Atal Setu Bridge
-
పని ఒత్తిడికి మరొకరు బలి.. అటల్ సేతు పైనుంచి దూకి..
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆందోళనకర ఉదంతం వెలుగు చూసింది. ముంబైలోని అటల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆఫీసులో పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని మృతుని భార్య మీడియాకు తెలిపారు. ఇటీవల పూణెలోని ఒక సీఏ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి పని ఒత్తిడిన తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఉదంతం మరువక ముందే ముంబైలో ఇదే తరహా విషాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం సుశాంత్ చక్రవర్తి(40) అనే వ్యక్తి తాను ప్రయాణిస్తున్న కారును అటల్ సేతుకు ఒకవైపున నిలిపాడు. ఆ తరువాత బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకాడు. మృతుడు ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం మృతునికి భార్య, ఏడాది కుమార్తె, తల్లి ఉన్నారు.మృతుని భార్య వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు సుశాంత్ చాలా కాలంగా ఆఫీసులో పని భారంతో ఆందోళన చెందుతున్నాడని తెలిపారు. కాగా సుశాంత్ ఇటీవలే కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుశాంత్ చక్రవర్తి మృతదేహం కోసం పోలీసులు సముద్రంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.ఇది కూడా చదవండి: కత్తితో దాడి.. ముగ్గురు మృతి -
ఏం కష్టం వచ్చిందో.. డ్రైవర్, పోలీసులు లేకుంటే ఆమె పరిస్థితి ఏంటో!
మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ సేతు బ్రిడ్జి (ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్) గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన అనేక కేసులు నమోదవుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకునే వారికి ఈ బ్రిడ్జి ఒక స్పాట్‌గా మారింది. ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే.. తాజాగా మరో మహిళ బలవన్మరనానికి యత్నించింది.అయితే వెంటనే స్పందించిన కారు డ్రైవర్, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై.. ఆమెను కాపాడటంతో రెప్పపాటులో ప్రాణాలతో బయటపడింది. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. 56 ఏళ్ల రీమా ముఖేష్ పటేల్ ముంబైలోని ములుండ్‌లో నివసిస్తున్నారు.ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ క్యాబ్‌లో అటల్ సేతు బ్రిడ్జి వద్దకు వచ్చింది. కారు దిగి సముద్రంలోకి ఏదో విసిరినట్లు చేసి వెంటనే నీళ్లలోకి దూకేందుకు యత్నించింది. దీనిని గమనించిన డ్రైవర్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు. ఆమె సముద్రంలోకి పడిపోకుండా జుట్టు పట్టుకొని ఆపాడు. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం కూడా అక్కడికి రావడంతో.. ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంగా స్పందించి ఆమెను రెస్క్యూ చేశారు. దీంతో మహిళ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడింది. మహిళను డ్రైవర్, పోలీసులు జాగ్రత్తగా పైకి లాగుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను ముంబై పోలీసులు తమ ట్విటర్లో షేర్ చేశారు.‘అటల్ సేతు బ్రిడ్జి రైలింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళను గమనించిన డ్యూటీ అధికారులు, లలిత్ షిర్సత్, కిరణ్ మహత్రే, యశ్ సోనావానే, మయూర్ పాటిల్ వెంటనే స్పందించి కాపాడారు’ అని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తెలిపారు.అదే విధంగా జీవితం ఎంతో విలువైనది అని, దానిని గౌరవించాలని తెలిపారు. ఎలాంటి కారణాలతోనూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఒక్క క్షణం మిమ్మల్ని ప్రేమించే మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. -
అటల్ సేతు నుంచి సముద్రంలోకి దూకి...
మహారాష్ట్రలోని ముంబైలో అటల్ సేతుపై నుంచి దూకి ఓ యువ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు డోంబవలికి చెందిన శ్రీనివాసన్ కురుటూరి (38)గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాసన్ బుధవారం మధ్యాహ్నం 12.24 గంటలకు అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై న్హవా షెవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.అటల్ సేతు వద్దనున్న సీసీటీవీ ఫుటేజీలో ఒక కారు అటల్ సేతు వద్ద అకస్మాత్తుగా ఆగడం, ఒక వ్యక్తి కారులో నుండి బయటకు వచ్చి వంతెన రెయిలింగ్‌పైకి వేగంగా ఎక్కి, సముద్రంలోకి దూకడం కనిపిస్తుంది. మృతుడు శ్రీనివాసన్ విదేశాల్లో ఉద్యోగం చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చి వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పోలీసులు స్థానికుల సాయంతో సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. -
అటల్ సేతుకి పగుళ్లా?..అందులో నిజమెంత?
ముంబై : రాకపోకలు ప్రారంభించిన నెలల వ్యవధిలో అటల్ సేతు పగుళ్లు ఏర్పడ్డాంటూ మహరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఆగ్రహం వ్యక్తం చేశారు. అటల్ సేతు పగుళ్లు ఏర్పడిన ప్రాంతానికి మీడియాను వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అటల్ సేత నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు.వంతెన నిర్మాణంలో నాణ్యతలేదు. కాబట్టే పగుళ్లు ఏర్పడ్డాయని, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని కర్రతో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అటల్ సేతు వంతెన ప్రారంభోత్సవం జరిగిన కొన్ని నెలల్లో ఒక భాగం పగుళ్లు ఏర్పడింది. నిర్మాణ కోసం రూ.18,000 కోట్లు ఖర్చు చేసింది అని అన్నారు. అయితే, బీజేపీతో పాటు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) మాత్రం ఈ పగుళ్లు బ్రిడ్జిపైన కాకుండా నవీ ముంబైలోని ఉల్వే రహదారిపై ఏర్పడ్డాయని పేర్కొంది.ఈ సందర్భంగా ఎంటీహెఎల్ వంతెనపై పగుళ్లు ఏర్పడ్డాయని పుకార్లు వ్యాపించాయి. ఈ పగుళ్లు బ్రిడ్జిపైనే కాకుండా ఉల్వే నుండి ముంబై వైపు ఎంటీహెచ్ఎల్ని కలిపే రోడ్డుపైనే ఏర్పాడ్డాయని గుర్తించాలని అని ఎంఎంఆర్డీఏ తెలిపింది. అటల్ సేతుపై దుష్ప్రచారం ఆపండి అంటూ బీజేపీ ఎక్స్ వేదికగా స్పందించింది. ఇది సర్వీస్ రోడ్డు. ఇది ప్రధాన వంతెనకు అనుసంధానించే భాగం. ఇవి చిన్నపాటి పగుళ్లు. రేపు సాయంత్రంలోగా వాటిని సరిచేస్తాం. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడలేదు అని అటల్ సేతు ప్రాజెక్ట్ హెడ్ కైలాష్ గణత్ర తెలిపారు. -
రష్మిక వీడియో వైరల్.. ఏకంగా ప్రధాని స్పందించేలా చేసింది!
ప్రస్తుత దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కీలకమైన ఐదో దశకు చేరుకున్నాయి. మహారాష్ట్రలో మిగిలిన 13 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. అయితే సరిగ్గా ఎన్నికల సమయంలోనే సోషల్ మీడియో ఓ వీడియో పోస్ట్ చేసింది హీరోయిన్ రష్మిక మందన్నా. దీనిపై ప్రధాని మోదీ స్వయంగా స్పందించడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారిపోయింది. అసలేంటి ఆ వీడియో? ఇంతకీ నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో చూసేద్దాం పదండి.ఎలక్షన్స్ వేళ పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా చేసిన వీడియో పొలిటికల్ హాట్‌టాపిక్‌గా మారింది. అటు నార్త్‌లో ఇటు సౌత్‌లో టాప్ స్టార్‌గా దూసుకెళ్తున్న రష్.. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు అనుకూలంగా చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో కొందరు నెటిజన్స్ ఆమెను ప్రశంసిస్తుండగా.. మరికొందరేమో వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు.ముంబయిలోని సముద్రప్రాంతంలో నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జిని ఉద్దేశించి రష్మిక ఓ వీడియోను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. అందులో ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతుందంటూ ప్రశంసలు కురిపించింది. రెండుగంటల పట్టే ప్రయాణం.. కేవలం 20 నిమిషాల్లోనే చేరుకుంటున్నట్లు ఆనందం వ్యక్తం చేసింది. యంగ్ ఇండియా అభివృద్ధిలో అద్భుతాలు సాధిస్తోందంటూ కొనియాడింది. దేశంలో మౌలికవసతులు, రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉందన్న రష్మిక.. అభివృద్ధికే ఓటువేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ముద్దుగుమ్మ.అయితే రష్మిక చేసిన వీడియోపై ఏకంగా మన ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారిని అనుసంధానం చేయడానికి మించిన సంతృప్తి ఏముంటుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రష్మిక మందన వీడియోను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు ప్రధాని. అయితే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్‌కు అటల్ సేతు అని పేరు పెట్టింది కేంద్రప్రభుత్వం. జనవరిలో ప్రధాని మోదీ దీనిని జాతికి అంకితం చేశారు. దేశంలోనే పొడవైన వంతెన అటల్ సేతు గుర్తింపును దక్కించుకుంది.కాగా.. ఈ నిర్మాణం అద్భుతమని ఇప్పటికే పలువురు ప్రముఖుల ప్రశంసలు కురిపించారు. సీ లింక్ ప్రయాణం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తంచేశారు. తాజాగా ఎలక్షన్ టైమ్‌లో రష్మిక మందన వీడియో విడుదల చేయడంపై నెటిజన్లు రష్మికను ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా బీజేపీ ప్రొపగాండాలో భాగమని కొందరు అంటుంటే.. రష్మిక త్వరలోనే రాజకీయాల్లోకి వస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.Sir! What an honor! It's incredibly fulfilling to witness our country's growth as a super proud young Indian. 🙏🏻🤍 https://t.co/ZY19v2czFf— Rashmika Mandanna (@iamRashmika) May 17, 2024 -
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
నేషనల్ క్రష్‌గా అభిమానుల్లో పేరు సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన్నా. గతేడాది యానిమల్తో హిట్‌ను ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న కన్నడ భామ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముంబయిలో నిర్మించిన అటల్ సేతు గురించి మాట్లాడింది. ఇండియాలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రశంసలు కురిపించారు.రష్మిక మాట్లాడుతూ..' ముంబై-ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు అద్భుతంగా ఉంది. 2 గంటల జర్నీ కేవలం 20 నిమిషాల్లో చేరుకుంటున్నాం. అసలు మాటలు రావడం లేదు. ముంబయి టూ నవీ ముంబయి, ముంబయి టూ గోవా, ముంబయి టూ బెంగళూరు ప్రయాణించడం చాలా ఈజీ అయిపోయింది. ప్రస్తుతం ఇండియా చాలా వేగంగా దూసుకెళ్తోంది. మరింత వేగంగా అభివృద్ది చెందుతోంది. ఈ విషయంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు" అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. #WATCH | Mumbai: On the Mumbai-trans Harbour Link (MTHL) Atal Setu, Actor Rashmika Mandana says, "Who would have thought that something like this would have been possible. Now we can easily travel from Mumbai to Navi Mumbai. India is moving very fast and growing at a fast pace.… pic.twitter.com/ACwSoSNaa7— ANI (@ANI) May 14, 2024 -
అటల్ సేతుపై ఆ దృశ్యం చూడలేకపోయా - ఆనంద్ మహీంద్రా
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న చాలా నగరాల్లో ఒక పెద్ద సమస్య ట్రాఫిక్. ఈ సమస్యలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ముంబై నగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి 'అటల్ సేతు' అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో సముద్రం మీద నిర్మించిన అతి పెద్ద వంతెన (బ్రిడ్జ్) అయిన అటల్ సేతు మీద ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త 'ఆనంద్ మహీంద్రా' ప్రయాణించి.. తన అనుభవాన్ని తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేసారు. ఇందులో అటల్ సేతు బ్రిడ్జికి సంబంధించిన వీడియో కూడా చూడవచ్చు. గత వారం నేను ముంబై, పూణే మధ్య అటల్ సేతుపైన ప్రయాణించాల్సి వచ్చింది. బ్రిడ్జి మీద ప్రయాణిస్తుంటే.. నీటిపై బోటు మీద ప్రయాణిస్తున్నట్లు అనిపించింది. ఇదో ఇంజినీరింగ్ అద్బుతం. అయితే సాయంత్రం సమయంలో అద్భుతమైన దృశ్యాన్ని నేను చూడలేకపోయానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ.. వీడియో, ఫోటో వంటివి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే.. అటల్ సేతు గురించి.. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ నిర్మించిన అటల్ సేతు నిర్మాణానికి రూ.21200 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సుమారు 21.8 కిలోమీటర్ల పొడవైన అటల్ సేతు నిర్మాణం 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రం మీదనే ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడంతో సేవ్రీ నుంచి నవా షేవాకు ప్రయాణించే సమయం 2 గంటల నుంచి 20 నిమిషాలకు చేరినట్లు తెలుస్తోంది. -
అటల్ సేతుపై కారు ప్రమాదం
-
Mumbai: అటల్ సేతుపై మొదటి ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు
ముంబై: ముంబైలో కొత్త నిర్మించిన అటల్ సేతు వంతెనపై మొదటి ప్రమాదం జరిగింది. హైస్పీడ్‌లో ఉన్న ఓ కారు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో సినిమా రేంజ్లో పల్టీలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ముంబైలోని అటల్ సేతు వంతెనపై మొదటి ప్రమాదం జరిగింది. హైస్పీడ్‌లో ఉన్న మరో కారును ఓవర్ టేక్ చేయబోయి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు సినిమా రేంజ్లో రెండు పల్టీలు కొట్టింది. అయితే, వంతెనపై మరో కారులో ఉన్న డ్యాష్క్యామ్లో ఇదంతా రికార్డు అయ్యింది. కాగా, ఈ ప్రమాదంలో కారును ప్రయాణిస్తున్న వారు స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ప్రమాదానికి గురైన వారు రాయ్‌గఢ్‌లోని చిర్లేకు వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ముంబైలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్ సేతు’ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనినే ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు. ముంబైలో దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. కాగా అటల్ సేతు మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించారు. ఇది ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై టోల్ ఫీజు ఒకవైపు రూ. 250 వసూలు చేయనున్నారు. -
అటల్ సేతుపై ఆటో రిక్షా.. అదేలా సాధ్యం!
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఇటీవల అత్యంత పొడవైన సముద్రపు బ్రిడ్జ్ ‘ముంబాయ్ ట్రాన్స్ హార్బర్ లింక్’ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బ్రిడ్జ్‌కు మరో పేరు ‘అటల్ సేతు’. తాజాగా అటల్ సేతుపై ఆటో రిక్షా వెళ్లటంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శరావనన్ రాధాకృష్ణన్ అనే ఓ వ్యక్తి ‘ఎక్స్’ ట్విటర్లో అటల్ సేతుపై ఆటో రిక్షా వెళ్లుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. ట్రాఫిక్ నిబంధలను ఉల్లఘించి అటల్ సేతుపై ఆటో రిక్షా ఎలా వచ్చిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రారంభమైన ఈ వంతనపైకి టూ వీలర్, త్రీవీలర్ అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. కేవలం వేగంగా వెళ్లే ఫోర్ వీలర్ వాహనాలుకు మాత్రమే ఈ బ్రిడ్జ్‌పై అనుమంతి ఉంది. అయితే త్రీ వీలర్ అయిన ఆటో రిక్షా అటల్ సేతుపై ప్రత్యక్షం కావటంతో అసలు టోల్‌బూత్‌లను దాటుకొని అది ఎలా బ్రిడ్జ్‌పై వచ్చిందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘వావ్.. మొత్తానికి ఆటో రిక్షాను వేగంగా వెళ్లే వాహనాల కేటగిరీలో చేర్చవచ్చు’, ‘అతని ఫైన్ వేయకండి.. నేను కూడా నా టూ వీలర్ కూడా తీసుకువస్తా’, ‘అటల్ సేతుపై అనుమతి లేదు కాదా..ఇది ఎలా సాధ్యమైంది’ అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరో వైపు అద్భుతంగా నిర్మించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చాలా మంది వాహనదారులు ఆగిమరీ చూస్తున్నారు. దీంతో బ్రిడ్జ్‌పై ఇతర వాహనాలుకు ఇబ్బంది కలుతోందని వారికి ఇబ్బంది కలిగించవద్దని ముంబై ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. అటల్‌సేతు టూరిస్ట్ ప్రదేశం కాదని.. ఇక్కడ ఫొటోలు తీసుకోవద్దని ఆదేశించారు. ఇక..ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతుందీ బ్రిడ్జ్. మొత్తం పొడవు 21. 8 కిలోమీటర్లు కాగా..సుమారు 16 కిలో మీటర్లకు పైగా అరేబియా సముద్రపైనే ఉంటుంది. చదవండి: Lithium Mining: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా! -
Atal Setu Bridge: అటల్ సేతు అందాలు! (ఫొటోలు)
-
‘అటల్ సేతు’ నిర్మాణం కోసం ఉపయోగించిన టెక్నాలజీ ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ ‘అటల్ బిహారీ వాజ్‌పేయి సేవరి- నవ శేవ అటల్ సేతు’ వంతెనను ప్రారంభించారు. ఈ వంతెనను రూ.17,480 కోట్లతో నిర్మించారు. 21.8 కిలోమీటర్ల 6 లేన్ల పొడవుతో 16.5 కిలోమీటర్లు సముద్రం మీద, 5.5 కిలోమీటర్లు భూమిపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జిగా చరిత్రకెక్కింది. డిసెంబర్ 2016 లో ఈ బ్రిడ్జికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇక ఈ వంతెన నిర్మాణంలో ఉపయోగించిన టెక్నాలజీ కారణంగా భారత్‌ను ప్రపంచ పటంలో నిలుపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అతి తక్కువ ఐదేళ్ల కాలంలో పూర్తయిన ఈ బ్రిడ్జి వినియోగంతో కనెక్టివిటీ, రవాణాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని రవాణా సంబంధిత పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా బ్రిడ్జిని నిర్మించే సమయంలో వినియోగించిన టెక్నాలజీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే ఆటల్ సేతు ప్రత్యేకతలు : భూకంపాలనే నిరోధించేలా : వంతెన భూకంపాలను నిరోధించేలా టెక్నాలజీని వినియోగించారు. ఇది 6.5 రిక్టర్ స్కేల్ వరకు తీవ్రతతో వివిధ రకాల భూకంపాలను తట్టుకోలగలదు. రివర్స్ సర్క్యులేషన్ రిగ్స్: సౌండ్, వైబ్రేషన్లను తగ్గించడానికి వినియోగించిన టెక్నాలజీ సముద్ర జీవులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శబ్ధాన్ని తగ్గిస్తూ : వంతెనలో నాయిస్ సైలెన్సర్లు, శబ్ద ప్రభావాన్ని తగ్గించడానికి టెక్నాలజీని ఉపయోగించారు. ఎకో-ఫ్రెండ్లీ లైటింగ్: వంతెనపై లైటింగ్ సిస్టమ్ జల పర్యావరణానికి అంతరాయం కలగకుండా రూపొందించబడింది. టోల్ క్యూలు లేవు: ఎంటీహెచ్ఎల్ ఓపెన్ రోడ్ టోలింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది, ఇది టోల్‌ల వద్ద పొడవైన క్యూల సమస్యను పరిష్కరిస్తుంది. అధునాతన స్కానర్లు వాహనాన్ని స్కాన్ చేయగలవు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ వసూలు అవుతాయి. తద్వారా వాహనాల నిరీక్షణ సమయం తగ్గుతుంది. డిస్ప్లేలు: డ్రైవర్లకు సమాచారాన్ని అందించడానికి వంతెన నిర్దిష్ట వ్యవధిలో డిస్ప్లేలు ఉన్నాయి. వారి మార్గంలో ట్రాఫిక్ జామ్‌లు లేదా ప్రమాదాల గురించి వారికి సమాచారం అందుతుంది.