అన్నానగర్: మధురై సమీపం పేరైయూర్‌లో ఓ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. రూ. 8 లక్షల విలువ గల వస్తువులు కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తు కోట్ల ఖరీదైన బంగారం, నగదు సురక్షితంగా ఉన్నాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మధురై సమీపం పేరైయూర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న బ్యాంకులో శనివారం సాయంత్రం పని ముగియగానే సిబ్బంది బ్యాంక్‌కు తాళం వేసి వెళ్ళారు. సాయంత్రం 4.50 గంటల సమయంలో బ్యాంకు లోపల అగ్నిప్రమాదం సంభవించి దట్టమైన పొగలు బయటకు వస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పేరైయూర్ పోలీసు జాయింట్ సూపరింటెండెంట్ చార్లెస్ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్ళి బ్యాంకు కిటికీ అద్దాలను పగులగొట్టి సుమారు గంటసేపు పోరాడి మంటలను ఆర్పారు. అనంతరం బ్యాంకు సిబ్బందిని పిలిపించి లోపలికి వెళ్ళి చూడగా క్యాషియర్ గది మొత్తం కాలిపోయింది. పదికి పైన కంప్యూటర్లు, వస్తువులు కాలి బూడిదయ్యాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిందని గుర్తించారు. అదృష్టవశాత్తు రూ.40 లక్షల నగదు, రూ.22 కోట్ల విలువ గల బంగారం సురక్షితంగా ఉన్నాయి. పేరైయూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment