గుంటూరు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం గొడవ జరిగింది. బ్యాంకు అధికారులు తాకట్టు పెట్టిన నగలను తమకు సమాచారం ఇవ్వకుండా వేలం వేశారంటూ ఖాతాదారులు బుధవారం సాయంత్రం బ్యాంకు వద్ద ఆందోళన చేశారు.
దీనిపై మేనేజర్‌తో వాగ్వాదానికి దిగారు. అతనిని బయటకు లాక్కొచ్చారు. సమాచారం తెలిసిన పోలీసులు రంగ ప్రవేశం చేసి..రెండు వర్గాల వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు.