సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రధాన పార్టీలు ముందస్తుగా డబ్బులు, బంగారం ఎర చూపినప్పటికీ తీరా ఎన్నిక దగ్గర పడడంతో రూ.3వేలతోనే సరిపుచ్చడంతో నిర్ఘాంతపోవడం ఓటర్ల వంతు అయింది. మునుగోడు ఉప ఎన్నికలో ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓటర్లకు రాజకీయ నాయకులు షాకిచ్చారు.
ఇంటికి తులం బంగారం, ఓటుకు రూ.30వేలు ఇస్తామని ఆయా ప్రధాన పార్టీలు గుట్టుగా ప్రచారం చేసినప్పటికీ ఓటరు ఊహకు అందకుండా రూ.3వేలతో సరిపుచ్చారని పలువురు పేర్కొంటున్నారు. ఎవరు ఎక్కువ తాయిలాలు ముట్టజెప్తే వారికే ఓటు వేయాలన్న ఆలోచనతో సగటు ఓటరు ఆలోచిస్తున్నాడు.
కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలైన ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీగా ఓటర్లకు నగదు అందించాలని చూసినా పలుచోట్ల ఓ పార్టీ నాయకులను మరో పార్టీ నాయకులు అడ్డుపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆశించిన విధంగా డబ్బులు అందకపోవడంతో ఓటర్లు నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment