంగారం చాలా చక్కగా పనిచేస్తుంది. ► బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది. ► బంగారు ఆభరణాలు ధరిస్తే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ►ఈమధ్య వివిధ సౌందర్య చికిత్సల్లోనూ బంగారన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా చర్మం యవ్వనంగా మారుతుంది. -
ఊరిలోని చిన్నాపెద్దా అందరూ బంగారం ప్రియులైతే.. ఏఐ ఫోటోలు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అరుదైన ఆభరణాలు
-
దొంగను మార్చేసిన భగవద్గీత.. చోరీ చేసిన నగలు వెనక్కి!
భగవద్గీత ఓ దొంగలో మార్పు తీసుకొచ్చింది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందడమే కాదు.. తొమ్మిదేళ్ల కిందట ఓ ఆలయంలో చోరీ చేసిన నగలను సైతం తిరిగి ఇచ్చేలా చేసింది. ఆశ్చర్యకరమైన ఈ ఘటన భువనేశ్వర్(ఒడిషా)లో జరిగింది. భువనేశ్వర్‌లోని గోపీనాథ్‌పూర్ రాధాకృష్ణ ఆలయంలో 2014 మే నెలలో చోరీ జరిగింది. కృష్ణ భగవానుడికి చెందిన లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అవి దొరకపోవడంతో కొత్త అభరణాలు చేయించారు ఆలయ నిర్వాహకులు. కట్ చేస్తే.. ఈ మధ్య ఆలయ ద్వారం వద్ద ఓం సంచి ఒకటి దొరికింది. అందులో ఓ లేఖ.. పోయిన నగలు కనిపించాయి. చేసిన చోరీకి క్షమాపణలు కోరుతూ లేఖ, జరిమానా కింద రూ.300 కూడా ఉంచాడు ఆ వ్యక్తి. ఈ మధ్యకాలంలో తాను భగవద్గీత చదివానని.. తన మార్గం తప్పని తెలుసుకొని విలువైన ఆ ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు దొంగ పేర్కొన్నాడు. మరోవైపు, తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన ఆభరణాలు తిరిగి దొరకడంతో ఆలయ అధికారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాలు ఇలా మళ్లీ దొరకడం అద్భుతమే అంటున్నారు. Video Source: OTV News English -
మునుగోడులో తులం బంగారం, రూ.30వేలు అని ఊరించి.. రూ.3వేలతో
సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రధాన పార్టీలు ముందస్తుగా డబ్బులు, బంగారం ఎర చూపినప్పటికీ తీరా ఎన్నిక దగ్గర పడడంతో రూ.3వేలతోనే సరిపుచ్చడంతో నిర్ఘాంతపోవడం ఓటర్ల వంతు అయింది. మునుగోడు ఉప ఎన్నికలో ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓటర్లకు రాజకీయ నాయకులు షాకిచ్చారు. ఇంటికి తులం బంగారం, ఓటుకు రూ.30వేలు ఇస్తామని ఆయా ప్రధాన పార్టీలు గుట్టుగా ప్రచారం చేసినప్పటికీ ఓటరు ఊహకు అందకుండా రూ.3వేలతో సరిపుచ్చారని పలువురు పేర్కొంటున్నారు. ఎవరు ఎక్కువ తాయిలాలు ముట్టజెప్తే వారికే ఓటు వేయాలన్న ఆలోచనతో సగటు ఓటరు ఆలోచిస్తున్నాడు. కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలైన ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీగా ఓటర్లకు నగదు అందించాలని చూసినా పలుచోట్ల ఓ పార్టీ నాయకులను మరో పార్టీ నాయకులు అడ్డుపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆశించిన విధంగా డబ్బులు అందకపోవడంతో ఓటర్లు నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. -
ఆభరణమూ చరిత్ర చెబుతుంది
పొన్నియిన్ సెల్వన్... అది ఒక చరిత్ర పుస్తకం. అది ఒక సాహిత్య సుమం. అది ఒక సామాజిక దృశ్యకావ్యం. వీటన్నింటికీ దర్పణాలు ఈ ఆభరణాలు. ఆభరణం చరిత్రను చెబుతుంది. ఆభరణం కూడా కథను నడిపిస్తుంది. ఆ ఆభరణాలకు రూపమిచ్చిన డిజైనర్... ప్రతీక్ష ప్రశాంత్ పరిచయం ఇది. ప్రతీక్ష ప్రశాంత్... ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఆమె కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తన క్రియేటివిటీతో తెరకు కళాత్మకతను పొదిగారామె. ఆ సినిమాలో నటీనటులు ధరించిన ఆభరణాలను రూపొందించిన ప్రతీక్ష ప్రశాంత్... సినిమా కోసం తనకు ఏ మాత్రం అవగాహన లేని చోళ రాజుల గురించి తెలుసుకున్నారు. వారి జీవన శైలి, వారికి ఇతర దేశాలతో ఉన్న వర్తక వాణిజ్యాలు, ఆచారవ్యవహారాలు, ధార్మికజీవనం... అన్నింటినీ ఔపోశన పట్టారు ప్రతీక్ష. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘మాకు సినిమా ప్రపంచంతో ఏ మాత్రం పరిచయం లేదు. మా ఇంట్లో వాళ్లు మహా బిడియస్థులు. మా పూర్వికులు నిజాం కుటుంబాలకు ఆభరణాలు తయారు చేశారు. హైదరాబాద్ లో ఆరు దశాబ్దాలుగా ఆభరణాల తయారీ, అమ్మకాల వ్యాపారంలో ఉన్నారు. కానీ వాళ్ల ఫొటోలు కూడా ఎక్కడా కనిపించవు. అలాంటిది ఒక్కసారిగా నేను సినిమా కోసం పని చేయడం ఊహించని మలుపు అనే చెప్పాలి. సినిమాకు ఆర్నమెంట్ డిజైనర్‌గా కంటే ముందు నా గురించి చెప్పాలంటే... మాది గుజరాతీ కుటుంబం. నేను పుట్టింది, పెరిగింది మాత్రం ముంబయిలో. మా నాన్నలాగే ఆర్కిటెక్చర్ చేశాను. పెళ్లితో కిషన్‌దాస్ ఆభరణాల తయారీ కుటుంబంలోకి వచ్చాను. నాకు ఉత్తరాది కల్చర్‌తోపాటు హైదరాబాద్ కల్చర్ తో మాత్రమే పరిచయం. అలాంటిది తమిళనాడుకు చెందిన ఒక పీరియాడికల్ మూవీకి పని చేయవలసిందిగా ఆహ్వానం అందడం నిజంగా ఆశ్చర్యమే. ఆ సినిమాకు డ్రెస్ డిజైనర్‌గా పనిచేసిన ‘ఏకా లఖానీ’కి నాకు కామన్ ఫ్రెండ్ సినీ నటి అదితి రావు హైదరీ. ఆమె ఆర్నమెంట్ డిజైనింగ్‌లో నా స్కిల్ గురించి ఏకా లఖానీకి చెప్పడంతో నాకు పిలుపు వచ్చింది. మణిరత్నం గారితో మాట్లాడిన తరవాత నేను చేయాల్సిన బాధ్యత ఎంత కీలకమైనదో అర్థమైంది. కొంచెం ఆందోళన కూడా కలిగింది. ఎందుకంటే నాకు చోళుల గురించి తెలియదు. ఆభరణాలు అర్థం కావడానికి కొన్ని పెయింటింగ్స్ చూపించారు. వాటిని చూసి యథాతథంగా చేయడం నాకు నచ్చలేదు. అందుకే చోళుల గురించి అధ్యయనం చేశాను. విదేశీ మణిమాణిక్యాలు చోళులు ధరించిన ఆభరణాల్లో ఉన్న మాణిక్యాలు మామూలు మాణిక్యాలు కాదు. అవి బర్మా రూబీలు. బర్మాతో చోళులకు ఉన్న వర్తక వాణిజ్యాల గురించి తెలిస్తేనే నేను ఆభరణంలో బర్మా రూబీ వాడగలుగుతాను. టాంజానియా, గోల్కొండతో కూడా మంచి సంబంధాలుండేవి. మరకతాలు, వజ్రాల్లో ఆ మేరకు జాగ్రత్త తీసుకున్నాం. అలాగే చోళులు శివభక్తులు, చేతికి నాగ వంకీలను ధరిస్తారు. తలకు పెద్ద కొప్పు పెట్టి, ఆ కొప్పుకు సూర్యవంక, చంద్రవంక, నాగరం వంటి ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాల్లో కమలం వంటి రకరకాల పూలు– లతలు, నెమలి, రామచిలుక వంటి పక్షులు, దేవతల రూపాలు ఇమిడి ఉంటాయి. ముక్కు పుడక నుంచి చేతి వంకీ, ముంజేతి కంకణం, వడ్డాణం, తల ఆభరణాలు... వేటికవి తనవంతుగా కథను చెబుతాయి, కథకు ప్రాణం పోస్తాయి. రంగస్థలం అయితే తల వెనుక వైపు ఆభరణాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండక పోవచ్చు. కానీ సినిమాలో ముఖ్యంగా మణిరత్నం మూవీలో కెమెరా పాత్ర చుట్టూ 360 డిగ్రీల్లో తిరుగుతుంది. కాబట్టి ఎక్కడా రాజీ పడడానికి వీల్లేదు. పైగా ఇప్పుడు ప్రేక్షకులు ఒకప్పటిలాగ సినిమా చూసి బాగుందనో, బాగోలేదనో ఒక అభిప్రాయంతో సరిపుచ్చడం లేదు. పాత్ర అలంకరణ నుంచి, సన్నివేశం నేపథ్యం వరకు ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు, పొరపాటు జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆటపట్టిస్తారు. అలాగే ఒకసారి ఐశ్వర్య ధరించిన ఆభరణాన్ని మరోసారి పారపాటున త్రిషకు అలంకరించామంటే ఇక అంతే. అప్పట్లో కోర్సుల్లేవు ఇక నా ఆర్నమెంట్ డిజైనర్ కెరీర్ విషయానికి వస్తే... నేను ఇందులో ఎటువంటి కోర్సూ చేయలేదు. ఇప్పటిలాగ పాతిక– ముప్పై ఏళ్ల కిందట కోర్సులు లేవు కూడా. మా మామగారికి సహాయంగా స్టోర్‌లోకి అడుగుపెట్టాను. నిపుణులైన మా కారిగర్స్ తమ అనుభవంతో పని నేర్పించారు. ప్రతి పనినీ ఆసక్తితో నేర్చుకున్నాను. ఇప్పటికీ రోజూ మధ్యాహ్నం వరకు నా ఆర్కిటెక్చర్ ఆఫీస్, మధ్యాహ్నం నుంచి ఆర్నమెంట్ స్టోర్ చూసుకుంటూ ఉంటాను. ఈ సినిమాకి పని చేయడం నా జీవితంలో ఒక విశిష్టమైన ఘట్టం’’ అన్నారామె. చారిత్రక దృశ్యమాలిక ఈ సినిమా కోసం మూడేళ్లు పనిచేశాను. నాలుగు వందల మంది డాన్సర్స్‌తో చిత్రీకరించిన విజయగీతం చాలా పెద్దది. సినిమా కోసం 450 ఆభరణాలు బంగారంతో చేశాం. ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తి, శోభిత... వంటి ముఖ్యపాత్రలతోపాటు మరికొన్ని ప్రధాన పాత్రలకు బంగారు ఆభరణాలు, చిన్న పాత్రలకు గిల్టు ఆభరణాలు చేశాం. దర్బార్ సన్నివేశాలు, యుద్ధఘట్టాలు, డాన్సులు... సన్నివేశాన్ని బట్టి ఆభరణం మారుతుంది. అలాగే ఒక్కో పాత్ర హెయిర్ స్టయిల్ ఒక్కో రకంగా ఉంటుంది. తలకు అలంకరించే ఆభరణాలు కూడా మారుతాయి. ప్రతి ఆభరణమూ చోళుల కాలాన్ని స్ఫురింపచేయాలి. చోళుల రాజ చిహ్నం పులి. రాజముద్రికల మీద పులి బొమ్మ ఉంటుంది. ఉంగరం మీద కొంత కథ నడుస్తుంది. కాబట్టి ఆ సీన్లో చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా పులితోపాటు పామ్ ట్రీ కూడా ఉండేటట్లు దంతంతో ఆభరణాన్ని రూపొందించాం. కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రఖ్యాత తమిళ నవలకు, చారిత్రక ఘట్టాలకు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడా లోపం జరగకూడదనేది మణిరత్నం గారి సంకల్పం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. – ప్రతీక్ష ప్రశాంత్, ఆర్నమెంట్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
సత్యదేవుని ఆభరణాల డిజిటలైజేషన్
అన్నవరం: సత్యదేవుని బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల డిజిటలైజేషన్ ప్రక్రియ ఆదివారం ఆరంభమైంది. ఉత్సవాలు, ఇతర పర్వదినాల్లో స్వామి, అమ్మవార్లకు అలంకరించే ఆభరణాలను డిజిటలైజ్ చేసేందుకు దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు, అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు ఆధ్వర్యాన ఫొటోలు తీయించారు. స్వామి వారికి ప్రతి రోజూ అలంకరించే ఆభరణాలను తీయడం సాధ్యం కాదు కనుక వాటిని స్వామివారి జన్మనక్షత్రం మఖ నాడు మూలవిరాట్‌కు అభిషేకం చేసేందుకు తీసినపుడు డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి కిరీటాలు, హారాలు, నేత్రాలు, స్వామివారి మీసం, కర్ణాభరణాలు, బంగారు పాత్రలు, పళ్లాలు సుమారు వంద ఆభరణాలను ఆదివారం రికార్డు ప్రకారం తూకం వేసి, ఫొటోలు తీయించారు. ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట శ్రీనివాస్, అర్చకుడు సుధీర్, అకౌంట్స్ సెక్షన్ సూపరింటెండెంట్లు అనకాపల్లి ప్రసాద్, బలువు సత్య శ్రీనివాస్, ఎస్పీఎఫ్ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటలైజేషన్లో భాగంగా ప్రతి ఆభరణాన్నీ ఫొటో తీసి, రికార్డుల ప్రకారం సరి చూసి, దాని పేరు, బరువు, ఇన్వెంటరీ నంబర్, తనిఖీ చేసిన తేదీ తదితర వివరాలతో ఆల్బమ్ చేయించి, దేవస్థానం వెబ్సైట్లో పొందుపరుస్తారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి నిత్యం అలంకరించే ఆభరణాలు సుమారు 200 ఉన్నాయి. ఇవి కాకుండా గతంలో వాడి పాతబడటంతో ప్రస్తుతం దేవస్థానం లాకర్లలో ఉంచిన ఆభరణాలు మరో 200 ఉన్నాయి. వీటి రక్షణకు దేవస్థానంలో నిత్యం 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రధానాలయం వద్ద కాపలా ఉంటారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవస్థానంలో గతంలో గోల్డ్ బాండ్ కోసం ఎస్బీఐకి ఇవ్వగా మిగిలిన ఆభరణాలన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నామని ఈఓ త్రినాథరావు చెప్పారు. రామాలయం, వనదుర్గ, కనకదుర్గ, నేరేళ్లమ్మ ఆలయాల్లోని ఆభరణాలను సోమవారం, బ్యాంకుల్లోని ఆభరణాలను మంగళవారం డిజిటిలైజ్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం వాడకంలో లేని ఆభరణాలను దేవస్థానానికి తిరిగి జమ చేయాల్సిందిగా అర్చకులను ఆదేశించామన్నారు. డిజిటలైజేషన్ వలన భవష్యత్తులో ఆ ఆభరణం చోరీ అయినా లేక పాడయినా దాని వివరాలు తెలుస్తాయని ఈఓ తెలిపారు. (క్లిక్: అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు!) -
Charminar: ‘లాడ్‌బజార్’.. తళుక్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే
సాక్షి, చార్మినార్(హైదరాబాద్): నగర చరిత్రలో చార్మినార్‌కు ఎంత గుర్తింపు ఉందో పక్కనే ఉన్న లాడ్బజార్కూ అంతే గుర్తింపు ఉంది. ఎక్కడేక్కడి నుంచో వచ్చి చార్మినార్‌ను సందర్శిచిన తర్వాత లాడ్బజార్లోకి అడుగు పెడతారు. వందలు, వేలల్లో ఉండే అందమైన డిజైన్ల గాజులను కొనుగోలు చేస్తుంటారు. ఏ పండగొచ్చినా.. పెళ్లిళ్ల సీజన్ మొదలైనా మొదట గుర్తుకు వచ్చేది లాడ్ బజారే.. వందల సంఖ్యలో ఉన్న షాపులను నిత్యం వేలాది మంది సందర్శిస్తుంటారు. రాష్ట్రంలోని జిల్లాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి గాజులు ఎగుమతి అవుతుంటాయి. అందమైన గాజులు తక్కువ ధరలకే లభ్యమవుతుండటంతో ఇక్కడి గాజులకు డిమాండ్ కూడా అధికంగానే ఉంటోంది. నిత్యం పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే విదేశీయులు సైతం గాజులను కొనుగోలు చేసి వారి దేశాలకు తీసుకెళ్తుంటారు. రాత్రిపూట లాడ్బజార్లోకి వెళ్తే జిగేల్మంటూ మెరిసే గాజుల అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఇంతటి పేరుగాంచిన లాడ్‌బజార్‌ను నైట్ బజార్‌గా మార్చాలని 1999లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయని స్థానిక గాజుల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు గానీ.. ఇటు సంబంధిత అధికారులు గానీ.. నైట్ బజార్ విషయాన్ని పట్టించుకోవడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నైట్ బజార్‌గా మారిస్తే పాతబస్తీకి మరింత వన్నె తెచ్చినట్లవుతుందని అంటున్నారు. ఏళ్లుగా గాజుల విక్రయాలతోనే జీవనం సాగిస్తున్న వ్యాపారుల ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ► దూరప్రాంతాల నుంచి షాపింగ్ కోసం ఇక్కడికి వచ్చే వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి విముక్తి లభిస్తుంది. పార్కింగ్‌కు సౌకర్యం కల్పిస్తేనే వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. ► పరిసరాల రోడ్లన్నీంటినీ వెడల్పు చేయాలి. చార్మినార్ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లను పూర్తిగా అందుబాటులోకి తేవాలి. లాడ్‌బజార్‌లో వ్యాపారాభివృద్ధి కోసం ఇక్కడి దుకాణాలకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కల్పించాలి. ఆ పేరెలా వచ్చిందంటే.. ►లాడ్లా అంటే గారాబం.. ప్రేమ.. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని, ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమ, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకలను కొని బహుకరిస్తుండటంతో ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. ► మహ్మద్ కూలీ కుతుబ్‌షా కూడా తాను ప్రేమించిన భాగమతికి ఇక్కడి లాడ్‌బజార్‌లోని గాజుల్నే బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కి పైగా దుకాణాలు నిత్యం తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. -
Home Creations: ఒంటి అలంకరణ వస్తువులతో ఇంటి అలంకరణ
ఇంటిని అందంగా అలంకరించాలంటే బోలెడంత డబ్బు ఖర్చు చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పడం మంచిది. ఉన్న వస్తువులతో రీ సైక్లింగ్ చేసే పద్ధతులు తెలుసుకుంటే చాలు ఇంటిని వినూత్నంగా మార్చుకోవచ్చు. అందుకు ఫ్యాషన్ యాక్ససరీస్ అదేనండీ ఒంటి అలంకరణ వస్తువులను చూపులను ఆకట్టుకునే విధంగా ప్రతి పీస్‌ను ఇంటి అలంకరణలో ఉపయోగించవచ్చు. చెవి రింగులు, మెడకు చుట్టుకునే స్కార్ఫ్, వేసుకునే హై హీల్స్, పట్టుకొనే గొడుగు.. కాదేదీ ఇంటి అలంకరణకు అనర్హం. ఫ్యాషన్ యాక్ససరీస్ ఉపయోగించేవాటికన్నా పక్కన పెట్టేసేవి ఎక్కువే ఉంటాయి. అంతగా కొని దాచిపెట్టేస్తారు కాబట్టి, వీటితోనే ఇంటి అలంకరణ చేసేస్తే.. ఇంట్లో వారి మెప్పుతో పాటు ఇంటికి వచ్చే అతిథులు మార్కులు కూడా కొట్టేయొచ్చు. అయితే, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం... సిల్క్ స్కార్ఫ్ బయటకు వెళితే కుర్తీ, టాప్‌కి కాంబినేషన్‌గా మెడలో స్కార్ఫ్ ఉండాల్సింది. అందమైన స్కార్ఫ్‌లు ఎన్నో మీ వద్ద ఉండే ఉంటాయి. కొన్ని స్కార్ఫ్ల డిజైన్లు చూడముచ్చటగా ఉంటాయి. ఫ్రేమ్‌లో స్కార్ఫ్‌ని సెట్ చేస్తే, అందమైన వాల్ ఆర్ట్ అలంకరణకు రెడీ. ఇందుకు ఫ్రేమ్ ఎంపిక ఒక్కటే మీ ఛాయిస్. మీ అభిరుచిని బట్టి ఎన్ని స్కార్ఫ్‌లు అయినా మార్చుకుంటూ రోజుకో ఆర్ట్‌ని ఆస్వాదించవచ్చు. వేలాడే జూకాలు అతివల హృదయానికి చేరువగా ఉండేది ఆర్ట్. అందుకే, వారికి కావల్సిన ప్రతీ వస్తువూ కళాత్మకంగా ఉండేది ఎంచుకుంటారు. వాటిలో చెవి రింగులు ప్రధానమైనవి. ఒక మంచి ఫ్రేమ్‌లో అమర్చి, లివింగ్ రూమ్‌లో అలంకరించి, ఆ అందమైన తేడాను మీరే గమనించవచ్చు. బరువైన బ్యాంగిల్.. పేపర్‌వెయిట్ ఇత్తడి, రాగి, గాజు మెటీరియల్‌తో తయారైన సింగిల్ హెవీ బ్యాంగిల్స్‌ను మన దగ్గర చాలానే ఉంటాయి. బరువుగా ఉందనో, మరోసారి వాడుదామనో పక్కన పెట్టేసిన ఇలాంటి గాజును టేబుల్ పెపర్వెయిట్గా ఉపయోగించుకోవచ్చు. వీటి డిజైన్ కూడా చాలా కళాత్మకంగా ఉండటంతో చూడగానే ఆకట్టుకుంటుంది. గొడుగు దీపాల జిలుగులు ఎండ, వానల సమయాల్లో అందమైన గొడుగుల సంఖ్య మన దగ్గర చేరుతూనే ఉంటాయి. ఏదైన టూర్లకు వెళ్లినప్పుడు కూడా చిన్న చిన్న గొడుగులను సేకరించే అలవాటు ఉంటుంది. వీటిని ఇలా విద్యుత్ దీపాలకు అడ్డుగా పెట్టి, ఇంటి అలంకరణలో రెట్టింపు కళ తీసుకురావచ్చు. బ్యాగులే శిల్పాలు పాడైన ఫ్యాన్సీ బ్యాగులు, క్లచ్‌లు, శాండల్స్, ఉపయోగించని లిప్‌స్టిక్ వంటివి కవర్లో పెట్టి, మూలన పడేయాల్సిన అవసరం లేదు. వాటికి కొంచెం సృజనాత్మకత జోడించి, శిల్పాలుగా మార్చుకోవచ్చు. ఇంటి గ్లాస్ షోకేస్‌లో అందంగా అలంకరించుకోవచ్చు. మీకు కావల్సిందల్లా కొంచెం ఊహ, మరికొంచెం సృజనాత్మకత.. ఇలా మీ ఆలోచనా సామర్థ్యాన్ని బట్టి ఉన్న వస్తువులతోనే ఇంటిని కొత్తగా అలంకరించవచ్చు. చదవండి: Home Creations: అలంకరణలో ఇదో విధం..! -
పట్టుకున్న బంగారం ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, వజ్రాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడడం తెలిసిందే. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇలా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న పసిడి, వెండి, వజ్రాలు తదితర విలువైన వస్తువులను తర్వాత ఏం చేస్తారు? అనేది తెలుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీనితోపాటు మరికొన్ని ప్రశ్నలను నగరానికి చెందిన ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అడిగితే ఏం సమాధానం వచ్చిందో తెలుసా? ‘‘మా వద్ద సమాచారం లేదు’’అని!! అది చదివి అవాక్కవడం అతని వంతైంది. పన్ను ఎగ్గొట్టే యత్నంలో.. యూఏఈ, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాల నుంచి బంగారం, ఇతర దేశాల నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీని కొందరు విమానాల ద్వారా అక్రమంగా హైదరాబాద్‌కు తెస్తుంటారు. పన్ను ఎగ్గొట్టే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా వీటిని తీసుకొస్తుంటారు. అత్యంత ఆధునిక విధానాల్లో వీటిని తెస్తూ కస్టమ్స్ అధికారుల కంట పడకుండా బురిడీ కొట్టిస్తుంటారు. అయితే, బాడీ స్కానింగ్ తదితర అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చాక.. స్మగ్లర్ల పప్పులు ఉడకడం లేదు. ఇలా పట్టుబడిన బంగారం, వెండి, వజ్రాలు, కరెన్సీ, విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కస్టమ్స్ అధికారులు ఏం చేస్తారు? వీటిని వేలం వేస్తారా? లేక ఇతర శాఖలకు పంపుతారా? కోర్టుకు స్వాధీనం చేస్తారా? అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఇవే ప్రశ్నలను సంధిస్తూ నగరానికి చెందిన రాబిన్ అనే సామాజిక ఉద్యమకారుడు శంషాబాద్‌లోని హైదరాబాద్ కస్టమ్స్ ఆఫీసుకు, సనత్‌నగర్‌లోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్‌కు సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేశాడు. చెన్నై సీబీఐ లాకర్లా అయితే ఎలా?: రాబిన్ తన ప్రశ్నలకు కస్టమ్స్ అధికారులు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంపై ఆర్టీఐ దరఖాస్తుదారుడు రాబిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిత్యం కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటున్న బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వివరాల గురించి ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తుంటాయని, స్వాధీనం చేసుకున్న వాటిన ఏంచేస్తారో ప్రజలకు చెప్పకపోవడం ఏంటని వాపోయాడు. అసలు ఈ వస్తువుల రికార్డు నిర్వహణ సరిగా ఉందా? అని నిలదీశాడు. నిర్వహణ సరిగా లేకపోతే ఇటీవల చెన్నైలోని సీబీఐ కస్టడీ నుంచి దాదాపు 100 కిలోల బంగారం మాయమైన తరహాలో జరిగితే ఏమేం మాయమయ్యాయనే సంగతి ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నాడు. ఈ తొమ్మిది ప్రశ్నలు సంధించాడు! (1) 2015 నుంచి 2020 వరకు కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల వివరాలు (2) స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏయే దేశాలవి? (3) 2015–2020 వరకు నమోదు చేసిన కేసులు (4) స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం చేస్తారు? (5) ప్రస్తుతం హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న వస్తువుల విలువ ఎంత? (6) సీజ్ చేసిన వçస్తువులను హైదరాబాద్ కస్టమ్స్ వేలం వేస్తుందా? (7) మీరు నిర్వహించిన వేలంలో విక్రయించిన పది వస్తువులు, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు (8) వేలం సమాచారం ప్రజలకు ఎలా తెలియజేస్తారు? గత పది వేలంల గురించిన వివరాలు (9) హైదరాబాద్ కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల్లో ఎన్ని కస్టడీలో ఉన్నాయి? ఇతర విభాగాలు, కోర్టుకు ఎన్నింటిని అప్పగించారు? -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
-
ట్రెండ్‌కు తగినట్టు ఉంటేనే ఎవరైనా చూసేది
అక్కా! నువ్వు చేయించుకున్నావ్ కదా! నాక్కూడా చేయించవే!! ఏమండీ!నా తోటికోడలు చేయించుకుందిగా!! అత్తా! మీ అమ్మాయికి చేయించారుగా!! వదినా! మా అన్నయ్య నీకు చేయించాడుగా!! పండగ చేసుకునే సమయంలో ఈ చేయించడమేంటీ?! ఇవాళ ధనత్రయోదశి.. ఎల్లుండి పండగ! మరి కన్నుల పండుగ చేయించాలి కదా! ఆభరణాల కొనుగోలులోనే కాదు కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఎప్పుడూ అవి కొత్తదనంతో ఆకట్టుకుంటూ ఉండాలి. ఒకసారి నగ కొన్నాక అదెప్పుడూ ట్రెండ్‌లో ఉండాలి. అలాంటి ఆభరణాలు ఎన్నో మెడల్స్‌లో వచ్చాయి. అతివల మనసు దోచేస్తున్నాయి. ఎప్పటికీ ఎవర్గ్రీన్ అనిపించే డిజైన్స్‌ను ధరించిన మన ‘తారా’మణులు ఆభరణాలకు కొత్త సింగారాలను అద్దుతున్నారు. వీటిలో ఖరీదైనవే కాదు అచ్చూ అలాగే ఉండే ఇమిటేషన్ జువెల్రీ కొంగొత్తగా ఆకట్టుకుంటుంది. ఏ వేడుకకు ఏ ఆభరణమో ఎంపికలోనే ఉంటుంది అసలు అందం. ♦ వరుసలుగా కూర్చిన పేటల హారాలు, జంతువులు, పక్షుల డిజైన్లతో రూపొందించిన హారాలు అన్నింటి ఔరా! అనిపిస్తూనే ఉన్నాయి. ♦ పోల్కీ కుందన్స్ సెట్ సంప్రదాయ వస్త్రాలంకరణ లోనే కాదు వెస్ట్రన్ డ్రెస్సులకు ఓ ప్రత్యేక అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెడతాయి. అందుకే తారల అలంకరణలో తప్పనిసరి ఆభరణం అయ్యింది. ♦ మామిడి పిందెల హారాలు ఏ సందర్భాన్నైనా కాంతివంతంగా మార్చేస్తాయి. కాలాలు మారినా మారని ఈ డిజైన్ అతివలకు ఎప్పుడూ ఆకర్షణీయమే! ♦ మిగతా ఆభరణాలేవీ అవసరం లేకుండా పెద్ద పెద్ద చెవి బుట్టాలు ఏ వేడుకనైనా ప్రత్యేకతను నిలిపేలా చేస్తున్నాయి. ♦ పెద్ద పెద్ద పోల్కీచోకర్ సెట్స్ వేడుకకు ఒక రాణివాసపు లుక్‌ను తీసుకువస్తున్నాయి. అందుకే మన సంప్రదాయ వేడుకలో తప్పనిసరి గ్రాండ్ ఆభరణమైంది. ♦ దేవతా మూర్తుల రూపాలతో డిజైన్ చేసిన ఆభరణాలు (టెంపుల్ జువెల్రీ) సంప్రదాయ వేడుకలో హైలైట్‌గా నిలుస్తున్నాయి. ♦ ముత్యాల సొగసు ఎప్పుడూ కొత్త సింగారాలను మోసుకొస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి వేడుకను ముత్యాల ఆభరణాలు ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ♦ వజ్రాభరణాలు ఏ వయసు వారికైనా తీరైనా ఖరీదైన అందాన్ని తీసుకువస్తాయి. మగువల మనసు దోచే ఆభరణాలలో ఒక్కటైనా వజ్రాభరణం ఉండాల్సిందే! -
మహిళ కడుపులో నగలు, నాణేలు
రామ్పుర్హట్: కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె కడుపులో ఉన్న 1.5 కేజీల ఆభరణాలు, నాణేలను చూసి విస్తుపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా రామ్పురహాట్లో చోటుచేసుకుంది. మర్గ్రామ్కు చెందిన మానసికస్థితి సరిగా లేని 26 ఏళ్ల ఓ మహిళ కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసి మహిళ కడుపులోంచి బంగారం, కాంస్యం, రాగితో చేసిన గొలుసులు, దుద్దులు, ముక్కుపుడకలు, గాజులు వంటి 1.5 కేజీల ఆభరణాలు, రూ.5, రూ.10 విలువ గల 90 నాణేలను బయటికి తీసినట్లు వైద్యులు తెలిపారు. తాము బయటకు తీసిన వాటిలో చేతి వాచీలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ‘నా కూతురి మానసిక పరిస్థితి సరిగా లేదు. కొద్దిరోజులుగా భోజనం చేసిన తర్వాత ప్రతి వస్తువును విసిరికొడుతోంది. మాయమైన ఆభరణాల గురించి అడిగిన ప్రతిసారి ఏడవడం మొదలు పెట్టేది. కొంత కాలంగా ఆమెను కనిపెట్టి చూస్తున్నాం. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. చాలా మంది ప్రైవేటు డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకపోయింద’ని బాధితురాలి తల్లి వివరించింది. -
ఆమె పొట్టలో కిలోన్నర బంగారం..
కోల్‌కతా : ఇంత వరకూ ఇనుప వస్తువులు మింగిన వారి గురించే చదివాం. కానీ ఈ యువతి ఏకంగా బంగారాన్ని మింగేసింది. ఇలా ఇప్పటి వరకూ ఆమె కడుపులో దాదాపు కిలోన్నరకు పైగా బంగారం చేరింది. ఆ వివరాలు... పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ 26 ఏళ్ల యువతికి మతి స్థిమితం లేదు. దాంతో ఆకలేసినప్పుడల్లా చేతికి దొరికిన పదార్థాలను తినేది. ఈ క్రమంలోనే బంగారు ఆభరణాలను కూడా కడుపులో పడేసుకుంది. దాంతో గత కొద్ది రోజులుగా యువతి అనారోగ్యంతో బాధపడుతుంది. తిన్న వెంటనే వాంతులు చేసుకుంటుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆపరేషన్ చేయగా ఆమె కడుపులో ఆభరణాలు, నాణాలు కనిపించాయి. ఆపరేషన్ చేసిన వైద్యుడు... యువతి కడుపులో నుంచి గొలుసులు, ముక్కు పుడకలు, చెవి పోగులు, గాజులు, బ్రాస్లెట్ తదితర ఆభరణాలతోపాటు రూ.5, రూ.10 నాణేలను వెలికితీశామని తెలిపాడు. వీటి బరువు సుమారు 1.5 కిలోగ్రాముల వరకూ ఉందన్నారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే కోలుకుంటుందని తెలిపారు. ఈ విషయం గురించి బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురికి మతిస్థిమితం లేదు. ఎప్పుడూ ఆమెను ఇంట్లో ఎవరో ఒకరు కనిపెట్టుకునే ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఆభరణాలను మింగి ఉంటుంది. ఇన్ని రోజులుగా ఇంట్లో ఆభరణాలు కనిపించకుండా పోతుంటే మాకు అర్థం కాలేదు. ఎవరైనా దొంగిలిస్తున్నారేమో అని అనుమానం కలిగింది. దీని గురించి మా అమ్మాయిని అడిగితే ఏడ్చేదే తప్ప.. ఏం చెప్పేది కాదు. అయితే గత కొద్ది రోజులుగా భోజనం చేసిన వెంటనే వాంతులు చేసుకుంటుంది. ఆస్పత్రికి తీసుకురావడంతో ఈ విషయం తెలిసింది’ అన్నారు. -
శ్రీవారి ఆభరణాలు భద్రమే..!
తిరుమల: అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరుమల శ్రీవారి ఆభరణాలున్నాయని, పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. సోమవారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని రమణ దీక్షితులకు సూచించారు. శ్రీవారి ఆలయంలో వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలను బోర్డు సభ్యులతో కలసి నిశితంగా పరిశీలించినట్లు చెప్పారు. 1952 నుంచి మిరాశీ వ్యవస్థ రద్దయిన 1996 వరకు ప్రతి ఆభరణాన్ని తిరువాభరణం రిజిస్టర్లో నమోదు చేశారని తెలిపారు. 2001లో గరుడ సేవ సందర్భంగా భక్తులు నాణేలు విసరడంతో కెంపు రాయి పగిలిందని చెప్పారు. పగిలిన కెంపు పొడిని సేకరించి మూటకట్టి రిజిస్టర్లో నమోదు చేశారన్నారు. పోటులోని పురాతన గోడలు దెబ్బ తినకుండా అడుగు మందంతో ఫైర్ రిఫ్రట్టరీ బ్రిక్‌వాల్ మాత్రమే ఏర్పాటు చేశారని.. నేలపై ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. కాగా, శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలన్న ప్రతిపాదన ఆగమ శాస్త్రానికి విరుద్ధమని ఆగమ సలహా మండలి సభ్యుడు సుందరవదన భట్టాచార్యులు చెప్పారు. -
‘అది టీటీడీకే అవమానం’
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వేంకటేశ్వరస్వామి ఆభరణాల అంశంపై టీటీడీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. టీటీడీ అధికారుల సమక్షంలో నగల పరిశీలన అంటున్నారని.. అది టీటీడీ కాదు.. టీడీపీ పాలకకమిటీ అని విమర్శించారు. ఒకవేళ నగల పరిశీలన జరిగితే న్యాయం జరుగదన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల భూములను సైతం కాజేసిన వారు పరిశీలన కమిటీలో ఉన్నారని, ఇది దేవస్థానం వారికే అవమానమన్నారు. కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో వేసిన జ్యుడీషియల్ కమిటీలా.. ఇక్కడ కూడా నగల పరిశీలనకు కమిటీ వేస్తే తప్ప న్యాయం జరుగదని తెలిపారు. కాగా, శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలని మొదట టీటీడీ భావించినప్పప్పటికీ.. ఇందుకు ఆగమసలహా మండలి సభ్యులు అభ్యంతరం తెలిపారు. శ్రీవారి ఆభరణాల ప్రదర్శణను ఆగమ సలహాదారు సుందరవదన భట్టాచార్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీవారి ఆభరణాలు అత్యంత పవిత్రమైనవని, వాటికి విలువ కట్టలేమని ఆయన అన్నారు. ఆభరణాలను ప్రదర్శిస్తే.. వాటి భద్రత బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. -
శ్రీవారి ఆభరణాల ప్రదర్శనపై వెనక్కి తగ్గిన టీటీడీ
-
శ్రీవారి ఆభరణాల ప్రదర్శనకు బ్రేక్!
సాక్షి, తిరుమల : కలియుగ ప్రతక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆభరణాల ప్రదర్శనపై టీటీడీ వెనుకకుతగ్గింది. శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలని మొదట టీటీడీ భావించినప్పప్పటికీ.. ఇందుకు ఆగమసలహా మండలి సభ్యులు ఒప్పుకోలేదు. శ్రీవారి ఆభరణాల ప్రదర్శణను ఆగమ సలహాదారు సుందరవదన భట్టాచార్య తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీవారి ఆభరణాలు అత్యంత పవిత్రమైనవని, వాటికి విలువ కట్టలేమని ఆయన అన్నారు. ఆభరణాలను ప్రదర్శిస్తే.. వాటి భద్రత బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. పింక్ డైమండ్ తాను చూడలేదని సుంధరవదన భట్టాచార్య తెలిపారు. టీటీడీ రికార్డులో ఉన్న ప్రకారం ఆభరణాలన్నీ ఉన్నాయని చెప్పారు. అయితే, టీటీడీ ఏర్పడకముందే స్వామివారికి చెందిన అనేక ఆభరణాలు కనుమరుగయ్యాయని చెప్పారు. శ్రీవారి ఆభరణాల ప్రదర్శనను ఆగమ పండితులు సైతం వ్యతిరేకిస్తున్నారని, గర్భాలయంలో ఉంటేనే ఆభరణాలకు భద్రత లభిస్తుందని ఆగమ సలహాదారు సుంధరవదన భట్టాచార్య తెలిపారు. అనాదిగా ఆలయంలోనే ఆభరణాలకు మరమత్తులు చేపడుతున్నామని చెప్పారు. శ్రీవారి నిత్య సేవలు ప్రత్యక్ష ప్రసారం ఇస్తామన్న ఈవో వ్యాఖ్యలను సైతం ఆగమ సలహాదారులు ఖండించారు. ఆగమ సంప్రదాయానికి వ్యతిరేకంగా చేపట్టే ఎలాంటి కార్యక్రమాలనైనా వ్యతిరేకిస్తామని ఆగమ సలహాదారులు స్పష్టం చేశారు. -
నల్లపూసలు ఎందుకు ధరిస్తారు?
ముల్తైదువులు ధరించే ఆభరణాలు వారి దేహంపై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి. స్త్రీ సంతానాన్ని తన గర్భంలో మోసి మరొక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన వాటినే ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు పెద్దలు. వాటిల్లో నల్లపూసలు ఒకటి. వెనకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు. ఈ నల్లపూసలు ఛాతీమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదికాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం. ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ. మనదేహంలోని ఉష్ణంతో బాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతోంది. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయ మధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతుభాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూవరులచే ‘నీలలోహిత గౌరి’ కి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. నీలలోహిత గౌరిని పూజించడం వలన ... ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. -
ఆభరణాలు భద్రం
భువనేశ్వర్ : శ్రీజగన్నాథుని ఆభరణాలు, ఇతరేతర అమూల్యమైన సంపద భద్రంగా ఉన్నట్టు శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం(ఎస్జేటీఏ) తెలిపింది. శ్రీమందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు కావడంతో స్వామి అమూల్య రత్న సంపద పట్ల పలు అపోహలు ప్రసారం అవుతున్నాయి. ఇవన్నీ నిరాధారంగా శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం స్పష్టం చేసింది. రత్న భాండాగారం రెండు అంచెల్లో ఉంటుంది. బాహ్య భాండాగారం(బహారొ భొండారొ), లోపలి భాండాగారం (భిత్తొరొ భొండారొ)గా పేర్కొన్నారు. స్వామి అమూల్య రత్న సంపద లోపలి భాండాగారంలో భద్రంగా ఉంటుంది. నిత్య వినియోగ ఆభరణాలు, పాత్రలు వగైరా సొత్తు బాహ్య భాండాగారంలో ఉంటుంది. అరుదుగా వినియోగించే ఆభరణాలు లోపలి భాండాగారంలో భద్రపరుస్తారు. బాహ్య భాండాగారం తెరిస్తే గానీ లోపలి భాండాగారం లోనికి ప్రవేశించడం అసాధ్యం. రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు రత్న భాండాగారం స్థితిగతుల్ని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఇటీవల బాహ్య భాండాగారం తెరిచారు. గోడలు అక్కడక్కడ స్వల్పంగా బీటలు వారినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా బాహ్య భాండాగారం గ్రిల్ నుంచి లోపలి భాండాగారం వైపు దృష్టి సారించారు. ఈ భాండాగారం తలుపుల తాళాలకు సీలు వేసినట్లు అధికార వర్గం గుర్తించింది. ఈ లెక్కన లోపలి భాండాగారం సురక్షితంగా ఉన్నందున దానిలో రత్న సంపద కూడా భద్రంగా ఉండడం తథ్యంగా శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం స్పష్టం చేసింది. తాళం గల్లంతు వాస్తవమే! రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు రత్న భాండాగారం పరిశీలించడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో రత్న భాండాగారం తెరిచేందుకు తా ళం చెవి కోసం వెతుకులాట మొదలైంది. జిల్లా ట్రెజరీలో ఉండాల్సిన తాళం చెవి కనిపించనట్లు జిల్లా కలెక్టరు బహిరంగపరిచారు. అధికార సమూహం అంతా ఏకమై గాలించిన రత్న భాండాగారం తాళం చెవి కాన రాని మాట వాస్తవం. కాగిత పత్రాలు, దస్తావేజులు వగైరా క్షుణ్ణంగా పరిశీలించిన ప్రయోజనం శూన్యంగా పరిణమించింది. అంచెలంచెలుగా అధికారులు ఈ పరిస్థితిని సమీక్షించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు నిర్ణయించారు. 1985 సంవత్సరంలో లోపలి భాండాగారం తెరిచి ఆభరణాలు వగైరా లెక్కించినట్టు దస్తావేజులు స్పష్టం చేస్తున్నాయి. లెక్కింపు ముగించి ఈ భాండాగారానికి 3 తాళాలు వేశారు. ఒక తాళానికి సీలు ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. రాష్ట్ర హై కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో ఈ ఏడాది ఏప్రిల్ నెల 4వ తేదీన రత్న భాండాగారం పరిశీలించారు. తాళం చెవి గల్లంతుపట్ల 17 మంది సభ్యుల నిపుణుల బృందం తలకిందులు అయి ప్రయత్నించిన గాలించ లేకపోయింది. బాహ్య భాండాగారం తెరిచి పరిశీలన మొక్కుబడిగా ముగించేశారు. లోపలి భాండాగారం పరిశీలించాల్సిన అవసరం లేనట్లు నిపుణుల బృందం ప్రకటించింది. తాజా పరిస్థితుల్ని విశ్లేషిస్తే తాళం చెవి లేనందున లోపలి భాండాగారం పరిశీలన సాధ్యం కానట్లు తెలుస్తుంది. అంచెలంచెలుగా సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీ ఉదయం రత్న భాండాగారం పరిశీలన ముగించిన వెంటనే శ్రీ మందిరం సబ్ కమిటీ అదే రోజు మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం అయింది. తాళం చెవి గల్లంతు శీర్షికతో ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశం తీర్మానం మేరకు మర్నాడు భువనేశ్వర్ స్పెషల్ సర్క్యుట్ హౌసులో శ్రీమందిరం పాలక మండలి సమావేశం జరిగింది. పూరీ గజపతి మహా రాజా, శ్రీ జగన్నాథుని తొలి సేవకుడు దివ్య సింఘ్ దేవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కూడా తాళం చెవి జాడ కానరానందున విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు. ఇంటర్నల్ ఆడిట్ తాళం చెవి జాడ కోసం ఇంటర్నల్ ఆడిట్ కూడా నిర్వహించారు. శ్రీమందిరం సేవా పాలక మండలి ప్రముఖుడు ఈ ఆడిట్ నిర్వహించారు. 1985 సంవత్సరంలో రత్న భాండాగారం ఆభరణాల లెక్కింపు పురస్కరించుకుని శ్రీమందిరం పాలక మండలి డిప్యుటీ పాలకుడు రబీంద్ర నారాయణ మిశ్రా నుంచి రత్న భాండాగారం తాళం చెవి తీసుకున్నట్టు ఆడిట్ ఖరారు చేసింది. శ్రీ మందిరం ప్రధాన పాలకునికి ఈ నివేదిక సమర్పించారు. కలెక్టరేటులో రికార్డు రూమ్ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇంత ప్రయాసపడిన తాళం చెవి జాడ దొరక లేదు. న్యాయ విచారణకు సహకరిస్తాం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని శ్రీ జగన్నాథ ఆలయ అధికారవర్గం(ఎస్జేటీఏ) తెలిపింది. -
శ్రీవారి వజ్రాలు ఎలా మాయం అయ్యాయి?