
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆందోళనకర ఉదంతం వెలుగు చూసింది. ముంబైలోని అటల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆఫీసులో పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని మృతుని భార్య మీడియాకు తెలిపారు. ఇటీవల పూణెలోని ఒక సీఏ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి పని ఒత్తిడిన తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఉదంతం మరువక ముందే ముంబైలో ఇదే తరహా విషాదం చోటుచేసుకుంది.
మీడియాకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం సుశాంత్ చక్రవర్తి(40) అనే వ్యక్తి తాను ప్రయాణిస్తున్న కారును అటల్ సేతుకు ఒకవైపున నిలిపాడు. ఆ తరువాత బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకాడు. మృతుడు ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం మృతునికి భార్య, ఏడాది కుమార్తె, తల్లి ఉన్నారు.
మృతుని భార్య వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు సుశాంత్ చాలా కాలంగా ఆఫీసులో పని భారంతో ఆందోళన చెందుతున్నాడని తెలిపారు. కాగా సుశాంత్ ఇటీవలే కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుశాంత్ చక్రవర్తి మృతదేహం కోసం పోలీసులు సముద్రంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
ఇది కూడా చదవండి: కత్తితో దాడి.. ముగ్గురు మృతి
Comments
Please login to add a commentAdd a comment